viral fever
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్‌లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్‌గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్‌లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్‌గున్యా కేసులు సెప్టెంబర్‌లో 183, అక్టోబర్‌లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
ఏపీలో విజృంభిస్తున్న విషజ్వారాలు
-
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు
-
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!
సాక్షి, కరీంనగర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశానికి వెళ్లిన యువకుడి శవమై ఇంటికి తిరిగొచ్చాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. మండలంలోని బండపల్లికి చెందిన రేగుల బాబు(39) గత డిసెంబర్లో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఇరువై రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. అక్కడ వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గలేదు. రెండు, మూడు రోజుల్లో ఇంటికొస్తానని భార్యకు వారం క్రితం ఫోన్ చేసి చెప్పాడు. పరిస్థితి విషమించి బాబు శుక్రవారం మృతి చెందాడు. ఈ అతని స్నేహితులు ఫోన్ ద్వారా బాబు భార్య కల్యాణికి ఫోన్లో తెలపడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. బాబు శవపేటిక సోమవారం బండపల్లికి చేరింది. తండ్రి శవాన్ని చూసి కూతురు, కుమారుడు, భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది. చిన్ననాటి నుంచి కష్టాలే.. బాబు చిన్నతనంలోనే తండ్రి లచ్చయ్య మృతి చెందడంతో తల్లి లచ్చవ్వ గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తూ కుమారుడిని పోషించింది. బాబు పదోతరగతి చదువుతుండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న బాబు బంధువులు పెళ్లి చేశారు. స్వగ్రామంలో చిన్నాచితక పనులు చేసుకునేవాడు. ఇటీవల అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జ్వరంబారిన పడి గత శుక్రవారం మృతిచెందాడు. ముందుకొచ్చిన యువకులు.. బాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ యువకులు ముందుకొచ్చారు. మృతుడికి పదమూడేళ్ల కూతురు రష్మిత ఉంది. ఆమె చదువుల కోసం యువకులు రూ.50వేలు జమచేశారు. మరింత మొత్తం జమచేసి అందజేసేందుకు యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇవి చదవండి: పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం! -
హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..
సాక్షి, కుమరం భీం: తీవ్రజ్వరంతో ఒకరి మృతి చెందిన ఘటన మండలంలోని చింతగూడ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అనుమాల నరేందర్ (25) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఐదు నెలల పాప ఉంది. నరేందర్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 20 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆసుపత్రుల్లో చూపెట్టుకున్న తగ్గలేదు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్ అసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..
ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్‌లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి! -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
కలలు.. కల్లలయ్యాయి..
ఎల్కతుర్తి: ఇటీవల బీటెక్ అయిపోయింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ మనం ఒకటి తలిస్తే.. విధి మరోటి తలుస్తుందని అంటుటారు.. అదే ఈ యువకుడి విషయం జరిగింది. జ్వరంరాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నాడు. అతను ఇచ్చిన ఇంజక్షన్‌తో శరీరం నల్లగా మారడంతోపాటు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి విజయ్(22) బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న విజయ్‌కి జ్వరం రావడంతో జీల్గులకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మాత్రలు ఇచ్చాడు. అయినప్పటికి విజయ్‌కి జ్వరం తగ్గకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ వేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంజక్షన్ వేసిన దగ్గర శరీరమంతా నల్లగా మారి ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా మరికొన్ని మాత్రలు ఇచ్చి తగ్గకపోతే రావాలని సూచించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. దీంతో ఆర్ఎంపీ.. విజయ్ చేతికి మరో ఇంజక్షన్ వేసి పంపించాడు. ఆ నొప్పి తీవ్రతరం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అశ్రిత్‌రెడ్డి.. విజయ్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నాలుగు రోజుల తర్వాత రావాలని మందులు రాసి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన విజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఈనెల 14న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్తోపాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ అశ్రిత్‌రెడ్డి విజయ్ మృతికి కారకులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడికి తల్లిండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మృతుడి తండ్రి రవిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఇటీవలే బావుపేటలో ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బత్తిని సతీష్ అనే వ్యక్తి మృతిచెందిన విషయం మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త! వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ...
సాక్షి, అమరావతి: వాతావరణంలో మార్పులు, వర్షాలతో రాష్ట్రంలో వైరల్ ఫీవర్; మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.98 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 945 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 531, పార్వతీపురం మన్యంలో 238 కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఓ మోస్తరుగా, 13 జిల్లాల్లో నామమాత్రంగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,387 డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 387 కేసులు ఉన్నాయి. విజయనగరంలో 173, కాకినాడలో 99, అనకాపల్లిలో 82 కేసులు నమోదయ్యాయి. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పారిశుధ్య నిర్వహణ, నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. డెంగీకు సంబంధించి 54 ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను సెంటినల్ నిఘా ఆసుపత్రులుగా గుర్తించారు. వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,270 టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో వైద్య సిబ్బందికి సెరా నమూనాలపై అవగాహన కల్పించారు. మలేరియా ఎక్కువగా ఉన్న ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో నియంత్రణ చర్యలను వైద్య శాఖ చేపట్టింది. వ్యాధి ఎక్కువగా ఉన్న 4–5 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. దోమల నుంచి రక్షణ కోసం 25.94 లక్షల దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పరిసరాలను పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపడుతోంది. వెక్టార్ కంట్రోల్, ఏఎన్ఎంలు వారి పరిధిలో అపరిశుభ్రంగా, నీరు నిలిచిన ప్రాంతాల ఫోటోలను హైజీన్ యాప్‌లో అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వెంటనే గ్రామ/వార్డు కార్యదర్శులు అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఫ్రైడే–డ్రై డే ప్రచార కార్యక్రమం ప్రతి శుక్రవారం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటి ఆవరణ, చుట్టుపక్కల పనికిరాని వస్తువులు, టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ► మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ► నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి ► ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి ► తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ► దోమ తెరలు వినియోగించాలి. గర్భిణిలు, చిన్న పిల్లలకు దోమతెరలు తప్పనిసరి నిర్లక్ష్యం చేయద్దు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు సహా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సొంత వైద్యం చేసుకోకూడదు. సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, రాష్ట్ర సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ ప్రాథమిక దశలోనే గుర్తించాలి వాతావరణంలో మార్పుల వల్ల వైరల్ ఫీవర్ (విష జ్వరం)లు ఎక్కువగా వస్తాయి. దోమల ద్వారా మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు వస్తాయి. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం కీలకం. జ్వరం, ఇతర అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇంట్లో ఇతరులకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకూడదు. మాస్క్ ధరించాలి. మాస్క్ వల్ల కరోనాతోపాటు ఇతర వ్యాధులు, వైరస్లు, భ్యాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రఘు, గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ -
యూపీ: వైరల్ ఫీవర్‌తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్‌లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్‌లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్ లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్ -
ఆ గ్రామంలో వరుస మరణాలు.. కారణం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరుస మరణాలతో ఆ గ్రామం అల్లాడుతోంది. కారణం తెలియకుండానే కన్నుమూస్తున్న వారిని చూసి గ్రామం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందో.. రేపు ఎవరివంతో అనుకుంటూ.. దినదినగండంగా గడుపుతోంది. ఇదీ.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామం పరిస్థితి. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విస్తృతంగా ఉన్నా.. ఎవరికి వారే వైద్యం చేయించుకోవడం, జ్వర తీవ్రత పెరిగితే జిల్లా కేంద్రమైన ఖమ్మం ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో కోవిడ్ మొబైల్ వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నా.. తమ గ్రామానికి ఎందుకు రావడంలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమైన పెద్ద పోచారంలో ఒక్కొక్కరుగా కన్ను మూస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామంలో 12 మంది మృత్యువాత పడ్డారు. కారణాలు ఏమైనా.. వరుస మరణాలు సంభవిస్తుండటంతో తమను పట్టించుకునే వారే లేరా.. అనే ఆవేదన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. మరణించిన వారిలో కరోనా వైరస్ సోకిన వారు, వృద్ధాప్యంలో ఉన్న వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. సెప్టెంబర్ 15 నుంచి వరుసగా మరణాలు సంభవించడం, మరో వైపు జ్వరాల తీవ్రత పెరగడం.. అది ఏ జ్వరమో.. చికిత్స ఎక్కడ చేయించుకోవాలో..? ఎలాంటి మందులు వాడాలో.. చెప్పే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం అని చెబితే కరోనా.. అని అంటారనే భయంతో అనేక మందికి జ్వరాలు వచ్చినా బయటకు రాక అందుబాటులో ఉన్న వైద్యంతో సరిపెడుతున్నారని.. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని భయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు అన్ని ప్రాం తాల్లో చర్యలు చేపడుతున్నా.. తమ గ్రామంలో ప్రభుత్వ వైద్యం అందని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గ్రామ ప్రజల్లో మనో ధైర్యం కలగాలంటే జ్వరపీడితులకు సరైన వైద్యం అందించడంతోపాటు కరోనాపై వారికి ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని గ్రామపెద్దలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇటీవల గ్రామంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. -
కాటేస్తున్నాయి..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వైరల్ జ్వరాలు పిల్లలను కాటేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చాపకింద నీరులా దాడి చేస్తున్నాయి. ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలమైంది. ఈ సీజన్లో ప్రతి 10 మందిలో ఒకరికి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం ఒకటి. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లల్లో ఎక్కువగా .. ఎక్కువమంది చిన్న పిల్లలు జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు జ్వర పీడితులతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొందరు పిల్లల్లో డెంగ్యూ పాజిటివ్ లక్షణాలు కనబడడంతో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఒకటి, రెండు డెంగ్యూ కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 150 మందికి పైగా పిల్లలు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో సుమారు 50 మందికి పైగా చిన్నారులు వైద్యం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది చేరడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్త్రీ, పురుషుల జనరల్ వార్డులు కూడా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే టోకెన్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఉదయం టోకెన్ తీసుకుంటే రాత్రికి గాని వైద్యుడి వద్దకు వెళ్లడానికి అవకాశం దొరకడం లేదు. ఎలా వస్తాయంటే.. వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వైరల్ జ్వరాలకు మరో కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువ మంది గుమికూడి ఉండే చోట్లలో వైరల్ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే పిల్లల్లో జ్వరాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది. లక్షణాలు ఇవీ.. వైరల్ జ్వరాల బారిన పడిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరం నిస్పత్తువ, తలనొప్పి ఉంటాయి. ఆహారం తీసుకోకపోవడం, గొం తునొప్పి, ముక్కులో నీళ్లు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా వ్యాయామం చేసేవారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. చాలా వరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ♦ జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒంటి నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ♦ పిల్లలతో పాటు పెద్దలు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ♦ పిల్లలను ఐస్‌క్రీమ్‌లకు దూరంగా పెట్టాలి. ♦ వాతావరణం చల్లగా ఉంటుంది కావున పిల్లలకు రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం దుప్పటి కప్పి నిద్రపుచ్చాలి. ♦ ఆకాశం మేఘావృతం అయినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పిల్లలను బయటకు పంపరాదు. ♦ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా చిన్న పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో రోజు ఆస్పత్రికి 150 మందికి పైగా చిన్నారులు వస్తున్నారు. పిల్లలను చల్లని వాతావరణంలో తిప్పకూడదు. రాత్రి వేళల్లో దుప్పటి కప్పి పడుకోబెట్టాలి. జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి.– డాక్టర్ డేవిడ్ సెల్వన్‌రాజ్, ఆర్ఎంఓ,చిన్నపిల్లల వైద్యుడు. ప్రొద్దుటూరు -
వైరల్.. హడల్
నల్లకుంట/గాంధీ: విషజ్వరాలు నగరవాసులను వణికిస్తున్నాయి. ఎప్పడూ లేని విధంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతుండడంతో రెండు వారాల క్రితం అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 2వేల నుంచి 3వేల మంది రోగులు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో 20 మంది వైద్యులే అందుబాటులో ఉండడంతో... ఒక్కో వైద్యుడు సగటున 120–150 మందిని చూడాల్సి వస్తోంది. దీంతో రోగులు గంటల తరబడి లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ల్యాబ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. రక్త పరీక్షల కోసం రోగులు బారులుతీరుతున్నారు. ఇక్కడ క్యూలైన్ పాటించకపోవడంతో ఒక్కోసారి తోపులాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ‘గాంధీ’లో డెంగీ డేంజర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఐదు రోజుల్లో 555 విషజ్వరాల కేసులు నమోదు కాగా... వాటిలో 121 డెంగీ పాజిటివ్ కేసులు కావడం గమనార్హం. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో ఇద్దరు డెంగీతో మరణించగా... ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు డెంగీతో మృతి చెందారు. నేలపైనే వైద్యం గాంధీకి రోగుల తాకిడి పెరగడంతో బెడ్స్ సరిపోవడం లేదు. దీంతో రోగులను వరండాలో నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లు, వీల్‌చైర్లపైనే వైద్యం అందించాల్సి వస్తోంది. 1,062 పడకలున్న ఆస్పత్రిలో సుమారు 3వేల మందికి వైద్యం అందించడం గమనార్హం. విషజ్వరాల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైరల్ ఫీవర్ వార్డు రోగులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం స్పందించి రోగుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు. సంఖ్య పెరిగింది సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధిచెందుతాయి. తాగునీరు కలుషితం కావడం వల్ల కూడా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. అధికంగా జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి. – డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంఓ -
వైరల్ ఫీవర్‌తో బాలిక మృతి
ఒంగోలు సెంట్రల్: ఒంగోలులో వైరల్ ఫీవర్‌తో ఓ బాలిక బుధవారం మృతి చెందింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలిక కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు సంతపేట 14వ డివిజన్ పరిధి ఆంజనేయస్వామి గుడి పక్కన నివసించే రెబ్బ రమేష్ కుమార్తె సిరి చందన (6) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు కుమార్తెను సుందరయ్య భవన్ రోడ్డులోని చిన్న పిల్లల వైద్యశాలలో చేర్పించారు. వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించిన అక్కడి వైద్యులు పాపకు చికిత్స అందించారు. ఇంతలో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ జ్వరాలు ప్రబలకుండా నగరంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. వైద్య శిబిరాలు సంతపేటలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో అక్కడ గురువారం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ లక్ష్మీపాపారావులు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి, జ్వరబాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించారు. -
'బెడ్డు'మీదపల్లె
ప్రకాశం, యర్రగొండపాలెం: విషజ్వరాలతో (వైరల్‌ఫీవర్స్) మండలంలోని గడ్డమీదిపల్లె మంచంపట్టింది. వీరభద్రాపురం పంచాయతీలోని ఈ గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా చోటు చేసుకోవడం వలన అంటువ్యాధులు సోకుతున్నాయి. పంట పొలాలు గ్రామానికి సమీపంలో ఉండటంతో గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్నాయి. వైద్యాధికారులు సీజనల్ వ్యాధులపై ప్రత్యేదృష్టి పెట్టి గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేస్తున్నారు. జ్వరాలు సోకిన వారి ఇంటివద్దనే సెలైన్ బాటిళ్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్డమీదిపల్లెలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి.సురేష్ బుధవారం తమ సిబ్బందితో వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. 110 మందిని ఆయన పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. 10 మందికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. గ్రామంలో వైద్యబృదం పర్యటించి కాలువల్లో, గుంతల్లో నిలువ ఉన్న మురికి నీటిలో ఎబేట్ పిచికారి చేయించారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
నల్లకుంట: గత కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో బస్తీలు వణికిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడిన మంచానికే పరిమితమవుతున్నారు. సకాలంలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా జ్వరం తగ్గక పోవడంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి బాట పడుతున్నారు. బస్తీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతర వర్షాలు, పారిశుధ్య లోపం కారణంగా నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుతోంది. గ్రేటర్‌లోని అన్ని మురికి వాడలు, బస్తీల్లో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బస్తీల్లో పారిశుధ్యం లోపించింది. డ్రెయిన్లు పూడుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత నీరు కలుషి తమవుతుండటంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. చలి జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో వైరల్ ఫీవర్స్, మలేరియా తదితర రోగాలతో చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లోనూ జ్వర పీడిత కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ‘గాంధీ’లో నేల పడకలే దిక్కు గాంధీఆస్పత్రి : విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రోగుల తాడికి విపరీతంగా పెరిగింది. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి రోగులు క్యూ కట్టడంతో పలు విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాలో నేలపై పరుపులు వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం 2101 రోగులకు వైద్యసేవలు అందించారు. సాయంత్రం ఓపీకి స్పందన అంతంత మాత్రంగా ఉంది. సరైన ప్రచారం లేకపోవడంతో ఈ నెల 1 నుంచి 8 వరకు గాంధీ సాయంత్రం ఓపీలో కేవలం 116 మంది మాత్రమే వైద్యసేవలు పొందారు. జాగ్రత్తలు తీసుకోవాలి కాచి వడపోసిన నీటిని తాగాలి. కలు షిత, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదు. వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వస్తే వైద్యుల సలహామేరకు మందులు వాడాలి.– డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంవో -
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
-
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
సాక్షి, హైదారాబాద్ : అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అవగాహన సదస్సులతో పాటు త్వరలోనే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం ఆయన మంత్రి ఈటల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విష జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతోనే విషజ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. అందరికి వైద్యం అందేలా ప్రభుత్వం యుద్ధప్రాతిక చర్యలు చేపబట్టబోతుందన్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితిపై సమీక్షించామని, సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక క్యాలెండర్ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో దోమలను నివారించవచ్చునని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కేబినెట్ ఆమోదిస్తే బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో అంటువ్యాధులు, నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారులు ఉదయం 6 గంటలకల్లా విధుల్లో ఉండాలని సూచించారు. డెంగీని 15 రోజుల్లో అదుపులోకి తెస్తామని మంత్రి తెలిపారు. వినాయక మండపాల వద్ద పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. నిర్మాణరంగ వ్యర్థాలపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మేయర్, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో డ్రైనేజీ పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం జీహెచ్ఎంసీ బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. -
పడకలు లేవని ముప్పు తిప్పలు
సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్‌కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్‌లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్ బారో సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్‌కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్‌కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్ మాత్రమే కాదు.. వైరల్ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది. -
హైదరాబాద్‌లో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు