కారు ఢీ కొని యువకునికి గాయాలు
బద్వేలు అర్బన్: మండల పరిధిలోని రాజుపాళెం వద్ద శనివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి , గోపాలమ్మల రెండవ కుమారుడైన కల్లూరు రవికుమార్‌రెడ్డి(17) అనే యువకుడు రోడ్డుపక్కన నిలిచి ఉండగా తిరుపతి నుంచి బద్వేలుకు వస్తున్న కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు యువకుడిని పట్టణంలోని ప్రభుత్వాసుప్రతికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తరలించారు. కాగా గతంలో రోడ్డువెంట స్పీడ్ బ్రేకర్లు ఉండేవని, ఇటీవల కాలంలో రోడ్డువేసే సందర్బంలో స్పీడ్ బ్రేకర్లు తొలగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.