Woman dies
-
విషాదం: ప్రాణం తీసిన చేపల కూర.. భార్య మృతి.. కోమాలో భర్త!
విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మార్చి 25న మలేషియాలో వెలుగుచూసింది. జపాన్‌లో ఎక్కువగా తినే పఫర్ ఫిష్ రుచికరంగా ఉండటంతోపాటు అత్యంత విషపూరితమైనది. ఇది తెలియక జోహోర్కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మార్కెట్ నుంచి పఫర్ ఫిష్‌ను కొనుగోలు చేశాడు. వాటిరి ఇంటికి తీసుకురాగా అతని భార్య లిమ్ సీవ్ గ్వాన్ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది. ఇద్దరు కలిసి తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్వాన్‌కు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఇవే లక్షణాలు కొంత సమయానికి అతనిలో కూడా ప్రారంభమయ్యాయి. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్ సీవ్ గ్వాన్ మరణించింది. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు. కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. చదవండి: హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్ -
ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో చీరకొంగు చిక్కుకొని..
సాక్షి, నల్గొండ: ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు చీర కొంగు చిక్కుకోవడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.. ఈ విషాదం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన మరాటి ఆండాలు (55) స్థానిక పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు రమావత్ జగన్‌కు చెందిన ధాన్యాన్ని తూర్పారట్టేందుకు కూలికి వెళ్లింది. కాగా తూర్పారపట్టే యంత్రంలో ధాన్యం పోస్తుండగా ప్రమాదవశాత్తు వేగంగా తిరుగుతున్న రాడ్‌కు ఆండాలు చీర కొంగు చుట్టుకొని కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆండాలు కుడికాలు విరగడంతో పాటు రొమ్ము భాగంలో బలమైన గాయాలయ్యాయి. గమనించిన రైతు జగన్.. అండాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి రైతుల సహాయంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కారులో తరలించారు. కాగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆండాలు అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. చదవండి: భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం? -
ఘోర ప్రమాదం.. గోడ కూలి పాప, మహిళ మృతి
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది. రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి -
అమర్నాథ్ యాత్రలో మరో ఏపీ మహిళ మృతి
-
అమర్నాథ్లో పెను విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి
సాక్షి, న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం: అమర్నాథ్ యాత్రలో జరిగిన పెను విషాదంలో ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్నాథ్ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్ కమిషనర్ కౌశిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చదవండి: Amarnath Yatra: 35 మంది ఏపీవాసులు సురక్షితం.. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఇందులో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు పయనమయ్యారు. మరో 11 మంది ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. -
భర్తను పికప్ చేసుకోవడానికి వెళ్తూ.. గుంతను తప్పించబోయి..
చెన్నై: భర్తను పికప్ చేసుకోవడానికి బండి మీద వెళ్తూ.. దారిలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందింది ఓ మహిళ. తమిళనాడులోని కంచీపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరి(37) తన భర్త అరుముగమ్‌ను తీసుకురావడానికి బండి మీద వెళ్తోంది. ఆ సమయంలో రోడ్డు మీద ఓ ట్రాక్టర్ అడ్డు ఉండడం, పైగా ఎదురుగా ఓ గుంత ఉండడంతో ఆమె తప్పించబోయింది. ఈ క్రమంలో పక్కన వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాని కిందపడి అక్కడికక్కడే ఆమె కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న శివకంచి పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
పెళ్లి తర్వాత ప్రేమ.. అనాలోచిత నిర్ణయం తెచ్చిన అనర్థం
నిమ్మనపల్లె (అన్నమయ్య జిల్లా): ఒక్క అనాలోచిత నిర్ణయం..నిండు జీవితాన్ని బలితీసుకుంది. ఉన్నతంగా చదువుకొన్న విద్యాధికులు ఉన్నంతంగా ఆలోచించలేకపోవడం...చదువుతో పాటు నేర్చుకోలేని సంస్కారం.. కారణంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. యువతి వందేళ్ల జీవితం మూడు నెలల కాలానికే మృత్యువుకు అర్పితమైంది. వైవాహిక జీవితంపై సరైన అవగాహన లేక ..పెళ్లి తరువాత ప్రేమిస్తే వచ్చే అనర్థాలను గుర్తించలేక ఒకరు ప్రాణాలను కోల్పోతే..మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు... మరొకరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారంపంచాయితీ రెడ్డివారిపల్లెకు చెందిన యువతి మూగలమర్రి హర్పిత(27), అనాలోచిత నిర్ణయం నేపథ్యం..రెడ్డివారిపల్లె గ్రామంలోని ఎం.నరసింహులు, క్రిష్ణమ్మ దంపతులకు కుమారుడు అరవింద్, కుమార్తె హర్పితలు ఉన్నారు. తండ్రి నరసింహులు వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో లాండ్రీషాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు తిరుపతిలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండగా, హర్పిత సైతం తిరుపతిలోని జ్యువలరీ షాపులో సేల్స్‌గర్లగా పనిచేస్తోంది. తెలుగు సబ్జెక్టులో బీఎడ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఈమెకు గత మార్చి నెల20వ తేదీన చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరుకు చెందిన జాషువాతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరి మధ్య సఖ్యతలేకుండా పోయింది. కారణం..ఆమెకు పుంగనూరు మేలుపట్ల చెందిన రాజేష్‌రెడ్డితో పరిచయం ఉండటమే. మేలుపట్లకు చెందిన వెంకటరమణారెడ్డికి రాజేష్‌రెడ్డి సొంత కొడుకు కాగా, జాషువాను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. జాషువా పౌల్ట్రీ రంగంలో పనిచేస్తూ నిమ్మనపల్లె మండలంలో కోళ్ల ఫారాలకు అవసరమైన మందులు సరఫరా చేస్తూ ఉండేవాడు. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో స్కిల్‌డెవలప్‌మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్డివారిపల్లెకు చెందిన హర్షితతో జాషువాకు పెళ్లి నిశ్చతమైంది. అయితే పెళ్లిచూపుల సమయంలో, షాపింగ్‌లో, ఫంక్షన్లో వీరిద్దరూ హర్పితతో కలిసి తిరిగారు. ఈ సమయంలో రాజేష్‌రెడ్డితో హర్పితకు పరిచయం ఏర్పడి బలపడింది. జాషువాతో పెళ్లి జరిగిపోయింది. భర్తపై నిరాసక్తత ప్రదర్శించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. విషయం తెలిసిన రాజేష్‌రెడ్డి తల్లి హర్పితను మందలించింది. భర్తతో సఖ్యతగా ఉండాలంటూ సూచించింది. అయితే ఆ మాటలను పెడచెవిన పెట్టింది. రాజేష్‌రెడ్డితో పరిచయం కొనసాగించింది. యధావిధిగా తిరుపతిలోని జ్యువలరీషాపులో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. ప్రమాద నేపథ్యం ఈనెల13వ తేదీ సోమవారం రాత్రి రాజేష్‌రెడ్డి ఇంటి వద్ద రూ.లక్ష నగదు తీసుకుని కారుతోపాటు అదృశ్యమయ్యాడు. కుమారుడి అదృశ్యంపై తండ్రి వెంకటరమణారెడ్డి పుంగనూరు పోలీస్టేషన్లో14వ తేదీ ఫిర్యాదు చేశాడు. రాజేష్‌రెడ్డి ఉపయోగించిన కారు మదనపల్లెలోని దేవతానగర్ వద్ద పోలీసులు గుర్తించారు. కారులో సీట్లుకాలిపోవడం, పెట్రోల్ , డీజిల్ వాసన రావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజేష్‌రెడ్డి ఉన్న లొకేషన్ గుర్తించి తండ్రి వెంకటరమణారెడ్డి, పుంగనూరు పోలీసులు ఇన్నోవా వాహనంలో విజయవాడకు వెళ్లారు. అక్కడ రాజేష్‌రెడ్డితో హర్పిత ఉండడం గుర్తించారు. వారిని తీసుకుని వస్తుండగా ఒంగోలు వద్ద హైవేపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని , లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హర్పిత అక్కడికక్కడే మృతి చెందింది. రాజేష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్ తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఒంగోలు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహం రాక ఆలస్యం శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హర్పిత మృతదేహం శనివారం రాత్రి వరకు స్వగ్రామం రెడ్డివారిపల్లెకు చేరుకోలేదు. తండ్రి నరసింహులు సోదరుడు అరవింద్ శుక్రవారమే ఒంగోలుకు వెళ్లారు. మృతదేహంకోసం గ్రామంలోకుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. హర్పిత తెలుగు బీఎడ్ పూర్తి చేసింది. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఉన్నతంగా చదువుకున్నా ఉన్నతంగా ఆలోచించలేకపోయారు. చదువుతోపాటు నేర్చుకున్న సంస్కారాన్ని మరిచిపోవడంతోఒకరు తనువు చాలిస్తే, మరొకరు సమాజంలో గౌరవం కోల్పోవాల్సి వచ్చింది. మరొకరి జీవితం ప్రశ్నార్థకం అయింది. పెళ్లి తర్వాత ప్రేమ అనర్థమే.. పెళ్లి తరువాత ప్రేమైనా వ్యామోహమైనా , అక్రమ సంబంధాలైనా అనర్థాలే తెచ్చిపెడుతాయి. వీటివల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న జంటలను నిత్యం చూస్తున్నాం. ఇప్పటికైనా యువతీ యువకుల ఆలోచనలోమార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది -
విధి వక్రీకరించి.. పెళ్లయిన మూడు నెలలకే..
ఒంగోలు: విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైన సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట గ్రామ సమీపంలోని కుమ్మరికుంట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజేష్‌రెడ్డి అనే యువకుడు అదృశ్యమైనట్లు అతని తండ్రి రమణారెడ్డి పుంగనూరు పోలీసులకు ఈ నెల 14వ తేదీ ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారించగా ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పుంగనూరు పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్, కానిస్టేబుల్ ఎల్లప్ప, రమణారెడ్డి, బంధువులు కలిసి పవన్‌కుమార్ అనే కారు డ్రైవర్‌ను తీసుకుని కారులో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ రాజేష్‌రెడ్డిని గుర్తించి తీసుకుని తిరిగి పుంగనూరు పోలీసుస్టేషన్‌కు వెళ్తుండగా డ్రైవర్ పవన్‌కుమార్ నిద్రమత్తు కారణంగా కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు రెండోవైపు నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హర్షిత (35) అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ఆరుగురైన రాజేష్‌రెడ్డి, రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, ఎల్లప్ప, జ్ఞానప్రకాష్, డ్రైవర్ పవన్‌కుమార్ గాయపడటంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరుగుమల్లి ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన హర్షితకు మార్చిలో వివాహం జరగ్గా, మూడు నెలలకే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. -
మహిళతో లారీ డ్రైవర్ గొడవ.. సెల్‌ఫోన్ లాక్కుని..
గుంటూరు రూరల్: పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకునే ఓ మహిళ ప్రాణాలను లారీ డ్రైవర్ బలి తీసుకున్నాడు. మృతురాలి పిల్లలు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట సుగాలీ కాలనీకి చెందిన ప్రతామ రమణమ్మ (40) భర్త కొన్ని సంవత్సరాల కిందట మృతి చెందాడు. అప్పటినుంచి చిత్తు కాగితాలు ఏరుకోవడంతోపాటు చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను పోషిస్తుంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తనతోపాటు తన ముగ్గురు పిల్లలు, ఆడపడుచు, ఆడపడుచు భర్త కలిసి గుంటూరు రూరల్ మండలంలోని నాయుడుపేటలోని డంపింగ్ యార్డు సమీపంలో కాగితాలు ఏరుకునేందుకు బయలుదేరారు. బస్సుకు ఎక్కువ చార్జీ అవుతుందని లారీలో అయితే తక్కువతో ప్రయాణించవచ్చని అదే దారిలో వస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన లారీని చిలకలూరిపేటలో ఎక్కారు. అనంతరం నాయుడుపేట వద్ద లారీని ఆపాలని డ్రైవర్‌ను కోరారు. లారీ ఆగటంతో ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు, రమణమ్మ దిగారు. అనంతరం రమణమ్మ డ్రైవర్‌కు రూ.100 ఇచ్చింది. డ్రైవర్ రూ.300 ఇవ్వాలని రమణమ్మతో గొడవకు దిగాడు. ఇరువురు వాదులాడుకుంటుండగా డ్రైవర్ రమణమ్మ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని లారీని ముందుకు లాగించాడు. సెల్‌ఫోన్‌కోసం కదులుతున్న లారీని ఎక్కేందుకు ప్రయత్నించింది. లారీని డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు. కాలుజారి రమణమ్మ కిందపడింది. అదే లారీ ఆమెపైకి ఎక్కింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు కేకలు వేశారు. డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ ఆంజనేయులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి, బంధువుల నుంచి సమాచారం సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ లారీని ప్రత్తిపాడు సమీపంలో నిలిపివేసి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
కాన్పు చేసిన నర్సులు.. బిడ్డతో సహా గర్భిణి మృతి
సాక్షి, బెంగళూరు: పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాల్సిన గర్భిణి వైద్య సేవలు అందక కన్నుమూసింది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లాలోని హొసకెర పీహెచ్సీలో చోటు చేసుకుంది. వివరాలు.. మధుగిరి తాలూకా బ్రహ్మదేవరహళ్లికి చెందిన కమలమ్మ(28) కు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎంతసేపైనా రాకపోవడంతో కారులో హొసకెరె పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో నర్సులే కాన్పు చేసేందుకు ఉపక్రమించారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మృతి చెందింది. వైద్యులు లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందినట్లు భర్త కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమానుషం.. అస్పత్రి మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం -
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
సాక్షి, సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్‌కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌చేసిన డ్యుటీ డాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. -
మొబైల్ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది
ముంబై: ముంబై సమీపంలోని థానేలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ దొంగతనం చేశారు. మొబైల్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆ మహిళ కిందపడిపోగా.. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిపూర్‌కు చెందిన కన్మిలా రైసింగ్ అనే మహిళ థానేలోని ఓ 'స్పా'లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో... బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆమె ముందుకు వంగడంతో ఆటో నుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయాలవడంతో ఆమెకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆటోలో ప్రయాణించిన తన స్నేహితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేఈ, సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు అల్కేష్ పర్వేజ్(20),మొమిన్ అన్సారీ(18)గా తెలిపారు. చోరీ చేసిన మొబైల్‌ను రికవరీ చేశారా లేదా అన్నది తెలియరాలేదు. గతంలోనూ వీరు మొబైల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చదవండి: క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి.. -
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై ప్రమాదవశాత్తూ స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో భార్య లక్ష్మి మృతి చెందగా, భర్త నాగేశ్వరరావు, కుమారులు సాయిచంద్, సూర్యతేజ గాయపడ్డారు. నీటి పారుదల శాఖలో ఏఈగా పని చేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం గత కొన్నాళ్లుగా మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గతరాత్రి పిల్లలతో సహా గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కేకు తినే పోటీలో పాల్గొని మహిళ మృతి
సిడ్నీ : కేకు తినే (ఈటింగ్ కేక్) పోటీలో పాల్గొని మహిళ మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్ హౌస్ హోటల్లో కేకు తినే(ఈటింగ్ కేక్) పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన ల్యామింగ్టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఓ 60 ఏళ్ల మహిళ ల్యామింగ్టన్ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్ పీసులను తిన్న వెంటనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హోటల్ యాజమాన్యం ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందారని వెల్లడించారు. మహిళ మృతి పట్ల హోటల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా ఆ దేశంలో ప్రతి ఏడాది తిండి పోటీ (ఈటింగ్ కాంపిటీషన్) నిర్వహిస్తారు. కేకులు లేదా ఇతర ఆహార పదార్థాలను తక్కువ సమయంలో ఎక్కువ తినేవారిని విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు విలువైన బహుమతులను కూడా అందిస్తారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ ప్రమాదవశాత్తు..
సాక్షి, రంగారెడ్డి : బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం పైనుంచి కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. మృతురాలు ఎయిర్పోర్ట్ ఉద్యోగిని సిమ్రాన్(22)గా గుర్తించారు. కర్ణాటకలోని ముధోల్ టౌన్ బాగల్కోట్ జిల్లాకు చెందిన సిమ్రాన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తన డిప్రెషన్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు. -
కడప జిల్లాలో సరైన వైద్యం అందక మహిళ మృతి
-
వైద్యురాలి నిర్వాకం..
సాక్షి, పీఎం పాలెం(భీమిలి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఓ వివాహిత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరితే విగతజీవిగా ఇంటికి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 25 రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి లక్షలాది రూపాయలు ఫీజుగా వసూలు చేసి, ఆరోగ్యంగా వెళ్లిన యువతిని నిర్జీవిగా పంపించారని మృతురాలి బంధువులు ఆక్షేపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధురవాడ చంద్రంపాలెం దరి దుర్గానగర్‌కు చెందిన కె.విమల(మృతురాలి తల్లి), కె.కుసుమకుమారి (మృతురాలి చెల్లెలు) తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రంపాలెం దుర్గానగర్‌కు చెందిన కె.విమలకుమారి పెద్ద కుమార్తె సుధారాణి(42) భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కె.డేవిడ్ అనే వ్యక్తిని ఈ ఏడాది జూలై 10న రెండో వివాహం చేసుకుంది. అతని తొలి భార్య మరణించగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఇద్దరికీ రెండో వివాహమే. ఇప్పటికే మొత్తం నలుగురు పిల్లలు ఉండడంతో ఇక చాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని సుధారాణి నిశ్చయించుకుంది. ఆగస్టు 12న నగరంలోని వివేకానంద ఆస్పత్రిలో చేరింది. అక్కడ డాక్టర్ శాంతాకుమారి కుటుంబ నియత్రణ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఏమి జరిగిందో కాని ఆమె పరిస్థితి విషమించడంతో వివేకానంద ఆస్పత్రి నుంచి మరుసటి రోజు 13న మైక్యూర్ ఆస్పత్రికి డాక్టర్ శాంతాకుమారి హుటాహుటిన తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి సుధారాణి ఊపిరితిత్తులు, గండె, లివర్, కిడ్నీ పని చేయడం లేదని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. 14న ఆపరేషన్ చేయగా కడుపులో పెద్దపేగు కట్ అయిందని, దాని మూలంగా రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. మైక్యూర్ ఆస్పత్రిలోనే ఆగçస్టు 31వ తేదీ వరకూ ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించిందని ఆస్పత్రి బిల్లు రూ.8.5 లక్షలు కట్టించుకుని కేజీహెచ్‌కు తరలించడం మంచిదని చెబుతూ డిశ్చార్జ్ చేశారని సుధారాణి తల్లీచెల్లి విమల, కుసుమకుమారి వివరించారు. అప్పటికే వైద్య ఖర్చులకు మరో రూ.4 లక్షలకు పైగా అయిందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా ఈ నెల 4న సుధారాణి చనిపోయింది. ‘ఠాగూర్’సినిమా చూపించారు.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వెళితే తమకు ఠాగూర్ సినిమాలా కథ నడించారని మృతురాలి తల్లి ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ఆగస్టు 17న డీసీపీ–1కు, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లోనూ ఫిరాదు చేశామని తెలిపారు. ఇప్పటికీ పోలీసులు డాక్టర్ శాంతాకుమారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆశలు చిదిమేసిన లారీ
సాక్షి, పీఎం పాలెం (భీమిలి): ఆ వివాహిత ఉన్నత విద్యావంతురాలు.. మంచి ఉద్యోగం సాధించి భర్తకు అండగా నిలవాలనుకుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగానికి పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు కాటేయడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలవడంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఈ హృదయవిదారకర దుర్ఘటన జాతీయ రహదారిపై మధురవాడ బస్టాప్ సమీపంలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన బెహరా(ఒప్పంగి) దివ్య మాధురి (27) బీఎస్సీ, బీఈడీ వరకూ చదువుకుంది. ఆమెకు 5 సంవత్సరాల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. సచివాలయ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి పీఎం పాలెం సమీప సాంకేతిక విద్యాపరీషత్ పరీక్షా కేంద్రానికి భర్తతో కలిసి ఆదివారం ఉదయం బైక్‌పై వచ్చింది. పరీక్ష అనంతరం తగరపువలసలో ఉంటున్న ఆడపడుచు ఇంటికి వెళ్లడానికి భార్యాభర్తలు బయలుదేరారు. జాతీయ రహదారిపై బ్రిడ్జి దాటిన తరువాత చంద్రంపాలెం ప్రభుత్వ హైస్కూలు ఎదురుగా ట్రాఫిక్ అధికంగా ఉండటంతో తమ వాహనాన్ని ఓ పక్కగా నిలిపారు. అదే సమయంలో ఓ లారీ ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టింది. అదే వేగంతో కారు పక్కనున్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో ఒక్కసారిగా దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన దివ్యమాధురి సంఘటన స్థలంలో మృతి చెందగా భర్త వెంకట దుర్గాప్రసాద్ ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం రూపంలో దివ్యమాధురిని విధి కాటేయడంతో పిల్లలిద్దరూ తల్లి లేనివారయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. పాత గోపాలపట్నంలో ఆరేళ్లుగా నివాసముంటున్నారు. ఇక్కడ అందరితో కలివిడిగా ఉండే మాధురి మృతితో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. భర్త దుర్గాప్రసాద్ లారెన్స్ అండ్ మయో కళ్లద్దాల సంస్థలో పని చేస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అబార్షన్‌కి యత్నించిన మహిళ మృతి
-
రాఖీ కట్టేందుకు వచ్చి...
సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి జిల్లా ముఖీగుండికు చెందిన సిల్ పార్వతి (32) తన అన్న గణేష్‌కు రాఖీ కట్టేందుకు సాలూరు పట్టణంలోని బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు. బిడ్డకు సైతం.. మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు డెంగీ అనుమానిత కేసులు.. ఈ క్రమంలో సాలూరు సీహెచ్‌సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి దిలీప్‌కుమార్ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు మండలాలకు చెందిన జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
అమర్నాథ్ యాత్రలో వైఎస్సార్ జిల్లా భక్తురాలి మృతి
సాక్షి, వైఎస్సార్ : అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళా భక్తురాలు భాగ్యమ్మ బల్తాల్ బేస్ క్యాంపులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. భాగ్యమ్మ మృతదేహాన్ని రేపు విమానంలో స్వస్థలానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమర్నాథ్ యాత్రలో బుధవారం 15 మంది భక్తులు ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యారు. అయితే తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్క్‌లు అందజేసి, మెడికల్ క్యాంపులకు తరలించారు. -
స్కూటీ అదుపుతప్పి మహిళ దుర్మరణం
మాడుగులపల్లి (నల్లగొండ) : స్కూటీ అదుపుతప్పి ఓ మహిళ దుర్మరణం చెందగా మరో ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆగమోత్కూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం కల్మెర గ్రామానికి చెందిన సోమిడి స్రవంతి స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి మాడ్గులపల్లి మండలం జాల్‌బాయిగూడెంలో నివాసముంటున్న బంధువు నాతాల రాంరెడ్డి ఇంటికి వచ్చింది. అక్కడ పనులు ముగించుకుని సాయంత్రం ఇద్దరు చిన్నారులతో కలిసి స్వగ్రామానికి తిరుగు పయనమైంది. మార్గమధ్యలో ఆగమోత్కుర్ గ్రామ శివారులో స్కూటీ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో పాములపహడ్ గ్రామం నుంచి ధాన్యాన్ని తీసుకుని వేగంగా వస్తున్న లారీ, కింద పడిన స్రవంతిపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెనుక కూర్చున్న చిన్నారులు మరోవైపు పడడంతో స్వల్పగాయాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్ఐ జయరాజ్ తెలిపారు. -
మహిళపై అత్యాచారం.. ఆపై హత్య
ప్రకాశం జిల్లా / పాతమాగులూరు(సంతమాగులూరు): కూలి పని చేసుకునైనా కడుపు నింపుకుందామని వాచ్ ఉమెన్ ఉద్యోగం చేసుకుంటున్న మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని పాతమాగులూరు సమీపంలో బొద్దుల వాగు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ హైమరావు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ఆరేపల్లి ముప్పాళ గ్రామానికి చెందిన మంచాల కనకమ్మ (39)కు అదే గ్రామానికి చెందిన రంగారవుతో వివాహమైంది. వీరికి నరసింహారావు అనే కుమారుడు ఉన్నాడు. అతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కొన్నేళ్ల తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె పొట్ట నింపుకోవడం కోసం మూడేళ్ల కిందట సంతమాగులూరు మండలం పాత మాగులూరు వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ గ్రానైట్ ఫ్యాక్టరీల్లో వాచ్ ఉమెన్‌గా చేరింది. ఈ క్రమంలో సంవత్సరం కిందట పాతమాగులూరు సమీపంలోని వైష్ణవి గ్రానైట్ ఫ్యాక్టరీలో వాచ్ ఉమెన్‌గా కుదరి అక్కడ యాజమాన్యం ఇచ్చిన రూమ్‌లోనే నివశిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె బొద్దుల వాగు భావిలో శవమై తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడి గుర్తింపు సంఘటన స్థలంలో చెప్పులు, కండువ, బెల్డు, కాస్త దూరంలో ఓ చొక్కా లభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. డాగ్‌లు అక్కడున్న వస్తువులు వాసన చూసి కొద్ది దూరంలో శ్రీ లక్ష్మీ బాలాజీ గ్రానైట్‌లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నుదుల్ అనే యువకుడు నివశించే స్థలాన్ని చూపించాయి. ఈ ఘాతుకానికి అతనే పాల్పడి ఉంటాడని పోలీసులు గుర్తించారు. అదే రూమ్‌లోని నిందితుని స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం మార్టూరు పరిసరాల్లో ఉండి ఉండొచ్చని పోలీసులు విచారణలో వెల్లడించారు. ఘాతుకానికి ఒక్కడే పాల్పడ్డాడా, లేక మరికొంతమంది ఉన్నారా.. అనేది పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడి కావాల్సి ఉంది. -
ఆమె బతికుండగానే కొరికి చంపాయి..
సాక్షి, విజయనగరం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళపై కుక్కలు దాడి చేసి, ప్రాణాలు తీశాయి. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సాలూరు మున్సిపాలిటీ పరిధిలో బంగారమ్మ కాలనీలో ఓ మహిళపై కుక్కలు దాడి చేసి చంపాయి. వెంకటాపురం గజలక్ష్మి గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద కదలలేని స్ధితిలో ఉంది. అయితే నిన్న రాత్రి (గురువారం) గజలక్ష్మి పై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కుక్కలు ఒళ్లంతా కొరకడంతో కదలలేని స్ధితిలో ఉన్న ఆమె ఈరోజు తెల్లావారేసరికి మృత్యువు పాలైంది. ఈ హృదయ విదారకర దృశ్యం స్థానికులును కలిచి వేసింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారుబోల్తా పడి మహిళ..
గోరంట్ల(సోమందేపల్లి): గోరంట్ల మండలం మిషన్ తండా వద్ద జాతీయ రహదారిపై కారుబోల్తాపడి చెన్నైకు చెందిన సావ్రితమ్మ(56) మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల మేరకు... సావిత్రమ్మ కుమార్తె పద్మశ్రీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమార్తెను చూడటానికి ఈమె కొద్దిరోజుల క్రితం చెన్నైనుంచి హైదరాబాద్‌కు వెళ్లింది. దసరా సెలవులు కావడంతో కూతురు పద్మశ్రీ, అల్లుడు సూర్యప్రకాష్‌లను పిలుచుకుని సావిత్రమ్మ ఓ కారులో శుక్రవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయల్దేరింది. మిషన్ తండా వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సావిత్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు, అల్లుడు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
నవ్వుతో జయించు.. చీకటిని ఎదురించు!
- వరకట్న దాహానికి తల్లి బలి - తెలిసీ చేసిన నేరానికి కటకటాల్లో తండ్రి - పది నెలల చిన్నారి భవిష్యత్ అంధకారం - అమ్మ లేదని.. తిరిగి రాదని తెలియని పసితనం - బలవన్మరణాలను ప్రశ్నిస్తున్న నవ్వుల పువ్వు - ఈ చిన్నారిని పయనం ఎటువైపు? ఈ బోసినవ్వుల వెనుక విషాదం దాగుంది. వచ్చీ రాని అమ్మ పలుకులు.. కనిపించని లోకాలకు వినిపించవని తెలియదు పాపం. రెండు రోజుల క్రితం వరకు ఉదయం లేవగానే పాలు పట్టే ఆ రూపం ఇక కనిపించదనే చేదు నిజం ఈ నవ్వులకేం తెలుసు? లాల పోసి జోల పాడే తల్లిని తలుచుకుని మౌనంగా అందరి ముఖాల్లోకి చూడటం తప్ప ఈ చిన్నారి ఏం చేయగలదు? నవ మాసాలు మోసి కని పెంచుతున్న మాతృమూర్తి తీసుకున్న నిర్ణయం తన బంగారు భవితను అంధకారం చేసిన విషాదం ఎవరితో చెప్పుకోగలదు! ఆడ పుట్టుక ఇంత వేదనాభరితమని తెలియక.. ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆడ..పిల్ల పయనం ఎటువైపునకు. అమ్మానాన్న చదువుకున్నారని.. తన జీవితంలో అక్షర సుమం విరబూస్తుందనే ఈ చిన్నారి కల చెదిరిపోయింది. నాన్న అదనపు కట్న దాహం.. అమ్మ క్షణికావేశం.. పది నెలల బంగారు తల్లి జీవితం చుక్కాని లేని నావలా మారింది. అమ్మలారా.. అక్కలారా ఆలోచించండి. కష్టాలతో కుంగిపోకండి. ఎదురొడ్డి పోరాడండి. ఆడది అబల కాదు.. సబల అని చాటండి. కఠిన నిర్ణయం తీసుకునే ముందు.. ఈ లోకంతో పని ఏముందనుకునే క్షణం ఒక్కసారి పేగు పంచుకున్న పిల్లల ముఖం చూడండి. ఆ నవ్వుల పువ్వులకు సమాధానం చెప్పి మరీ కదలండి. అన్నింటికీ చావు పరిష్కారం కాదనే విషయం తెలిసి మసులుకోండి. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటరే.. పోయేటప్పుడు ఒక్కరే.. ఇదే జీవితం. అనంతపురం సెంట్రల్: నగరంలోని వినాయక్‌నగర్‌లో గత శుక్రవారం అదనపు కట్నం వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన రాజేశ్వరి కుమార్తె(10 నెలలు) జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తల్లి మృతదేహానికి శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తుండగా.. ఆ ప్రాంతంలో బంధువుల ఒడిలోని ఈ చిన్నారిని చూసిన హృదయాలు ద్రవించుకుపోయాయి. రోడ్లు భవనాల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న శ్రీనాథ్ ధన దాహం తన రక్తం పంచుకుని పుట్టిన చిన్నారిని మాతృ ప్రేమకు దూరం చేసింది. కుమార్తె జీవితం బాగుండాలని తాహతుకు మించి కట్నకానుకలతో మెట్టినింటికి పంపిన తల్లిదండ్రుల ఆశలపై బండ పడింది. పోస్టుమార్టం గది వద్ద ఈ వృద్ధ దంపతుల రోదన మిన్నంటింది. రాజేశ్వరి తండ్రి చంద్రశేఖర్ కన్నీటి పర్యంతమవుతూ.. ‘ఒక్కగానొక్క కూతురు.. ఆమె జీవితం బాగుండాలని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి కట్టబెట్టినా. 25 తులాల బంగారం, రూ.3లక్షల నగదుతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశాం. ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచీ నరకమే. అదనపు కట్నం కోసం బతికుండగానే నరకం చూపించినారు. బుధవారం నాడు ఫోన్ చేసి రా.. నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గురువారం వెళ్లి అందరికీ సర్దిచెప్పినాం. శుక్రవారం రోజున మళ్లీ అదే గొడవ. ఎంతటి క్షోభకు గురి చేసినారో. ఈ లోకం వీడిచిపెట్టి పోయింది. నా తల్లి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఇది హత్యే. నా బిడ్డ పరిస్థితి మరొకరికి రాకూడదు. వాళ్లందర్నీ కఠినంగా శిక్షించాలి.’ అన్నారు. ఇదిలాఉంటే వన్‌టౌన్ పోలీసుల అదుపులోని రాజేశ్వరి భర్త శ్రీనాథ్ బోరున విలపించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. చిన్న మనస్పర్థలకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని వాపోయాడు. పోస్టుమార్టం అనంతరం రాజేశ్వరి అంత్యక్రియలు నగరంలో జేఎన్‌టియూ రోడ్డులోని శ్మశానవాటికలో పూర్తి చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... హిందూపురం సంజీవరాయనిపల్లికు చెందిన నాగరత్నమ్మ (33) పురిటి నొప్పులతో 12న హిందూపురం ఆస్పత్రిలో చేరింది. గర్భిణి పరిస్థితిని గమనించిన వైద్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆమెను అర్థరాత్రి 12 గంటల సమయంలో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు కాస్త జాప్యం చేయడం పెద్ద సమస్యగా మారింది. ఓ గైనిక్ వైద్యురాలు, అనస్టీషియా వైద్యురాలు 13న రాత్రి సిజేరియన్ చేశారు. ఆపరేషన్ జరిగే సమయంలోనే బాలింతకు ఫిట్స్ వచ్చాయి. అప్పటికే గుండె ఫంక్షనింగ్ తక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. సిజేరియన్ చేయగా బాబు జన్మించాడు. అప్పటికే నాగరత్నమ్మ గుండె ఫెయిలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అనస్తీషియా వైద్యులు బాలింతను ఏఎంసీ (అక్యూట్ మెడికల్ కేర్)కు తరలించి వెంటిలేటర్ ద్వారా శ్వాసనందించారు. ఉదయం 8.30 గంటల సమయంలో బాలింత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త సురేష్‌తో పాటు వారి బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు ప్రయత్నించారనీ.. కాకపోవడంతోనే సిజేరియన్ చేశారని గైనిక్ హెచ్ఓడీ షంషాద్‌బేగం చెప్పారు. నాగరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. -
విష జ్వరంతో మహిళ మృతి
కళ్యాణదుర్గం(నుసికొట్టాల తండా): మండల పరిధిలోని నుసికొట్టాల తండాకు చెందిన నీలమ్మ (35) విషజ్వరంతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నీలమ్మకు జ్వరం రావడంతో సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా అక్కడి వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రి రెఫర్ చేశారు. దీంతో భర్త వెంకటేశ్ నాయక్ ఆమెను అనంతపురం తీసుకురాగా, అక్కఽ చికిత్స పొందుతూ ఆస్పపత్రిలో మృతి చెందింది. మెరుగైన వైద్యం అందకే తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త వెంకటేశ్ నాయక్ వాపోయారు. గ్రామంలో మరికొంతమంది జ్వర పీడితులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ధర్మవరం: ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన యంకమ్మ (40) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఉతికిన దుస్తులను విద్యుత్ స్తంభానికి కట్టిన తాడుపై ఆరేయబోయింది. వర్షానికి తడిసిన తాడుకు విద్యుత్ ప్రసరిస్తుండటంతో అది తెలీని యంకమ్మ విద్యుదాఘాతానికి గురైంది. హుటాహుటిన ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామయ్య, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నట్లు వారు తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
రాప్తాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కవిత (26) అనే మహిళ మృతి చెందింది. వివరాలు అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గుంజర ఎర్రిస్వామి, కవిత దంపతులు. వ్యక్తి గత పని నిమిత్తం బుధవారం ద్విచక్రవాహనంలో అనంతపురానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాప్తాడు మీదుగా అయ్యవారిపల్లికి బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలో రాప్తాడు చెరువులోకి వెళ్లే కాలువ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కవిత తలకు గాయమైంది. వెంటనే అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వారికి కుమారుడు, కుమారై ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. -
సర్వజనాస్పత్రిలో బాలింత మృతి
వారంలో మూడుసార్లు సర్జరీ పేగుకు రంధ్రం.. నొప్పి తీవ్రం కోలుకోలేక ప్రాణం వదిలిన వైనం వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆగ్రహం సర్వజనాస్పత్రిలో ఓ బాలింత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యాధికారులు, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. - అనంతపురం న్యూ సిటీ అనంతపురం సర్వజనాస్పత్రిలో మంగళవారం బాలింత మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన స్వప్న (23), రామాంజనేయులు దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. స్వప్న రెండోసారి గర్భం దాల్చడంతో కాన్పు కోసం ఆమె భర్త ఈ నెల 16న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. అదే రోజున డాక్టర్ విజయలక్ష్మి ఆమెకు సిజేరియన్ చేశారు. స్వప్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ అయిన రోజు నుంచి స్వప్న కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు నొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గైనిక్ వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళితే నొప్పి మామూలేనంటూ తేలిగ్గా తీసుకున్నారు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో గైనిక్ వైద్యులు మరోసారి ఆపరేషన్ చేసి పరిశీలించగా.. పేగుకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో ఈ నెల 19న ఏఎంసీకు మార్చారు. గైనిక్, సర్జరీ వైద్యులు, అనస్తీషియన్లు మరోసారి పరీక్షించి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్తో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. ఈ నెల 25న కర్నూలు నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ ఆర్.సి.రామంచంద్రనాయుడుతో సర్జరీ చేయించారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వప్న మృతి చెందింది. భర్తకు విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు. రోజుల పసికందు, మూడేళ్ల బాబు బాగోగులను వికలాంగుడైన తండ్రి రామాంజనేయులు ఎలా చేసుకుంటారంటూ విలపించారు. వైద్యులపై చర్యలు తీసుకోండి బాలింత మృతికి కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలోనే పేగుకు రంధ్రం పడిన విషయం గుర్తించి, అవసరమైన చికిత్స చేసి ఉంటే బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకూ కదిలేది లేదని, మృతదేహంతో ధర్నా చేపడతామని అనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సర్జరీ విభాగం హెచ్ఓడీ రామస్వామినాయక్, అనస్తీషియన్ డాక్టర్ నవీన్, గైనిక్ డాక్టర్ సంధ్య, టూటౌన్ సీఐ యల్లంరాజు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. మా ప్రయత్నం మేం చేశాం స్వప్నకు సర్జరీ చేసిన వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి శస్త్రచికిత్సల్లో అనుభవం కల్గినవారు. సర్జరీ చేసిన వైద్యులు, స్టాఫ్‌ను విచారించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకునే సర్జరీ చేశామని చెబుతున్నారు. పేగులో ఏ విధంగా రంధ్రం పడిందో అర్థం కాని పరిస్థితి. బాలింత ప్రాణం కాపాడేందుకు మా ప్రయత్నం మేం చేశాం. డాక్టర్ల తప్పిదమేమీ లేదు. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
విద్యుదాఘాతానికి వివాహిత బలి
ధర్మవరం రూరల్ : మండలలోని ధర్మపురిలో చంద్రశేఖర్‌రాజు భార్య లావణ్య(30) అనే వివాహిత విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయమే బాత్రూంలో లైటు వేయడానికి వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారమై షాక్ కొట్టడంతో కిందపడిపోయినట్లు వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి జీవన్, రేవతి, రావణ్ అనే పిల్లలు ఉన్నారు. -
ఆటో నుంచి పడి వృద్ధురాలి మృతి
రాయదుర్గం రూరల్ : రాయదుర్గం మండలం జుంజురాంపల్లి-రేకులకుంట గ్రామాల మధ్య జరిగిన మరో ప్రమాదంలో మలకాపురానికి చెందిన అంజినమ్మ(50) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మలకాపురానికి చెందిన 16 మంది కూలీలు రేకులకుంటకు చెందిన కురుబ రామాంజినేయులు అనే రైతు తోటలో ఉల్లినారు నాటేందుకు ఉదయమే ఆటోలో బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో జుంజురాంపల్లి దాటగానే ఆటో వెనుక డోరుపై కూర్చొన్న తిమ్మక్క, అంజినమ్మ, రత్నమ్మ, వన్నూరక్క నలుగురూ అదుపుతప్పి కిందడిపోయారు. వారిలో అంజినమ్మ తలకు తీవ్ర దెబ్బలు తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారందరినీ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అంజినమ్మ మృతి చెందినట్లు అక్కడ పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
వడ్డీ కట్టండంలేదని దాడి,మహిళ మృతి
-
రైలు కింద గుర్తు తెలియని యువతి మృతి
తాడిపత్రి రూరల్ : తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో గల రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని ఓ యువతి(20) రైలు కింద పడి శనివారం మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. -
బాలింతను కాటేసిన విద్యుదాఘాతం
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో విద్యుదాఘాతానికి కళావతి(23) మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల బాలింత. గ్రామానికి చెందిన కళావతి, ఈశ్వర్ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగించే వారు. కళావతి శుక్రవారం ఉదయం తడి దుస్తులను ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు వివరించారు. భర్త, ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించేందుకు వస్తూ... కళావతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలియగానే న్యామద్దల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి, మృతురాలి భర్తను ఓదార్చారు. వారిలో జయకృష్ణ అనే గ్రామస్తుడు కూడా ఉన్నాడు. అతను పరామర్శ అనంతరం స్వగ్రామానికి బైక్‌లో వెళ్లూ మార్గమధ్యంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అదే పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. -
ఘోరం..
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్ బైక్ నడుపుతున్న యువతి దుర్మరణం ఎనుమలవారిపల్లిలో విషాదఛాయలు ఇంటర్ చదువుతున్న బంధువుల అబ్బాయిని పరీక్ష కేంద్రానికి తన ద్విచక్రవాహనంలో తీసుకెళ్లేందుకు బయల్దేరిన ఆ యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండటమే కాక మగ పిల్లలు లేరన్న లోటును తీర్చిన ఆ యువతి తిరిగిరాని లోకాలకు చేరింది. మగరాయుడిలా అండగా ఉంటివి కద తల్లీ..అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. - నల్లమాడ (పుట్టపర్తి) నల్లమాడ మండలం ఎన్.ఎనుములవారిపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రావణి అనే (17) యువతి దుర్మరణం చెందింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్.ఎనుములవారిపల్లికి చెందిన చిల్లా రాధమ్మ, చిన్న కుళ్లాయప్ప దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి ఇంటర్ వరకు చదువుకొని ఇంటిపట్టునే ఉంటోంది. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దంపతులకు మగ సంతానం లేని లోటు తీర్చేది. శ్రావణి రెండేళ్ల నుంచి మోటార్ సైకిల్ (బైక్) నడుపుతూ అందరినీ ఆకట్టుకుంది. సమీప బంధువు నరసింహనాయుడు కదిరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆ మార్గంలో బస్సు సౌకర్యం లేదు. సమయానికి ఆటో కూడా అందుబాటులో లేకపోవడంతో పరీక్షకు సమయం అవుతోందని శ్రావణి.. నరసింహనాయుడును ద్విచక్ర వాహనం (ఫ్యాషన్ ప్రో)లో ఎక్కించుకుని కదిరికి బయలుదేరింది. కిలో మీటర్ దూరం వెళ్లగానే బాట్లో మాను వద్ద కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై శ్రావణి అక్కడికక్కడే మృతిచెందింది. వెనుక కూర్చున్న నరసింహనాయుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ శివరాముడు, ఓడీ చెరువు ఎస్ఐ సత్యనారాయణ, నల్లమాడ ఏఎస్ఐ జయప్ప, ఆర్ఐ శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో యువతి మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యక్ష సాక్షి నరసింహనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించామని ఏఎస్ఐ తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ ప్రమాద సమాచారం తెలియగానే వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని, శ్రావణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాతబత్తలపల్లి ఎంపీటీసీ సుకన్యాశ్రీనివాసరెడ్డి, సహకార సంఘం ఉపాధ్యక్షులు రామప్ప, మాజీ సింగిల్‌విండో డైరెక్టర్ రంగప్ప, శ్రీరామమూర్తి, రామిరెడ్డి, టీ.నరసింహారెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్ కూడా యువతి మృతదేహాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మరో ఇద్దరు.. పావగడ : తాలూకా లోని దవడబెట్ట గ్రామానికి చెందిన గోపి నాయక(32) నాగప్ప (40)లు మధుగిరి తాలూకాకు చెందిన చిన్నేనహళ్ళి రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మధుగిరి నుంచి పావగడకు టీవీఎస్ విక్టర్ వాహనంలో వెళుతున్న వీరు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శింగనమల : మండలంలోని సప్తగిరి క్యాంపర్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్ఐ హమీద్‌ఖాన్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కొండమ్మ(50) కొడుకు(వరుసకు)తో కలిసి దిచక్రవాహనంపై అనంతపురం ఆస్పత్రికి వెళుతోంది. ద్విచక్ర వాహనం సప్తగిరి క్యాంపర్ వద్ద ఉన్న బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న కొండమ్మ కింద పడింది. కొండమ్మకు తీవ్ర గాయాలవడంతో 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నార్పల : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ రోడ్డులో ఉన్న ఐష్ ఫ్యాక్టరీ నిర్వాహకురాలు శ్యామల(39) విద్యుదాఘాతంతో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన శ్యామల కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నార్పలకు వలస వచ్చి జీవనోపాధికి ఐష్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుక్రవారం శివర్రాతి కావడంతో ఆమె భర్త నారాయణరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల కొండకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామల ఐష్ ఫ్యాక్టరీలో ప్లగ్ వేయబోయి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలో పడిపోయారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్నవారు అది గమనిఽంచి ఆమెను హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామల భర్త నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. -
చిత్తూరులో మహిళ మృతి
గంగవరం : చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లె నుంచి చిత్తూరుకు బయలుదేరింది. అలాగే తిరుచ్చి నుంచి ఓ లారీ బొగ్గులోడుతో హైదరాబాద్‌కు వెళుతోంది. ఈ రెండు కల్లుపల్లె సమీపానికి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం తిరుచంగూడుకు చెందిన లారీ డ్రైవర్ ప్రభాకరన్ (45), బస్సులో ప్రయాణిస్తున్న హిందూపురానికి చెందిన ఈశ్వరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు 108లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్ఐలు జేసీబీల సహాయంతో బస్సు-లారీలను విడదీశారు. -
ఆటో బోల్తా : మహిళ మృతి
- 15మందికి గాయాలు గుమ్మఘట్ట : గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి క్వారీ సమీపంలో గురువారం సాయంత్రం ఓ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో తాళ్లకెరకు చెందిన హనుమక్క(68) అనే మహిళ మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి. గుమ్మఘట్ట ఎస్ఐ హైదర్‌వలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణం నుంచి 24మంది ప్రయాణికులతో ఓ ఆటో అడిగుప్ప మీదుగా తాళ్లకెర గ్రామానికి బయలుదేరింది. సిరిగేదొడ్డి క్వారీ సమీపంలోకి రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తాళ్లకెరకు చెందిన హనుమక్క, చ్ మారెక్క, గురుమూర్తి, హెచ్ శివమ్మ, మారెక్క, సోమణ్ణ, రంగసముద్రంకు చెందిన జగదీష్, మల్లక్క, వరలక్ష్మి, నాగచంద్రారెడ్డి, తిప్పేస్వామి, లక్ష్మి, రఘునాథరెడ్డి, కోనాపురానికి చెందిన గొల్ల కమలమ్మ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అటుగా వెళ్తున్న యువకులు 108 ద్వారా రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హనుమక్క మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, పీపీ పాలయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తెగిన అనుబంధం
మృత్యువు వికృతమైంది. అది ఎప్పుడు ఎవరిపై ఎలా విరుచుకుపడుతుందో ఎవరికీ తెలియదు. బంధాలు, అనుబంధాలను తెంపేస్తోంది. అయిన వారిని అనాథలను చేసి రోడ్డున పడేస్తోంది. దేవుని దర్శనార్థం గుడికి బయలుదేరిన తల్లీకొడుకుపై పంజా విసిరిన మృత్యువు వాహన రూపంలో కుమారుడ్ని కబళించింది. కళ్లెదుటే కన్నపేగు రక్తపు మడుగులో గిలగిలాకొట్టుకుంటూ ప్రాణాలొదిలిన తీరు చూసి ‘తల్లి’డిల్లిపోయింది. భాగ్యనగరం నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరిన దంపతులపైనా కన్నెర్రజేసింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే లోగానే మరో కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యను కాటికి పంపింది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు ఆయా కుటుంబాలలో చీకట్లు నింపాయి. తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం బందార్లపల్లి సమీపంలో శనివారం రాత్రి రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన సావిత్రి(52) మృతి చెందారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి (57) తీవ్రంగా గాయపడ్డారని తాడిపత్రి రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు... దంపతులిద్దరూ హైదారాబాద్ నుంచి కారులో స్వగ్రామమైన నాగిరెడ్డిపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలోని బందార్లపల్లి సమీపానికి తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తూ ఎదురొచ్చిన మరో కారు ఢీకొనడంతో సావిత్రి అక్కడిక్కడే మరణించారు. శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడి స్పహ కోల్పోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తమ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాధితుడ్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి, సావిత్రి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. -
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి ఐటీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రిపుల్ ఐటీ చౌరస్తాలో ముగ్గురు మహిళలు రోడ్డు దాటుతుండగా సెవెన్ సీటర్ ఆటో వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులు సమీపంలోని ఐటీ సంస్థలో హౌస్ కీపింగ్ పనులు చేస్తుంటారని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వణికిస్తోన్న స్వైన్ ప్లూ
-
డాడీ..క్షమించు..! అంటూ తండ్రికి చివరి మెసేజ్
-
విమానంలో మహిళ మృతికి కారణాలేమిటి?
ముంబాయి నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ 34 ఏళ్ల మహిళ మృతిచెందింది. విమాన సిబ్బంది నిర్లక్ష్యంతోనే విమానం ఆన్‌బోర్డింగ్ సమయంలో ఆ మహిళ ప్రాణాలు విడిచినట్టు ఆమె కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మృతిచెందిన మహిళ పేరు సంగీత. వారణాసికి చెందిన ఆమె, తన భర్త, పాపతో కలిసి ఫ్లైట్ ఎస్జీ 704 విమానంలో ముంబాయి నుంచి వారణాసి వస్తున్నారు. మార్గం మధ్యలోకి రాగానే ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది.. వెంటనే కుటుంబసభ్యులు విమాన సిబ్బందికి సమాచారం అందించినా వారు వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశారని ఆమె భర్త వాపోతున్నారు. వెంటనే వైద్య సహాయం అందించకపోవడంతో తన భార్య మృతిచెందినట్టు భర్త ఆరోపిస్తున్నారు. అయితే సంగీతను విమానంలో డాక్టర్ పరీక్షించారని, కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంగీతకు అవసరమైన వైద్యసహాయమంతా విమాన సిబ్బంది అందించారని పేర్కొంది. క్యాపిటన్ ఏటీసీకి సమాచారం అందించి, ల్యాండింగ్ సమయంలోనూ వైద్య సహాయం అందించారని స్పైస్ జెట్ తెలిపింది. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని స్పైస్ జెట్ చెప్పింది.. అయితే మార్గం మధ్యలోనే సంగీత చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. సంగీత పోస్టుమార్టం రిపోర్టే ఆమె చనిపోవడానికి అసలు కారణాలేమిటో వెల్లడిస్తుందని స్పైస్ జెట్ పేర్కొంటోంది. -
పింఛన్ కోసం క్యూలో నిలబడ్డ వృద్ధురాలు మృతి
-
ఆప్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుని...
ప్రజాపోరాటం నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకేమైతే మాకేంటి అన్నతీరుగా వ్యవహరిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం గిల్ రోడ్డులో ఆప్-ఎల్ఐపీ నిర్వహించిన ర్యాలీ వల్ల ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అంబులెన్స్‌లో ఓ మహిళ మృతిచెందింది. కొత్త సిమ్లపురి ప్రాంతానికి చెందిన అవతార్ కౌర్ అనే ఆ మహిళ తక్కువ బ్లడ్ షుగర్, నీళ్ల విరేచనాలతో బాధపడుతోంది. ఆమెను గిల్ రోడ్డులోని గ్రేవాల్ ఆసుపత్రిలో చేర్పించగా.. మహిళ పరిస్థితి క్షీణించడంతో అక్కడి డాక్టర్లు మోడల్ టౌన్లో క్రిష్ణా ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిని మహిళను ఆ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ గిల్ రోడ్డులో ఆప్ నిర్వహిస్తున్న ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో వారి అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ భేటీలో పాల్గొన్నారు. 20-25 నిమిషాల పాటు ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో తమ అంబులెన్స్ చిక్కుకుని పోయిందని ఆమె కొడుకు దేవేందర్ సింగ్ ఆరోపించారు. అంబులెన్స్‌ను ముందుకు కదిలేలా సహకరించాలని పలుమార్లు ప్రాధేయపడినట్టు, ఎవరూ సహకరించలేకపోయారని కన్నీరుమున్నీరయ్యారు. అంబులెన్స్‌లో తన తల్లి మరణించినట్టు చెప్పారు. రాజకీయ పార్టీ వల్ల తన తల్లి మరణించిందని ఆరోపించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆగ్రహానికి లోనైన కుటుంబసభ్యులు వెంటనే రోడ్డుపై నిరసనకు దిగినట్టు ఏడీసీపీ ధృవ దాహియా చెప్పారు. అయితే వారు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదును దాఖలు చేయలేదన్నారు. కొద్దిసేపు నిరసన చేసిన అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్‌లో ఇరక్కపోవడం వల్లనే మహిళ మరణించినట్టు గ్రేవాల్ ఆసుపత్రి కూడా ధృవీకరించింది. -
నిప్పంటించుకున్న యువతి మృతి
కదిరి టౌన్ : మతిస్థిమితం సరిగాలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లచెరువు మండలం ఓరువాయికి చెందిన నారాయణమ్మ (30) ఆదివారం మృతిచెందింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆత్మహత్య..!ఎవరికీ చెప్పుకొలేఖ
-
గొంతులో ఎముక ఇరుక్కొని..
చర్ల: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో చోటు చేసుకుంది. తేగడ గ్రామానికి చెందిన నిట్టా జ్యోతి(50) ఆదివారం ఇంట్లో మాంసాహారం భుజిస్తుండగా ఓ ఎముక గొంతులో ఇరుక్కొని ఇబ్బంది పడింది. కడుపులోకి జారుతుందేమోనని చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు ఆమెను తరలించారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పొందవచ్చని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం తీసుకు వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బుధవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేస్తుండగా గొంతులో తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జ్యోతి మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలుఉన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
గరికిపేట (నెల్లిమర్ల రూరల్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గరికిపేటలో శని వారం చోటుచేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతివాడ లక్ష్మి (35) పచ్చగడ్డి కోసేందుకు సమీపంలో గల వ్యవసాయ భూమిలోకి వెళ్లిం ది. అరుుతే సంబంధిత భూ యజమాని వెలుతురు కోసం పొలానికి విద్యుత్ బల్బు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయం గమనించని లక్ష్మి గడ్డికోస్తూ పొరపాటున కిందనున్న వైరును తాకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందిం ది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉపేంద్ర సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
పాము కాటుతో మహిళ మృతి
ఆత్మకూరు: నల్లగొండ జిల్లాలో పాము కాటుకు ఓ మహిళ మృతిచెందింది. ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అండమ్మ(45) అనే మహిళ ఆదివారం ఉదయం ఇంటి ఆవరణలో పాత్రలు కడుగుతున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. అండమ్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మావోయిస్టుల మందుపాతరకు మహిళ బలి
చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో వరుసగా జరుగుతున్న మందుపాతరల పేలుళ్లకు సాధారణ పౌరులూ బలవుతున్నారు. సుక్మా జిల్లాలో గురువారం మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ చిన్నారి బలవ్వగా తాజాగా శుక్రవారం ఇదే జిల్లాలోని భెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోగల కొత్తచెరువు గ్రామం వద్ద జరిగిన పేలుడుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గోర్ఖా గ్రామం కోసీపారాకు చెందిన ముచ్చిక హిడ్మా (55) విప్పపూలు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళకు గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో వారం వ్యవధిలో మూడు మందుపాతరల పేలుళ్లకు ముగ్గురు బలి కావడంతో గ్రామీణులు రహదారులపై నడవాలంటేనే వణికిపోతున్నారు. -
బావిలో దూకిన దంపతులు.. భార్య మృతి
కర్నూలు : కుటుంబ కలహాలతో భార్యా భర్తలు బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య నీట మునిగి మృతి చెందగా.. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చీకట్ల శ్రీనివాసులు (27)కు ఆరునెలల కిందట లావణ్య (22)తో వివాహమైంది. దంపతులు తరచు ఘర్షణ పడేవారు. అయితే శుక్రవారం దంపతులు లావణ్య పుట్టింటికి వెళ్లవలసి ఉంది. ఈ క్రమంలో వెళ్లేందుకు బయలుదేరిన వీరు ఇద్దరు బావిలో పడటంపై పలు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. కాగా వీరు దూకిన బావిలో నీరు లేవు. లావణ్య మృతిపై స్థానికులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లావణ్య మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పిడుగు పడి మహిళ మృతి
అనంతపురం : పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా డి.ఇరెహాల్ మండలం వసగుడ్డం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ... గ్రామానికి చెందిన మహిళ నీలమ్మ (38) తోపాటు ఇద్దరు కూలీలు వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో భారీ వర్షం వచ్చింది. దీంతో కూలీలు చెట్ల కిందకు పరుగులు తీశారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలోని కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పాముకాటుతో మహిళ మృతి
మదనపల్లెరూరల్ (చిత్తూరు): పాముకాటుతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ పచారవాండ్లపల్లెకు చెందిన సుబ్బరాయప్ప భార్య అమృత (28) బుధవారం ఉదయం పొలానికి వెళ్లింది. కలుపు తీస్తుండగా పాము కాటేయటంతో విష ప్రభావంతో స్పృహతప్పి పడిపోయింది. అయితే, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. అమృత అపస్మారక స్థితిలో పడి ఉంది. అయితే, గ్రామానికి రహదారి, వైద్య సదుపాయాలు లేకపోవటంతో ఆమెకు వైద్యం అందలేదు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచింది. -
ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
రసూల్‌పుర (హైదరాబాద్): పాత ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ అక్కడే సజీవ సమాధి అయ్యింది. హైదరాబాద్ నగరం బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ముత్యాలు అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లును కూల్చివేస్తున్న సమయంలో నేడు సాయంత్రం ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి అక్కడే ఉన్న రజిత (23) అనే కూలీపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రజిత అల్వాల్‌లోని ఖానాజీగూడ నివాసి అని తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమాని ముత్యాలుపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
తాండూరు (రంగారెడ్డి): భర్త చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాల్కాపూర్ గ్రామానికి చెందిన అంతమ్మపై భర్త భీమయ్య ఆగస్టు 31న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సుల్తానాబాద్: టవేరా వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎరవెల్లి సుజాత (45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానికులు, ఎస్సై కథనం ప్రకారం.. కాట్నపల్లి నుంచి నీరుకుల్ల గ్రామపంచాయతీ పరిధిలోని రంగంపల్లి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై మలహల్రావు, సుజాత వెళ్తున్నారు. రాజీవ్ రహదారిపై డివైడర్ ఉండడంతో రంగంపల్లికి నేరుగా వెళుతుండగా కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వైపు వస్తున్న టవేరా వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. టవేరా వాహనం అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలికి భర్త మలహల్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రుతి సెంటర్లో టెస్ట్ ట్యూబ్ సెంటర్లో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల వేధింపులతో మహిళ మృతి
ఆసిఫ్ నగర్: పోలీసుల వేధింపులతో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్ నగరం ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలున్నాయని ఆసిఫ్ నగర్ పోలీసులు ఓ మహిళను వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి చోరీకి సంబంధించి ఆమెను తీవ్రంగా హింసించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసుల వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది. -
ఇన్నోవా బోల్తా: మహిళ మృతి
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆదిలాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా మండలంలోని దగ్గి గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న భాగ్యలక్ష్మి(46) అక్కడికక్కడే మృతి చెందగా.. మాధవి, మునీంద్రాచారి, బ్రహ్మచారి, సాత్విక అనే నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొట్టి..కొట్టి చంపేశాడు..!
వేదమంత్రాల సాక్షిగా తాళికట్టాడు.. ఏడడుగులు నడిచి తోడుగా ఉంటానన్నాడు.. అదనపు కట్నం కోసం చివరకు మూడుముళ్ల బంధాన్నే మరచిపోయాడు.. కలకాలం కాపాడుతానని ప్రమాణం చేసిన అతడే ఆమె పాలిట కాలయముడయ్యాడు.. పుట్టింటి నుంచి కట్నం తేలేదంటూ ఆ ఇల్లాలిని కొట్టి..కొట్టి చంపేశాడు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిన ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు. - కొరటికల్(మునుగోడు) మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన జోలం ఎర్రయ్య, యాదమ్మల కుమారుడు లింగస్వామికి ఆరేళ్ల క్రితం పీఏపల్లి మండల పరిధిలోని అజ్మాపూర్ గ్రామానికి చెందిన సీత బుచ్చయ్య, ముత్యాలమ్మ కుమారై పద్మ(23)తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 లక్షల కట్నంతో పాటు 5 తులాల బంగారం, ఇంటి సామగ్రి ముట్టజెప్పారు. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. పురుగులమందు తాగిందని.. కట్నం కోసం లింగస్వామి బుధవారం కూడా భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు..మరుసటి రోజు గురువారం కూడా చావబాదడంతో పద్మ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురై జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. పురుగుల మందు తాగిందని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం పద్మ మృతిచెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పద్మ పుట్టింటి వారు ఆమె మృతదేహాన్ని చూసి, ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే హత్య చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో నల్లగొండ డీఎస్పీ రాములునాయక్, చం డూర్ సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్ఐ డానియల్‌కుమార్‌లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించకపోవడం, ఒంటిపై గాయాలు ండడంతో భర్త కొట్టడంతోనే మృతిచెంది ఉంటుందని భావిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలి సొదరుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధించి కొట్టి చంపిన భర్తతో పాటు ఆమె అత్తా, మామ ఎర్రయ్య, యాదమ్మలతో పాటు ఆడపడుచులు సైదమ్మ, ధనమ్మ, వనమ్మలపై కేసు నమోదుచేసి దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు. కట్నం కోసం.. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న లింగస్వామి అదనపు కట్నం తేవాలని భార్యను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా రోజూ మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా కొట్టేవాడు. ఈ క్రమంలో పద్మ పుట్టింటికి తెలపడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మూడు సార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో తీరుమార్చుకుంటానని నమ్మబలికాడు. -
ఆర్టీసీ బస్సు ఢీ: మహిళ మృతి
చిత్తూరు (తిరుపతి): తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఆమె పట్టణంలోని పెద్దకాపు వీధికి చెందిన లక్ష్మి(30) గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పిడుగు పడి మహిళ మృతి
నక్కలవాడ (ఆదిలాబాద్): పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (45) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే ఆమె పనిచేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
టేకులపల్లి (ఖమ్మం జిల్లా): గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కంకరమిల్లు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలానికి చెందిన నూనావత్‌మేరీ (50) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేది. కాగా, ఆమె రోడ్డు దాటుతుండగా ఒక గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆమె ఎగిరిపడి రోడ్డుపక్కనే ఉన్న చెత్తకుప్పల్లో పడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులపైకి దూసుకెళ్లిన టిప్పర్: భార్య మృతి
హైదరాబాద్: నగరంలోని నాగోలులో శనివారం టిప్పర్ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న టిప్పర్ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో భార్య మృతి చెందింది. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆపరేషన్ వికటించి మహిళ మృతి
-
ఆకలితో మహిళ మృతి
కృష్ణా: ఆకలిబాధ తట్టుకోలేక ఓ మహిళ ఆదివారం ప్రాణం విడిచింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం అకపాలెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మీనుగు రుక్మిణమ్మ(50) వితంతువు. భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెను పిల్లలు వదిలేశారు. "నా" అన్నవారు ఎవరూ చూడకపోయినా వితంతువు ఫించన్‌తోనే జీవనం సాగిస్తోంది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక జన్మభూమి కమిటీ వారు 4 నెలల క్రితం రుక్మిణమ్మకు ఫించన్ తొలగించారు. దీంతో ఆ ఇంటా ఈ ఇంటా అడుక్కుని కాలం గడుపుతోంది. ఇలాంటి దుర్భర జీవితం గడుపుగున్న రుక్మిణమ్మకు ఆదివారం ఆకలిబాధ ఎక్కువై మంచం మీదే తుదిశ్వాస విడిచింది.(తిరువూరు) -
బస్ కింద పడి మహిళ మృతి
-
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించారు
-
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించాడు
(కర్నూలు)కొలిమిగుండ్ల: డబ్బులివ్వనందుకు వెంకటిబాయి అనే మహిళను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఘనుడు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె ఎస్టీ తండాలో జరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీను నాయక్, వెంకటి బాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. మంగవారం రాత్రి తన అవసరాల కోసం డబ్బులు ఇవ్వనందుకు శ్రీను నాయక్, వెంకటిబాయిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు కొన ఊపిరితో ఉన్న వెంకటిబాయిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చనిపోయే ముందు ఆమె మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గ్యాస్ పేలుడు ఘటన.. చికిత్స పొందుతూ మహిళ మృతి
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 7న ఎల్బీనగర్ భరత్‌నగర్, ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారిసహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
డిప్యూటీ సీఎం వాహనం ఢీకొట్టిన మహిళ మృతి
డిప్యూటీ సీఎం ఎస్కార్ట్ వాహనం ఢీ కొన్న ఘటనలో గాయాలు వరంగల్: ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన గులాం సాదికున్నీసా బేగం (48) శుక్రవారం వేకువజామున మృతి చెందింది. మృతురాలి భర్త కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూర్‌కు చెందిన గులాం గౌసు, సాదికున్నీసాబేగం దంపతులు నవంబర్ 30న వరంగల్ నుంచి నల్లగొండకు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ మండలం యశ్వంతాపూర్ దగ్గర డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం టైరు పగిలి ఆ దంపతులు ప్రయూణిస్తున్న కారును ఢీకొంది. దీంతో సాదికున్నీసా బేగంకు తీవ్రగాయాలు కాగా, హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 24న డిశ్చార్జ్ అరుు్యంది. వారు వరంగల్‌లోని ఎఫ్‌సీఐ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. కాగా, శుక్రవారం వేకువ జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రోడ్డుప్రమాదంతో పక్కటెముకల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్లడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని గౌస్ వెల్లడించారు. మృతురాలి కుమార్తె షహాజదీమోహ్‌వీన్(7) తల్లి మృతదేహాన్ని చూసి నిద్రపోరుుందా అని అడగడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యూరు. -
బాణసంచా పేలి మహిళ మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద భక్తులు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో అక్కడే ఉన్న మహిళా భక్తురాలికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. మరో మహిళా భక్తురాలు తీవ్రంగా గాయపడింది. దాంతో దేవాలయ సిబ్బంది... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన తల్లి
-
మూర్చవచ్చి....కొద్ది సేపటికే మృతి
-
ఫలించిన సాక్షి ప్రయత్నం
-
కేజీహెచ్‌లో మహిళ మృతి: బంధువుల ఆందోళన
విశాఖపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో యువతిని ఆమె బంధువులు మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... విశాఖ జిల్లా పద్మనాభపురం మండలం రేవిడి ఆసుపత్రిలో ఓ యువతి ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత ఆ యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ యువతి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.