BRS Party
-
‘ఇక్కడ ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?’
నల్లగొండ జిల్లా : జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని విమర్శించారు బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరపలేదని తప్పుబట్టారు. నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ రైతులు అన్ని విషయాల్లో మోసపోయారు. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగొళ్లు లేవు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడుపోయారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. నల్లగొండ లో ఓ మంత్రికి సోయి లేదు. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడు. ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తలగా మాట్లాడొద్దు’ అని సూచించారు జగదీష్ రెడ్డి. -
కేటీఆర్‌వి పగటి కలలు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగలు కంటున్నారని కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అంటూ విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఐఎంజీ భారత్‌కు భూములను అప్పనంగా కట్టబెట్టారు. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ భూమి కేటాయింపులను రద్దుచేసి ప్రభుత్వ భూములను కాపాడారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపైన విచారణ జరగాలి. లక్షల కోట్ల అప్పుల్లో ముంచి తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.అలాగే, మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉంది. ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరాం. మొత్తం మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘ఈడబ్ల్యూఎస్ కింద ముస్లింలకి బీజేపీ రిజర్వేషన్లను ఇస్తోంది. ఏపీ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ రిజర్వేషన్లను తొలగించే దమ్ము బీజేపీకి ఉందా?. 70 ముస్లిం తెగలకు రిజర్వేషన్లు ఇచ్చామని గతంలోనే నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అని ప్రశ్నించారు. -
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. -
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. -
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. న్యాయ వ్యవస్థకు సవాలే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్‌లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్‌గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.తొలి ఎన్నికలలో టీఆర్ఎస్కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్‌లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.2014 టర్మ్‌లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్‌కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్‌కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది. 2014-2023 వరకు బీఆర్ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తొలి సంతకం నేనే చేస్తా.. అవయవదానానికి ముందుకొచ్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలన్న కేటీఆర్.. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్‌కు కేటీఆర్ సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో కేటీఆర్ ప్రకటించారు. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.ఎంతో ఉపయోగకరం.. అభినందనలు: హరీష్రావుఅవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు...ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే. బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా ఇచ్చాం. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది’’ అని హరీష్‌రావు వివరించారు. -
అసెంబ్లీలో మరోసారి రచ్చ రచ్చ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు.మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్‌ను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్‌ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. -
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై టెన్షన్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక, గత విచారణలో ఆపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత పిటిషన్ల పెండింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్టార్కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, విచారణపై ఉత్కంఠ నెలకొంది.ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్లు ఉన్నాయి. ఈ సందర్బంగా అఫిడవిట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..‘నేను ఎన్నడూ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. అనర్హత పిటిషన విచారణకు అర్హత లేదు. నాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరారు. అలాగే, కేటీఆర్ ఉన్న ఫొటోలు, పోస్టర్లను అఫిడవిట్లో జత చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫొటో ఉంచడంపై ఫిర్యాదు కాపీని కూడా జత చేశారు.మరోవైపు.. గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్ ఇలా ఉంది. అఫిడవిట్ ప్రకారం.. నేను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌ను కలిశాను. వ్యక్తిగత హోదాలోనే ఆయనను కలిశాను. ఆ మీటింగ్‌కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నాకు పార్టీ మారే ఆలోచనే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నాను. ఏ దశలోనూ బీఆర్ఎస్ను వీడలేదు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. నాపై అనర్హత అనే ప్రశ్న తలెత్తదు. నేను స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నుంచి తప్పుకున్నట్లుగా నా చర్యలను భావించవద్దు అని తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్‌తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం
Telangana Assembly Session Updates..అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.అరగంట పాటు వివేక్, సుమన్ మధ్య చర్చలు.వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..ఇప్పటి వరకు సస్పెండ్‌పై బులెటిన్ ఇవ్వలేదు.రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహంబులెటిన్ ఇస్తే నేను రానుఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుందిపద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదురాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందిసస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్‌ను కలుస్తాను.స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదుసస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులుగంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు.నిన్న జాన్ పాడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.మార్షల్స్‌తో బీజేపీ సభ్యుల వాగ్వాదం.. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్కి మధ్య వాగ్వాదం.అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల డిమాండ్రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీటన్నెల్ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులుకార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలుఅసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి.. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
బీజేపీవైపు దక్షిణాది.. అందుకే డీలిమిటేషన్ డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ గురించి గతంలో ఉన్న చట్టాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీలపైన రేవంత్ దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న జరిగిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నాయి. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
మీ ప్రాథమ్యాలు యజ్ఞయాగాలే!
సాక్షి, హైదరాబాద్: ‘అప్పుడు మీ ప్రాథమ్యాలు కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలు, కొత్త సచివాలయం, పెద్ద భవనాలు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయాలు, పోలీసులకు ఏసీ వాహనాలు, చండీయాగాలు, ప్రగతి భవన్లో య జ్ఞాలు, యాగాలే.. ప్రజలకు మంచి రోడ్లు ఉండాలని మా త్రం కాదు. నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు, బ్రిడ్జీలు కట్టాలని ఉంది’అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం రాజేశాయి.రోడ్ల నిర్మాణంపై శనివారం ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యాగాలు చేశామని, సచివాలయం కట్టామని తమను అవమానించారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు దేవుడిపై భక్తి ఉందన్నారు. ‘నేను వాటర్ నీళ్లు అనను... ఎక్కడంటే అక్కడ చేపల పులుసు తినను’అని కోమటిరెడ్డి తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులంతా నిష్క్రమించారు.దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పందిస్తూ యాగాలు చేయడం తప్పని కోమటిరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ ప్రాథమ్యాల గురించే మాట్లాడారని.. దీనికే వారు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని వివరణ ఇచ్చారు. తన సమాధానాలకు దిమ్మ తిరిగే వారు వెళ్లిపోయారని విమర్శించారు.రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై కోమటిరెడ్డి వర్సెస్ ప్రశాంత్‌రెడ్డి అంతకుముందు రోడ్ల మరమ్మతు లు, నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయ డం లేదని.. ఫలితంగా తమ హయాంలో ప్రారంభమైన పనులు సైతం ఆగిపోయాయని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో తాము రోడ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో రూ. 200 కోట్లతో రోడ్లు వేశామన్నారు.అయితే ఈ వాదనను కోమటిరెడ్డి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 8,112 కోట్లతో 6,668 కి.మీ. రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్‌రెడ్డికి కొబ్బరికాయ కొట్టి సన్మానం చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తనపై కక్షతో నియోజకవర్గంలో రోడ్లకు నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 7 కి.మీ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను బీఆర్ఎస్ పాలనలో కట్టలేకపోయారని కోమటిరెడ్డి ఆరోపించగా అది ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అని ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. -
సింగిల్‌గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు.ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు. -
బాలయ్య దంచుడుపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌ఛాట్ సందర్భంగా.. సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజుకొకరినీ కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రోజుకొకరిని కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? బాలయ్య కంటే రోజూ తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్న కోమటిరెడ్డి.. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట అంటూ మంత్రి కోమటిరెడ్డి చమత్కరించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లకు మాటలతోనే బతకడం అలవాటైంది. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. హరీష్ రావు మామ చాటు అల్లుడు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారు. అలాంటప్పుడు మేం వాళ్లతో ఏం మాట్లాడతాం?. వేముల ప్రశాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన కేబినెట్లోనూ డమ్మీ మంత్రి ఉండే. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టరు అని కోమటిరెడ్డి అన్నారు. ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపిన కోమటిరెడ్డి.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి టెండర్లు కూడా పిలుస్తామని తెలిపారు.యాగాల కామెంట్.. బీఆర్ఎస్ వాకౌట్అంతకు ముందు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండికోమటిరెడ్డి వ్యవహారంపై శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని హరీష్‌రావు నేతృత్వంలోని బృందం స్పీకర్‌ను కోరింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలే చెబుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరింది. -
సీఎం రేవంత్‌రెడ్డితో హరీష్‌రావు భేటీ.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్‌ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్‌రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు. -
తెలంగాణ పరువు తీసిందెవరు?.. కవితపై సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు. మహిళా కమిషన్‌కి సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు’’ అంటూ సీతక్క ప్రశ్నించారు.‘‘మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు?. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాము. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు?’’ అంటూ సీతక్క నిలదీశారు.‘‘ప్రజలకు ఇళ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు పథకాలకు పెడితే ఎందుకంత కడుపు మంట?, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’’ అని సీతక్క హితవు పలికారు. -
కూల్చే పనిలో కాంగ్రెస్.. అమ్మే పనిలో బీజేపీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేశారు. కొత్త పరిశ్రమలు పెట్టరు.. ఉన్న పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.కొత్త పరిశ్రమలు కావాలని అడగరు ... ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు.కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ... తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం.మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదుఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యంతెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవు.జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.… pic.twitter.com/ov56JVLvsv— KTR (@KTRBRS) March 21, 2025 -
చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీళ్లు వదిలారు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ వేళ.. బీఆర్ఎస్ పార్టీ అనూహ్య నిరసనకు దిగింది. ఎండిన వరికంకులతో ఆ పార్టీ సభ్యులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌ను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు.ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు. ముందుచూపు లేని దున్నపోతు ప్రభుత్వం ఇది. ప్రాజెక్టులలో నీరు ఉన్నా వదలడం లేదు. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీరు వదిలారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోచేస్తున్నారు. 400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండబెట్టారు. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? అని కేటీఆర్ అన్నారు. అని కేటీఆర్ మండిపడ్డారు. -
కేసీఆర్ రానట్లేనా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao) దూరంగా ఉండనున్నారా?. బడ్జెట్ ప్రసంగంతో పాటు సమావేశాలకూ ఆయన దూరంగా ఉంటారా?. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని ఆయన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్ఎస్ శ్రేణుల హడావిడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం(Governor Speech) రోజున కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంతో ఈసారి సెషన్ ఆసక్తికరంగా జరగవచ్చనే చర్చ నడిచింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆయన సెషన్ దూరంగానే ఉంటారని తెలుస్తోంది. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు నిన్న కేసీఆర్‌కు బహిరంగ లేఖ ఒకటి రాశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు విన్నవించాలని.. లేకుంటే ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వద్ద నిరసనలు చేపడతామని అందులో హెచ్చరికలు జారీ చేశారు కూడా.కేసీఆర్ చివరిసారిగా కిందటి ఏడాది బడ్జెట్ సమావేశాలకు హారజయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతా డొల్ల’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు కూడా. -
కేసీఆర్‌పై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
సాక్షి, తెలంగాణభవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటరిచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సంస్కారం ఉందా?. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరువుపోతుంది.అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలని పేదలను వేధిస్తోంది. ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారు. ఫోర్త్ సిటీ అని మరో 15వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలి. ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా నిన్న రేవంత్ సభలో మాట్లాడారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డ వ్యక్తి అని రేవంత్ అంటాడు. అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్‌ను బండకేసి కొట్టారు. 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైంది.రేవంత్‌కు సవాల్..రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం
-
బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి చురకలు
-
బీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారు : భట్టి
-
TS Assembly: తెలంగాణ శాసన సభ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. :తెలంగాణ శాసన సభ ఎల్లుండి( సోమవారానికి) వాయిదాతెలంగాణ శాసన సభలో పొట్టి శ్రీరాములు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంరుణమాఫీ చరిత్రలో మిగిలిపోయే అంశం.ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేశాం.క్వింటాల్ కి 10 కిలోల తరుగు పేరిట కోట్లు కొల్లగోట్టారు.తరుగు తీస్తే.. తొలు తీస్తాం అని మేము చెప్పాం.కృష్ణ బేసిన్లో 299 టీఎంసీ లు చాలు అని సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్.. ఇది నిజం కదా..?వైఎస్సార్ ఆశీర్వాదంతో కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు.అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడ్డుకుంటే పోతురెడ్డి పాడు పెద్దది అయ్యేదా..?కేసీఆర్ ఏడాది నుంచి 55 లక్షల జీతం జీతం తీసుకొని.. సభకు వచ్చింది రెండు రోజులు మాత్రమే.సీఎం రేవంత్ ప్రసంగంరైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాంగత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం చేసిందిమార్చి 31వ తేదీ నాటికి రైతులందరినీ భరోసా అందిస్తాంఅధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాంరైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాంవరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నారుగతంలో ఎక్కడ పంట పండినా.. కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంకేబినెట్ విధానాలనే గవర్నర్ ప్రసంగిస్తారు.. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం ఈ మాత్రం అవగాహన లేకుండా మంత్రులుగా ఎలా చేశారో తెలియడం లేదు ఇష్టారీతిలో మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతే.. భవిష్యత్‌లో కూడా బీఆర్ఎస్కు సున్నానే వస్తది బీఆర్ఎస్ బాయ్కాట్మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసనరేవంత్ ప్రసంగం కొనసాగుతున్న వేళ సభ నుంచి బాయ్‌కాట్ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ఆ తర్వాత కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగం చేర్చారుఓ గవర్నర్ అందునా మహిళా గవర్నర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హేళన చేసింది మేము రాజ్యంగబద్ద వ్యవస్థ కు గౌరవం ఇస్తాంగవర్నర్ ప్రసంగం.. గాంధీ భవన్ ప్రసంగంలా ఉందని కొందరు హేళన చేస్తున్నారుఅజ్ణానమే కొందరు విజ్ణానం గా భావిస్తున్నారు. శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి..కృష్ణ బేసిన్ ప్రాజెక్టుల్లో తెలిమెట్రీలను పెట్టిస్తాం గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయింది కృష్ణ జలాలు అక్రమంగా తరలిపోవడానికి గత ప్రభుత్వం సహకారం ఉంది. కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటా కోసం మేము పోరాటం చేస్తాంబకాయిల పాపం ఎవరిది?: మంత్రి శ్రీధర్ బాబుబకాయిలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి?పేరుకుపోయిన బకాయిలను 14 నెలల నుంచి చెల్లిస్తున్నాంప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దుబకాయిలంతా మీరు అధికారంలో ఉన్న సమయంలోవేమీరు పెండింగ్‌లో ఉంచిన బకాయిలను మేమే అధికారంలోకి వచ్చాక చెల్లించాముపళ్ల రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలిమీ ఇంజనీరింగ్ కాలేజ్‌లకు దీటుగా.. మేము మా ప్రభుత్వ కాలేజ్‌లను ముందుకు తీసుకవెళ్ళతాముఇంత బ్లైండ్‌గా మాట్లాడుతారనుకోలేదు: భట్టిమేం పనులు చేశాం.. మీలా ప్రచారాలు చేసుకోవడంలేదుఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలోపు రుణమాఫీ చేశాంఅన్ని గ్రామాల్లో ఆ జాబితా డిస్ప్లే చేస్తున్నాంపల్లా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాస్తవాలు చెబుతారని అనుకున్నాం.కానీ, ఇంతబ్లైండ్గా మాట్లాతారనుకోలేదుబీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారుబీఆర్ఎస్ పాలనలో డ్రాపౌట్స్ ఎందుకు పెరిగాయి?2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడులు మానేశారు?మేం యూనివర్సిటీలను ధారదత్తం చేసి విద్యను అమ్ముకోలేదుటీచర్ రిక్రూట్మెంట్ ఎవరు ఇచ్చారు?ఇంకా 5, 6 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటాంఒక్కసారైనా ఐటీఐల గురించి పట్టించుకున్నారా?. మేం అధికారంలోకి రాగానే వాటిని స్కిల్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించాం. మీలాగా గాలికి వదిలేయలేదుఅన్ని వర్సిటీలకు వీసీలను నియమించాంచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వెళ్లి ఎప్పుడైనా చూశారా?వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించిన ఘనత రేవంత్రెడ్డిదేసీఎం ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోండిమీరు చూసిన సీఎంలాగా ఇప్పటి సీఎం చేయరు ప్రభుత్వానికి BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి.సీఎం, డిప్యూటీ సీఎం ఏ గ్రమానికైనా రచ్చి వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలి.ఏ గ్రామంలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!ఆ గ్రామంలోనే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా.జనగామనే కాదు డిప్యూటీ సీఎం మధిర అయినా పర్లేదు.వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాఅసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి..రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదనడం సరికాదుఅధికారంలో వచ్చిన మూడు నెలలోనే రుణమాఫీ చేశాంసిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకు ఆ నేతలు చేసిన దానికంటే.. మేం చేసిన మేలు ఎక్కువఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తాంప్రతీ పథకాలను లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంఅధికారంలో ఉన్నన్నాళ్లూ మీరు ప్రచారాలు చేసుకున్నారుమేం అన్నీ చేసుకుంటూ పోతున్నాం.. కానీ, ప్రచారం చేసుకోవడం లేదుకావాలంటే.. శాసన సభ ప్రాంగణంలో రైతు బంధు, రైతు భరోసా లిస్టులు అంటిస్తాం115 నియోజకవర్గాలకు సంబంధించి.. గృహజ్యోతితో పాటు అన్ని పథకాల సమాచారం మా దగ్గర ఉందిమేం పని చేసేది ప్రజల కోసం మీలాంటి రాజకీయ పార్టీల కోసం కాదుబీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు.. డిప్యూటీ సీఎం చెబుతున్నారుడిప్యూటీ సీఎం ఎలాగైనా సీఎంకు రావాల్సిన క్రెడిట్ కొట్టేసి.. ప్రమోషన్ పొందాలని చూస్తున్నారుమేం అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలిమా ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేశాంరైతు భరోసా ఎంత మందికి ఇచ్చారు?ఎంత మందికి ఇచ్చారో కాదు.. ఇంకా ఎంతమందికి ఇవ్వలేదో ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా?అధికారంలోకి వచ్చి 15నెలలు అయ్యింది.. ఇంకెతం కాలం పడి ఏడుస్తారు?వరికి రూ.500 బోనస్ ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు?మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో మెజార్టీ రైతులకు రుణమాఫీ అయ్యింది.. రైతు భరోసా ఇచ్చాము.మీ ప్రభుత్వo లో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు ఇన్స్టాల్ మెంట్ చేశారు...మేము 2లక్షలు ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా మేము ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..మేము రుణమాఫీ చేస్తే మీరు ఓర్వలేక పోతున్నారు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిరేపు సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ వస్తున్నారు.దేవాదుల ఆన్ చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలి.ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయి.రేపు సీఎం పంటనష్టం పై రైతులకు నిదులు ఇవ్వాలి.అంతకుముందు.. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అంశం పునఃసమీక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశంఘుంది. అలాగే ఇవాళ కీలకమైన యూనివర్సిటీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది. విభజన చట్టం 10 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడం, తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్లు లాంటి అంశాలను ఈబిల్లులో పొందుపరిచారు.అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశంఇవాళ అసెంబ్లీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్లు చేశారు. లాబీలో శ్రీధర్ బాబు ఛాంబర్ ముందు ఈ ఇద్దరు మంత్రులలు ఎదురు పడ్డారు. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందని కోమటిరెడ్డి అనగా.. అసెంబ్లీ సిబ్బంది, అధికారులు నవ్వుకున్నారు. వెంకన్న నాపై అభిమానంతో అలా అంటారు..ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దని శ్రీధర్ బాబు అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. -
బీజేపీ నేతలతో రేవంత్ రహస్య భేటీల మర్మమేమి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025మరో ట్వీట్లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
సీఎం రేవంత్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని శంభీపూర్‌రాజు, వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
మొయినాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్‌రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్‌రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం -
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్ఎస్ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్ ప్రసాద్ అనడంతో జగదీశ్ రెడ్డి లేచారు. స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్ తన మార్క్ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్ వాడీవేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు. -
నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరే అభ్యర్థి పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సీపీఐ అభ్యర్థి సత్యం బరిలో ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పోటీలో నిలిచారు. ఇక, నామినేషన్ పేపర్లపై అభ్యర్థులను బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ సేకరించారు. నేడు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. -
గులాబీ బాస్ ఆన్ డ్యూటీ!
-
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
ఎర్రవల్లి: బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్
సాక్షి, ఎర్రవెల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్బంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.ఇదే సమయంలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. -
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్
సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్ గుర్తు చేశారు.‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు...చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్‌రావు నిలదీశారు. -
సర్కారు పన్నాగం.. నాడు సుద్దులు.. నేడు టెండర్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితి తెలంగాణ సర్కార్‌ది అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు అప్పులు.. రాష్ట్ర భూముల తాకట్టు’ అని మండిపడ్డారు. రూ. 30వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం. నాడు భూములు అమ్మొద్దని సుద్దులు, నేడు అమ్మకానికి టెండర్లు. నిధుల సమీకరణ పేరుతో అడ్డికి పావుశేరుకు భూముల అమ్మకం’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరో వైపు, అప్పు చేసి, పప్పు కూడు నాటి సామెత అప్పు చేసి, చిప్ప కూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘నాడు అప్పు చేసి70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందేలా చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంటు అందించాం...కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామసాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేసి 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటుచేస్తే అప్పులు తప్పని రాద్దాంతం చేశారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. 15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి రుణమాఫీ ఎగ్గొట్టి రైతుబంధు ఎగ్గొట్టి రైతుబీమా లేకుండా చేసి కరెంటుకు కోతలు వేసి గురుకులాలను గాలికి వదిలేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టి పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డి శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం ఇది’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క పథకం అమలు చేసింది లేదు. గల్లీలో గాలిమాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి ? నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు.. నేడు అందినకాడికి అప్పులు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
రేవంత్.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్: కవిత హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు.మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10వేల పోస్టుల కార్డులు సేకరించారు. అనంతరం, పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌కు పంపించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. హమీల అమలుపై మార్చి 8(మహిళా దినోత్సవం)న ప్రకటన చేయకపోతే 10వేల మంది మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు. లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం.మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదు.ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. 18ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తాండాలో సాగు నీరందక ఎండిపోతున్న పంటలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయన్న ఆశతో వరి పంట వేసుకున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం నుంచి కుట్రపూరితంగా రేవంత్ నీళ్లు ఇవ్వకుండా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘దేవునిగుట్ట తండాలో వరి నాట్లు వేసుకున్నారు. రుణమాఫీ కాలేదు, రైతుబంధు రాలేదు. కాలం తెచ్చిన కరువు కాదిది.. రేవంత్ తెచ్చిన కరువు. గత ప్రభుత్వంలో అప్పర్ మానేర్ నింపి ఎర్రటి ఎండలో నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలి. మల్కపేట రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఒక వేళ నీళ్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్‌రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్‌రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
రేవంత్ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారుకేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ దళంలోకి.. గులాబీ వనంలోకి కార్తీక్ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్ అన్నారు.ఇదీ చదవండి: మామునూర్ ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం ఢిష్యూం.. ఢిష్యూం -
మేం ‘పింక్ బుక్’ రాస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.మరోవైపు, నాగర్ కర్నూల్ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. -
హరీష్‌రావుపై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. హరీష్‌రావుపై మరో కేసు నమోదైంది. చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.ీబీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మరో కేసు నమోదైంది. హరీష్‌రావుపై పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు, సంతోష్ కుమార్, పరశురాములు, వంశీకృష్ణపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం.. హరీష్‌రావుపై 351(2), ఆర్డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా వంశీకృష్ణ, ఏ2గా హరీశ్‌రావు పేరును పోలీసులు చేర్చారు. -
హెలికాప్టర్ నుంచి చూస్తే టన్నెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా?
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ(గురువారం) ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) జరగడం దురదృష్టకరం. కానీ, ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని.. అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారాయన. ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొంతన లేదు. హెలికాప్టర్లో వెళ్తున్న మంత్రులు పోటాపోటీగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించడం లేదు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది. రేవంత్‌కు కౌంటర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎనిమిది మంది ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. అబద్ధాలు మాట్లాడుతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి. ఎక్కడా SLBC సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. మొత్తం పది ఏజెన్సీలకు డైరెక్షన్ కరువైంది. సహాయక చర్యల్లో విఫలమై.. బీఆర్ఎస్పై బుదరల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను చూడటానికి, మా అనుభవంతో సూచనలు చేయడానికి వెళ్తున్నాం. మూర్ఖులు మమ్మల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాంబీఆర్ఎస్ హయాంలోనే పనులుకరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో SLBC పనులు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే BRS ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం. కాంగ్రెస్ హయంలో పనులు మూలకు పడితే.. రూ.100 కోట్ల రూపాయల మొబలైజేషవ్ నిధులిచ్చాం. మా హయాంలో 13 కిలోమీటర్లు పని జరిగింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి BRS పై బుదర జల్లుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది SLBC సహాయక చర్యలపై. తన పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీష్ రావు అన్నారు. సోయిలేకుండా మాట్లాడుతున్నారుఎస్సెల్బీసీలో జరిగిన ప్రమాదం.. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ తరఫున ఈ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. ఇవాళ హరీశ్ రావు నేతృత్వంలో ఎస్సెల్బీసీ వెళ్తున్నాం. ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేస్తాం. తెలంగాణ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వాటర్, నీళ్లు కలిశాయి అని మాట్లాడటం బాధాకరం. మంత్రుల తీరు జాతీయ స్థాయిలో పరువు తీసేలా ఉంది. అందుకే ఆ పదవుల్లో ఉండాలో లేదో వాళ్లే తేల్చుకోవాలి. ::నల్లగొండలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
పాక్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నాం. అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
బీసీలపై పెద్ద కుట్ర.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాంమోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్‌గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోదండరెడ్డి.. ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరం అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల వచ్చిన కరువు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదు. కానీ, కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొంది.రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం.అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని కాదు.. మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం. మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు.ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేసిన సందర్భం దేశ చరిత్రలోనే లేదు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు. జై కిసాన్.. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. కొదండరెడ్డి గారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు… https://t.co/A2AFrxhMza— KTR (@KTRBRS) February 22, 2025 -
భూపాలపల్లి లింగమూర్తి కేసుపై రాజకీయ దుమారం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్యచేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు తెర లేపింది. లింగమూర్తి హత్య వెనుక గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తిని చంపేశారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగం అనేక కేసులు వేసి పోరాడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై రాజలింగం కేసులు వేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి అనేక అనుమానాలు ఉన్నాయి.బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చంపించారని లింగమూర్తి భార్య చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కేసు వేసినందుకే చంపేశారని లింగమూర్తి కూతురు అంటున్నారు. గండ్ర వెంకట రమణారెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని కేసీఆర్ ఆదేశించాలి. అవినీతి బయటపడుతుందనే హత్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నడిరోడ్డుపై వామన్ రావు దంపతులను హత్య చేశారు. నిందితుడు ఎవరో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. లగచర్ల దాడి సూత్రదారుడితో కేటీఆర్ 72 సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల రాజకీయం ఇలా ఉంటుంది.హరీష్ రావుకు అసలు మానవత్వం ఉందా?. కృష్ణా నీటిని ఏపీకి ఎక్కువ దోచిపెట్టిందే బీఆర్ఎస్. ఈ ఘటనను డైవర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. 15 నెలలుగా బయటకు రాని కేసీఆర్‌కు కాంగ్రెస్ గ్రాఫ్ గురించి ఏం తెలుసు?. ఎవరిని అడిగి కాంగ్రెస్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నారా?. బీఆర్ఎస్ హత్యలు చేయడం తప్ప ఇంకా ఏం చేయగలదు?. ఈ హత్యను సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీబీసీఐడీతో విచారణ జరపాలని సీఎంను కోరుతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలి. ఈ కేసును న్యాయమూర్తి సుమోటోగా తీసుకోవాలి.గండ్ర కౌంటర్.. మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. లింగమూర్తి హత్యను మాకు చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు. ఈ విషయంపై కోర్టులోనే మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. భూ వివాదాలతోనే హత్య జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లింగమూర్తి హత్యకు నాకు, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్/భూపాలపల్లి, సాక్షి: మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి(Nagevelli Raja Lingamurthy) దారుణ హత్యకు గురికావడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నాం మంత్రి కోమటిరెడ్డి ఈ కేసుపై మీడియాతో మాట్లాడతారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని లింగమూర్తి కేసు వేశారు. అయితే.. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేశారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హస్తం ఉందంటూ..తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని సరళ ఆరోపిస్తున్నారు. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. ఇక.. మేడిగడ్డ అవినీతి వ్యవహారంపై పోరాటం చేస్తున్నందుకే ఆయన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్ట ప్రకారం విచారణ జరపాలని, నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టొద్దని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పోలీసులను కోరారు. హత్యా రాజకీయాలు ఏమాత్రం మంచివి కావని అంటున్నారాయన. కుటుంబ సభ్యుల అనుమానాలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో తాజాగా.. లింగమూర్తి(Lingamurthy) కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించాలనుకుంటోంది.పోలీసుల అదుపులో నిందితులు? రాజా లింగమూర్తి హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భూ వివాదాల నేపథ్యంలో లింగమూర్తి స్నేహితుడే ఈ హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు. సంజీవ్, హరిబాబు, కొమురయ్య, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ఈ కేసు గురించి మీడియాకు వివరించే అవకాశం ఉంది.బీఆర్ఎస్తో అనుబంధం నుంచి..రాజా లింగమూర్తికి గతంలో బీఆర్ఎస్తో మంచి అనుబంధం ఉంది. ఆయన భార్య మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. అయితే కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ జంట కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. మంకీ క్యాపులతో వచ్చి..బుధవారం తన స్వస్థలం జంగేడు శివారు ఫక్కీర్‌గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి ఇంటికి బయల్దేరారు. కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో.. ఆటోలో మంకీ క్యాపులతో వచ్చిన కొందరు దాడికి దిగారు. మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడి ఆయన కుప్పకూలిపోయారు. అయితే.. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతుండగా.. లింగమూర్తి కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. లింగమూర్తిపైనా పలు కేసులురాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. గతంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో ఆయన ఫిర్యాదు చేశారు కూడా. ఈ వివాదాల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మళ్లీ అధికారంలోకి వస్తాం పోరాటానికి సిద్ధమవ్వండి
-
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సేనని.. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒక్కటే మార్గమన్నారు. ‘‘తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే మాకు ముఖ్యం. ప్రజల అస్తిత్వం కోసం పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.విస్తృత స్థాయి సమావేశంలో 30 మంది వారి అభిప్రాయాలు చెప్పారు. తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం. అందరిని భాగ స్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాం.ఏప్రిల్ రెండో వారంలో ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. పార్టీ సభ్యత్వ సమోదు కార్య క్రమం. పార్టీ నేతలకు శిక్షణ తరగతులు చేపడతాం. త్వరలోనే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అధ్యక్షలను ఎంపిక చేస్తాం. 2026 ఏప్రిల్ వరకు సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, ప్రజా పోరాటాలు చేస్తాం. రేవంత్ రెడ్డిని వాళ్ల కేబినెట్ మంత్రులే పట్టించుకోవడం లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో రేవంత్ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు. -
విమర్శలు తప్ప.. కేటీఆర్ చేసిందేమీలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు. -
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. -
తెలంగాణ భవన్ కు కేసీఆర్
-
నేను ఐదు సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్ మంత్రినే..
హైదరాబాద్: తాను కేసీఆర్(KCR) క్యాబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా చేశానని, మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని, అందుకు తానే సాక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జూపల్లి.. ‘ కేసీఆర్ మీటింగుల్లో కేసీఆర్ వచ్చేదాకా ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఆరిపోయింది కాకుండా ఢిల్లీలో అరిపోయారు. సెక్రటేరియట్ కట్టడం తప్పు పట్టడం లేదు కానీ, సెక్రటేరియట్ రాకపోవడం తప్పని ఆనాడే అన్నాను. అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పదేండ్లు పట్టిందా?, బీఆర్ఎస్(BRS) ఓడిపోవడానికి వాళ్ళ స్వయంకృపరాదమే కారణం. కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు తపిస్తున్నట్టు నిన్న ఆయన అనుచరులు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటం, రాజకీయ సంఘర్షణలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగాయి. పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు. గడిచిన 65 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేశారు.కేసీఆర్ పదేండ్ల అప్పుల పాలన గొప్ప పాలన ఎలా అవుతుంది?, ఆంధ్రవాళ్ళు అంద్రవాళ్ళు అన్న కేటీఆర్(KTR) ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్కసారైనా అంబేద్కర్ కి దండ వేశాడా?, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చాడా?, రాష్ట్ర అప్పు 2 లక్షల కొట్లే అని అసెంబ్లీలో కేసీఆర్ అన్నారు. అదే నిజమని అనుకున్నాం. కేసీఆర్ శాసనసభకే రాలేదు. ఆయన పాలన కావాలని కోరుకుంటారు ఏంటి?, కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. కేటీఆర్ మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదుసర్పంచులకి బిల్లులు ఇవ్వడం లేదని అనడానికి కేటీఆర్ కి సిగ్గు ఉందా?, కేసీఆర్ చేసిన పనికి....అప్పు కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాత పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కి వాత పెడతారు. కేసీఆర్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు’ అని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
GHMC: బరిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడితో జీహెచ్ఎంసీ పాలక మండలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్–ఎంఐఎం పార్టీలు స్టాండింగ్ కమిటీకి పరస్పర అవగాహనతో పోటీ చేయడంతో ఎన్నిక జరగకుండానే కమిటీ ఏకగ్రీవమవుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సఖ్యతగా ఉండే ఎంఐఎం..తన స్టాండ్ కనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం తమ కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం బరిలో దింపాయి. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి సైతం ఇద్దరు స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయడంతో ఉపసంహరణ గడువు దాకా కొంత డ్రామా జరిగే అవకాశం ఉంది. స్టాండింగ్ కమిటీలో 15 స్థానాలున్నాయి. కార్పొరేటర్లు 15 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం..ఇద్దరి మృతితో నాలుగు స్థానాలు ఖాళీ కాగా 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరే స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు ఓటర్లు. ఎక్కువ ఓట్లు పొందిన వారు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యే అవకాశం ఉంది. పొత్తు లేకుండా పారీ్టలు వేటికవి విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ఎక్కువ మంది కార్పొరేటర్లున్న బీఆర్ఎస్ గెలిచేది. కానీ ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుతో ఆ రెండు పార్టీల వారే ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల బలానికనుగుణంగా స్టాండింగ్ కమిటీకి పార్టీలు సభ్యులను నిలబెడుతున్నాయి. బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తు ఉన్నప్పుడు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆపార్టీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిలబడి, గెలిచేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే ఎంఐఎం బలం ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం ఎనిమిదిమందిని బరిలో దింపింది.కాంగ్రెస్ నుంచి ఏడుగురు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లను పోటీకి దింపాలో, వద్దో నిర్ణయించకముందే ఆ పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు. పారీ్టల బలాల దృష్ట్యా, అధిష్ఠానం ఆదేశిస్తే వారిద్దరూ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. లేని పక్షంలో క్రాస్ ఓటింగ్‌పై ఆశతో బరిలో ఉండవచ్చు. అదే జరిగితే ఉత్కంఠ భరితమైన పోలింగ్ జరగనుంది. బీజేపీ సైతం స్టాండింగ్ కమిటీకి పోటీ చేయాలని భావించినప్పటికీ, పార్టీ పెద్దల సూచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఒకవేళ పోలింగ్ జరిగితే, పోటీలో లేని బీజేపీ సభ్యుల ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.నేడు నామినేషన్ల పరిశీలన నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం స్క్రూటినీ చేస్తారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్‌జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో స్థానం ఉన్న కాంగ్రెస్ పారీ్ట..బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలో స్థానం లేకుండానే ఉంది. తిరిగి స్టాండింగ్ కమిటీలోకి వచ్చే అవకాశం ఏర్పడినట్లు పరిశీలకులు చెబుతున్నారు.నామినేషన్లు వేసింది వీరే.. గడువు ముగిసేలోగా నామినేషన్లు వేసిన వారిలో ఎంఐఎం నుంచి బాతా జబీన్, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహబ్, మహ్మద్ సలీమ్, పరీ్వన్ సుల్తానా, సమీనాబేగం, డా. అయేషాహుమేరా, గౌసుద్దీన్ మహ్మద్లున్నారు. కాంగ్రెస్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్, బూరుగడ్డ పుష్ప, సీఎన్ రెడ్డి, వి.జగదీశ్వర్‌గౌడ్, బానోతు సుజాత, బొంతు శ్రీదేవి, ఎండీ బాబా ఫసియుద్దీన్లున్నారు. బీఆర్ఎస్కు చెందిన జూపల్లి సత్యనారాయణరావు, ప్రసన్నలక్ష్మి కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు పార్టీల గుర్తింపు అంటూ లేదు. -
నిజంగానే పాలు అమ్మిన మల్లారెడ్డి
-
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. -
TG: అర్ధరాత్రి హైడ్రామా.. బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్‌ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.మరోవైపు.. శేఖర్ అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్‌ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్‌కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశంరాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఆరు నెలల తర్వాత..సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్ఎస్కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. -
ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్‌కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్‌రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
పింక్ బుక్‌లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. -
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
పార్టీలు మారనున్న కార్పొరేటర్లు?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పార్టీలు మారనున్నారా? అంటే కాదనలేమనే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో జీహెచ్ఎంసీలో ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న 15 స్థానాలూ ఇప్పటి వరకు బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకే ఏకగ్రీవమవుతూ వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ (standing committee) సభ్యులవుతారు. ఏడాది కాలపరిమితి గల స్టాండింగ్ కమిటీకి గత సంవత్సరం వరకు బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తు బంధం కొనసాగింది. రెండు పార్టీలూ కలిస్తే.. పోటీలో దిగినా లాభం లేదనే తలంపుతో మిగతా పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఎంఐఎం తమకు లభించే ఏడు స్థానాల కోసం అధిష్ఠానం ఎవరి పేర్లయితే ఎంపిక చేస్తుందో వారే నామినేషన్లు వేసేవారు. బీఆర్ఎస్ (BRS Party) నుంచి సైతం ఉపసంహరణ నాటికి దాని వాటా మేరకు ఎనిమిదిమంది మిగిలేవారు.జంపింగ్ సమయం.. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి, రాజకీయ పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలతోపాటు పలువురు కార్పొరేటర్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో మూడు స్థానాల నుంచి కాంగ్రెస్ బలం 24కు పెరగడం తెలిసిందే. ప్రస్తుతం ఎంఐఎం.. కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నందున ఈసారి అవి రెండూ కలిసి పోటీచేసే అవకాశం ఉన్నప్పటికీ, ఏక్షణం ఎలాంటి మార్పులైనా జరగవచ్చుననే తలంపుతో ఇతర పార్టీల నుంచి సైతం నామినేషన్లు వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. మరోవైపు, తమ పార్టీకి ఎక్కువ మంది సభ్యులుంటే స్టాండింగ్ కమిటీలో ప్రభావం చూపవచ్చుననే తలంపుతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 146 మంది కార్పొరేటర్లలో బీఆర్ఎస్కు అత్యధికంగా 42 మంది కార్పొరేటర్లున్నారు. ఆతర్వాత వరుసగా ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్‌కు 24 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఏపార్టీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే బీఆర్ఎస్ నెగ్గుతుంది. కానీ, అది సాధ్యం కాదని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు. మేయర్ పీఠంపై దృష్టితో.. మరోవైపు, బల్దియాలో తమ బలం పెంచుకొని వచ్చే సంవత్సరం జరగబోయే పాలకమండలి ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే బలాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని మూడు పార్టీలూ భావిస్తున్నందున కూడా ప్రస్తుతం పార్టీ మార్పిడులు జరిగేందుకు అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపార్టీలో చేరిన వారి సంఖ్య 24కు పెరిగినప్పటికీ, చేరేవారు ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గత సంవత్సరం ఆగిపోయిన చేరికలను కాంగ్రెస్ తిరిగి ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు. కార్పొరేటర్లకు మిగిలిన ఏడాది పదవీ కాలంలో ఎక్కువ నిధులు పొందేందుకు, తద్వారా ఎక్కువ పనులు చేసి వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు ఆపార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది.చదవండి: ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్బీజేపీ సైతం కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ గెలుపు జెండా ఎగురవేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమందిని చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదపనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు స్టాండింగ్ కమిటీ ఎన్నిక తగిన సమయమని చెబుతున్నారు. కొందరు పార్టీలో చేరినంత మాత్రాన ఏ పార్టీ కూడా సొంతబలంతోనే అన్ని స్థానాలూ గెలవలేదని, అందుకు వివిధ కారణాలున్నాయని కొందరు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే 15 స్థానాలు లభిస్తాయంటున్నారు. అయినప్పటికీ తమ పార్టీకి ఎక్కువ బలం కోసం మూడు పార్టీలు ఎలాంటి కార్యాచరణ అమలు చేయనున్నాయో వేచి చూడాల్సిందే!మొదటి రోజు నామినేషన్లు నిల్.. స్టాండింగ్ కమిటీకి నామినేషన్ల తొలిరోజైన సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇద్దరు సభ్యులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. నామినేషన్ల దాఖలుకు 17వ తేదీ వరకు గడువుంది. ఈలోగా ఎవరు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో, ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేవలం స్టాండింగ్ కమిటీ కోసం ఇతర పార్టీలతో పొత్తు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కార్పొరేటర్లకు సూచించినట్లు సమాచారం. పోటీ చేయాలనుకుంటే బీజేపీ కార్పొరేటర్లు పోటీ చేయవచ్చునని అన్నట్లు తెలిసింది. -
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
BRS రైతు మహాధర్నా
-
Hyderabad: మిత్రులెవరో.. ప్రత్యర్థులెవరో?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతివ్వనుంది? ఏ పార్టీ ఎవరితో విభేదించనుంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవలి కాలంలో రాజకీయ పారీ్టల్లో చేటుచేసుకున్న పరిణామాలు. ప్రస్తుత పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికలు పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. రెండు పార్టీలకు పాలకమండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణనలోకి తీసుకొని స్టాండింగ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకుగాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు పోటీ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్– ఎంఐఎం పరస్పర సహకారంతో పని చేసినందున ఆ రెండు పార్టీల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతూ వచ్చారు. ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీకి సైతం ఏ రెండు పార్టీలైతే పరస్పర అవగాహనతో పని చేస్తాయో ఆ పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఎంఐఎం మద్దతు ఎవరికి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎంఐఎం–కాంగ్రెస్‌ల మధ్య నెలకొన్న అనుబంధం తెలిసిందే. ఆ రెండు పారీ్టలే పరస్పర సహకారంతో పోటీ చేస్తాయనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి. అదే జరిగితే గతంలో బీఆర్ఎస్ పొందిన స్టాండింగ్ కమిటీ స్థానాలు ఈసారి కాంగ్రెస్‌కు దక్కుతాయి. లేదా బలాల దృష్ట్యా కాంగ్రెస్ కంటే ఎంఐఎంకు ఎక్కువ మంది సభ్యులున్నందున బలాల దామాషాకు అనుగుణంగా రెండు పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పొత్తు లేకుండా పోటీ జరిగితే? అలా కాకుండా పొత్తు లేకుండా వేటికవే విడివిడిగా పోటీచేస్తే ఎక్కువ సభ్యులున్న పారీ్టకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉన్నా, సీక్రెట్ బ్యాలెట్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఏ పారీ్టకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పే పరిస్థితి లేదు. పార్టీలతో పాటు, పార్టీల కతీతంగా కార్పొరేటర్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు, మద్దతు తదితరమైనవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. బల్దియాలో ఇప్పటి వరకు ఎంఐఎం లేకుండా.. ఏ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్న చరిత్ర లేదు. ఎంఐఎంయేతర పారీ్టల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయాలే ఉన్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ పార్టీ దేనితోనైనా లోపాయికారీ మద్దతు పొందవచ్చనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జనరల్‌బాడీ సమావేశం ఇందుకు ఉదాహరణ. సభ జరగడానికి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్.. ‘మా పార్టీ బలమే ఎక్కువ. మా వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభ జరపగలరా’ అన్నారు. కానీ.. కారణమేదైనా సభలో బీఆర్ఎస్ మాత్రమే లేకుండా బడ్జెట్, సాధారణ సమావేశాలు జరగడం తెలిసిందే. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లున్నా.. బీఆర్ఎస్కు అందరి కంటే ఎక్కువ సీట్లున్నా పారీ్టల మధ్య పరస్పర సహకారం లేకుంటేనే దానికి ఉపకరిస్తుంది. లేని పక్షంలో ఏ రెండు పారీ్టలైతే జత కడతాయో ఆ రెండు పారీ్టల సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఏం జరగనుందన్నది నామినేషన్లు ముగిసే లోగా స్పష్టత రానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. పోటీ జరుగుతుందా, ఏకగ్రీవమవుతుందా? అన్నది ఉపసంహరణలు ముగిసే 21వ తేదీన వెల్లడి కానుంది. బీజేపీ కార్పొరేటర్లతో నేడు కిషన్ రెడ్డి భేటీ జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు.అవే కీలకం మొత్తం 150 మంది కార్పొరేటర్లకుగాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మరణంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి పోటీ చేసేందుకు, ఓట్లు వేసేందుకూ అర్హులు. ఈ బలం దృష్ట్యా బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలెక్కువ. తర్వాత ఎంఐఎంకు అయినప్పటికీ.. అంతర్గతంగానైనా, బహిరంగంగానైనా ఎత్తులు, పొత్తులు, జిత్తులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. -
బీఆర్ఎస్ వల్లే ‘ఆప్’ ఓటమి: కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్‌ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్‌గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు. ‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానన్ను కలిసిన కేటీఆర్
-
‘ఎన్నికల యావ తప్ప చేసిందేంటి?.. నాగయ్య మృతి కాంగ్రెస్ పాపమే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోవడం వల్లే నాగయ్య చనిపోయాడని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య.ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ.దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయి.లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా…— Harish Rao Thanneeru (@BRSHarish) February 6, 2025వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ: కేటీఆర్ సైటెర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశంపై స్పందించారు. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా కేటీఆర్..‘నిన్నటి అసెంబ్లీ సమావేశం.. తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంచేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయింది. రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసింది. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహల్ గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. Lies! Damn Lies! Nothing but lies! Yesterday’s Assembly session clarified two things to the people of Telangana - the disastrous government that has no clarity and the lies you shamelessly peddled in the name of BC Declaration! While the government is clueless on the data…— KTR (@KTRBRS) February 5, 2025 -
తెలంగాణ కులగణన.. ఆ లెక్కలు వాళ్లే చెప్పాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కులగణన.. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాలకు రిఫరెన్స్‌గా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టి.. చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.ఈరోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు న్యాయం జరగనుంది. ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి.2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించాం బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ కి రాని వాళ్లు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ల గతి ఏంటో? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీసీల కోసమైనా కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే మాజీ సీఎం కేసీఆర్(KCR) రేపు అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలని కోరారు. ఇదే సమయంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత(kavitha) తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో కుల గణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించామని కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు. మేం కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్ ఏమీ పెట్టం. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి.బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమంలాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. కేబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించాం. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. నిర్ణయం నుండి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో చేసినందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపండి అని వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కులగణనపై కవిత కీలక వ్యాఖ్యలు -
కులగణన అంతా కాకి లెక్కలే: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా కాకి లెక్కలే ఉన్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతీచోటా వినిపిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా? అని ప్రశ్నించారు. మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నారని అంటారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘మేము చేసిన ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ, బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోటా వినిపించింది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా?. నిన్న ఆగమాగం లెక్కలు పెట్టారు. రేపు అసెంబ్లీలో పెడుతున్నారంట. పెడితే బిల్లు పెట్టండి. .. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకుని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టీ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. బీసీలకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు, బీహార్‌లో చేశారు. అదే మోసం తెలంగాణాలో చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే. మేము ఏమైనా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నామని అంటున్నారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తోంది. ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలలో వ్యత్యాసం తీవ్రంగా ఉంది. కాబట్టి 15 రోజులు రివ్యూకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో మేము అందరం పెద్దలను కలుస్తాము. పోరాటాలకు మేము ఎప్పుడు సిద్ధమే. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం అన్నారు. ఇప్పుడు మైనార్టీలతో కలుపుకుని 56.3% బీసీలు అని మీరే అంటున్నారు. 56.3% రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోవాలి’ అని కవిత డిమాండ్ చేశారు. -
సుప్రీం కోర్టులో కేటీఆర్ ‘ఫిరాయింపుల పిటిషన్’ వాయిదా
న్యూఢిల్లీ,సాక్షి: తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
కేసీఆర్‌కు ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..
చాలాకాలం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పులిలా గాండ్రించారా?. ఆ పులిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదరగొట్టే ప్రయత్నం చేశారా?. రేవంత్‌కు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. కేసీఆర్‌ను ముగ్గులోకి దించి ఆయనతో విమర్శలలో సైతం తలపడి పైచేయి సాధించాలన్నది వాంఛగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేను నెలల కాలంలో పలుమార్లు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభలో సైతం ఘాటుగా మాట్లాడారు. ఎలాగైనా కేసీఆర్‌ను రెచ్చగొట్టాలన్నది ఆయన వ్యూహంగా కనిపించేది. ఇప్పటికైతే రేవంత్ ఆశించినట్లు జరిగిందని చెప్పాలి. కానీ, వాదోపవాదాలలో ఆయన ఎంత వరకు సఫలం అయ్యారన్నదే ప్రశ్న..కేసీఆర్ ఇంతకాలం దాదాపు పూర్తి మౌనం పాటించారు. కారణం ఏదైనా ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్కు ఉత్తేజం తెచ్చేలా ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాలలో మంచి భాషలో పదునైన పదాలు వాడే శక్తి కేసీఆర్ సొంతం అని చెప్పాలి. ఆయనకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ గతంలో స్పందించలేకపోయేది. రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ లోటు కొంత తగ్గిందని చెప్పాలి. రేవంత్ చాలా దూకుడుగా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబంపైన విమర్శలు చేసేవారు. కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు, ఈగో సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్పై ఏర్పడిన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.ఆరు గ్యారంటీలు, తదితర హామీలు కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కేసీఆర్ ముందున్న సవాలు అయితే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం రేవంత్‌కు ఉన్న ఛాలెంజ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరో చిన్న నేత ఎక్స్‌లో పెట్టిన పోల్ కేసీఆర్‌కు ప్రయోజనకరంగా మారింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కావాలా?. ఫాం హౌస్ ప్రభుత్వం కావాలా? అని పోల్ పెడితే 67 శాతం మంది ఫాం హౌస్ పాలనే బెటర్ అని, మిగిలిన 33 శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా అభిప్రాయం తెలిపారు. ఇది సహజంగానే రేవంత్‌కు కాస్త చికాకు తెప్పిస్తుంది. కేసీఆర్ తన ప్రసంగంలో ఆ పాయింట్‌ను అడ్వాంటేజ్ చేసుకోవడానికి గాను ప్రజాభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ శక్తి ఏమిటో మళ్లీ చూపిస్తామని, తాను కొడితే వట్టిగా ఉండదు అంటూ సీరియస్ వ్యాఖ్య చేశారు. ఇంతకాలం గంభీరంగా, మౌనంగా చూస్తూ వచ్చానని, ఏడాదిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ దివాళా తీయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే జనం కొట్టేలా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఈ ఊపులో ఆయన ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సహజంగానే బీఆర్ఎస్ నేతలలో, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కాంగ్రెస్‌లో కాకను పెంచుతాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీని గట్టిగానే నడుపుతున్నప్పటికీ అసలు నేత కేసీఆర్ కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారా అని కేడర్ ఎదురు చూసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ పులి లేచింది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏడాదిపాటు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఇకపై నిజంగానే జనంలోకి వచ్చి తిరుగుతారా? లేక అప్పుడప్పుడు ఇలా స్పెషల్ షోలకు పరిమితం అవుతారా? అన్నది అప్పుడే చెప్పలేం. నగరానికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లోనే ఆయన ఎక్కువకాలం గడపడం బలహీనతగానే చెప్పాలి. కేటీఆర్, హరీష్ రావులు ఇంత గట్టిగా పనిచేయడం కష్టం అవుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, ఆయన కార్యకర్తలకు అంతగా అందుబాటులో లేరని చెబుతారు. శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ బాగా డీలా పడ్డారు. తాను బాగా పని చేశానని, అయినా ఓటమి పాలయ్యాయని బాధపడుతుండవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దీనికి కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీనిని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వీక్ పాయింట్స్‌ను పట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, ముందుగా బీఆర్ఎస్లో ఉన్న బలహీనతలను ఆయన గుర్తించగలగాలి. భారతీయ జనతా పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. దానికి తగినట్లుగానే ఆ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది స్థానాలు సంపాదించి సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం బాగా ఇబ్బంది కలిగించే అంశమే.బీజేపీ గెలుపునకు పరోక్షంగా బీఆర్ఎస్ సహాయపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్ కాకపోయినా, కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్కు ప్రయోజనం కలిగించాయి. పార్లమెంటు ఎన్నికలలో ఓటమి పాలైనా, అసెంబ్లీ ఎన్నికలలో ఆ పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ భావన. కాకపోతే ఇంకా దాదాపు నాలుగేళ్లు పోరాటాలు సాగించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అధికంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కనుక గణనీయమైన స్థానాలు సాధించగలిగితే అప్పుడు కాంగ్రెస్ భయపడే పరిస్థితి వస్తుంది. కానీ, అది అంత తేలికకాదు. అంతేకాక కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తలనొప్పి కాకుండా ఉండాలి. ఇకపై రేవంత్ మరింతగా కవ్విస్తుంటారు. దానిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అవుతుంది.మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోగలగాలి. దానివల్ల పార్టీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వ్యూహాలను ఎలా ఎదుర్కుంటారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అనాలోచితంగా ఏదో మంచి జరుగుతుందనుకుని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోల్ పెట్టి నాలుక కరచుకోవాల్సి వచ్చింది. ఈ పోల్ నిజంగానే ప్రజలలో ఉన్న అభిప్రాయానికి దర్పణం పడుతోందా? లేదా? అన్నదానిపై రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హైడ్రా దూకుడు, ఆరు గ్యారంటీల అమలులో ఉన్న ఇబ్బందులు, అవి కాక ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీలు, వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు .. ఇవన్నీ కూడా కాంగ్రెస్‌కు ఇరకాటమైనవే అని చెప్పాలి. హామీలను నెరవేర్చాలన్న తాపత్రయం ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందుకు అవకాశం ఇవ్వడం లేదు. తెలంగాణాకు ఆదాయం బాగానే ఉన్నా, ఈ హామీలకు అది సరిపోవడం లేదు. అందుకే పైలట్ ప్రాజెక్టు పేరుతో మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకుని స్కీముల అమలుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కూడా కొంత నష్టం జరగవచ్చు.గతంలో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వలేక సతమతమయ్యారు. దాని ఫలితంగా బీఆర్ఎస్కు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి వాతావరణమే కాంగ్రెస్‌కు ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో పోల్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిన అభిప్రాయం కలిగింది. దీనిపై రేవంత్ స్పందన అంత బాగోలేదని చెప్పాలి. కేసీఆర్‌ను రాకీ సావంత్ తో పోల్చడం సరికాకపోవచ్చు. కేసీఆర్ తాను కొడితే వట్టిగా ఉండదన్న వ్యాఖ్య కేవలం హైప్ కోసమే చేసింది అయినా, రేవంత్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే వ్యక్తిగతంగానే మాట్లాడారనిపిస్తుంది. ముందు సరిగా నిలబడడం నేర్చుకో అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ చేయడం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్‌కు ప్రతిపక్షనేత హోదా ఉందన్న సంగతి మర్చిపోకూడదు.ఈ విషయంలో బీఆర్ఎస్కు కొంత ఇబ్బందే. అయితే, కేసీఆర్ నిత్యం ప్రజలకు, ముఖ్యంగా కేడర్‌కు అందుబాటులోకి వచ్చి, టూర్లు మొదలు పెడితే వచ్చే స్పందనపై బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదుర్కుంటున్న మాట నిజం. దానిని అధిగమించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారన్నదానిపై, ప్రజలలో సానుకూల అభిప్రాయం ఎలా కలిగిస్తారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ను బలహీనపరచాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వారిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చినంత మాత్రాన పూర్తి ఫలితాన్ని ఇవ్వదన్న సంగతి ఆ పార్టీ నేతలకు అర్దం అయి ఉండాలి.కేసీఆర్ చేస్తున్న మరో ముఖ్యమైన విమర్శ రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉండడం. అది దేశవ్యాప్తంగా ఉన్న విషయమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన కూల్చివేతలు కూడా కొంత నష్టం చేశాయి. దానిని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కొంత యత్నం చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు బాగా జరిగితే రేవంత్ ప్రభుత్వం అడ్వాంటేజ్లోకి వెళుతుంది. కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని వినియోగించుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లను దెబ్బకొట్టడానికి బీజేపీ సహజంగానే యత్నిస్తుంది. రాష్ట్రంలోని అధికారంతో పట్టు బిగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. పులిగా మారతారో లేదో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం. ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: మల్లు రవికేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుంభకర్ణుడిలా ఏడాదిగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో మాతరమే బీఆర్ఎస్ పని చేస్తుంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఓటింగ్ చేసి.. జిమ్మిక్కులు చేసింది. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ఏడాది లోపలే చేశాం. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. కవిత వల్ల కేజ్రీవాల్ లాంటి వారే జైలుకు పోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్‌ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్‌రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్తుందా?: కవిత
సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని.. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది?. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దీదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్లకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలించలేరు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందా? ఎప్పుడు పోతుందా? అన్నది తెలియని దుస్థి తి ఏర్పడింది. చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు...కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి?. తెలంగాణను ఆంధ్రతో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర. కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారు. కేసీఆర్ హయాంలో నేరుగా లబ్దీదారులకే కోట్లాది రూపాయలు వెళ్లాయి..కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చేశామని చెప్పడమే తప్పా ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ్యతకు గురికావడం బాధాకరం. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు. -
‘అక్రమ అరెస్టు’లపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. .. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన. -
పెట్టుబడులపై రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’’ అంటూ పొన్నాల వ్యాఖ్యానించారు.‘‘సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ. పదేళ్ల కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్పతనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు.. మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి. ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం’’ అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు.‘‘2014, 2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయాంలో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్‌లో కేసీఆర్ హయాం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది. 2014లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటే అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగంలో భారీ పురోగతి సాధించింది...వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా?.స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు? ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు?. రేవంత్ భాష, స్వభావం అలా ఉండటానికి దేశంలో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు’’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. -
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించింది.‘కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. రుణమాఫీ,రైతుబంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారు.పంజాబ్,హరియాణాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు కేసీఆర్. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు.నల్గొండ రైతులు అవస్థలకు,పిల్లలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.రుణమాఫీ 25 శాతం కూడా కాలేదు.గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నాం. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
-
పాత రోజులు మర్చిపో.. కడియంకు రాజయ్య వార్నింగ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీ నాలుగు పథకాలపై ప్రతిపక్ష పార్టీ విమర్శనాస్త్రాలు
-
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: Mahesh Kumar
-
కరీంనగర్లో హీట్ పాలిటిక్స్.. మేయర్‌కు గంగుల సవాల్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు ఏపీని ఆపటం చేతకాకుంటే.. అఖిలపక్షాన్ని తీసుకుని పోవాలి. సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారన్న అనుమానం కలుగుతుందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.బంకచర్ల ద్వారా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే.. రేవంత్ మౌనంగా ఉండటానికి కారణమేంటి?. ప్రాజక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఏపీ, కర్ణాటకలు గోదావరి జలాలు తరలించుకుపోతే దావోస్, ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. గోదావరి నీటిని ఏపీ.. తుంగభద్ర నీళ్లను కర్ణాటక తరలించుకుపోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించరు?. ఇరిగేషన్ శాఖమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్. ఉత్తమ్‌కు చేతనైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘హక్కుగా రావాల్సిన నీటిని కూడా 13 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించలేకపోయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 40వేల కోట్లు ఏపీకి ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా కర్ణాటక అడ్డుకుంటోన్న సీఎం స్పందించటం లేదు.’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
కౌశిక్ రెడ్డిపై టమోటాలు విసిరిన కాంగ్రెస్ నేతలు
-
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. -
పోటాపోటీగా డప్పు కొట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు
-
26 నుంచే.. రేషన్‌కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ
సాక్షి, సూర్యాపేట జిల్లా: దేశంలోనే ఎక్కువ ధాన్యం పడించిన రాష్ట్రం తెలంగాణ అని.. 159 మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, పాలకవర్గం సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు.. 26 నుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి.. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రిగా ప్రజలకు హామీ ఇస్తున్నా.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు.సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. ఈ నెల 26 తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల రూపాయలు అందజేస్తాం. కోదాడ పట్టణం మీదుగా రైల్వే లైన్ రావటం కోసం మా సాయశక్తుల ప్రయత్నిస్తాం. జనవరి 26 న భూమిలేని రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తాం’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ దొంగ దీక్ష.. ప్రజలు తిప్పి కొట్టాలి: మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, 1967 లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇది. రాష్ట్రంలో కీలకమైన పాత్ర ఉత్తమ్‌కి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం.. ప్రతి సంక్షేమ పథకం అమలుకు గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటంటూ తమ్మల మండిపడ్డారు. ఎన్నికల హామీలో ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నామన్నారు. గోదావరి జలాలు పాలేరుకి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తమ్మల కోరారు. బీఆర్ఎస్ పార్టీ దొంగ దీక్షకి సిద్ధమౌతుంది. ప్రజలు దీక్షను తిప్పి కొట్టాలి’’ అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్! -
కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పటాన్చెరులో ఉద్రిక్తతలు
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గత కొంతకాలంగా పటాన్చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. -
మేయర్‌పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
ఇందిరమ్మ రాజ్యం కాదు.. తోడేళ్లలా ప్రాణం తీసే సర్కార్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!.కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది..తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ఆత్మహత్యలు కాదివి… pic.twitter.com/u70SmU5tlb— KTR (@KTRBRS) January 21, 2025మరోవైపు రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సైతం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది. రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య. రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు జరిగియా.రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు.🔴 రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406🔴 రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య🔴 రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలురాష్ట్రంలో రైతుల… pic.twitter.com/UmPqslh3Ph— BRS Party (@BRSparty) January 21, 2025వేసిన పంటలు చేతికిరాక.. వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక.. బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి’ అంటూ ఆరోపణలు చేసింది. -
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్‌భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్‌ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్‌రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ
సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారుహామీలను అమలు చేయాలని అడగడం తప్పా?రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు? -
తెలంగాణను ఉద్దరించలేనోడు.. ఢిల్లీని ఉద్దరిస్తాడా?: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని సవాల్ విసిరారు.‘‘ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ? -
బీఆర్ఎస్ది వడ్డీ మాఫీనే.. దొంగ దీక్ష అందుకే: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అలాగే, తెలంగాణ ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. వడ్డీ మాఫీ మాత్రమే చేసింది. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోంది. రైతు భరోసా పేరుతో ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు 12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. బీఆర్ఎస్ రైతుబంధు పేరుతో ఏడాదికి 8వేల నుండి పది వేలు చేస్తే.. కాంగ్రెస్ పది వేల నుండి 12 వేలు ఇస్తుంది. భవిషత్తులో 14 వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది.దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు 500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు సన్నాలు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ హౌసింగ్ పథకాన్ని మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక చేసింది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్నే ఎత్తేసింది. బీజేపీ రుణమాఫీ అనే మాటే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్ మాత్రమే’ అంటూ కామెంట్స్ చేశారు. -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫు న్యాయవాదుల పిటిషన్
-
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
బీఆర్ఎస్ అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్(BRS Party) అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్(RSS) ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ(BJP) చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం.. సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు.(ఐడియాలాజికల్ డిఫరెన్సెస్) స్వాతంత్య్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని రేవంత్ అన్నారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అదని, మోహన్ భాగవత్ (ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్) అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని సీఎం వివరించారు.స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భాగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ అన్నారు. బీజేపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని, అందుకే తాము భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని సీఎం అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో!ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా? లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా? స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విషయంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
సాక్షి, కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్‌లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్(BRS) లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్, హరీష్‌రావు హౌస్ అరెస్ట్కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్‌రావులను హౌస్ అరెస్ట్ చేశారు.వన్ టౌన్లో మూడు, త్రీ టౌన్లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు. అధికారిక లాంఛనాలతో.. మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రముఖుల సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా ప్రస్థానంనాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు. -
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది’
యాదాద్రి: భువనగిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడిగా ఆమె ఆరోపించారు. ‘ కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. ఏఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్‌కి దుకాన్ ఒక బూటకం. కాంగ్రెస్‌ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం. కాంగ్రెస్ యువజన విభాగం గూండాల విభాగంగా మారింది. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనం. కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి.భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరు’ అని కవిత హెచ్చరించారు.కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా తీవ్రంగా మారింది. . భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే: కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు: కేసీఆర్ -
బీఆర్ఎస్ రైతు మహాధర్నా మళ్లీ వాయిదా
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే. రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది. -
కేటీఆర్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్: ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మరో కేసు నమోదైంది. నిన్న(గురువారం) ఏసీబీ(ACB) విచారణకు హాజరైన కేటీఆర్.. విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వచ్చారు. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో కేటీఆర్‌పై నమోదైంది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏసీబీ విచారణ తర్వాత ఆ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకూ కేటీఆర్ ర్యాలీగా వచ్చారు. దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది.తీవ్ర ఉత్కంఠ రేపిన కేటీఆర్ విచారణఏసీబీ విచారణకు కేటీఆర్ విచారణకు హాజరైన క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో విచారణ తర్వాత ఆయన తిరిగి వచ్చేవరకూ ఉత్కంఠ కొనసాగింది. విచారణ ముగించుకుని కేటీఆర్ బయటకు వస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.కేటీఆర్‌ను ఏసీబీ విచారించే క్రమంలో ముఖ్యనేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగితేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తును నందినగర్ నివాసానికి చేరుకుని ఏం జరుగుతుందో అనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు.మరొకవైపు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఇదీ కూడా చదవండి: ఇది తొలి పాడ్‌కాస్ట్.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ -
వికారాబాద్ ‘సీఎం’ అనుముల తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన సాగుతోందన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి(రేవంత్ రెడ్డి సోదరుడు) గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupati Reddy) పోలీసులు సేవలు చేయడంపై బీఆర్ఎస్, కేటీఆర్ స్పందించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి రాచమర్యాదలు చేయడంపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ..‘రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన. అనుముల రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్. బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి చేసినట్టు పరేడ్ చేయించారు. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ! అంటూ మండిపడ్డింది.రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన.అనుముల రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం 👇కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్.బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి,… pic.twitter.com/YmitO3eRWT— BRS Party (@BRSparty) January 10, 2025ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్ ట్విట్టర్లో..‘తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు!. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో!. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు!. సీఎం రేవంత్ రెడ్డి గారు నాది ఒక చిన్న విన్నపం! ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను!. IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, తిరుపతి రెడ్డికి మర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం… ఒక్క CM ని ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారు! 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ ని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో! వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక…నాది ఒక చిన్న… https://t.co/IqaWMekseD— KTR (@KTRBRS) January 10, 2025 -
కేటీఆర్ అన్నట్టు... నిజంగానే లొట్టపీసు కేసా..? కాంగ్రెస్ తో ఉన్న ఆధారాలు
-
‘రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ’
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు.‘‘బీఆర్ఎస్ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ సంబురాలు చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసులు పెట్టీ సంబురాలు చేసుకుంటుంది...కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషి గా మల్లెపువ్వు లాగా, కడిగిన ముత్యం లాగ బయటకొస్తాడు...ఈ ఫార్ములా కారు రేస్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్లా పడటం ఖాయం. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి లాయర్లను వెంట బెట్టుకొని వెళ్తారు. కేటీఆర్ లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్ళొద్దా?. రాహుల్‌కి ఒక చట్టం.. కేటీఆర్‌కి ఒక చట్టం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ పనిచేస్తోంది’’ అంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
రైతు భరోసా నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే..
-
ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కేటీఆర్ స్పందనబీఆర్ఎస్కు గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. ‘‘గ్రీన్కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన. హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ(MAUD) తరఫున హెచ్ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే.. హెచ్ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే.. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్ఈవో ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్.. ఇదో లొట్టపీసు కేసు! -
వీడియో: పాడి కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. -
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు. -
వారి ఉచ్చులో పడితే.. నష్టపోయేది మీరే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కష్టకాలంలో బాధ్యతలు చేపట్టామని.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు.‘‘ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన రూ. 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల 22500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది’’ అని సీఎం రేవంత్ వివరించారు.‘‘గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!ఈ ప్రభుత్వం మనది.. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి. పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదు’’ అని రేవంత్ చెప్పారు. -
రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఇవ్వాలని అంటున్నారు.. రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతు భరోసా (Rythu Bharosa) కింద రైతులకు ఇవ్వలేదు.. రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు కుల గణన డ్రామా చేశారని దుయ్యబట్టారు.‘‘ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఏ ఊళ్లో ఎంత రుణమాఫీ చేశారో లిస్ట్ బయటపెట్టాలి. ఏ ఊళ్లో ఎంతమందికి బోనస్ ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ ఊళ్లో రైతు కూలీలకు ఎంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ కూడా బయటపెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుక్కను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలని.. రైతు బంధు పథకాన్ని కూడా బొందపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. రూ.22 వేల కోట్లు ఎక్కడ దారి మళ్లాయో లిస్ట్ బయటపెట్టాలి. ఈ ప్రభుత్వం పచ్చి దొంగ మాటలు మాట్లాడుతోంది. ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగండి...ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం 17,500, ఊరూరా పోస్టర్లు వేసి మరీ రైతులకు తెలిసేలా చేస్తాం. రైతు బంధును లేకుండా చేయాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుక్కుంటారా అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ ధోరణి ఆలోచన చాలా దారుణంగా ఉంది’’ అని కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు!‘‘రేపటి(శనివారం) నుండి రైతులను చైతన్య పరుస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. వరుసగా 11 సార్లు రైతులకు సమయానికి రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. రూ.73 వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు నేరుగా వేశాము. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద వేయలేదు. కాంగ్రెస్ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతొ బిల్డప్ ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ప్రజా పాలన కింద కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ డిటైల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర వున్నా.. మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు??రైతులు ఏ పంట వేసారో అని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఈ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది.. ప్రమాణ పత్రాలు ఎవ్వరూ ఇవ్వాలి .. ఈ ప్రభుత్వం ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. కౌలు రైతులకు , భూ రైతులకు రైతు భరోసా ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. 22 వేల కోట్లు దుర్వినియోగం అని దొంగ మాటలు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. 22 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయో ఈ ప్రభత్వం చెప్పాలి.. చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా ??’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్ కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. -
నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా
-
మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే: కేటీఆర్
-
పోలీసుల మరణ మృదంగం.. సర్కార్‌కి పట్టింపు లేదా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్‌రావు సూచించారు.పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024 -
తులం బంగారం ఇచ్చారా?.. కాంగ్రెస్ నేతలను నిలదీయండి: కవిత
సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు(Himanshu Rao) పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యానిమల్(Animal) సినిమాలోని 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి' అంటూ స్వయంగా పాట పాడిన హిమాన్షు.. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను కూడా యాడ్ చేసి వీడియోగా రూపొందించారు.దీంతో తన కుమారుడు తన కోసం ఓ పాట పాడటంతో సంబరపడిపోయిన కేటీఆర్.. సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జూలైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు ఈ పాటను రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు పాట సాహిత్యం.. గానం అద్భుతంగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. తాను దీని పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కు అభినందనలంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తన పాటను తండ్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని హిమాన్షు రీట్వీట్ చేశారు. The best Gift for me in what has been a difficult year Thank you Binku @TheHimanshuRaoK ❤️ Loved the vocalsApparently, my son recorded this for my birthday in July. But shied away from releasing it as he didn’t think it was good enough!!!I’ve only heard it last week for… pic.twitter.com/NTIBgcxQAa— KTR (@KTRBRS) December 28, 2024 -
ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా కారు రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఈ కేసు వివరాలను ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ.. ఈడీకి అందించింది. ఇక, కొన్ని గంటల ముందే ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ -కారు రేసింగ్ కేసు విషయమై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కీలక అంశాలను ప్రస్తావన చేసిన ఏసీబీ. కౌంటర్లోని విషయాలు.. కారు రేసింగ్‌లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేర పూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడు. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారు. దీని వలన హెచ్ఎండీఏకు 8 కోట్లు అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని తెలిపింది.అలాగే, కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్‌పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని చెప్పడం సరైనది కాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారు. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు ఆయనే చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైంది కాదు. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. -
కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ
-
అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్‌కు హరీష్‌రావు సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్‌ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు.‘‘శ్రీతేజ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్కర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్‌కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. రేవతి అందరి మనసును కరిగేలా చేసింది’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు?. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా?. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు.. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలి’’ అని హరీష్‌రావు చెప్పారు. -
Allu Arjun Controversy: రాజకీయ రగడ
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్ తీరును అధికార కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. .. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా.. రీల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: 'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తారా? : బీఆర్ఎస్ నేత శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు. పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం పంజాగుట్ట (హైదరాబాద్): సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
సినిమాను తలపించిన అసెంబ్లీ సమావేశాలు: పొన్నాల సెటైర్లు
సాక్షి, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలు సినిమా చూసినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారు.. అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంట్రాక్టర్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా?. అదానీతో రేవంత్‌రెడ్డికి అంతర్గత ఒప్పందం ఉంది. అందుకే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి రేవంత్.. అదానీపై ఫిర్యాదు చేయలేదు. ప్రజలను తప్పు దారిపట్టించేందుకు.. అసెంబ్లీ వేదికగా మోసం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం గవర్నర్‌ను కలిశారా అని ప్రశ్నించారు.రాష్ట్ర ఆదాయం మూడున్నర రెట్లు పెరిగింది. నిజ జీవితంలోనూ లోన్ అనేది ఒక భాగం. అప్పులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అంటున్నారు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇలా లేదు. లోన్లు పరిమితులకు లోబడే వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? లేక క్లోజ్ చేస్తారా?. అప్పులు, పెట్టుబడుల గురించి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. మంత్రులు, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదారి పట్టించారు. బీఆర్ఎస్ పాలనలో 27 రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. కాంగ్రెస్ నేతలు వస్తారా చూపిస్తాను. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయలేదు. అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రవర్తన చాలా బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు.మరో బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..‘పదేళ్ల పాటు అన్ని పండుగలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జరిపారు. బతుకమ్మ పండుగకు చీరలు.. రంజాన్, క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారంలో ఉంటే అబద్దాలు నిజమవుతాయా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? అని ప్రశ్నించారు. అలాగే, రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? అని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారువందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.రుణమాఫీ కానీ రైతన్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు?రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లిరా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాంరుణమాఫీ మాయరైతుభరోసా రూ. 7500 మాయతులం బంగారం మాయమహిళలకు రూ.2500 మాయరూ.4000 ఆసరా ఫించన్లు మాయరూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయజాగో తెలంగాణ జాగో అంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం .. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుంది ?… pic.twitter.com/QmWuYgmFmK— KTR (@KTRBRS) December 22, 2024 -
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
అది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ: సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు.
/telugu-news/telangana/liveblog/telangana-assembly-sessions-dec-20th-live-updates-2298339
-
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య..