( ఫైల్ ఫోటో )
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది.
మరణించిన ఇద్దరు మహిళలని, బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment