Rajupalem
-
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహారుద్రాభిషేకం..
-
అత్తతో వివాహేతర సంబంధం.. నేనుండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
సాక్షి, వైఎస్సార్ కడప(రాజుపాళెం): వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలి తీసుకుంది. అత్త వరుసైన మహిళే ఇందుకు కారణమైంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన రాజుపాళెంలో నివాసముంటున్న పర్లపాడు నరసమ్మకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఓ కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తెను పక్కవీధిలోని ఎస్సీకాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్ మిద్దె పెద్దదస్తగిరికిచ్చి పెళ్లిచేసింది. అతడికి తల్లి మాబున్ని, తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నారు. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఈ నేపథ్యంలో నరసమ్మకు, చిన్న దస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కుట్టుమిషన్లు రిపేరు చేసే చిన్నదస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నరసమ్మ అతడి ఇంటి వద్దకు వచ్చి తనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ వాగ్వాదానికి దిగింది. ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హతుడి తల్లి మిద్దె మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ మధుసుదన్ గౌడ్, ఎస్ఐ రాజగోపాల్ పరిశీలించారు. చదవండి: (సాఫ్ట్వేర్ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం) -
తీవ్ర విషాదం: చెరువులో పడి నలుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా మృతి చెందారు. నలుగురి మృతితో ఓజిలి మండలం రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం గ్రామంలో ఉన్న చెరువు వద్దకు మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) ఆడుకోవడానికి వచ్చారు. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో చిన్నారులు పడిపోయారు. అక్కడే సమీపంలో ఉన్న షేక్ ఖలీల్ (45) వెంటనే వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. వారిని కాపాడే క్రమంలో ఖలీల్ కూడా నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లి ఖలీల్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజుపాలెం: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం - ప్రొద్దుటూరు రహదారిలో కుర్రపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెం నుంచి ప్రొద్దుటూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నఓ యువకుడిని ఎదురుగా వస్తోన్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తోన్న రాజుపాలెం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ భాషా(24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. youngman died, road accident, rajupalem, యువకుడి మృతి, రోడ్డు ప్రమాదం, రాజుపాలెం -
కారు ఢీ కొని యువకునికి గాయాలు
బద్వేలు అర్బన్: మండల పరిధిలోని రాజుపాళెం వద్ద శనివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి , గోపాలమ్మల రెండవ కుమారుడైన కల్లూరు రవికుమార్‌రెడ్డి(17) అనే యువకుడు రోడ్డుపక్కన నిలిచి ఉండగా తిరుపతి నుంచి బద్వేలుకు వస్తున్న కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు యువకుడిని పట్టణంలోని ప్రభుత్వాసుప్రతికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తరలించారు. కాగా గతంలో రోడ్డువెంట స్పీడ్ బ్రేకర్లు ఉండేవని, ఇటీవల కాలంలో రోడ్డువేసే సందర్బంలో స్పీడ్ బ్రేకర్లు తొలగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. -
శివాలయంలో చోరీ
రాజుపాళెం: రాజుపాళెంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కన ఉన్న ఈశ్వర రామాలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గ్రామస్తులు తెలపడంతో సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ సుబ్బయ్య పరిశీలించారు. దేవాలయంలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు. ఈశ్వర ఆలయం, పార్వతీదేవి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి దేవాలయంలోని గర్భగుడి వాకిలికి వేసిన తాళాలను కూడా పగులగొట్టారు. శివలింగం ఉన్న గర్భగుడిలో బీరువాని పగులగొట్టి అందులో ఉన్న దేవాతామూర్తుల బట్టలను చిందరవందర చేశారు. హుండీలో ఉన్న రూ.5 వేలు వరకు నగదును తీసుకెళ్లారని గ్రామానికి చెందిన సానా వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతి
రాజుపాలెం (గుంటూరు) : రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోట నాగరాజు తన ఇద్దరు కుమారులతో కలిసి బావి వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. దీంతో నాగరాజు(30)తో పాటు ఆయన కుమారుడు అనిల్(4) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ఆయన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలోని నారాయణరెడ్డి సమాధి వద్ద పుష్పమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి మల్లమ్మ, కుమారులు సూర్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు. -
వరదనీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
వైఎస్సార్ జిల్లా (రాజుపాలెం) : రాజుపాలెం మండలానికి, వెంగళాయపాలెం గ్రామానికి మధ్యనున్న మడవంక పొంగటంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు వెంటనే దిగిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వెళుతోంది. బస్సును వరద నీటి నుంచి బయటికి లాగేందుకు పరిసర గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : విషజ్వరం బారిన పడిన ఓ బాలుడు మృతిచెందాడు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకువపల్లె గ్రామానికి చెందిన షరీఫ్, చాందినీ దంపతుల రెండో కుమారుడు మహ్మద్ రఫీ(11 నెలలు) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం కనిపించకపోవటంతో శనివారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో రాజుపాలెం వద్ద చిన్నారి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. -
అన్న చేతిలో తమ్ముడు హతం
రాజుపాళెం: తొండలదిన్నె గ్రామానికి చెందిన దేవగుడి మహబూబ్ బాషా (35) అనే రైతు ఆయన తమ్ముడు దేవగుడి దస్తగిరిని శుక్రవారం ఉదయం హత్య చేశాడు. మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం అందించిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దస్తగిరి, హతుడు మహబూబ్ బాషా ఇద్దరు అన్నదమ్ములు. వీరికి దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరం గ్రామ సమీపంలోని కుందూనది దగ్గర్లో వరి మాగాణి పొలం ఉంది. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య వరిమడి గెట్టుకు సంబంధించి తగాదా జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబ్ బాషా వరి పంటను చూసేందుకు వెళ్లాడు. ఆయన సోదరుడు దస్తగిరి పొలంలో నుంచి నీళ్లు రావడంతో అడిగారు. అక్కడ ఇరువురి మధ్య మాటకుమాట పెరిగింది. తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దస్తగిరి తన చేతిలో ఉన్న పారతో తమ్ముడైన మహబూబ్ బాషా తలపై కొట్టడంతో మృతి చెందాడు. తలపై బలమైన గాయం తగలడంతో మెదుడు చితికి పోయింది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మైదుకూరు డీఎస్పీ: మహబూబ్ బాషా మృతి చెందిన సంఘటనా స్థలాన్ని మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య, అర్బన్, రూరల్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, ఎస్ఐ మధుసుదన్‌రెడ్డి, ఏఎస్ఐ నాగన్న, పోలీసులు రమణారెడ్డి పరిశీలించారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముందు నుంచి అన్నదమ్ములు పొలం విషయంపై మాట్లాడుకోవడం లేదని తెలిసింది. మృతుడు మహబాబ్‌బాషా ఆయన తండ్రి నాగయ్యతో కలిసి ఉంటున్నాడు. నిందితుడు దస్తగిరి వేరే ఇంట్లో నివాసం ఉన్నాడు. హతుడు తండ్రి, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. -
ఘనంగా చెన్నకేశవస్వామి ఉత్సవాలు
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సంజీవరాయస్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం వైభవంగా స్వామి వారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై పల్లకీలో ఊరేగారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఇదో రకం మోసం..!
- ఇళ్ల స్థలాల పేరిట పిలిచి... ‘ప్రత్యేక హోదా’ కోసం ఆందోళన - రాజుపాలెం నుంచి మహిళలను గుంటూరు రప్పించిన ప్రభుత్వ ఉద్యోగి.. - ఆ వ్యక్తి కోసం ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి, గుంటూరు : తాము చేసే ఆందోళనలకు కొందరు ప్రజాసంఘాల నాయకులు మాయమాటలు చెప్పి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకుల మాటలు నిజమేనని నమ్మి ఆందోళనల్లో పాల్గొంటున్న అమాయక ప్రజలు చివరకు మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు గుంటూరు నగరంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోమవారం నగరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన కార్యక్రమం జరిగింది. దీంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వినతిపత్రం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఇళ్ల స్థలాల కోసం మీ తరఫున పోరాడుతున్నామని నమ్మించి తమను ఈ కార్యక్రమానికి రప్పించారనీ, ప్రత్యేక హోదా కోసం ఆందోళ చేస్తున్న విషయమే తమకు తెలియదని కొందరు మహిళలు పోలీసుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఓప్రభుత్వ ఉద్యోగి తమను నమ్మించి రాజుపాలెం నుంచి గుంటూరు రప్పించారనీ, అసలు ఇక్క డ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి మధ్యాహ్న సమయమైందని వారు వాపోయారు. ఏదో కార్యక్రమం కోసం ఆందోళన చేసి ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే రక్షించేదెవరం టూ పోలీసుల వద్ద మహిళలు ఆవేదన చెందినట్లు సమాచారం. విషయం అర్థం చేసుకున్న పోలీసు అధికారులు ఆ ప్రభుత్వ ఉద్యోగి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.