కాంగ్రెస్‌ సర్కార్‌ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు | Harish Rao Fires On Telangana CM Revanth Reddy Over Farmers Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కార్‌ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు

Published Sun, Mar 23 2025 3:21 PM | Last Updated on Sun, Mar 23 2025 4:54 PM

Harish Rao Fires On Revanth Reddy

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.

అనంతరం హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే  రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపడ్డారు.

‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement