
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తాండాలో సాగు నీరందక ఎండిపోతున్న పంటలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయన్న ఆశతో వరి పంట వేసుకున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం నుంచి కుట్రపూరితంగా రేవంత్ నీళ్లు ఇవ్వకుండా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
‘‘దేవునిగుట్ట తండాలో వరి నాట్లు వేసుకున్నారు. రుణమాఫీ కాలేదు, రైతుబంధు రాలేదు. కాలం తెచ్చిన కరువు కాదిది.. రేవంత్ తెచ్చిన కరువు. గత ప్రభుత్వంలో అప్పర్ మానేర్ నింపి ఎర్రటి ఎండలో నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలి. మల్కపేట రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఒక వేళ నీళ్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment