విషజ్వరం బారిన పడిన ఓ బాలుడు మృతిచెందాడు.
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : విషజ్వరం బారిన పడిన ఓ బాలుడు మృతిచెందాడు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకువపల్లె గ్రామానికి చెందిన షరీఫ్, చాందినీ దంపతుల రెండో కుమారుడు మహ్మద్ రఫీ(11 నెలలు) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.
అయితే స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం కనిపించకపోవటంతో శనివారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో రాజుపాలెం వద్ద చిన్నారి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.