
(ఫైల్ ఫోటో)
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం ఇద్దరి ప్రాణాలను తీసింది. సిద్దిపేట జిల్లా మార్కెట్ యార్డు సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. చింతల చెరువు సమీపంలో బాలరాజ్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పక్షాన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడి.. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు సారయ్యను మంత్రి హరీశ్ పరామర్శించారు. సారయ్యకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలను అధికారులను ఆదేశించారు.