lightning strike
-
బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మహిళలు సజీవదహనం
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. -
తూ.గో.లో ఘోరం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలని, బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పువర్తి క్యాంప్‌పై మావోల మెరుపుదాడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేత మడకం హిడ్మా స్వగ్రామమైన పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో అడవిలో నక్కిన మావోయిస్టులు.. క్యాంప్‌పైకి రాకెట్ లాంచర్లు ప్రయోగించారు.అయితే ఇవి క్యాంప్ వెలుపల జవాన్ల సంచారం లేని చోట పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సుమారు గంటన్నరపాటు తుపాకులు, బాంబుల మోతతో పువర్తి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రంతా జవాన్లు అప్రమత్తంగా గడిపారు. శనివారం క్యాంప్ సమీప అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. చొచ్చుకుపోతున్న బలగాలు దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన హిడ్మా సొంతూరిలో గత ఫిబ్రవరి 18న భద్రతా దళాలు క్యాంప్ ఏర్పాటు చేశాయి. వివిధ దళాలకు చెందిన వేలాది మంది జవాన్లు కేవలం వారం రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన ఈ క్యాంప్ ఏర్పాటు చేసి మావోయిస్టులకు గట్టి హెచ్చరిక పంపారు. అంతేకాక పువర్తిలో ఉన్న స్తూపాలను ధ్వంసం చేశారు. హిడ్మా సమావేశాలు నిర్వహించే ఇంటిని తమ అదీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బస్తర్ అడవుల్లో వరుసగా చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోవర్టు ఆరోపణలతో ఈ ఏడాది పది మందిని మావోయిస్టులు హతమార్చారు. ఈ తరుణంలో మావోయిస్టు పార్టీలో అభద్రతా భావం నెలకొందని, తెలంగాణ కేడర్‌కు చెందిన నేతలను హిడ్మా నమ్మడం లేదనే ప్రచారం మొదలైంది. కవ్వింపు చర్య?: వరుస నష్టాల నుంచి తేరుకుని, భద్రతా దళాలను ఆత్మరక్షణలో నెట్టే లక్ష్యంతో మావోయిస్టులు పువర్తి క్యాంప్‌పై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాత్రివేళ వ్యూహాత్మకంగా క్యాంప్‌పై దాడి చేసి, అక్కడున్న భద్రతా దళాలను చెదరగొట్టడంతోపాటు తమకు పట్టున్న అటవీ ప్రాంతంలోకి రప్పించి అంబుష్ దాడి చేసేందుకు యత్నించినట్టు సమాచారం. అందులోభాగంగానే భారీ సంఖ్యలో జవాన్లు మోహరించిన క్యాంప్‌పై రాకెట్ లాంచర్లు ప్రయోగించి కవ్వింపు చర్యలకు దిగారని తెలుస్తోంది. అయితే రాత్రంతా క్యాంప్ లోపలే ఉండడం ద్వారా మావోలు పన్నిన ఉచ్చులో జవాన్లు చిక్కుకోలేదని చెబుతున్నారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సీఆర్పీఎఫ్ బెటాలియన్–226(గాదిరాస్, సుక్మా జిల్లా) క్యాంప్‌లో పనిచేస్తున్న అస్సాంకు చెందిన జవాన్ విపుల్ భయాన్ తన సరీ్వస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్పిట్ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యవస్థలన్నీ విఫలం... భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్యార్డ్గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్యార్డ్కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్యార్డ్పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చే స్తారు.ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు.. పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలంజనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసింది. -
AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల పిడుగులు పడగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రాజమహేంద్రవరంలో కుండపోత వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మండపేట (కోనసీమ)లో 12, రాజమహేంద్రవరం 9.2, నూజివీడు (ఏలూరు) 7.3, మచిలీపట్నం (కృష్ణా) 7.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 45 చోట్ల 2 నుంచి 6 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై దాదాపు అడుగుమేర నీరు నిలిచింది.పిడుగుపాటుకు గురై.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు (55), ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పర్సా రామారావు (44), ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్రకాలువ ప్రాంతంలో కరిపోతుల నాగేశ్వరరావు (72), పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజొన్న కోతలకు వెళ్లిన తల్లీకూతుళ్లు బొందెల నాగేంద్రమ్మ (53), నాగరాణి(33), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెంకు చెందిన ఆవుల కోటేశ్వరరావు (42), అతని మేనల్లుడు జమ్ముల గోపి(35) మరణించారు. పశ్చిమ గోదావరిజిల్లా శృంగవృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ (49) అనే వ్యవసాయ కూలీ మృత్యువాతపడ్డాడు.తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలుద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2–5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. లద్దగిరి (కర్నూలు)లో 43.3, ఎండ్రపల్లి (ప్రకాశం) 43.2, మద్దూరు (వైఎస్సార్), మంగ నెల్లూరు (తిరుపతి)లో 42.9 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో మూడు రోజులు వానలే..అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి మంగళవారం ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులకు ఆస్కారం ఉందని వివరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. -
పట్టు సాధిస్తున్న ఇజ్రాయెల్
జెరూసలేం: హమాస్ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటిదాకా 800 పైచిలుకు ప్రాంతాలను నేలమట్టం చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఇజ్రాయెలీ ప్రాంతాలను మిలిటెంట్ల చెర నుంచి సోమవారం విడిపించింది. అయితే దక్షిణాదిన పలుచోట్ల ఇంకా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ సైన్యం హోరాహోరీ పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పదుల కొద్దీ అదనపు దళాలను ఇజ్రాయెల్ రంగంలోకి దించుతోంది. ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతు అందించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల నేపథ్యంలో ఆ దేశ విమాన వాహక యుద్ధ నౌకలు తదితరాలు తూర్పు మధ్యదరా సముద్రం వైపు తరలాయి. సమీప ప్రాంతాల యుద్ధ విమాన దళాలను కూడా అమెరికా హుటాహుటిన సమీకరిస్తోంది. దాడి వెనక ఇరాన్! ఇజ్రాయెల్‌పై దాడి వెనక ఇరాన్ హస్తం, ప్లానింగ్ ఉన్నట్టు హమాస్, హెజ్బొల్లా నేతలే స్వయంగా వెల్లడించారు. గాజా స్ట్రిప్‌లో 30 మందికి పైగా ఇజ్రాయెలీలను తాము బందీలుగా పట్టుకున్నట్టు ఇస్లామిక్ జిహాద్ సంస్థ చీఫ్ జైద్ అల్ నఖాలా చెప్పాడు. -
కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి
సాక్షి, మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపాటుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిమ్మ చీకట్లో అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపోయిందని ఆ గ్రామ సర్పంచ్ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు. చదవండి: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు -
నాగర్ కర్నూల్లో విషాదం: పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్ మాట్లాడుతుండగా సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు పాపగంటి నాగయ్య, రమేష్‌గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి. (చదవండి: దిద్దుబాటు చర్యలు) -
ప్రైవేట్ వైద్యులు వర్సెస్ ప్రభుత్వ చట్టం
ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు. ఏమిటీ చట్టం? ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది. చట్టంలో స్పష్టత లేని విషయాలివే! ► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్‌కి దారి తీయవచ్చు. ► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? ► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా? ► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి? ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు? ► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్‌కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు. వైద్యులకు వేధింపులు తప్పవా? ► ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు. ఉద్దేశం మంచిదే కానీ... ► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
పిడుగుపాటుకు ఒంటికి అతుక్కున్న స్వర్ణం
ఆదిలాబాద్ రూరల్: పిడుగుపాటుకు మృతి చెందడం.. గాయపడటం సాధారణం. కానీ పిడుగుపాటు వేడికి ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగి పోయి ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమెను ఆస్పత్రిపాల్జేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ పిడుగు పడింది. సమీపంలోనే వ్యవ సాయ పనుల్లో శ్వేత నిమగ్నమై ఉండగా.. పిడుగు పడింది. దీంతో వెలువడిన వేడిమికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. వెంటనే స్థానికులు ఆమెను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
దావత్ కోసం వెళ్లి.. పిడుగుకు బలై..
జఫర్‌గఢ్/ఖమ్మం/గార్ల: దసరా పండుగ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు గ్రామ శివార్లకు వెళ్లిన స్నేహితులపై పిడుగు పడింది. దీనితో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌవుతాపురం గ్రామానికి చెందిన నేరెళ్లి శివకృష్ణ (22), మరుపట్ల సాంబరాజు (22), నేరెళ్లి వంశీకృష్ణ, వొజ్జల సందీప్, పాలకుర్తి మండలం బొమ్మెరకు జిట్టబోయిన సాయికుమార్ (23) స్నేహితులు. అంతా కలిసి దసరా పార్టీ కోసం బుధవారం సాయంత్రం సాగరం గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో వాన మొదలవడంతో అంతా కలిసి పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు వెళ్లి నిల్చుకున్నారు. కాసేపటికే ఆ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీనితో నేరెళ్ళి శివకృష్ణ, జిట్టబోయిన సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు మిగతా ముగ్గురిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మరుపట్ల సాంబరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో నేరెళ్లి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చెరువు మత్తడి చూడటానికని వెళ్లి.. మహబూబాబాద్ జిల్లా గార్లలో వానకు నిండి మత్తడి పోస్తున్న చెరువును చూసేందుకు అక్కడి వడ్డెర బజారుకు చెందిన వేముల సంపత్ (27), ఆలకుంట శేఖర్, రూపన్ రమేశ్, విజయ్ వెళ్లారు. కాõదÜపటికే జోరువాన మొదలవడంతో చెరువు కట్టపైనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో వేముల సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్, విజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కాస్త దూరంగా ఉన్న రూపన్ రమేశ్ పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు శేఖర్, విజయ్‌లకు గార్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ►ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో బుధవారం సాయంత్రం కోళ్లను కప్పేందుకు ఇంటి బయటికి వచ్చిన మూడు జమ్మ (68) అనే వృద్ధురాలు.. కొద్దిదూరంలో పిడుగుపడటంతో శబ్దానికి గుండె ఆగి కన్నుమూసింది. ►నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌పై గురువారం వేకువజామున పిడుగు పడటంతో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ►కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో ఇంటిపై పిడుగుపడటంతో భుక్యా రాజేశ్ అనే వ్యక్తి ఇంట్లోని టీవి, ఫ్రిజ్, విద్యుత్ వైరింగ్ కాలిపోయాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రాజేశ్ భార్య స్వరూపకు గాయాలయ్యాయి. -
పిడుగుపాటుకు ఇద్దరు తోడల్లుళ్లు మృతి
వాంకిడి (ఆసిఫాబాద్): సాగులో మామకు ఆసరా ఇద్దామని బుధవారం అత్తగారింటికి వచ్చిన తోడల్లుళ్లు పిడుగుపాటుకు బలైపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం కొమురంభీం జిల్లాలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన లోబడే రాంచందర్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వాంకిడి మండలం కోమాటిగూడకు చెందిన వాడుగురే సంతోష్ (38)తో, రెండో కుమార్తెకు ఆసిఫాబాద్ మండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన ఆదె సంతోష్ (36)తో వివాహం జరిపించారు. ఇంధాని ఎక్స్‌రోడ్డు వద్ద గల తన పత్తి చేనులో యూరియా వేసేందుకు రాంచందర్ ఇద్దరు అల్లుళ్లను బుధవారం ఇంటికి పిలిపించుకున్నాడు. పొద్దంతా కుటుంబ సభ్యులు పొలంలోనే గడిపారు. సాయంత్రం పని ముగించుకుని తోడల్లుళ్లు వాడుగురే సంతోష్, ఆదె సంతోష్ ఇద్దరు ఒకే బైక్‌పై ఇంటికి బయల్దేరారు. తేజాపూర్ గ్రామ శివారులో వీరి బైక్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాడుగురే సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఆదె సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
కూలీల జీవితాల్లో పిడుగుపాటు
కాగజ్‌నగర్/కౌటాల/ కోటపల్లి (మంచిర్యాల): వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. కుమురంభీం జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామానికి చెందిన సద్గు రే రేఖాబాయి(44) సోమవారం గ్రామ శివారు లోని ఓ రైతు చేనులో సోయాబీన్ విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయం త్రం కూలీలు రేఖాబాయి, లలితాబాయి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో వర్షం కురిసి పిడు గు పడింది. రేఖాబాయి అక్కడికక్కడే మృతిచెంద గా, సమీపంలోని లలితాబాయి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు భర్త సురేశ్, కూతురు ఉన్నారు. పెళ్లయిన రెండు నెలలకే.. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం రాస్పల్లి గ్రామానికి చెందిన సుమన్ సోమవారం ఉదయం తన భార్య అనూష, చిన్నాన్న, చిన్నమ్మ, కూలీలతో కలిసి గ్రామ సమీపంలోని చేనులో పత్తి విత్తనాలు నాటడానికి వెళ్లాడు. సాయంత్రం పిడుగుపడటంతో సుమన్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య అనూష చేతికి స్వల్ప గాయమైంది. ప్రసాద్ అనే మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమన్, అనూష దంపతులకు పెళ్లయి రెండునెలలే కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో ఘటనలో ఇదే మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన నానాజీ(35) గ్రామ శివారులో విత్తనాలు వేసేందుకు వెళ్లి పిడుగుపడి మృతి చెందాడు. ఆయనకు భార్య నీలాబాయి, కుమారుడు సందీప్(10), కూతురు సం«ధ్యారాణి(8) ఉన్నారు. పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అంకవ్వ(55) ఇదే గ్రామానికి చెందిన రైతు చేనులో సోమవారం పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం తర్వాత చేనులో విత్తనాలు విత్తేందుకు వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో అంకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి? ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..) జాగ్రత్తలు తప్పనిసరి ► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. ► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. ► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. ► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. ► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ -
గాలివాన బీభత్సం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతి
రాజాపూర్/మాగనూర్/కల్వకుర్తి రూరల్/సూర్యాపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందగా సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మర్రిబాయితండాకు చెందిన శత్రునాయక్ (60) ఆదివారం సాయంత్రం శివారులోని తన పొలంలో ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగుపడి ఆయన మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని కొత్త రైల్వేస్టేషన్ సమీపంలో కుర్వ పరమేశ్ అలియాస్ లింగప్ప (20) గొర్రెలను మేపుతుండగా పిడుగు పడటంతో మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురుమిద్దకు చెందిన సాంబశివ (8) తల్లిదండ్రులతో కలసి పొలం వద్దకు వెళ్లగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్, మద్దిరాల, మోతె మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వీచిన ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలో హోర్డింగులు నేలకూలాయి. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌లో చెట్టు విరిగి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై పడింది. పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ, సపోట తోటల్లో కాయలు నేలరాలాయి. నూతనకల్‌లో వడగండ్ల వర్షం కురిసింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సుమారు వందవరకు విద్యుత్ స్తంభాలు కూలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పిడుగులు పడి 11 మందికి గాయాలు
కామారెడ్డి క్రైం/కోనరావుపేట(వేములవాడ): కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులు పడి పదకొండు మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా శివారులో శనివారం సాయంత్రం బూ క్యా బందర్, అతని భార్య బుల్యా, కొడుకు రాజేందర్, తండాకు చెందిన బూక్యా లక్ష్మి, బూక్యా హుస్సేన్, ఇస్లావత్ గం గులు పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వచ్చింది. వెంట నే వారంతా ఓ చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో వారికి సమీపంలో పిడుగు పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అందరూ అ పస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాజన్న జిల్లాలో.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం రావడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పిడుగు పడడంతో చెట్టుకింద తలదాచుకున్న ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ మామిడిపల్లికి చెందిన పన్నాల హన్మాండ్లు, పన్నాల దేవీవెంకటేశ్, అన్నాడి ఎల్లారెడ్డి, మారు మోహన్‌రెడ్డి, మారు బుచ్చిమల్లవ్వలను వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల అధికారులను ఆదేశించారు. -
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
నక్కపల్లి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. రాజయ్యపేటలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ ప్రాంతంలో ఆటలాడుకుంటున్న పిల్లలు పిడుగు శబ్దానికి భయపడి పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని కొందరూ వీడియోలో చిత్రీకరించారు. -
బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి..
మంచిర్యాలక్రైం: పెళ్లయిన చాలాకాలం తర్వాత పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ హాయిగా జీవనం సాగిస్తోంది ఆ కుటుంబం. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా పడిన పిడుగు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీవ్రగాయాల పాలయ్యారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో అందె వెంకటేశ్, మౌనిక దంపతు లు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శ్రీయాన్(18 నెలలు)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఫ్లై ఓవర్‌బ్రిడ్జిపైకి రాగానే పిడుగుపడింది. ముగ్గురూ కిందపడిపోగా, మౌనిక(28), శ్రీయాన్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన వెంకటేశ్(32)ను కరీంనగర్‌కు తరలించారు. గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు సీసీసీ నాగార్జున కాలనీకి చెందిన మౌనికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మౌనిక, శ్రీయాన్ మృతిచెందడం, వెంకటేశ్ ప్రాణాపాయస్థితిలో ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, కలెక్టర్ భారతి హోళికేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌనిక, శ్రీయాన్ మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, తహసీల్దార్ రాజేశ్వర్‌ను భారతి ఆదేశించారు. అవే కారణమై ఉండొచ్చు.. నడుస్తున్న వాహనంపై పిడుగుపడటమనేది అనూహ్యమైన ఘటన అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారిణి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సెల్ఫోన్లు, ఇనుప వస్తువులు వాహకాలుగా పనిచేసి ఎక్కువగా విద్యుత్ తరంగాలను ఆకర్షిస్తాయని తెలిపారు. మేఘాల రాపిడి సమయంలో వీటిలో ఏదైనా విద్యుత్‌ను ఆకర్షించి ఉంటుందని, అదే ఘటనకు కారణమై ఉండొచ్చని ఆమె వివరించారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
కౌటాల (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన రైతు బోర్కుట్ పున్నయ్య(52), తల్లీకూతుళ్లు డొంగ్రీ పద్మ(40), డొంగ్రీ శ్వేత(20) తమ తమ పత్తి చేన్లలో ఎరువులు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. వర్షం వచ్చే అవకాశం ఉందని పద్మ భర్త హŸక్టు.. పద్మ, శ్వేతలను పున్నయ్య ఎడ్లబండిపై గ్రామానికి పంపాడు. పున్నయ్య, ఆయన భార్య రషిక, కుమారుడు బాలాజీ, పద్మ, శ్వేత ఎడ్లబండిపై బయల్దేరారు. అంతలోగానే ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగుపడింది. దీంతో పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఎద్దు కూడా చనిపోయింది. రషిక, బాలాజీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
కాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే ఊహించని విషాదం
సాక్షి,విజయనగరం : జిల్లా కేంద్రానికి సమీపంలోని చాకలిపేటలో పెళ్లింట విషాదం అలముకుంది. భారీ వర్షంతో పాటు పిడుగుపడి ఇద్దరు వ్యక్తు లు మృతిచెందగా ముగ్గురు గాయపడ్డారు. విజయనగరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాకలిపేటలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సాయంత్రం రామనారాయణం వద్ద ఉన్న మామిడి తోటలో చెట్ల కింద కూర్చొన్నారు. అనుకోకుండా కురిసిన వర్షానికి తోటలోనే ఉండిపోయారు. అదే సమయంలో పిడుగులు పడడంతో ఒక పక్క కూర్చొన్న చాకలిపేటకు చెందిన పి.ఎర్నిబాబు (28), సురేష్ (26)లు అక్కడికక్కడే చనిపోయారు. మరో వైపు కూర్చొన్న సారిక శ్రీను, వెంకటేష్, కళింగపట్నం పెంటయ్యలు గాయపడ్డారు. ముగ్గురూ కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
విషాదం: పెళ్లి బృందంపై పిడుగు.. 16 మంది మృతి
ఢాకా: నవవధువు, వరుడిని ఆశీర్వదించాలని వెళ్లిన అతిథులను మృత్యువు పిడుగు రూపంలో వెంటాడింది. సంతోషంతో సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో క్షతగాత్రులను కాపోడుకోవడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ విషాదం ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. చపైనవాబ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహానికి వచ్చిన బృందం పడవ దిగి నదీ సమీపంలోని షిబ్‌గంజ్ నగరంలో తమ విడిది ప్రాంతానికి వెళ్తున్నారు. అంతలో హఠాత్తుగా రుతుపవనాల కారణంగా భారీ వర్షంతో పాటు పిడుగులు పడటం మొదలైంది. దీంతో పడవలో నుంచి ఒక్కొక్కరు దిగివస్తుండగా ఆ పెళ్లి బృందంపై సెకన్ల వ్యవధిలోనే పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సభ్యులు మృతి చెందగా, పలువరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వరుడికి తీవ్రగాయాలు కాగా వధువు ప్రమాద జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లేకపోవడంతో క్షేమంగా బయటపడింది. అందులో గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య జిల్లా కాక్స్ బజార్లో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో సహా 20 మంది మృతి చెందారు. -
పిడుగుపాటుతో మహిళా వలంటీర్ మృతి
కవిటి, ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురంలో వలంటీర్‌గా పనిచేస్తున్న ఆశి జయ (30) తన మరిదికి వధువును చూసేందుకు బంధువులతో కలిసి సమీప గ్రామమైన బిర్లంగి తోటూరుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం పడడంతో ఓ చెట్టు కిందకు చేరారు. సరిగ్గా అక్కడే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కవిటి మండలంలోని శావసానపుట్టుగకు చెందిన వివాహిత కోరాడ గౌరమ్మ (49) ఆదివారం కొబ్బరి తోటలో పనికి వెళ్లింది. సాయంత్రం అకస్మాత్తుగా పిడుగు పడడంతో అక్కికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం.. ఆ ఇద్దరికీ పదవీ గండం? -
పిశాచి పిడుగు : షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లో విషాదం చోటు చేసుకుంది. వర్షం నుంచి రక్షించుకునేందుకు చెట్టు కిందకు చేరిన వ్యక్తులు అనూహ్య ప్రమాదంలో ఇరుక్కున్నారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరమైన ఈ విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు ఈ నలుగురు చెట్టుకింద నిలబడ్డారు. అకస్మాత్తుగా పిడుగువారిపై పడింది. అంతే క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని హార్టికల్చర్ సిబ్బందికి చెందిన వారుగా తెలుస్తోంది. కాగా సాధారణంగా పిడుగులు పడేటప్పుడు అందరూ చెట్లకిందకు, భవనాలు కిందకు వెళుతుంటారు. వాస్తవానికి ఇది ఇంకా ప్రమాదకరం. ఈ సమయంలో చెట్లకింద నిలబడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు ఎత్తైన వాటిని ఆకర్షిస్తాయి. దీంతో చెట్లపైనా, ఎత్తైన భవనాలపైనే పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. -
గుర్గావ్లో పిశాచి పిడుగు