బాణసంచా పేలి మహిళ మృతి | Woman dies in crackers explosion at undrajavaram,west Godavari District | Sakshi
Sakshi News home page

బాణసంచా పేలి మహిళ మృతి

Published Sat, Nov 29 2014 10:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Woman dies in crackers explosion at undrajavaram,west Godavari District

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద భక్తులు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో అక్కడే ఉన్న మహిళా భక్తురాలికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. మరో మహిళా భక్తురాలు తీవ్రంగా గాయపడింది.

దాంతో దేవాలయ సిబ్బంది... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement