కళ్యాణదుర్గం(నుసికొట్టాల తండా): మండల పరిధిలోని నుసికొట్టాల తండాకు చెందిన నీలమ్మ (35) విషజ్వరంతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నీలమ్మకు జ్వరం రావడంతో సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా అక్కడి వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రి రెఫర్ చేశారు. దీంతో భర్త వెంకటేశ్ నాయక్ ఆమెను అనంతపురం తీసుకురాగా, అక్కఽ చికిత్స పొందుతూ ఆస్పపత్రిలో మృతి చెందింది. మెరుగైన వైద్యం అందకే తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త వెంకటేశ్ నాయక్ వాపోయారు. గ్రామంలో మరికొంతమంది జ్వర పీడితులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.