Medigadda Barrage
-
మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తాండాలో సాగు నీరందక ఎండిపోతున్న పంటలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయన్న ఆశతో వరి పంట వేసుకున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం నుంచి కుట్రపూరితంగా రేవంత్ నీళ్లు ఇవ్వకుండా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘దేవునిగుట్ట తండాలో వరి నాట్లు వేసుకున్నారు. రుణమాఫీ కాలేదు, రైతుబంధు రాలేదు. కాలం తెచ్చిన కరువు కాదిది.. రేవంత్ తెచ్చిన కరువు. గత ప్రభుత్వంలో అప్పర్ మానేర్ నింపి ఎర్రటి ఎండలో నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలి. మల్కపేట రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఒక వేళ నీళ్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్‌కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. -
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ(జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై విచారణ పూర్తి చేసిన ఎన్డీఎస్ఏ.. తుది నివేదికను కేంద్ర జలశక్తికి ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ అందజేశారు. జలశక్తి శాఖ పరిశీలన తర్వాత రాష్ట్రానికి ఎన్డీఎస్ఐ నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకూడదని మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ.. ప్రాజెక్టు పని చేస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనుంది.కాగా, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలిన విషయం తెలిసిందే. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు.దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి.నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. -
అవి ఇంజనీర్లకు వదిలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలతో మీకు సంబంధం లేదు. వాటిని ఇంజనీర్లకు వదిలేయండి..’అంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ‘మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలి. అది సాధ్యం కూడా..’అని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్‌రావు చెబుతుండగా.. జస్టిస్ ఘోష్ ఆయ న్ను మధ్యలోనే అడ్డుకున్నారు. ‘అంతే చాలు..టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు..’అని అన్నారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు గత ప్రభుత్వం తరఫున ప్రకాశ్‌రావు ‘సాక్షి’గా హాజరై సమాధానాలిచ్చారు. రాజకీయాలు చేయొద్దు తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారు? అని కమిషన్ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా..‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం. దానిని ఎవరూ మార్చలేరు..’అని కమిషన్ స్పష్టం చేసింది. ప్రజల సాగునీటి డిమాండ్లను నెరవేర్చడానికి 200 టీఎంసీలు అవసరం కాగా, తుమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత లేకపోవడంతోనే బరాజ్‌ను తరలించాల్సి వచ్చిందని ఆ తర్వాత ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యతే ఉందని కేంద్ర జలసంఘం పేర్కొందని, అందులోనూ ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయన్నారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకాశ్‌రావు చెప్పగా.. రాజకీయాలు చేయవద్దని, ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ కమిషన్ అభ్యంతరం తెలిపింది. రిటైర్డు ఇంజనీర్లు వద్దన్నా .. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని, దీనిని ఎలాగైనా సాధ్యం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్‌లో సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.ప్రతిపాదిత మేడిగడ్డ బరాజ్ అనవసరమని, అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీఎస్ఐడీసీ చైర్మన్‌గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధా నం అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. నీటి లభ్యత లేకపోవడంతో పాటు ముంపును తగ్గించడం కోసం తుమ్మిడిహెట్టికి బదులుగా వెన్‌గంగా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
మేడిగడ్డలో ‘డిజైన్’ లోపాలే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలింది. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు. దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి. నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ విజ్ఞప్తి మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్సీ(ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు, ఇతర ఇంజనీర్ల సమక్షంలో ఐఐటీ రూర్కీ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహించారు. టెయిల్ పాండ్ ఉంటే ....మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్ నిర్మాణం లేకపోవడమే అసలు లోపమని మోడ ల్ స్టడీలో తేలింది. బరాజ్ గేట్ల నుంచి భీకర వేగంతో వరద దిగువన టెయిల్‌పాండ్‌లోని నీళ్లలో దూకినప్పుడు అందులోని శక్తి విభజనకులోనై అన్నివైపులా వ్యాప్తి చెంది చివరకు నిర్వీర్య మైపోతుంది. దీనినే ఎనర్జీ డిస్సిపేషన్ అంటారు. మేడి గడ్డ బరాజ్ గేట్లను దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్ నిర్మాణాన్ని డిజైన్లలో ప్రతిపాదించలేదని నీటిపా రుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వరదలు తక్కు వగా ఉన్నప్పుడు బరాజ్ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపి వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు వదులుతారు. ఆ సమయంలో సైతం బరాజ్‌లో గరిష్ట మట్టం మేరకు నిల్వలుండడంతో గేట్ల నుంచి బయటకు వచ్చే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు ఏకంగా 30 మీటర్ల వరకు భీకర వేగంతో వరద బయటకు వస్తోందని మోడల్ స్టడీలో తేలినట్టు తెలిసింది. దీంతోనే బరాజ్ దిగువన రక్షణగా ఉండాల్సిన సీసీ బ్లాకులు కొట్టుకు పోయి వాటి స్థానంలో గుంతలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత గుంతలు లోతుగా మారి పునాదులను దెబ్బతీశాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఐఐటీ రూర్కీ మాడల్ స్టడీస్ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
‘మేడిగడ్డ’పై ఇక నివేదికలు అక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కింద ఏర్పడిన బుంగలను తమ సిఫార్సులకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ గ్రౌటింగ్ ద్వారా పూడ్చేయడంతో భూగర్భంలోని స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపు ణుల కమిటీ వెల్లడించింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా బరాజ్‌ల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవ కారణాలను తెలుసుకోలేమని తేల్చిచెప్పింది. అందువల్ల గతంలో తాము మధ్యంతర నివేదికలో నిర్దేశించిన వివిధ పరీక్షలు, అధ్యయనాల జాబితా నుంచి 5 రకాల అధ్యయన నివేదికలను ఇక సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.తాము సూచించిన అధ్యయనాలను సకాలంలో చేపట్టి నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తోందని తప్పుబట్టింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి/ఎన్డీఎస్ఏ డైరెక్టర్ గత నెల 29న ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు తన అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ తాత్సారం వల్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తాము తుది నివేదిక సమర్పించేందుకు మరింత ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై మిగిలిన నివేదికలైనా సకాలంలో సమర్పించేలా తెలంగాణ నీటిపారుదల శాఖపై ఒత్తిడి తేవాలని ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అయ్యర్ ఈ నెల 2న నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సత్వరమే కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు. డిసెంబర్ 31లోగా తుది నివేదిక అనుమానమేగత వానాకాలానికి ముందు బరాజ్‌లకు నిర్వహించాల్సిన తాత్కాలిక మరమ్మతులతోపాటు వాటిలోని లోపాలను గుర్తించడానికి చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్దేశిస్తూ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏప్రిల్ 30న మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పించింది. బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అధ్యయనాలు అత్యవసరమని అప్పట్లో తెలిపింది. అయితే వానాకాలంలోగా నీటిపారుదల శాఖ ఆయా అధ్యయనాలను చేపట్టి నివేదించకపోవడంతో నిపుణుల కమిటీ తుది సిఫార్సుల గడువును అక్టోబర్ 31 నుంచి ఎన్డీఎస్ఏ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తుది నివేదిక సమర్పించే అంశంపై నిపుణుల కమిటీ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసింది. -
‘మేడిగడ్డ’లో భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ.. ఈఈ, ఎస్‌ఈలపై క్రిమినల్ చర్యలు! మేడిగడ్డ బరాజ్‌లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అర్హులే. తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్.. మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్‌కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్‌లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌పై ఎస్ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది. మెజర్మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది. నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి. కొంపముంచిన కాఫర్ డ్యామ్! బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్‌పైల్స్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్‌ను ప్రారంభించాక కాంట్రాక్టర్‌కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు. నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు బరాజ్‌లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
మేడిగడ్డకు కొత్త టెయిల్‌పాండ్!
సాక్షి, హైదరాబాద్: పీడన శక్తి విడుదల(ఎనర్జీ డిస్సిపేషన్)కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’జరిపించిన ఓ మోడల్ స్టడీలో తేలింది. దీంతో తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్)కు లేఖ రాశారు. మళ్లీ వర్షాకాలం రాకకు ముందు మిగిలి ఉండే సమయంలో ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడతాయి. ఎందుకంటే గేట్ల నుంచి నీళ్లతో నిండే ఉండే జలాశయాల నుంచి విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. దీంతో టెయిల్‌పాండ్ నిల్వలో గేట్ల నుంచి వరద వచ్చి పడినా పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన నీటినిల్వలతో టెయిల్‌పాండ్ నిర్మించకపోవడంతోనే అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమానుగుణంగా గుంతలు పెద్దగా మారి బరాజ్ పునాదుల కింద ఇసుక జారిపోవ డానికి కారణమైందని ఎల్అండ్టీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ దిగువన ఎనర్జీ డిస్సిపేషన్ కోసం టెయిల్‌పాండ్ సామర్థ్యం పెంపు చర్యలను తీసుకోవాలని భావిస్తున్నారు.ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ అప్పగింతటెయిల్పాండ్ పనులకు సంబంధించిన మోడ ల్ స్టడీస్‌ను ఐఐటీ రూర్కీతో నీటిపారుదల శాఖ చేయించింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈతో ఈ డిజైన్లకు ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేందుకు ఎన్డీఎస్ఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీకి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషషన్ ఎదుట డాక్యుమెంట్ల దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినేట్స్ డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి.మూడు బ్యారేజీల వివరాలను వెంకటేశ్వర్లు కమిషన్‌కు అందించారు. కమిషన్ బహిరంగ విచారణలో మేడిగడ్డ బ్లాక్ సెవెన్ ఘటన ప్రస్తావనకు రాగా.. ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. అయితే నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డామేజ్ అయిందని, మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆదేశించారని వెంకటేశ్వర్లు తెలిపారు.బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. కాగా వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.ప్రభుత్వానికి చేరిన మెడిగడ్డ పై విచారణ విజిలెన్స్ రిపోర్ట్రిపోర్ట్ను పరిశీలిస్తున్న ప్రభుత్వంరెండు మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్న సర్కార్.అధికారుల తప్పిదాలు ఉన్నట్లు ఇప్పటికే తాత్కాలిక రిపోర్ట్విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన తరువాత ఐఎఎస్ అధికారులను పిలువనున్న కమిషన్ -
‘కాఫర్ డ్యామ్’ నిర్లక్ష్యం పాక్షికంగా నిజమే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. 2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది. సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి.. దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు. సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా? టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
జలాశయాల్లో ‘సికెంట్’ వినియోగించరు!
సాక్షి, హైదరాబాద్: ‘జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరు. సికెంట్ పైల్స్ డిజైన్ల తయారీకి ప్రత్యేక నిబంధనలూ లేవు. మేడిగడ్డ బరాజ్‌కి సికెంట్ పైల్స్ ఎందుకు వాడారు?’అని కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ ఎస్ఈ కె.ఎస్.ఎస్.చంద్రశేఖర్‌కు శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల డిజైన్లపై కమిషన్ కీలక ప్రశ్నలను సంధించింది. దేశంలో జలాశయాల నిర్మాణాల్లో సికెంట్ పైల్స్ వినియోగంపై అప్పట్లో తమ వద్ద సమాచారం లేదని చంద్రశేఖర్ బదులిచ్చారు. ఇన్ఫ్రా, సముద్రపు తీర ప్రాజెక్టుల్లో వీటిని వినియోగిస్తున్నారన్నారు. వీటి డిజైన్లకు మార్గదర్శకాలు లేకపోవడంతో బ్రిటిష్ కోడ్‌ను అనుసరించామన్నారు. సికెంట్ పైల్స్‌పై నిర్ణయం ఫీల్డ్ ఇంజనీర్లు, ఎల్‌అండ్‌టీదే.. మేడిగడ్డ బరాజ్ పునాదు (ర్యాఫ్ట్)ల కింద షీట్‌పైల్స్‌కి బదులు సికెంట్ పైల్స్‌తో కటాఫ్ వాల్ నిర్మించాలని ప్రాజెక్టు క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నిర్ణయం తీసుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాథమిక దశలో నాలుగు బోర్ రంధ్రాలు వేసి నిర్వహించిన మట్టి నమూనా పరీక్షల ఆధారంగా షీట్‌పైల్స్‌ను డిజైన్లలో ప్రతిపాదించామన్నారు. తర్వాత దశలో మరిన్ని బోర్ రంధ్రాలు వేసి పరీక్షలు నిర్వహించగా భూగర్భంలో కంకర మట్టి, ఇసుక రాళ్లు ఉన్నట్టు తేలడంతో షీట్‌పైల్స్‌ను వాడడం సాధ్యం కాదని క్షేత్ర స్థాయి ఇంజనీర్లు నివేదించారన్నారు. తాము ప్రత్యామ్నాయంగా డయాఫ్రమ్ వాల్కి డిజైన్లు ఇవ్వగా, క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు సికెంట్ పైల్స్ వేసేందుకు డిజైన్లు కోరారన్నారు. సరైన షూటింగ్ వెలాసిటీని పరిగణనలోకి తీసుకున్నారా సీడీఓ విభాగం సరైన డిజైన్లు ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రశేఖర్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా.. మేడిగడ్డ బరాజ్ నుంచి విడుదలయ్యే వరద వేగాన్ని (షూటింగ్ వెలాసిటీని) సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని, విడుదలైన వరద నేలను తాకే చోట మట్టికోతకు గురికాకుండా దిగువన సరిపడా నీటి నిల్వలతో టైల్‌పాండ్ ఉండాలనే ఆలోచన చేయలేదని కమిషన్ తప్పుబట్టగా, అందులో వాస్తవం లేదన్నారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా సరైన షూటింగ్ వెలాసిటీ, టైల్‌పాండ్ లెవల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నేల కోతకు గురై మేడిగడ్డ బరాజ్ కుంగిందని ఓ మోడల్ స్టడీలో తేలడంతో కమిషన్ ఈ కీలక ప్రశ్నను లేవనెత్తింది. అధిక షూటింగ్ వెలాసిటీ ఉండనుందని క్షేత్ర స్థాయి ఇంజనీర్ల నుంచి తమకు లెక్కలు అందలేదన్నారు. వ్యాప్కోస్ నివేదికలోని లెక్కల ఆధారంగా సరైన టైల్‌పాండ్ లెవల్‌తోనే డిజైన్లను తయారు చేశామన్నారు. డీపీఆర్‌లో నీటి నిల్వ సామర్థ్యం లేదు.. మేడిగడ్డ బరాజ్ డీపీఆర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సూచించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖర్ తెలిపారు. వ్యాప్కోస్ ఇచి్చన హైడ్రాలజికల్ డేటాను హైపవర్ కమిటీ ఆమోదించిందని, దాని ఆధారంగానే డిజైన్లను తయారు చేశామని వివరించారు. సీఈ సీడీఓ ఇచి్చన డిజైన్లకు నిర్మాణ దశలో చేసిన మార్పులు గుర్తు లేదన్నారు. క్షేత్ర స్థాయి ఇంజనీర్ల సూచనతో బరాజ్‌ల ర్యాఫ్ట్ డిజైన్లలో మార్పులు చేసిచ్చామన్నారు. నీటి నిల్వ సామర్థ్యంపై క్షేత్ర స్థాయి ఇంజనీర్లు ఏమైనా సూచనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, గుర్తు లేదన్నారు. 2డీ, 3డీ మోడల్ స్టడీస్ తర్వాత డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. -
మేడిగడ్డపై తుది నివేదిక కోసం విజిలెన్స్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన అంశాలపై లోతైన విచారణలో భాగంగా కీలక అధికారులను విచారించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు శనివారం నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరు..? మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు..? వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ఈఎన్సీ (ఓ అండ్ ఎం), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావును, 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజనీర్ టి.శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్‌శర్మను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు అందించగా...తుది నివేదికను సత్వరం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ విజిలెన్స్‌ను ఆదేశించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించగా..ఆ సంస్థ మరింత గడువును కోరినట్లు తెలిసింది. దాంతో ఈ నెలాఖరుకల్లా తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది. -
మీరు చెప్పింది అబద్ధం!
సాక్షి, హైదరాబాద్: ‘మీ సమాధానం పూర్తి అబద్ధం. నిజాలే చెప్తానని ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం ఇస్తారా? మేడిగడ్డ బరాజ్‌లోని 1, 2వ నంబర్ బ్లాకుల్లో ఆర్సీసీ కటాఫ్‌లు, 3–7 నంబర్ బ్లాకుల్లో సికెంట్ పైల్స్ వినియోగించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ సూచించినట్టు ఏవైనా డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా?’అని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు స్మార్ట్‌గా ఉంటే ఫర్వాలేదు.. ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. కమిషన్‌ను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణలో భాగంగా కమిషన్ శనివారం మూడున్నర గంటలపాటు నల్లా వెంకటేశ్వర్లుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 71 ప్రశ్నలను సంధించింది. తనకు ఆంగ్లంలో అంతగా ప్రావీణ్యం లేదని, మేడిగడ్డ నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగంపై అంతకుముందు ఇచ్చిన సమాధానాన్ని సరిదిద్దడానికి అవకాశం కలి్పంచాలని ఆయన కోరగా.. కమిషన్ తిరస్కరించింది. ఆంగ్లం రాకుండా ఈఎన్సీగా ఎలా పనిచేశారని మండిపడింది. తనకు జ్ఞాపకం ఉన్న వివరాలు చెప్పానని, అందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చంటూ వెంకటేశ్వర్లు క్షమాపణ కోరారు. తమ్మిడిహట్టి వద్దు అన్నది ప్రభుత్వ అధినేతనా? హైపవర్ కమిటీనా? తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చి బరాజ్ నిర్మించడానికి డీపీఆర్ తయారీ బాధ్యతను ఏప్రిల్ 2015లో వ్యాప్కోస్‌కు కట్టబెట్టినట్టు నల్లా వెంకటేశ్వర్లు కమిషన్‌కు తెలిపారు. లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా, ప్రభుత్వ అధినేతది అని బదులిచ్చారు. ఇలాంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్రశ్నించగా, మంత్రివర్గంలో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై చర్చ జరిగిందని బదులిచ్చారు. ‘2016 మార్చి 27న నాటి సీఎం (కేసీఆర్) నిర్వహించిన ఓ సమావేశంలో వ్యాప్కోస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ డీపీఆర్ సమర్పించారు. తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు లోకేషన్‌ను మార్చాలని డీపీఆర్‌లో వ్యాప్కోస్ ప్రతిపాదించింది. వ్యాప్కోస్ ప్రతిపాదనలను హైపవర్ కమిటీ ఆమోదించింది’అని వెంకటేశ్వర్లు చెప్పారు. లొకేషన్ మార్పుపై సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అంతకుముందు చెప్పారు కదా.. అని కమిషన్ నిలదీయగా, సీఎం రీఇంజనీరింగ్ చేయాలని సూచించారని మళ్లీ వివరణ ఇచ్చారు. వ్యాప్కోస్ ప్రతిపాదించిన ప్రాంతానికి 5.4 కి.మీ. దిగువన అన్నారం, 2.20 కి.మీ. దిగువన సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలన్న ప్రతిపాదనల ఆధారంగా హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మార్పులను హైపవర్ కమిటీ భేటీలో వ్యాప్కోస్ కూడా సమ్మతించిందని ఆయన పేర్కొనగా, దానికి రుజువులు ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించింది. సమావేశం మినిట్స్‌లో ఈ విషయం ఉన్నప్పటికీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన వ్యాప్కోస్ ప్రతినిధి దానిపై సంతకం చేయాల్సిన అవసరం లేదని ఆయన బదులివ్వగా.. కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. వ్యాప్కోస్ ఇచ్చిన కొలతలు, సాంకేతిక ప్రమాణాల ప్రకారమే బరాజ్‌లు నిర్మించారా? అన్న ప్రశ్నకు.. మేడిగడ్డ బరాజ్ గేట్ల సైజు మినహా ఇతర మార్పులేమీ చేయలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్ల సంఖ్యతోపాటు వాటి సైజుల్లో మార్పులను సీఈ సీడీఓ సూచించారన్నారు. నిర్మాణంలో డిజైన్లను వక్రీకరించాల్సి రావడంతో 2018, 2021లో రెండుసార్లు బరాజ్‌ల అంచనాలను సవరించినట్టు తెలిపారు. డిజైన్లలో లోపంతోనే... బరాజ్‌ల నిర్మాణం 2019 జూన్‌లో పూర్తికాగా, సెపె్టంబర్లో వచ్చిన వరదల్లో దెబ్బతినడానికి కారణాలేమిటి? అని కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌ల నుంచి విడుదలయ్యే వరద భీకర వేగంతో బయటకి దూసుకొచ్చి నేలను తాకే చోట నీటినిల్వలు లేకపోవడంతో ఆ వేగానికి అక్కడ ఉన్న లాంచింగ్ అప్రాన్ కొట్టుకుపోయి నష్టం జరిగిందని వెంకటేశ్వర్లు అన్నారు. నిల్వతో ఏర్పడే పీడనశక్తి విడుదలకి డిజైన్లలో సరైన పరిష్కారాలను చూపకపోవడంతోనే బరాజ్‌ల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి నష్టం జరిగిందని చెప్పారు. పంపింగ్ కోసం బరాజ్‌లో కనీస నిల్వలను నిర్వహించాల్సి రావడమూ ఒక కారణమన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ‘జెడ్’ఆకృతి షీట్‌పైల్స్‌కి బదులు సికెంట్ పైల్స్‌ను వాడాలని ఎన్ఐటీ–వరంగల్‌తోపాటు ఐఐటీ–చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ సిఫారసు చేశారన్నారు. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదు
-
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియో వైరల్.. కేసు నమోదు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. -
మేడిగడ్డ కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపణలు చేశారు. ‘లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న బరాజ్.. సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్‌లో కుంగిపోయింది. భవిష్యత్తులో బరాజ్‌కు ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ కుట్ర అని భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్‌ను వారు ఏమైనా చేయగలరు’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో కేటీఆర్ శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సీఎం సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి చేస్తున్న వ్యవహారాలను సరైన సందర్భంలో బయటపెడతాం. ఉదయసింహ, ఫహీమ్ ఖురేíÙ, అజిత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు. ఎక్కడేం జరుగుతోందో మాకన్నీ తెలుసు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డుపెట్టుకొని నీళ్లు ఎత్తిపోయడం లేదు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీజేపీ ఒకే వైఖరితో ఉన్నాయి. బీజేపీ చెప్పినట్లుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నడుచుకుంటున్నారు. పోలవరం కాఫర్‌డాం కొట్టుకుపోయినప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక ఏమైంది? భేషజాలకు వెళ్లకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుంటే ఆగస్టు 2 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన? ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళనకు రూ. 1.50 లక్షల కోట్లు ప్రతిపాదిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చాలని ఎంఐఎం ఒత్తిడి చేసినందునే పాతబస్తీలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఎల్ అండ్ టీ తీరుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సందేశం వెళ్తుందని చెప్పారు. భూసేకరణలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ ప్రతిపాదించామని కేటీఆర్ చెప్పారు.షావలీ దర్గాపై గత ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు భిన్నంగా రేవంత్ వెళతారా? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి వివిధ పథకాలకు, పనులకు పేర్లు మార్చే పిచ్చి ఉందని, హైడ్రా కూడా అందులో భాగమేనన్నారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదన్నారు.ఎనిమిది సీట్లు ఇస్తే ఏమిచ్చారు..? తెలంగాణ ప్రజలు బీజేపీని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో గెలిపించినా రాష్ట్రానికి మాత్రం ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘బీజేపీకి అత్యంత క్లిష్టమైన సమయంలో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోరైలు విస్తరణకు నయాపైసా ఇవ్వలేదు’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇది ఎన్డీఎస్ఏ ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటిని నిల్వ చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని..వారికంటే కేటీఆర్‌కు కొద్దిగా ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్టుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత నిపుణులైన ఆరుగురితో ఎన్డీఎస్ఏ ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, వారి సూచనల ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోవాలా? కేటీఆర్ చెప్పినట్టు పోవాలా? అని ప్రశ్నించారు.నీరు ఉన్నా పంపింగ్ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్ తన పేరును జోసెఫ్ గోబెల్స్‌గా మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో శుకవ్రారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలి్టమేటం జారీ చేయడంపై స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపింగ్ సాధ్యం కాదు పంపింగ్ చేయాలంటే అన్నారం బరాజ్‌లో కనీసం 11 మీటర్లు, సుందిళ్ల బరాజ్‌లో కనీసం 9 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉండాలని, రెండు బరాజ్‌లలో 5 మీటర్ల నీటిమట్టంలోపే బుంగలు పడి ఉండడంతో పంపింగ్ సాధ్యం కాదని ఉత్తమ్ స్పష్టం చేశారు. బరాజ్‌ల గేట్లు దింపి పంప్‌హౌస్‌ల ద్వారా వాటిలోకి నీరుఎత్తిపోస్తే అవి కొట్టుకుపోతాయని, కేటీఆర్ అదే కోరుకుంటున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బరాజ్‌లు కొట్టుకుపోతే భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుందన్నారు.దిగువ ఉన్న సమ్మక్క బరాజ్, సీతమ్మసాగర్ బరాజ్‌లూ కొట్టుకుపోతాయని, భద్రాచలం, ఏటూరునాగారంతో పటు 44 గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని తెలిపారు. నీళ్లు మళ్లించడానికి తక్కువ నిల్వ సామర్థ్యంతో బరాజ్‌లు నిర్మిస్తారని, ఏకంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారని తప్పుబట్టారు. ప్లానింగ్, డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని.. ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచి్చందని గుర్తు చేశారు. కేటీఆర్, కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి కమీషన్ల కక్కుర్తితో రీఇంజనీరింగ్ చేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.1.47లక్షల కోట్లకు వ్యయం పెరుగుతందని కాగ్ తేల్చిందన్నారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థికభారం మోపినందుకుగాను మీరు, మీ తండ్రి కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 2 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ బరాజ్‌లు మినహా కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగిలిన భాగాల ను వాడుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రామడుగు, అనంతగిరి, ఇమామాబా ద్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు ఎగువ మానేరుకు సైతం ఎల్లంపల్లి నీటినే తరలిస్తామని చెప్పారు. ఎల్లంపల్లిలో 14 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను పంపింగ్ చేస్తామన్నారు. శ్రీరాంసాగర్ నిండిన వెంటనేనీళ్లను ఎత్తిపోస్తామన్నారు. విహార యాత్రలకు బీఆర్ఎస్ నేతలు: జీవన్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించగా, వారి హయాంలోనే కుంగిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ ఘటన వెనక అనుమానాలున్నాయని కేటీఆర్ అనడాన్ని తప్పుబట్టారు. విహార యాత్రల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారని విమర్శించారు. -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ
-
మేడిగడ్డకు ‘పరీక్ష’ కాలం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనకు కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి నిర్వహిస్తున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు(ఇన్వెస్టిగేషన్లు) అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిలిపివేయాల్సి వచి్చందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలపగా, ఇతర సమస్యలు ఉత్పన్నం కావడంతోనే పరీక్షలను ఆపామని మరో అధికారి వివరించారు. బరాజ్‌కు పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో సమావేశం కానుంది. శాశ్వత మరమ్మతులకు ఇన్వెస్టిగేషన్లే కీలకం గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. బ్లాకులోని 19, 20, 21వ పియర్లతోపాటుగా 20వ పియర్పైన ఉన్న శ్లాబు, పారాపెట్ వాల్స్, రోడ్డు బ్రిడ్జికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు పడి నీరు లీకైన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మూడు బరాజ్‌లను పరిశీలించి గతంలో మధ్యంతర నివేదిక సమరి్పంచింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి దారితీసిన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పటిష్టతను పరీక్షించడానికి వాటికి సైతం ఈ పరీక్షలు జరపాలని కోరింది. వాటి ఆధారంగానే శాశ్వత మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ పరీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించిన తర్వాతే మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు నిర్వహించాల్సిన శాశ్వత మరమ్మతులపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమరి్పంచనుంది. మేడిగడ్డ బరాజ్‌కు పరీక్షలు మధ్యంతరంగా ఆగిపోవడంతో కమిటీ తుది నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మాత్రం పరీక్షలు కొనసాగుతున్నాయని, మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని వేర్వేరు దశల్లో ఉన్నాయని, వర్షాలు పూర్తిగా నిలిచిన తర్వాతే వాటిని మళ్లీ పునరుద్ధరించడానికి ఆస్కారముంటుందని స్పష్టం చేస్తున్నాయి. అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తిచేశాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణుల బృందానికి నీటిపారుదలశాఖ తెలియజేసింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు ఇంకా పూర్తికావాల్సి ఉందని పేర్కొంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) బి.నాగేందర్రావు, రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి శుక్రవారం జలసౌధలో ఎన్డీఎస్ఏతో పాటు సెంట్రల్ వాటర్ అండర్ పవర్ రిసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్) ప్రతినిధులు అమితాబ్ మీనా, మనీష్గుప్తా, డాక్టర్ మందిరతో సమావేశమై మధ్యంతర నివేదిక అమలులో పురోగతిని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు.ఈ బృందం త్వరలో ఢిల్లీలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశమై వారికి తెలియజేయనుంది. దీని ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుంది. -
మేడిగడ్డలో రింగ్‌బండ్ తొలగింపు
కాళేశ్వరం: జయ«శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 7వ బ్లాక్ చుట్టూ వేసిన రింగ్‌బండ్‌ను తొలగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతేడాది అక్టోబర్ 21న బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు పగుళ్లు తేలి వంతెనతో పాటు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ సూచన మేరకు గ్రౌటింగ్, ఇసుక తొలగింపు, షీట్‌ఫైల్స్ అమరిక తదితర మరమ్మతులకు వీలుగా, 7వ బ్లాక్‌లోకి వరద చేరకుండా దానిచుట్టూ రింగ్‌బండ్ నిర్మించారు. అయితే వారం రోజులుగా ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రింగ్‌బండ్‌ను తొలగించాలనే నిర్ణయానికొచ్చారు. రింగ్‌బండ్‌ను పొక్లెయినర్లతో తవ్వించి టిప్పర్ల ద్వారా మెటీరియల్‌ను బయటకు తరలిస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో గోదావరిలో ఉన్న రోడ్లను సైతం తొలగిస్తున్నారు. నిర్మాణ సంస్థకు సంబంధించిన వాహనాలు, మెటీరియల్‌ను పైకి తీసుకువెళ్తున్నారు.ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ప్రాణహిత ద్వారా 16 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులను వివరణ అడగ్గా..మళ్లీ కుంగిందని, బొరియలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయని, కానీ అలాంటిదేమీ లేదని చెప్పారు. వర్షాలతో వరద నీరు రావడం వల్లే రింగ్‌బండ్ తొలగింపు పనులు చేపడుతున్నామని వివరించారు. -
మేడిగడ్డలో సిరుల మేట!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్‌లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్ఎస్సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. వెలికితీతకు 18–24 నెలల గడువు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్ఎస్సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్మెంట్ టెండర్’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది. అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం! మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్ఎస్సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్ఎస్సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్ఎస్సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
మరో రెండు గేట్లు పైకి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు చెందిన మరో రెండు రేడియల్ గేట్లను ఇంజనీరింగ్ అధికారులు గురువారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో 21న మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగి, పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. గత నెల 17న 15వ పియర్‌లోని రేడియల్ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, 20వ పియర్ ముందు బొరియలు ఏర్పడి భారీ శబ్ధం, ధ్వనులు వినిపించాయి. దీంతో బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 6న 7వ బ్లాక్‌లోని 16, 17 రేడియల్ గేట్లను బలంగా పైకి ఎత్తారు. 8వ తేదీన అదే బ్లాక్‌లోని 22వ రేడియల్ గేటును ఎత్తారు. గురువారం 18, 19 గేట్లను 100.50 మీటర్ల మేర ఎత్తారు. దీంతో ఈ బ్లాక్‌లోని మొత్తం 8 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తినట్టయ్యింది. గేట్ల కటింగ్ పనులు వేగవంతం: ప్రాజెక్టులోని 19, 20, 21 గేట్ల కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20వ గేటును కట్ చేసి విడిభాగాలు తొలగించి, బయటకు తీసుకెళ్లేందుకు వీలుగా చేశారు. ఆ గేట్ల వద్ద ఉన్న కేబుల్స్, ఇతర పరి కరాలు తొలగించడానికి సమ యం పట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా 7వ బ్లాక్‌లో షీట్‌ఫైల్స్ పనుల్లో వేగం పెంచారు. చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను సరైన స్థానంలో అమర్చుతున్నారు. మంత్రి ఉత్తమ్ పర్యటన అనంతరం మరమ్మతుల్లో వేగం పెరిగిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అటు అన్నారంలో బోర్‌తో డ్రిల్లింగ్ వేసి రంధ్రాలు చేస్తున్నారు. 25 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా కింద మట్టి దృఢంగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది. -
మేడిగడ్డలో మరో గేటు ఎత్తారు
కాళేశ్వరం(జయశంకర్భూపాలపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీలో మరో గేటును ఇంజనీరింగ్ అధికారులు శనివారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు గత నెల 17న 15వ గేటును పైకి ఎత్తినప్పుడు 7వ బ్లాక్‌లో 20వ పియర్ ముందు గొయ్యి ఏర్పడి భారీ శబ్దాలు వచ్చాయి.దీంతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు జరిపి బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల శుక్రవారం 7వ బ్లాక్‌లోని 16, 17 గేట్లను పైకి ఎత్తారు. శనివారం అదే బ్లాక్‌లోని 22వ గేటును పైకి ఎత్తినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 19, 20, 21 గేట్లను ఎత్తే పరిస్థితి లేకపోవడంతో కట్ చేసి తొలగించే పనులు జరుగుతున్నాయి. -
రిపేర్ల తర్వాతే మేడిగడ్డలో నీటి నిల్వ: మంత్రి ఉత్తమ్
సాక్షి, పెద్దపల్లి: సుందిళ్ల, అన్నారం, మేడిగ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం(జూన్7) మేడిగడ్డ బ్యారేజీని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి పరిశీలించారు. అనంతరం అక్కడి ఎల్అండ్టీ గెస్ట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిర్మాణం మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు రిపేర్ చేస్తున్నాం. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీలు లేదని ఎన్డీఎస్ఏ సూచించింది. వర్షాకాలం వచ్చినందున మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. తుమ్మిడి హట్టి దగ్గర కొత్త బ్యారేజి నిర్మిస్తాంబీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగింది. రూ.94 వేల కోట్లప్రాజెక్టు కుంగిపోయింది. దాని కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం. ఎన్నికల కోడ్ వల్ల మరమ్మతుల రివ్యూకు రాలేకపోయాం. అందుకే ఇప్పుడు వచ్చి పరిశీలించా’ అని ఉత్తమ్ తెలిపారు. -
కాళేశ్వరంలో నీటినిల్వకు సన్నద్ధం!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు సీసీ బ్లాక్‌లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్ వెంట్ వద్ద గ్రౌటింగ్ ద్వారా నింపుతున్నారు.వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన పియర్లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక, షీట్‌ఫైల్స్ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి సొంతంగా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. మేడిగడ్డలో ఎంతో కొంత నీళ్లు నింపి, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పంపినా.. అవి ఉంటాయో, ఊడుతాయో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక సైతం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు ‘80 వేల పుస్తకాలు చదివి, సొంత తెలివితేటలతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. అల్లుడు హరీశ్‌రావు వరల్డ్ రికార్డు కోసం ఆగమాగం పనులు చేశాడు. ఇప్పుడు అది కూలింది. మేడిగడ్డలో కూలిన బ్లాక్‌ను సరిచేసి నీళ్లు నిలిపితే, ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు. ఒకవేళ రెండున్నర మీటర్లలో మేడిగడ్డ నింపి అన్నారం, సుందిళ్లకు నీటిని పంపితే వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద నీరు, ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నుంచే కిందికి పోవాలి. ఇప్పటికే 52 టీఎంసీల ఎత్తిన నీళ్లు కిందకు పోయాయి. సముద్రంలోకి పోయిన నీటికి కరెంట్ బిల్లులు కట్టాం. 80 వేల పుస్తకాలు చదివిన తెలివి అట్లుంది. కాళేశ్వరం సమస్య.. 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చిన సమస్య లాంటిది కాదు. విరిగింది వెన్నెముక. మేడిగడ్డ పునరుద్ధరణ అంశంపై ఇప్పటికే మూడు కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన సిఫారసుల మేరకు ముందుకు వెళతాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది. ఇక్కడి తప్పిదాలకు ఎవరు బాధ్యులో అది తేలుస్తుంది. ఇది కాకుండా అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎస్కలేషన్ ఎంత..ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంపై విచారణ మొదలు పెడితే అది ఇక్కడితో ఆగదు. మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. అంచనాల పెంపులో అవకతవకలను విచారిస్తూ పోతే ఏ ప్రాజెక్టూ ముందుకు పోదు. ప్రభుత్వం కూడా పనులు చేయించలేదు. బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ పనులు కొనసాగిస్తే విచారణకు ఆదేశించాక కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని మీడియానే రాస్తుంది. అందుకే అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు. మేడిగడ్డ అంశం తేలాక దానిపై ఆలోచిస్తాం..’ అని సీఎం వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ‘రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో నేనేమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు నాకు కానీ, పారీ్టకి కానీ దక్కే ప్రయోజనం ఏంటి? ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతోంది. విచారణలో నిందితులు చెబుతున్న అంశాలు నేను కూడా పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నా. ప్రతి చిన్న అంశంపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మా ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ వంటి వెధవ పనులు చేయడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ పోలీసుల బదిలీలు జరగలేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కరెంట్ కోతల్లేవు..అంతరాయం మాత్రమే ‘రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతల్లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి తప్పితే ఎక్కడా కోతలు లేవు. తెలంగాణ రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీకి ఇచ్చాం. ఆయన దానికి కీరవాణితో సంగీతం సమకూర్చుకుంటారో, మరొకరితోనో అనేది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూదనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే కొత్త చిహ్నం ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా – సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహ్వానించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
శరవేగంగా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ
-
మేడిగడ్డ కింద అగాధం!
సాక్షి, హైదరాబాద్/ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ దిగువన అగాధం బయటపడింది. కుంగిపోయిన ఏడో బ్లాకులోని 20వ పియర్ ముందు భాగంలో గురువారం పెద్ద గొయ్యి ఏర్పడింది. అది బొరియలా బ్యారేజీ కింది వరకు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ గొయ్యి నుంచి నీటి ఊట ఏర్పడి దిగువకు ప్రవహిస్తోంది. గతంలో వరదల సందర్భంగా బ్యారేజీ పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి.. ఒక చివరి నుంచి మరో చివరి వరకు సొరంగంలా అగా ధం ఏర్పడి ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు.దానికి సంబంధించి గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆరీ్ట) పరీక్షలు చేశారు. వాటి ఆధారంగా బ్యారేజీ కింద 12 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో అగాధం ఉండి ఉంటుందనే భావనకు వచ్చారు. ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి దానికి సంబంధించినదేనని చెప్తున్నారు. అగాధంతోనే బ్యారేజీ కుంగిపోయి.. గతేడాది అక్టోబర్ 21న భారీ శబ్ధంతో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు కుంగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమి టీని ఏర్పాటు చేసింది. బ్యారేజీని పరిశీలించిన కమిటీ.. 2019 వరదల సమయంలోనే బ్యారేజీలో సమస్యలు తలెత్తాయని.. మరమ్మతులు నిర్వహించకపోవడంతో పరిస్థితి దిగజారిందని తమ మధ్యంతర నివేదికలో పేర్కొంది. 2019 జూన్‌లోనే సమస్య ఏర్పడినా, బ్యారేజీలో పూర్తి నీటి నిల్వను కొనసాగించారని.. ఈ క్రమంలో బ్యారేజీపై ఒత్తిడి పెరిగి పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయిందని తెలిపింది.బ్యారేజీకి సంబంధించి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలని సూచించింది. పలు రకాల పరీక్షలు చేసిన నిపుణులు.. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోయి భారీ అగాధం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. తాజాగా బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం దీన్ని ధ్రువపరుస్తోందని అంటున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తే.. ఈ అగాధం ఏమేర ఉందనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొరాయించిన గేట్లు ఎత్తే క్రమంలో.. గత ఏడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే బ్యారేజీలోని 85 గేట్లకుగాను 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. కుంగిన బ్లాకులోని 15వ నంబర్ నుంచి 22వ నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. వాటిని అలాగే వదిలేశారు. వానాకాలం వస్తుండటంతో నీటి ప్రవాహం మొత్తంగా కిందికి వెళ్లేలా.. అన్ని గేట్లను ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవలి నివేదికలో పేర్కొంది. కుంగిన, పగుళ్లు ఏర్పడిన పియర్ల మధ్య ఉన్న గేట్లను కూడా జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. దీంతో ఈ నెల 15న 15వ గేటును ఎత్తారు. గురువారం 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయతి్నంచగా.. బ్యారే జీ కింది నుంచి భారీ శబ్ధా్దలు, ప్రకంపనలు వచ్చా యి. దాంతో గేట్లు ఎత్తే ప్రయత్నాలను నిలిపేశారు. వేగంగా అత్యవసర మరమ్మతులు నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు బ్యారేజీ వద్ద అత్యవసర మరమ్మతులు కొనసాగుతున్నాయి. బ్యారేజీ ఎగువన గేట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌లను క్రేన్ సాయంతో సరిదిద్దుతున్నారు. అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నారు. షీట్‌ఫైల్స్ కూడా బ్యారేజీ వద్దకు చేరుకున్నాయని, వాటిని అమర్చే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం, మరమ్మతుల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. పునాదులకు బోర్ డ్రిల్లింగ్.. మేడిగడ్డ బ్యారేజీ కింద అగాధం ఉన్నట్టు తేలడంతో.. బ్యారేజీ ర్యాఫ్ట్ (పునాది)కు బోర్ హోల్ డ్రిల్లింగ్ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఆ రంధ్రం ద్వారా గ్రౌటింగ్ (సిమెంట్, ఇసుక మిశ్రమం నింపడం) చేయనున్నారు. కుంగిన 7వ బ్లాక్‌లోని 21వ పియర్ ముందు కూడా డ్రిల్లింగ్ ప్రారంభించారు. దానిద్వారా జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను కొనసాగించనున్నారుఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల అమలుపై నేడు భేటీ కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సుల అమలుకు చర్యలు మొదలయ్యాయి. దీనిపై ఈఎన్సీ (జనరల్) చైర్మన్‌గా నలుగురు అధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం శనివారం జలసౌధలో జరగనుంది. బ్యారేజీల రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక చర్యలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. -
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
కాళేశ్వరం బ్యారేజీలకు శాస్త్రవేత్తల బృందం
కాళేశ్వరం/ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనంలో భాగంగా పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) శాస్త్రవేత్తలు రాష్ట్రానికి చేరుకున్నారు. జేఎస్ ఎడ్లబడ్కార్ (జియో టెక్నికల్ పరీక్షల నిపుణుడు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్ పాలీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నిపుణుడు)తో కూడిన బృందం బుధవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజనీర్లతో కలసి ఈ బృందం పరీక్షలు నిర్వహించింది. బృందం సభ్యులు ముందుగా మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైన కాలినడకన వెళ్లి పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్ 21న కుంగిన 7వ బ్లాక్‌లోని పియర్‌ను, అడుగు భాగం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. కుంగుబాటుకు గల కారణాలను సీఈని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు చేసిన పరీక్షల వివరాలను అడిగారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహ ప్రాంతాల్లో తిరిగారు. కుంగిన పియర్లు, క్రస్టుగేట్లు, అక్కడి పరిసరాలను ఫొటోలు తీసుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో 15 నుంచి 21వ పియర్ వరకు ఉన్న ఇసుక మేటలు, గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. గంటపాటు మేడిగడ్డను పరిశీలించిన అనంతరం అన్నారం బ్యారేజీకి వెళ్లారు. అక్కడ సీఈ, ఈఈ యాదగిరిలు వారికి బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీ బుంగలు, చేపట్టిన మరమ్మతుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్‌లో చేస్తున్న సీసీ బ్లాక్ పనులను చూశారు. ఎగువన ఇసుక మేటలను చూసి త్వరగా వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ బృందం గురువారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనుంది. మూడు కేంద్ర సంస్థలతో పరీక్షలు.. కాగా, బృందం పర్యవేక్షణలో బ్యారేజీలకు జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో పాటు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే శాశ్వత మరమ్మతులను నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది.దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను ఇప్పటికే ప్రారంభించగా, త్వరలో ఎన్జీఆర్ఐ, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థల నుంచి సైతం శాస్త్రవేత్తలు పని ప్రారంభిస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో వేర్వేరుగా ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం అవి సమర్పించే నివేదికల ఆధారంగా మరమ్మతులు నిర్వహించాలని సోమవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండిమేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు!బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరుమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను సూచిస్తూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా మధ్యంతర నివేదిక సమర్పించినా.. మరమ్మతులు తక్షణమే ప్రారంభమయ్యే సూచన లు కనిపించడం లేదు. వానాకాలం ప్రారంభానికి నెల రోజులే మిగిలి ఉండగా, ఆలోగా అయ్యర్ కమిటీ సిఫారసు చేసిన తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌కు నిర్వహించే మరమ్మతులు తాత్కాలికమేని, మళ్లీ ఏదైనా జరగదని గ్యారెంటీ ఇవ్వలేమని అయ్యర్ కమిటీ తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికపై అధ్యయనం కోసం నీటి పారుదల శాఖలోని ఇంజనీర్లతో ఓ కమిటీని వేయా లని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలకు మరమ్మతుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయ్యర్ కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్నింటిని మాత్రమే వానాకాలం ప్రారంభానికి ముందు అమలు చేసేందుకు అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ సూచించిన పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను తయారు చేసి ఆమోదం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలోగా వర్షాకాలం ప్రారంభం అవుతుందని చెపుతున్నాయి. అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాతే బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను నిర్వహి స్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యంపై అయ్యర్ కమిటీ ప్రశ్నలు రేకెత్తించిన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందనే భావనతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. కాగా, మరో వారం రోజులు గడిచిన తర్వాతే మరమ్మతులు చేపట్టే అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్‌మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
7న మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్!
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 7న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. గతేడాది అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని లోపాలపై విచారణకోసం ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 6 నుంచి 12 వరకు రాష్ట్రంలో రెండో విడత పర్యటన నిర్వహించనుంది. 6న హైదరాబాద్‌కు చేరుకుని సాయంత్రం 5 గంటలకు బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జస్టిస్ చంద్రఘోష్, నీటిపారుదల శాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు. మరుసటి రోజు ఉదయం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరనున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన రాత్రి రామగుండంలో బస చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీకి మాత్రమే భారీ నష్టం జరగడంతో ప్రస్తుతానికి ఈ బ్యారేజీని మాత్రమే సందర్శించాలని జస్టిస్ చంద్రఘోష్ నిర్ణయించారు. 8న ఉదయం ఆయన రామగుండం నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వీలైతే దగ్గరల్లో ఉన్న అన్నారం బ్యారేజీని తొలుత సందర్శించి తర్వాత హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. 9న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై న్యాయవిచారణలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 10, 11 తేదీలను జస్టిస్ పీసీ చంద్రఘోష్ రిజర్వ్ చేశారు. 12న ఆయన తిరిగి కోల్‌కతాకు బయలు దేరి వెళ్లనున్నారు. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో చోటుచేసు కున్న నిర్లక్ష్యం, అక్రమాలు, లోపా లు, అవినీతి, ప్రజాధనం దుర్విని యోగంపై న్యాయ విచారణ జరప డానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ మూర్తి జస్టిస్ పీసీ చంద్రఘోష్‌ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. -
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్‌కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
అవసరమైతే అందరికీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నిర్మాణ సంస్థ లు, అధికారులకు అవసరమైతే త్వరలోనే నోటీసు లు జారీ చేస్తామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. అవసరమైతే ప్రజాప్రతినిధులను పిలి పించి బ్యారేజీల నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాల్లో వారి పాత్రను తెలుసుకుంటామన్నారు. కాళేశ్వరం బ్యారే జీల నిర్మాణంపై న్యాయ విచారణను ప్రారంభించిన సందర్భంగా గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును విచారిస్తారా? అని ప్రశ్నించగా.. కేసీఆర్ పేరును ప్ర స్తావించకుండా జస్టిస్ ఘోష్ పైవిధంగా బదులిచ్చా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే పత్రిక ల్లో బహిరంగ ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నాకే విచారణ ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ నివేదికలు, విజిలెన్స్ దర్యాప్తు నివే దికలు, కాగ్ ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లతో పాటు ఎన్డీఎస్ఏ నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. న్యాయపరమైన అంశాలకు లోబడే.. వ్యక్తుల ముఖాలు చూసి కా కుండా న్యాయపరమైన అంశాలకు లోబడే విచారణ ఉంటుందని జíస్టిస్ ఘోష్ పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విచారణ కొనసాగుతుందని, ఏవైనా పొరపాట్లు జరిగితే కోర్టులు స్టే విధించే అవకాశం ఉంటుందని తెలిపా రు. బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని చెప్పారు. రెండో పర్యాయం రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు బ్యారేజీలను సందర్శిస్తానని వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన జారీ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో లోపాల పై న్యాయ విచారణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం గురువారం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేసింది. బ్యారేజీల నిర్మాణంలో చో టుచేసుకున్న లోపాలు, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసి బాధ్యులను గుర్తించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసినట్టు తెలిపింది. సాక్ష్యాధారాలు తప్పనిసరి: ప్రజలు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో పాటు నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సీల్డ్ కవర్లో మే 31లోగా బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెల్లో వేయాలని ప్రకటన సూచించింది. పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులను పంపవచ్చని తెలిపింది. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా అఫిడవిట్ పొందుపర్చని ఫిర్యాదులను తిరస్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. -
8న ‘కాళేశ్వరం’పై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో వాదనలను సోమవారం(ఈనెల 8న) వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పిటిషన్ల తరఫు న్యాయవాదులకు చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు.. పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఎఓ)తో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి. మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు బట్టబయలవుతాయి. నవంబర్ 1న నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు చేపట్టేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వాలి’అని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు(4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పండి సీబీఐకి అప్పగించే విషయం, పిటిషనర్ల వాదనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఏఏజీ.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పార్టీ ఇన్ పర్సన్ (అతనే వాదనలు వినిపిస్తారు)గా కేఏ పాల్ వాదిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రభు త్వ వాదన కూడా వినాల్సి ఉన్నందున ఉత్త ర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. తమ వాదనలు వినాలని పాల్, ఇతర పిటి షనర్ల లాయర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. వ్యాజ్యాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. గతేడాది ఎన్డీఎస్ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికను గత నెల విచారణ సందర్భంగా ప్రభుత్వం.. ధర్మాసనం ముందు ఉంచింది. -
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
తెలంగాణలో రెండో రోజు NDSA బృందం పర్యటన
-
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
మేడిగడ్డపై ఏర్పాటైన కమిటీ..రిపేర్ పనులు ఆపిన కాంగ్రెస్
-
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
ఎన్డీఎస్ఏ చెప్పిందే వింటాం
సాక్షి, హైదరాబాద్: ‘మెడిగడ్డ బ్యారేజీలోని ఒక్క పిల్లర్ కుంగితేనే ఇంత రాద్దాంతమా?’అంటూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతూ మాట్లాడటం దురదృష్టకరమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏ నిపుణుల కమిటీ సూచనలనే పాటిస్తుందని, బీఆర్ఎస్ నేతల మాటలకు విలువ లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన కోసం ఈ నెల 6న నిపుణుల కమిటీ రానుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎన్డీఎస్ఏ నిపుణులు పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించారని, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ మళ్లీ నీటితో నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ.. ఇలా అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడంతో రూ. 94 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యల్లో చిక్కుకుందన్నారు. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్‌రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్‌ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్‌ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్‌తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
మేడిగడ్డ పగుళ్ళను చూసి ఖంగుతిన్న BRS నాయకులు
-
కాళేశ్వరంపై కుట్ర
అన్నారం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి/ సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్/ దామెర/ జనగామ: రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి మొత్తం కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతోందనే అనుమానాలు కలుగుతున్నా యని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ప్రకటన, గతంలో రేవంత్ బాంబులు పెట్టి ప్రగతిభవన్ పడగొడతానన్న మాటలు తమ అనుమానాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్దకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కూడిన రెండు వందల మంది బృందం మిగతా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ‘చలో మేడిగడ్డ’పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ రైతుల విషాదగాధలు తెలిసిన కేసీఆర్.. వృథాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రోజుకో సంఖ్య చెప్తున్నారు. రేవంత్ సాంగత్యంతో ఉత్తమ్ కూడా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్ర తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి. రేవంత్.. మీరు తెలంగాణ ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇప్పుడు సీఎంగానైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోకండి. మేడిగడ్డ బ్యారేజీని ధ్వంసం చేయకండి. కావాలంటే ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మమ్మల్ని ఎంతైనా హింసించండి. కానీ ప్రాజెక్టును, రైతులను కాపాడండి. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సమస్యనో.. ఎన్నికలు, ఓట్ల సమస్యనో కాదు. ఇది లక్షలాది తెలంగాణ రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ల స్థాయిలో ఉన్న సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేసి మిగతా పిల్లర్లకు విస్తరించేలా చేయకండి. అలాంటిదేమన్నా జరిగి మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే.. దానికి పూర్తి బాధ్యత రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారుదే. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం.. కాంగ్రెస్ నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు సమస్యలను లేవనెత్తితే పరిష్కారం చూపకుండా.. పోటీసభలు, పర్యటనలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దంటూ బీఆర్ఎస్ నల్లగొండ సభ పెడితే.. కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లి హడావుడి చేశారు. కుంగిన రెండు, మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి కాళేశ్వరం పట్ల అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. నేడు కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’కు పిలుపునిస్తే.. ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు పాలమూరు–రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికైనా పనులు చేపట్టాలి.. 2022లో వచ్చిన భారీ వరదలతో కన్నెపల్లి, అన్నారం పంపుహౌజులు మునిగితే.. యుద్ధప్రాతిపాదికన ఏజెన్సీ ఖర్చులతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించాం. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇక్కడిదాకా వచ్చాం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు. చిన్న సమస్యలుంటే వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. దానిలోకి 34 స్ట్రీమ్లతోపాటు మానేరు నీళ్లు కూడా వస్తాయి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేస్తూనే.. అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడిగడ్డ ఒక కాంపోనెట్ మాత్రమే..: కడియం శ్రీహరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంపుసెట్లు, రిజర్వాయర్లలో (కాంపోనెట్ల)లో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. ‘‘మొత్తం 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు.. 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం.. 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత అంచనాలతో పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ 30 ఏళ్లు, ఎస్సారెస్పీ స్టేజ్ –1, స్టేజ్–2లు 40 ఏళ్లు దాటితే గానీ పూర్తి కాలేదు. వాటి అంచనా వ్యయం 10–20రెట్లు పెరిగింది. ఇప్పటివరకు కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాలు, ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు సమకూరింది. ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2, నిజాంసాగర్ల నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు, 17,08,230 ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయి. తుమ్మిడిహట్టి బ్యారేజీ కడితే చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం, మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపు ఉండంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది..’’అని వివరించారు. ఉద్రిక్తంగా.. ఉద్విగ్నంగా.. బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’పర్యటన ఆద్యంతం ఉద్విగ్నంగా, ఉద్రిక్తంగా సాగింది. ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన నేతలకు పర్యటన పొడవునా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మధ్యలో కాన్వాయ్‌లో చేరుతూ ముందుకు సాగారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట సమీపంలో బీఆర్ఎస్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని నిలువరించారు. తర్వాత ఇదే జిల్లా దామెర మండలంలో ఆగిన కేటీఆర్.. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. ‘‘జై తెలంగాణ అంటే పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది దారుణం బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి..’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు భూపాలపల్లిలోని కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి.. మేడారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం కొందరినే అనుమతించడంతో.. బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా.. మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందం కాన్వాయ్‌లోని ఓ బస్సు టైరు జనగామ పరిధి నెల్లుట్ల–యశ్వంతాపూర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పేలింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపేయడం ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ‘చలో మేడిగడ్డ’ ప్రభుత్వ బాధ్యత మరిచి ప్రాజెక్టులపై రాజకీయాలు చేస్తోంది: కేటీఆర్ పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకే ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం పర్యటనకు బయలుదేరే ముందు తెలంగాణభవన్‌లో, తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘కాళేశ్వరంపై అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులోని ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సొరంగాలు, కాలువల వద్ద పర్యటిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన ఒక మేడిగడ్డ బ్యారేజీలోని మూడు పిల్లర్లలో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్ల రూపాయలు వృధా అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ ప్రచారం చేస్తోంది. బ్యారేజీకి మరమ్మతు చేసి సాగునీరు ఇవ్వాలనే బాధ్యతను మరచి రాజకీయాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండకుండా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కు..’’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు కూలిపోవాలనే కుతంత్రం ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులను పరిరక్షించడానికి బదులు అవి కూలిపోవాలని కాంగ్రెస్ కుతంత్రాలు పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరమ్మతులు కూడా చేతకాని గుంపుమేస్త్రిని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే. దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించబోం. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం’’అని కేటీఆర్ హెచ్చరించారు. కాగా.. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే సరిదిద్దుకోవాలే తప్ప రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
చిల్లర మాటలు, చిల్లర విమర్శలు మానుకోండి
-
ఛలో మేడిగడ్డ: కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పడానికే తమ పార్టీ ఛలో మేడిగడ్డ పర్యటన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఛలో మేడిగడ్డకు బయలుదేరుతూ శుక్రవారం ఉదయం కేటీఆర్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని విమర్శించారు. ఛలో మేడిగడ్డ పర్యటన మొదటిది మాత్రమేనని, దీని తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామని చెప్పారు. కావాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఉన్న ఇబ్బందేంటని కేటీఆర్ ప్రశ్నించారు. రిపేర్ చేయకుండా ఉంచి వర్షాకాలంలో వరద వచ్చి బ్యారేజీ కొట్టుకుపోవాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దని సూచించారు. ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, కరువును పారలడం కోసం కాళేశ్వరంప్రాజెక్ట్ను నిర్మించారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఆ ప్రాజెక్ట్‌పై విషం చిమ్ముతున్నారన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా మేడిగడ్డ రిపేర్ చేసి నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. వచ్చే వారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం -
మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ? -
మేడిగడ్డనో... బొందల గడ్డనో తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: అది మేడిగడ్డనో, బొందలగడ్డనో ముందు కేసీఆర్ తేల్చాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డలో పిల్లర్లు కుంగింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కోట్ల శ్రీనివాస్, చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలిసి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం పీకడానికి మేడిగడ్డ వెళుతున్నారంటూ నల్లగొండ సభలో కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిని పీకడానికి, కట్టిన డబ్బు సంచులు పీకడానికి వెళ్లామని బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా మంచి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు ఒకటి అంటే మా కార్యకర్తలు వంద అంటారన్న విషయం మర్చిపోద్దని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌నుద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే క్షమాపణలు చెపితే వివాదం ఇంతటితో ముగిసిపోతుందన్నారు. బాల్కసుమన్ చిన్నపిలగాడు.. కడియం గాలిపటం మాదిరి బాల్కసుమన్ చిన్నపిలగాడని, పిలగాడు పిలగాడి తీరులోనే ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కడియం శ్రీహరికి రాజకీయ జ్ఞానం లేదని గాలిపటం లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ అధినేతల లైన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, అది కూడా తెలియని కడియం శ్రీహరి తన వద్దకు వస్తే క్లాసులు చెపుతానని వ్యాఖ్యానించారు. తన టైం బాగాలేక సంగారెడ్డిలో ఓడిపోయాయని, ఐదేళ్లు రెస్ట్ ఇచ్చినందుకు సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలని చెప్పిన జగ్గారెడ్డి తాను మెదక్ ఎంపీగా పోటీ చేయడం లేదని, ఈ అంశంలోకి మరోమారు తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
మేడిగడ్డ బ్యారేజీ..3 కేసులు నమోదు
-
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్‌కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్‌ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్‌మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు? ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్‌రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్‌కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
తప్పు తేలితే తగిన శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అ ధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని ఒక ట్రెండు రోజుల్లో శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా? జరిగినట్టు తేలితే బాధ్యులెవరు? అనేది తేలుస్తామని.. వారికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరే ముందు శాసనసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకమని.. కృష్ణాజలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల విలువైన పనులు కూడా జరిగాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టుకు మార్పులు చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. రూ.38,500 కోట్ల వ్యయ అంచనాతో ప్రాణహిత– చేవెళ్లను రూపొందిస్తే.. కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందా? ఇంకెంత అవుతుందోనన్న దానిపై స్పష్టత లేదు. పిట్టగూడులా కట్టారా? బాంబులతో పేల్చారా? మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేం ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర్రావు (హరీ శ్‌రావును ఉద్దేశించి)తోపాటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజీకి ఏం జరిగిందో చూసి, తెలంగాణ ప్రజలకు వివరించాలి. బస్సులో ప్రయాణించడానికి కష్టమైతే.. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అయితే.. ప్రతిపక్షాలే బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ చూడటానికే ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది’’ అని రేవంత్ చెప్పారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలున్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొనగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుకలో పేకమేడలు కట్టారా? పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అంటున్నారు. వాళ్లు ఇసుకలో పేకమేడలు కట్టారా? సభలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టాక.. కాళేశ్వరంపై, కాళేశ్వర్రావుగా పిలుచుకున్న హరీశ్‌రావుపై, ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారిందన్న అంశంపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఏమేం ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారన్న దానిపై ప్రాథమిక నివేదిక అందింది. -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్‌కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్‌పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా?
-
కాంగ్రెస్ బృందంతోపాటు వెళ్లిన ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు
-
మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న అధికారులు
-
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు
-
మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
-
కాంగ్రెస్ వ్యవహారం.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన చేపట్టిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం సమగ్ర రూపం చాలా మందికి తెలీదని అన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు అని తెలిపారు. కాళేశ్వరం ఫలితాలను రైతులను అడగండి చెబుతారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు రిజర్వయర్, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉన్నాయని తెలిపారు. మిగతా బ్యారేజీలు కూడా చూడాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు రంగనాయకసాగర్‌ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రాణహిత- చేవెళ్ల కట్టలేదుని ప్రశ్నించారు. సభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు. అధికార పక్షం మాత్రమే మాట్లాడిందన్నారు. సభా సంప్రదాయాలను అధికారపక్షం మంటగలుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కూడెల్లి వాగు, పచ్చటి పోలాలు చూడాలంటూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు హితవు పలికారు. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని..పునుద్దరణ పనులు చేపట్టాలని చెప్పారు. దురుద్దేశంతోనే ప్రాజెక్టు పునరుద్దరణ చేపట్టడం లేదని విమర్శించారు. చదవండి: మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం -
మాది ప్రజా ప్రభుత్వం.. భయపెడితే భయపడం: సీఎం రేవంత్
LIVE Updates గత ప్రభుత్వంలో మేడిగడ్డను ఎవ్వరినీ చూడనివ్వలేదు: సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే నల్గొండ సభ పెట్టారు కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము. మేడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది... అన్నారం సుందిల్లా సున్నం అయింది. మేడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమానించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్‌రావు మద్దతు పలికారు. తీర్మానం పై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం... భయపెడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్ కు ప్లా్రైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుత్వం అంటూ న్యూ యార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు కేసీఆర్ నల్గొండ లో మాట్లాడటం కాదు - అసెంబ్లీ కి రావాలి ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం... కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మేడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వయం ఉంది. కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి L AND T సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు... ఇప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు... అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటన కు వెళ్ళాలి వస్తానన్న బీజేపీ MLA లను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ BRS ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ BRS చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. *కేసీఆర్ అవినీతి ని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది: మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా రాలేదు వాస్తవాలు తెలుస్తాయనే భయపడుతున్నారు మేడిగడ్డ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు. మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం బృందం కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లిన సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30కు మేడిగడ్డ చేరుకోనున్న సీఎం, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు, కుంగిన పిల్లర్లను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5 — Telangana Congress (@INCTelangana) February 13, 2024 కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా...కేసీఆర్ నోరు మెదపడం లేదు రూ. 97 వేల కోట్ల వ్యయం చేస్తే 97 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. మేడిగడ్డ మరమత్తులకు పనికిరాదు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf — Revanth Reddy (@revanth_anumula) February 13, 2024 కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు: హరీష్ రావు మిగతా బ్యారేజీలు కూడా చూడాలి రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం, మంత్రులు రోడ్డుమార్గాన మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు. మేడిగడ్డ సందర్శనకు సీపీఐ, ఎంఐఎం సభ్యులు. బీఆర్ఎస్, బీజేపీ దూరం. సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. -
మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిదో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుండగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. మేడిగడ్డకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి సభ్యులు వాస్తవాలు చూడాలి. మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం. కేసీఆరే ముందుండి ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తే బాగుంటుంది. బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలికాప్టర్లో రావచ్చు. కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మపదార్ధాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు. సాగునీటి ప్రాజెక్టులపై నిన్న చర్చించి వాస్తవాలు చెప్పాం. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కుంగిన ప్రాజెక్ట్‌ను చూడకుండా గత ప్రభుత్వం దాచిపెట్టింది. అక్కడికి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. కొందరు అధికారులు డాక్యుమెంటను మాయం చేశారు. ఫైళ్ల మాయంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం సభ్యులు వాస్తవాలు చూడాలి. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలనే మేడిగడ్డ పర్యటన. ఇరిగేషన్ ప్రాజెక్టులపై త్వరలో శ్వేతపత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు ఇలా కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీలో భారీ అవినీతి జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన డ్యాంలు 50 ఏళ్లకు పైగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన బ్యారేజీ అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాం. విజిలెన్స్ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసలు వాస్తవలు ప్రజల ముందు ఉంచేందుకు మేడిగడ్డ పర్యటన. సభ్యులందరినీ ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి. వాస్తవాలు కళ్లారా చూసేందుకు బీఆర్ఎస్ను రమ్మంటున్నాం. అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాసేపట్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బస్సులో మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. -
నేడు సర్కారు మేడిగడ్డ టూర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేడు(మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ మేరకు సర్కారు ఏర్పాట్లు చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని.. ఈ విషయాన్ని చూపేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళతామని నాలుగు రోజుల కింద సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.15 గంటలకు సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. సీఎం, మంత్రులు వస్తున్న నేపథ్యంలో.. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శన తర్వాత సభ? సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా మేడిగడ్డ వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. బ్యారేజీని పరిశీలించేందుకు వీలుగా.. బ్యారేజీ దిగువన, గోదావరి తీరానికి వెళ్లే మార్గాలను సిద్ధం చేస్తున్నారు. వ్యూపాయింట్ ప్రాంగణం వద్ద 3 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలు, ఇతర అంశాలపై ఇక్కడ సభ నిర్వహించి, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. మేడిగడ్డ టూర్ షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం మూడున్నర గంటల కల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు బ్యారేజీని పరిశీలించి, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కేసీఆర్ మేడిగడ్డకు రావాలి: ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత (ఆర్కిటెక్ట్) కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులు, బోర్డుకు అప్పగింత అంశంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని (బీఆర్ఎస్ మద్దతుతో) ఆమోదించిన విషయాన్ని గమనించాలని కోరారు. సోమవారం అసెంబ్లీ వాయిదాపడ్డాక లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుందని.. మేడిగడ్డ పర్యటన నిమిత్తం సభను వాయిదా వేసి, బయలుదేరుతామని వివరించారు. -
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్‌పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు.. బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. ఇదీ చదవండి: Vote for Crore : ఓటుకు కోట్లు కేసులో సుప్రీం నోటీసులు -
విజిలెన్స్ ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్)లు, ఇతర అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలి్చంది. నిర్మాణ సమయంలో, తర్వాత చూపిన నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తికాకున్నా ‘వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్’ఇచ్చారని.. కాంట్రాక్టర్‌కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులను కాంట్రాక్టు సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని.. బిల్లుల చెల్లింపులు, ఖాతాల పరిశీలన ద్వారా దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. పని పూర్తికాకున్నా బ్యాంక్ గ్యారంటీల విడుదల బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 2 నుంచి వర్తిస్తుందంటూ అదే ఏడాది నవంబర్ 11న ఈఎన్సీ లేఖ జారీచేశారు. పనులు పూర్తికాకున్నా బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థకు విడుదల చేశారు. సదరు ఈఎన్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో ‘సౌండింగ్ అండ్ ప్రొబింగ్’ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. డ్యామ్ పర్యవేక్షకుడు (ఈఎన్సీ రామగుండం) అవి చేపట్టలేదు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, అన్ని కాంక్రీట్ నిర్మాణాల దృఢత్వంపై పరిశీలన అత్యవసరం. బ్యారేజీ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు జరగలేదు. బ్లాక్–7 పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), ర్యాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్‌ను నిర్దేశిత క్రమపద్ధతిలో నిర్మించలేదని వాటికి సంబంధించిన మెజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలింది. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్వహణ గాలికి వదిలేశారు 2019 జూన్ 19న బ్యారేజీని నాటి సీఎం ప్రారంభించారు. నాటి నుంచి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. నిజానికి తొలుత రూ.1,849.31 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యతలను నిర్మాణ సంస్థకు అప్పగించారు. తర్వాత ఈఎన్సీ సిఫార్సుల ఆధారంగా.. 2016 మార్చి 3న రూ.2,591 కోట్లకు, 2018 మే19న రూ.3,260 కోట్లకు, 2021 సెపె్టంబర్ 6న రూ.4,613 కోట్లకు అంచనాలను పెంచారు. ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించి.. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్ర తా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ నిర్మాణ 2019 సెపె్టంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై సూపరింటెండింగ్ ఇంజనీర్ కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు.. 2021 మార్చి 15న పనులు పూర్తయినట్టు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీచేశారు. కానీ ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి ఉత్తర్వులు జారీచేశారు. బ్యారేజీ వైఫల్యానికి కారణాలివీ.. ♦ బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్ పైల్స్‌ను పాతి నిర్మించిన కాఫర్ డ్యామ్‌ను నిర్మాణం పూర్తయ్యాక తొలగించాలి. కానీ కాఫర్ డ్యామ్‌ను, షీట్‌పైల్స్‌ను ఐదేళ్లు గడిచినా తొలగించలేదు. దీనితో గోదావరి నది సహజ ప్రవాహంపై ప్రభావం పడింది. ♦ బ్యారేజీ పునాది (ర్యాఫ్ట్), దాని కింద భూగర్భంలో ‘కటాఫ్ వాల్స్’ నిర్మాణం సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రాయింగ్స్ ప్రకారం ర్యాఫ్ట్, కటాఫ్ వాల్స్ మధ్య కలయిక (కనెక్షన్)ను చేపట్టలేదని బ్యారేజీకి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ర్యాఫ్ట్ కింద భూగర్భంలో ఎగువన, దిగువన షికెంట్ పైల్స్‌ను వేశారు. ఇందులో సెకండరీ పైల్స్ వేసేప్పుడు.. ప్రైమరీ పైల్స్ దెబ్బతిని పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండవచ్చు. 7వ బ్లాకులోని 16–21 పియర్లకు వ చ్చిన పగుళ్లను పరిశీలిస్తే.. పునాదులు ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతోంది. ♦ బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం కనిపించింది. బ్యారేజీని 2019–20లో ప్రారంభించాక దిగువన కాంక్రీట్ బ్లాకులతో ఏర్పాటు చేసిన అప్రాన్ ఏరియాకు ఎలాంటి తనిఖీలు, నిర్వహణ చేపట్టలేదు. వరదల్లో కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాంక్రీట్ బ్లాకులను పునరుద్ధరించి మరమ్మతులు చేయాలని 2020–2023 మధ్య నీటిపారుదల శాఖ నాలుగు సార్లు కోరినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ♦ 7వ బ్లాకులో 11 నుంచి 22 వరకు పియర్లు ఉండగా.. 18, 19, 20 పియర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పియర్ పునాదుల దాకా భారీగా దెబ్బతిన్నది. ♦ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించారు. -
ఈఎన్సీలపై వేటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యుడిగా గుర్తిస్తూ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రిటైరైనా కొనసాగుతూ.. 2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న సి.మురళీధర్ వాస్తవానికి 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కిందే రిటైరైనా అప్పటి బీఆర్ఎస్ సర్కారు తిరిగి అదే పోస్టులో నియమించింది. ఆయన పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనను ముందే తొలగించింది. తొలగించిన ఇద్దరు ఈఎన్సీల స్థానంలో.. ఇన్చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను ఆదేశించింది. ‘వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్’తో గందరగోళం! గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకు కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాని పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి.. డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగిందని నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ పనులన్నీ పూర్తికాలేదని, అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్అండ్టీ సంస్థ మాటమార్చింది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని అంటోంది. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. ఒప్పందం ప్రకారం పనిపూర్తయినట్టు (వర్క్ కంప్లీషన్) ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) లేఖ సైతం ఇచ్చారని ఎల్అండ్టీ వాదిస్తోంది. నీటిపారుదల శాఖ అందించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని పేర్కొంటోంది. దీంతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేగాకుండా బ్యారేజీ వద్దకు మీడియా బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని.. కానీ ఇప్పటివరకు కేవలం 98,570 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. -
మేడిగడ్డ ప్రాజెక్టుపై సంచలన రిపోర్ట్..
-
మేడిగడ్డ: విజిలెన్స్ రిపోర్ట్‌లో సంచలనాలు!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే మేడిగడ్డలో డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ అంచనాకు వచ్చింది. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. 2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయ్యిందన్న విజిలెన్స్.. ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజ్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయి. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్అండ్ టీకి లేఖ రాయగా, ఎల్ అండ్ టీ నుంచి ఎలాంటి స్పందన లేదని విజిలెన్స్ గుర్తించింది. ప్రాజెక్టులకు సంబంధించి చాలా రికార్డులు కూడా మాయమయ్యాయని.. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరగ్గా, త్వరలో పంప్ హౌజ్‌లపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టనుంది. ఇదీ చదవండి: మీ కౌంటర్లో పస లేదు! -
మీ కౌంటర్లో పస లేదు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలోని అంశాలను ఖండిస్తూ గత డిసెంబర్ 7న నీటిపారుదల శాఖ పంపించిన నివేదికలో ఎలాంటి పస లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పింది. బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ)కు లేఖ రాశారు. ‘నాణ్యత’పై గోప్యత ఎందుకు ..? బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతాపర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎన్డీఎస్ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేíÙంచిన తర్వాతే బ్యారేజీ పియర్లు కుంగడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణకు తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పొంతన లేని విభాగాల డ్రాయింగ్స్ భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించి ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీళ్లకు భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన ‘డిజైన్ కాలిక్యులేషన్స్’మాత్రం బ్యారేజీ కింద భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకిగా లేవని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ప్రాజెక్టు అధికారులు సమర్పించిన వేర్వేరు రకాల సమాచారాన్ని విశ్లేషించి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయానికి ఎన్డీఎస్ఏ వచ్చింది. ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కీలకమైన ఈ అంశంపై మరింతగా పరిశీలన కోసం ..ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్(సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో సహా అందజేయాలని విజ్ఞప్తి చేసినా ఇంత వరకు అందజేయలేదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. మళ్లీ ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపిస్తాం... ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అలా తెలిపిన వెంటనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందంటూ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్ఏ మళ్లీ గుర్తు చేసింది. బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తు అంశాలను సైతం తమకు తెలియజేయాలని కోరినట్టు పేర్కొంది. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదని తెలిపింది. -
మేడిగడ్డపై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్‌క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. జలసౌధలో 50 మంది అధికారులు హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి. అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పట్టుకెళ్లారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు. రాకపోకలు బంద్..సెల్ఫోన్ల స్వాదీనం తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. కుంగిన పియర్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు, బ్యారేజీ, పంపుహౌస్‌ల డ్రాయింగ్, డిజైన్లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు. నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు. హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
హైదరాబాద్ జలసౌధలో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల సోదాలు
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
మేడిగడ్డ: విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీస్‌లో విజిలెన్స్ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తోంది. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మెడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తోంది. -
మేడిగడ్డ చూడ..
-
ముదిరిన మేడిగడ్డ వివాదం
-
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్‌లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్‌కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్‌లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్‌లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు. -
ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు కూడా తవ్వించామని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చిందని విమర్శించారు. ఎన్ని కల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫల మైందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వీరిలో ఉన్నారు. కాగా ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే: కోమటిరెడ్డి ‘ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే సగం వరకు పనులు జరిగిన ప్రాజెక్టును వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చర్యలన్నీ తుగ్లక్ చర్యల్లా ఉన్నాయి. కొండపోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇక ఈ ప్రాజెక్టు పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటార్లు బిగించారు. ఇవన్నీ అసెంబుల్డ్ మోటార్లు. మోటార్లకు రూ.1,000 కోట్లకు బదులు రూ.4 వేల కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారు.. పొంగులేటి: ‘కేసీఆర్ ప్రతిచోటా తన మార్కు ఉండాలనే తాపత్రయంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. డయా ఫ్రం వాల్ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే మేడిగడ్డ పియర్స్ రోజురోజుకూ కుంగిపోయాయి. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోయాయంటే ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోంది. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు...’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు వివరించేందుకే..: శ్రీధర్‌బాబు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, జరిగిన నష్టం ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లికి సాగునీరు, తాగునీరు అందించాలని, ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంథని ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని సహచర మంత్రులను కోరుతున్నా..’ అని శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ మానస పుత్రిక: పొన్నం ‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. దీని కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది..’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అన్నారం బ్యారేజీని సందర్శన తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రూ. లక్ష కోట్లకు లక్ష ఎకరాల ఆయకట్టా?: ఉత్తమ్ ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్లు ఖర్చు చేసినట్లు గత పాలకులు చెబుతున్నారు. కానీ దానివల్ల ఏర్పడిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతం అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడం దురదృష్టకరం. బ్యారేజీ కుంగిపోయినా ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ నోరు మెదపలేదు. మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం జరిగింది. వాటిని పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతాం..’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. -
మేడిగడ్డ సందర్శన.. కాంగ్రెస్ మంత్రులకు కడియం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. అంచనాలు పెంచి కట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. పవర్ జనరేట్ ప్రాజెక్టులు, సబ్ స్టేషన్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం వల్లే అంచనా పెరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద, 19, 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని.. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కూడా కోరుకుంటోందని తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వైరీ కచ్చితంగా చేయాలన్నారు కడియం. అయితే విచారణ జరగకముందే మంత్రులు తీర్పులు చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా విషయాల్లో అవగాహన ఉందని భావించానని..కానీ ఆయనే పూర్తిగా తెలుసుకోకుండా తీర్పునిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్‌తో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి అడుగడుగునా విషం నింపుకుంది కాబట్టే హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా తీసుకురావాలని, ఇందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు. కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లిన మంత్రులు.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేయటానికి కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శించారు. శ్వేత పత్రాలు అంటూ కొంత కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అంటూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహాట్టి దగ్గర కట్టింది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ మాత్రమేనని తెలిపారు. చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్ -
మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ మంత్రులు కీలక వ్యాఖ్యలు!
-
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
నేడు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Updates: ఈఎన్సీ చీఫ్ మురళీధర్ కామెంట్లు.. ► మేడిగడ్డ బ్యారేజ్‌లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి ► 20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది ► మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది ► ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది ► ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► కిందికి పోయినా వాటర్‌ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్ ► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి ► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు ► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు ► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది ► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు ► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా ► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్‌తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యేవి కాదు. ► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి. ► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్‌ల నిర్మాణం ఎలా చేసారు ► బ్యారేజ్‌లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు ► మునిగిపోయిన పంప్‌ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్‌ను ఫైనాన్స్ డిపార్టుమెంట్లో పెట్టారు ► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు ► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే ► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది ► కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది ► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు ► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు. ► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం ► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది ► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు ► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు ► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం ► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది ► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం ► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది. ► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది. ► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి ► మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది ► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా ► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి ► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం ► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది ► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి ► ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి ► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం ► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్లే కాళేశ్వరంకు కీలకం ► అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యాయి ► బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు ► అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు ► ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ► గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉండే కీలక అంశాలు ► గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది ► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి? ► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది ► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత? ► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి? మేడిగడ్డకు మంత్రుల బృందం ► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్‌కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది ► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ► మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి. ► మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది. ►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు ►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన ►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం ►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి ►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది ► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది. జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. అనంతరం E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
మళ్లీ మేడిగడ్డ, అన్నారం మునుగుతాయి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్‌లు మళ్లీ నీటమునిగే ప్రమాదముందని రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన జలసౌధలో మీడియాతో మాట్లాడారు. పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలిస్తేనే మళ్లీ నష్టం జరగకుండా నివారించవచ్చని సూచించారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి తొలుత అనుమతిస్తే తర్వాత 120 మీటర్లకు తగ్గించి జెన్కో నుంచి డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని ఆరోపించారు. అన్నారం పంప్‌హౌజ్‌ను తొలుత 131 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 125 మీటర్లకు తగ్గించారని తెలిపారు. ఎత్తును తగ్గించడంతోనే పంప్‌హౌజ్‌లు మునిగినట్టు ఆరోపించారు. 2022లో మునిగిన తరహాలోనే మళ్లీ ఈ రెండు పంప్ హౌజ్‌లు మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీల గరిష్ట నిల్వ మట్టం(ఎఫ్ఆర్ఎల్) కంటే ఎక్కువ ఎత్తులో పంప్‌హౌజ్‌లను కట్టాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మించడంతోనే సమస్యలొచ్చాయన్నారు. నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా పంప్‌హౌజ్‌లను భూఉపరితలంలో నిర్మించాలని సిఫారసు చేస్తే, నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారని ఆరోపించారు. మోటార్లు ఎఫ్ఆర్ఎల్కి తక్కువ ఎత్తులో పెట్టినా పెద్దగా నష్టం ఉండదని, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు మాత్రం ఎత్తులో ఉండాల్సిందేనన్నారు. పటేల్ కంపెనీ తీరుతోనే కల్వకుర్తి లిఫ్టులోని పంప్‌హౌజ్ నీటమునిగి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. -
సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులపైనా గురి
సాక్షి, హైదరాబాద్: సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం గత పదేళ్లలో చేసిన అప్పులు, వ్యయం, కల్పించిన ఆయకట్టు, నష్టాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం, పాలనపరమైన అనుమతులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, ప్రతిపాదించిన ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, మిగిలిన ఆయకట్టుకు సాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు, ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా తరలించిన జలాలు, ఇందుకు అయిన నిర్వహణ వ్యయం, ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం అప్పులు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఇప్పటివరకు ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించారు? మిగిలిన ఆయకట్టుకు అందించడం సాధ్యమేనా? ఇందుకు ఎంత వ్యయం అవుతుంది? వంటి విషయాలతో సమాచారం తయారు చేసినట్లు చెబుతున్నారు. సీఎం సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ప్రత్యేక నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల స్థితిగతులు, తెలంగాణ ఏర్పడడానికి ముందు చేసిన వ్యయం, తెలంగాణ వచ్చాక ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కూడా నివేదికను రూపొందించారని అంటున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టికి బదులు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన వార్ధా బ్యారేజీ విషయంలో ముందుకు వెళ్తారా? అన్నదానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రాప్ హాలిడే పైనా వివరణ నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు అడుగంటి పోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న 6.4 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సైతం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మొత్తం ఎన్ని టీఎంసీల వరద వచ్చింది? ఆశించిన మేరకు వరద రాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్ని టీఎంసీలు సాగు, తాగునీటి అవసరాలకు వాడారు? తదితర అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వనుందని తెలిసింది. విద్యుత్ సంస్థల నష్టాలు, అప్పులే ప్రధానం తెలంగాణ వచి్చన తర్వాత రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకున్న అప్పులు, నష్టాలు, ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విశ్లేషిస్తూ విద్యుత్ శాఖ అధికారులు నివేదిక ఇచి్చనట్లు తెలిసింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమ, మంగళవారాల్లో విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీతో సమావేశమై విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి రూ.28,140 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించకుండా తామే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎనీ్పడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్) నష్టాలు రూ.50,275 కోట్లకు పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నట్టు తెలిసింది. -
కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. సొంత ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మరోసారి నిరాకరించింది. నీటిపారు దల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు సి.మురళీ ధర్, బి.నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి ఎల్ అండ్ టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వీ దేశాయ్ బృందంతో సమావేశమై బ్యారేజీ పునరు ద్ధరణపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలు ఎలా చోటుచేసుకున్నాయని మంత్రి ఎల్ అంట్ టీ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లేఖ రాసి బ్యారేజీ పునరుద్ధరణ నుంచి తప్పుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, ఒప్పందం ప్రకారం పని పూర్తయి నట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేఖ సైతం ఇచ్చారని ఎల్ అండ్ టీ బృందం వివరించింది. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ సైతం ముగిసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని పేర్కొంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మరుసటి రోజే బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమదేనని అంగీకరిస్తూ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ విడుదల చేసిన ప్రకటనను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మంత్రికి చూపించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్థాయి కానీ, అధికారం కానీ సురేశ్‌కుమార్‌కు లేదని ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశాయ్ చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో ఆయనపై ఒత్తిడి చేసి ప్రకటన ఇప్పించారని ఆరోపించినట్టు సమాచారం. ఎల్ అండ్ టీ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినా ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, చివరి బిల్లును సైతం ఇప్పటివరకు చెల్లించలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా పనులు పూర్తికానట్టేనని వాదించారు. ఇంకా అంచనాలే రూపొందించలేదా? మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా గోదావరిలో ఎగువ నుంచి వస్తున్న జలాలను దారి మళ్లించడానికి కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.55.5 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధు లు ఉత్తమ్‌కు వివరించారు. కాఫర్ డ్యామ్‌కు అంత వ్యయం కాదని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. మీ అంచ నాల ప్రకారం ఎంత వ్యయం అవుతుందని ఉత్తమ్ ఆయన ను ప్రశ్నించారు. ఇంకా అంచనాలు రూపొందించలేదని వెంకటేశ్వర్లు బదులివ్వగా, మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా పునాది కింద దృఢత్వం కోసం కటాఫ్ పైల్స్ వేయాల్సి ఉంటుందని, వీటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికే 45 రోజుల సమయం పడుతుందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వివరించారు. అనుభవం కోసమే సర్టిఫికెట్ ఇచ్చి ఇరుక్కున్నారు.. మేడిగడ్డ పనులు చేసిన అనుభవం వాడుకుని కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ సంస్థ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోరగా, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ జారీ చేసేయడంతోనే సమస్య ఉత్పన్నమైందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒప్పందం ప్రకారం పనులన్నీ పూర్తికాకుండానే ఎలా జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సర్టిఫికెట్‌ను అడ్డంపెట్టుకుని ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. కారణమేంటో తేల్చండి! మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న అంశంపై వివాదాన్ని పక్కనపెట్టి అసలు బ్యారేజీ కుంగడానికి కారణాలను వెలికి తీయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు మూల కారణం తెలిసిన తర్వాత పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించాలని, ఇందుకోసం నిర్మాణ సంస్థలను పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రితో సమావేశం అనంతరం కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులను ప్రారంభించే అంశంపై ఎల్ అండ్ టీ బృందంతో ఈఎన్సీలు చర్చించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని, అదనపు పనులకు ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. -
మేడిగడ్డపై అంత నిర్లక్ష్యమా.. మంత్రి ఉత్తమ్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్..‘అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. -
వారికే చెప్పుకోండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టును నిర్మించిన అధికారులు, ఇంజనీర్లు ఏం చెప్తారో కమిషన్‌కే చెప్పుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కొత్తగూడెం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావు తదితరులతో సీఎం ఆదివారం రాత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోగా.. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యతతమదేనని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరుసటి రోజే ప్రకటించిందని, ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఏమిటని ఈ సందర్భంగా రేవంత్ నిలదీసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో సొంత ఖర్చుతో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా అంగీకరించిన ఎల్అండ్టీ.. ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంలో జ్యుడిషియల్ కమిషన్‌కు వివరణ ఇచ్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు ఎల్‌అండ్‌టీపై చర్యలకు ఉపక్రమించాలని, అందుకు ఉన్న అవకాశాలను నివేదించాలని ఆదేశించినట్టు సమాచారం. కొత్త ప్రాజెక్టుల ఖర్చు వివరాలివ్వండి గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులపై పూర్తి వివరాలు అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇక యాసంగి పంటలకు నీళ్లిచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోయాయని, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని సీఎంకు ఈఎన్సీలు నివేదించారు. దీంతో హైదరాబాద్ జంట నగరాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు వేసవిలో తాగునీటి సమస్య ఎదురవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎగువన ఉన్న నారాయణపూర్ జలాశయం నుంచి కృష్ణానదిలో ఊట నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఈఎన్సీలు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఎండాకాలంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌లోని నిల్వలను పరిరక్షించాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శాసనసభలో ప్రకటించి.. ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై కీలక ప్రకటన చేస్తానని.. అన్ని వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో నీరు ఇవ్వలేని పరిస్థితి, దీనికి కారణాలు, బాధ్యులు ఎవరన్న అంశంపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. సాగర్ కింద క్రాప్ హాలిడే! నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు యాసంగిలో సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రమే అధికారులతో సమీక్షించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిన నేపథ్యంలో యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలని ఈఎన్సీలు సూచించినట్టు తెలిసింది. -
మేడిగడ్డపై ఎల్ అండ్ టీ యూ–టర్న్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తామని గతంలో చేసిన ప్రకటనపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ యూ–టర్న్ తీసుకుంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. సొంత ఖర్చుతోనే బ్యారేజీ పునరుద్ధరణ చేపడతామని మరుసటి రోజు ఎల్అండ్టీ జనరల్ మేనేజర్ సురే‹Ùకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్యారేజీ కుంగిన ఘటనపై నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్‌తో అక్టోబర్ 23న జలసౌధలో సమీక్ష నిర్వహించారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ నిబంధనలో భాగంగా బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఎల్అండ్టీ సొంత ఖర్చుతో చేసేందుకు ఒప్పుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. బ్యారేజీకి సంబంధించిన రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29తో ముగిసిన నేపథ్యంలో పునరుద్ధరణ బాధ్యత తమది కాదని తాజాగా ఎల్అండ్టీ సంస్థ మాట మార్చింది. బ్లాకు పునర్నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ నుంచి ఈ నెల 5న తమకు లేఖ అందిందని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే ఎల్ అండ్ టీ నుంచి లేఖ అందినట్టు చెప్పాయి. బ్యారేజీ పునరుద్ధరణ పనుల కోసం తొలుత ఎగువ నుంచి వస్తున్న వరదను దారి మళ్లించడం కోసం రూ.55.75 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఈ మేరకు వ్యయం భరించేందుకు ప్రభుత్వం ముందుకొస్తేనే పనులు ప్రారంభిస్తామని లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేయడం గమనార్హం. బ్యారేజీ పునరుద్ధరణ పనులకు మరో రూ.500 కోట్ల వ్యయం కానుందని ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించామని ఎల్ అండ్ టీ పేర్కొంది. లేఖను దాచిపెట్టారు! ఎల్ అండ్ టీ రాసిన లేఖను నీటిపారుదల శాఖ రహస్యంగా ఉంచడంపై ఆరోపణలు చెలరేగాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నెల 11న జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై ఈఎన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఉత్తమ్‌తో సహా మరో నలుగురు మంత్రులు నీటిపారుదల శాఖపై సమీక్ష జరిపారు. వాస్తవాలు దాస్తున్నారని రెండు సమీక్షల్లోనూ ఈఎన్సీలపై మంత్రులు మండిపడ్డారు. మంత్రులు రెండుసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎల్ అండ్ టీ లేఖ విషయాన్ని అధికారులు ప్రస్తావించలేదని తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
మేడిగడ్డపై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. నిష్పక్షపాత విచారణ జరిపించి.. కాంట్రాక్టులు ఎవరిచ్చారో, సమస్యలకు కారణం ఎవరో తేల్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వంలో నచ్చితే నజరానా (పురస్కారం), నచ్చకపోతే జుర్మానా (జరిమానా) ఉండవని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో శనివారం చేపట్టిన ధన్యవాద తీర్మానం చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడ్డాయని.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మాత్రం కళ్లముందే కుంగిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటిది తామేదో గొప్ప ప్రాజెక్టు కట్టామని, చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టును ఇసుకపై కట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులను తీసుకెళ్లి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను చూపిస్తామన్నారు. సాంకేతిక నిపుణులతో పరిశీలించాలి.. సీఎం రేవంత్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం వద్ద ఏదో ఘోరం జరిగిపోయిందంటూ.. ఏదో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టు శాసనసభ, మండలి సభ్యులను తీసుకెళ్లడం కంటే సాంకేతికంగా నిపుణులతో పరిశీలించడం మంచిదని సూచించారు. తాము ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై రేవంత్ ప్రతిస్పందిస్తూ.. మేడిగడ్డ పరిశీలనకు బీఆర్ఎస్ వారు రానంటే తమకు అభ్యంతరమేమీ లేదని, మిగతా సభ్యులకు అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్ వారికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం వద్ద బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా సరే.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మహాలక్ష్మి పథకం అమలు, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం వంటి హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది తమ గ్యారంటీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక.. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మార్పు, టీచర్లు–ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో, స్కూల్ సర్విసెస్, జీతాలు వంటి అంశాలపై ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసుకొస్తుందని, రైతుబీమా పథకాన్ని కూడా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. నా భాష ఇలాగే ఉంటుంది..! అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించే విషయంపై అన్నిపార్టీలతో చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజానికి ఈ ప్రాంగణం ప్రభుత్వ పరిధిలోనిది కాదని.. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ సమావేశమై ఏ ఆదేశాలిస్తే వాటిని పాటిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో సీఎం సంయమనం, సహనంతో ఉండాలని, పరుష పదజాలంతో భయపెట్టేలా మాట్లాడవద్దని కోరుతున్నామని దేశపతి పేర్కొన్నారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘గ్రామం నుంచి వచ్చాను. రైతుబిడ్డను. ప్రభుత్వ బడిలో చదువుకున్నాను, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భాష ఇలాగే ఉంటుంది. ఏం అనుకున్నానో అదే చెబుతాను. నా మాటలకు తప్పు చేయనివారు ఎందుకు భయపడాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి నమూనా చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే అభివృద్ధి నమూనాగా మార్చుతామని సీఎం రేవంత్ చెప్పారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో కళకళలాడేలా చేస్తామని.. మూసీ పరీవాహకం మొత్తం (నల్లగొండ దాకా>) ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకు శాసన మండలిపై ప్రత్యేక అభిమానం ఉందని.. పదిహేనేళ్ల కింద తాను ఎమ్మెల్సీగా అడుగుపెట్టి సీనియర్ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాగా.. మైనారిటీలకు ఇచ్చిన రూ.లక్ష సబ్సిడీ చెక్కు బౌన్స్ అయిందని, ఆ సొమ్మును ఇప్పించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ కోరగా.. గతంలో ఉన్నది నకిలీ ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ సొమ్ముపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కవిత సవరణ.. వెనక్కి.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో భాషా ప్రయోగం సరిగా లేదని, దానిని మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు ధన్యవాద తీర్మానానికి సవరణలు కోరారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు కల్పించుకుని.. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, సవరణ డిమాండ్‌ను ఉప సంహరించుకోవాలని కోరారు. కవిత ప్రతిస్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని భాషతో తాము ఏకీభవించడం లేదని, దానిపై నిరసన తెలుపుతూనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరణ డిమాండ్‌ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. కాగా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల సమయంలో మండలిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి తెచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. -
నాణ్యత లేని నాసిరకం నిర్మాణంతోనే ప్రాజెక్టు కుంగిపోయింది: కిషన్ రెడ్డి
-
ప్రశ్నార్థకంగా మేడిగడ్డ ప్రాజెక్టు
మహదేవపూర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఎక్కడా లేని ప్రచారం చేసిందనీ, కానీ ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం చూస్తుంటే దాని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ తదితరులతో ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కుంగిన 20వ పిల్లర్‌ను సందర్శించారు. కిషన్‌రెడ్డి బృందానికి ఈఈ తిరుపతిరావు ప్రాజెక్టు పరిస్థితులను వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుంగిపోయిన విషయం తెలిసిన వెంటనే తాను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందాన్ని పరిశీలనకు పంపించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని 20 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బృందం సభ్యులు కోరగా, ప్రభుత్వం 11 అంశాల వివరాలిచ్చి మిగతావి ఇవ్వలేదన్నారు. డ్యాం నిర్మాణంలోనే లోపాలు నిపుణుల కమిటీ.. డ్యాం నిర్మాణంలో లోపాలను ఎత్తిచూపిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పియర్స్ కింద సింగిల్ స్టోన్ పెట్టడం వల్ల ఆ స్టోన్ దెబ్బతినడంతో పియర్స్ కుంగిపోయాయని నిపుణులు పేర్కొన్నట్టు తెలిపారు. సాయిల్, ఇసుక నాణ్యత, మెటీరియల్, ఇంజనీరింగ్ నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. మేడిగడ్డ తరువాత అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాధారమైన మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిలువ ఉంచే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ వాస్తవాలు చెప్పాలి: కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వాస్తవాలు తెలుసుకునే హక్కు చెమటోడ్చి పన్నులు కట్టిన ప్రజలకు ఉందని, సీఎం కేసీఆర్ వాస్తవాలు చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రైతులపై గౌరవం ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, కోరిన వెంటనే 15 నిమిషాలలో సీబీఐతో విచారణ జరిపిస్తామని తెలిపారు. గ్రావిటీద్వారా నీరందించే రూ.30 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాదని, రూ.40వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి చివరికి రూ.లక్షకోట్లతో నిర్మించి రాష్ట్రానికి గుదిబండగా మార్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
‘మేడిగడ్డ’పై కేసీఆర్ స్పందించరేం?
సాక్షి, హైదరాబాద్: ‘2014 నుంచి 2018 వరకు హరీశ్‌రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గరే ఆ శాఖ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఇంత చర్చ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదు? బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ప్రకారం నిర్మాణం, నిర్వహణ జరగలేదని... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందని, మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు జరిగిన ఘటనను చిన్నదిగా చూపి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందన్న రేవంత్... కేసీఆర్‌ను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబమే ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని, ఈ ఉగ్రవాదులను కేంద్రం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన వేల రూ. కోట్ల అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే సీబీఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ మౌనమేల? కేంద్ర జలశక్తి పరిధిలో ఉండే కమిటీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పిందని, అవినీతిపరులను వదలనని చెప్పే ప్రధాని మోదీ ఈ కమిటీ నివేదిక వచ్చాక కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారని రేవంత్ ప్రశ్నించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని అడిగితే తాము అధికారంలోకి వచ్చాక తీసుకుంటామని అంటున్నారని, అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని... కేసీఆర్‌పై చర్యలు తీసుకోబోమని చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల అధికారులతో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. 2014–2023 వరకు కాళేశ్వరం నిర్మాణం వెనుక హరీశ్, కేసీఆర్ ఉన్నందున వారిని పదవుల నుంచి తొలగించాలన్నారు. కాళేశ్వరం అంచనాలు, పెంచిన వ్యయంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్ 9 తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
‘మేడిగడ్డపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి’
సాక్షి, మధిర: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో హైస్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కామెంట్స్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలోని మధిరలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ మంత్రుల ఆరోపించడం హస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు. మేడిగడ్డపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎంతో గొప్పగా నిర్మించామంటూ బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది. మున్ముందు ముప్పు తప్పదు.. మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం చెప్పింది. మొత్తం బ్యారేజీ పనిచేయని స్థితికి వచ్చింది. ఏడో బ్లాక్ రిపేరు చేయడానికి వీలుగా లేదని నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చెప్పింది. మొత్తం బ్లాక్‌ని పునాదులతో సహా తొలగించి పునర్నిర్మించాలని సూచించింది. సమస్య పరిష్కరించేంత వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని కేంద్ర బృందం తెలిపింది. ఒక వేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని బృందం చెప్పింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అధికారంలోకి రామని సీఎం కేసీఆర్‌కి అర్థమైపోయింది. రోజురోజుకి మా గ్రాఫ్ పెరుగుతోంది. మొన్నటి వరకు 80లోపు సీట్లు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం జనం నుంచి వస్తున్న స్పందన చుస్తే 80 సీట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గంటల కరెంటు ఇస్తారని, రైతుబంధు రాదని కేసీఆర్ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు జనంలోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ వస్తే గ్యారెంటీ స్కీమ్‌లు అమలవుతాయని జనం నమ్ముతున్నారు. సీపీఐ పార్టీతో పొత్తుల విషయంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో కవితపై కేంద్రమంత్రి ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ -
మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా ఉండడం.. అది కాస్త రాజకీయ విమర్శలకు దారి తీయడం తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యారేజ్‌ను పరిశీలించగా.. తాజాగా బీజేపీ నేతలు బ్యారేజ్ సందర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు. హెలికాఫ్టర్‌లో బ్యారేజ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతీ) బ్యారేజ్‌ను కూడా సందర్శించనున్నట్లు సమాచారం. బారికేడ్లు ఏర్పాటు మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. రాహుల్ పర్యటన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజ్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. నివేదిక ఇలా.. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ అక్టోబర్ 24వ తేదీన బ్యారేజ్‌ను సందర్శించింది. ప్రాజెక్టకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరింది. కానీ, తెలంగాణ సర్కార్ పూర్తి వివరాలు అందించలేదని సదరు కమిటీ తాజాగా తన నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దుప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. సంబంధిత వార్త: డిజైన్‌కు విరుద్ధంగా మేడిగడ్డ నిర్మాణం! రాజకీయ విమర్శలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు.. మేడిగడ్డ ఎన్డీఎస్ఏ నివేదిక విమర్శల్ని మరింతగా గుప్పించేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ నివేదికపై అధికార బీఆర్ఎస్ మండిపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కుటప్రూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కమిటీ రావడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయిందని, ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. -
మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. 7వ నంబర్ బ్లాక్ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్‌కుమార్ సిబల్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పునాది కుంగడం వల్లే.. ర్యాఫ్ట్ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్ పైల్స్ (కటాఫ్ వాల్స్) నిర్మించారు. ర్యాఫ్ట్ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్), ఇతర కారణాలతో ర్యాఫ్ట్కి ముందు భాగంలోని సెకెంట్ పైల్స్ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యత లోపం నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్ పైల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ గ్యాప్ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయింది. డిజైన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్ చేసి, రిజిడ్ స్ట్రక్చర్(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గోడలు (సెకెంట్ పైల్స్) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్లిఫ్ట్ ఫోర్స్) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్ కుంగిపోయింది. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అడిగిన సమాచారం ఇవ్వలేదు.. నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు. సమగ్ర దర్యాప్తు జరపాలి.. బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి. అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్‌ను అత్యవసరంగా పరీక్షించాలి. -
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క
-
కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ
సాక్షి, జయశంకర్భూపాలపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా ఆయన్ని అంగీకరించలేదు. చివరకు కాంగ్రెస్ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హెలికాఫ్టర్‌లోనే మేడిగడ్డను పరిశీలించారు. మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్ గాంధీ అంబట్ పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు. ..ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి. ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని రోజులు తిరగకముందే ఇలా బ్యారేజ్ కుంగివడం బాధాకరం. ..చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. చిన్నపాటి ఇంటికే ఇంజనీర్‌తో డిజైన్ చేయిస్తాం. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది అని రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అంబట్పల్లి, మేడిగడ్డ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావ్ ఠాక్రే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రాహుల్ గాంధీ సందర్శన నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. 144 సెక్షన్ అమలు ఉందని, సందర్శనకు అమలు లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ ఏర్పడింది. చివరకు రాహుల్‌కు ఏరియల్ సర్వే అనుమతి లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించాయి. -
పదవితో మారేదేమీ ఉండదు
సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెనుకబడిన వర్గానికి చెందిన నేతను తొలగించిన బీజేపీ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అంటోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ కేటగిరీకి చెందిన వాడైనా బీసీ జనగణన చేపట్టడం లేదని, ఒక వ్యక్తికి పదవి వచ్చినంత మాత్రాన పెద్దగా మారేదేమీ ఉండదని అన్నారు. బీసీ సీఎం అయినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదని, కులం కంటే గుణం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని 2014 డిసెంబర్లోనే సీఎం కేసీఆర్ బీసీ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ముదిరాజ్‌లకు రూ.1,000 కోట్ల విలువైన చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.30 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించామని తెలిపారు. పదవుల కంటే పథకాలు, జాతి ఉద్ధరణ ముఖ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నెపాన్ని బీసీలపై నెట్టేందుకే బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ ఎత్తుకుందనే అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు ‘బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా మార్పు కోసం రాజకీయాలు చేస్తోంది. కానీ విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాలను మార్చేందుకు పనిచేస్తున్నాయి. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. అయితే దాడులు లేదంటే అబద్ధాలతో మోసం చేస్తోంది. సోషల్ మీడియా అబద్ధపు వార్తలకు బీజేపీ ఫ్యాక్టరీలా మారింది. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విష ప్రచారం చేస్తోంది. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు..’అని కేటీఆర్ చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు జైలుకు వెళ్లొచ్చు.. ‘కాంగ్రెస్‌కు ఇప్పటికే 11 మార్లు అధికారం ఇచ్చిన ప్రజలు మరోమారు అప్పగించేందుకు సిద్ధంగా లేరు. గతంలో ఆరు సూత్రాలు అంటూ మోసగించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారంటీలతో మరోమారు అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో ఐదు గంటల పాటు కరెంటు ఇవ్వలేక లెంపలు వేసుకుంటోంది. దేశానికి ఆ పార్టీ తెల్ల ఏనుగులా తయారైంది. రాష్ట్రంలో పగ, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈపాటికి జైల్లో ఉండేవాడు. ఇప్పటికీ ఆయన జైలుకు వెళ్లొచ్చు..’అని అన్నారు. తొలుత మహారాష్ట్రలో జెండా ఎగరేస్తాం ‘ఇతర పార్టీలను బలహీన పరచడం, మేము బలపడటం లక్ష్యంగా బీఆర్ఎస్లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నాం. జాతీయ పార్టీగా తొలుత మహారాష్ట్రలో జెండా ఎగురవేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు సుమారు 30 ఏళ్లు పట్టింది..’అని గుర్తు చేశారు. కేసీఆర్‌కు దీటైన నేతలు లేరు ‘సీఎం కేసీఆర్‌కు దీటైన నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరు. పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేసీఆర్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రజలు ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కొత్త నమూనా ఆవిష్కరించడం ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యాయి. రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఆచరిస్తున్నాం. లింగ, కుల, మత వివక్ష లేకుండా పాలన సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమానికి నడుమ సమతూకం పాటిస్తున్నాం. అప్పులను రాష్ట్రంలో ఉత్పాదక రంగం, మౌలిక వసతులపై వెచ్చించాం. అన్ని రంగాల అభివృద్ధితో రాష్ట్రం, ప్రజల సంపద పెరిగింది. మా కంటే గొప్పగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వాలు ఏవీ లేవు..’అని కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ప్రతిపక్షాలది పైశాచికానందం ‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది 28 లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరదను కూడా తట్టుకుని నిలిచింది. ప్రాజెక్టులో లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత ఏజెన్సీ ద్వారానే మరమ్మతు పనులు జరుగుతాయి. ప్రజలపై ఎంత మాత్రం భారపడదు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బట్ట కాల్చి మామీదేయడం సరికాదు. గతంలో అన్నారం పంప్‌హౌస్ మునిగిన సమయంలోనూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందాయి..’అని కేటీఆర్ విమర్శించారు. -
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాల్లేవు
సాక్షి, హైదరాబాద్: ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవ ని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నా రు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఆయన శుక్రవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారే జీ తట్టుకుందని రజత్‌కుమార్ చెప్పారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పియర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ (సాధారణ) మురళీధర్, ఈఎన్సీ (పరిపాలన) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్రరావు, ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (కరీంనగర్) శంకర్, నీటిపారుదల అదనపు కార్యదర్శి భీం ప్రసాద్, సీడీవో సీఈ మోహన్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఏబీ పాండ్యా నేతృత్వంలో శనివారం బ్యారేజీని పరిశీలించనున్నట్లు రజత్‌కుమార్ చెప్పారు. -
ఇసుక పక్కకు జరగడం వల్లే..
సాక్షి, హైదరాబాద్: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్కూ నష్టం జరిగిందని చెప్పారు. పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు. -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో కుంగిన పిల్లర్
-
తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో కేంద్రబృందం భేటీ
-
2 గంటలు.. క్షుణ్ణంగా
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మంగళవారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు, అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్, డైరెక్టర్లు కె.శర్మ, తంగమణి, రాహుల్ కె.సింగ్ తదితరులు స్థానిక అధికారులతో కలిసి మధ్యాహ్నం 12.10 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది. రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం సభ్యులు కుంగిన బ్యారేజీని, రోడ్డును, బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే బ్లాక్‌లోని 15 నుంచి 22వ పియర్ వరకు, క్రస్ట్ గేట్ల పనితీరును తనిఖీ చేసినట్లు తెలిసింది. బృందం సభ్యులు 20వ పియర్ దగ్గరి నుంచి మహారాష్ట్ర వైపునకు కాలినడకన వెళ్లారు. కొలతలు తీసుకున్నారు. దిగువకు దిగేందుకు ప్రయత్నం చేసినా తేనె తుట్టెలు ఉండడంతో ఆగిపోయినట్లు సమాచారం. బ్యారేజీ వివరాలపై ఇరిగేషన్ అధికారులు, ఎల్అండ్టీ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీ కొనసాగింది. కానీ ఒక్క ఇరిగేషన్ శాఖ ఈఎన్సీతో తప్ప ఇతర అధికారులెవరితోనూ వారు మాట్లాడలేదు. తమ వెంట రానివ్వలేదు. తమ పరిశీలనలో ఏం తేలిందో కూడా వారు వెల్లడించలేదు. కాగా బ్యారేజీ పరిస్థితి, ఇతర వివరాలతో తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి బృందం సభ్యులు సమర్పించన్నారు. ఎల్అండ్టీ గెస్ట్‌హౌస్‌లో భోజనానంతరం ఈ బృందం అక్కడినుంచి వెనుదిరిగింది. కాగా బ్యారేజీ పరిస్థితి, సంబంధిత వివరాలను ఇరిగేషన్ శాఖ, ఎల్అండ్టీ సంస్థ గోప్యంగానే ఉంచుతున్నాయి. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన అధికారులను కూడా వద్దని నిలువరించినట్లు సమాచారం. కేంద్రం బృందం వెంట ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్‌టీ ప్రతినిధులు, స్థానిక ఇరిగేషన్, పోలీసు అధికారులు ఉన్నారు. మళ్లీ కుంగిన వంతెన! జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈనెల 21న సాయంత్రం భారీ శబ్దంతో ఓ అడుగు మేర కుంగడం కలకలం రేపింది. తెలంగాణతో పాటు పక్కనున్న మహారాష్ట్ర వాసులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల్లో మళ్లీ కొంతమేర వంతెన, పియర్ కుంగినట్లు తెలిసింది. అర మీటరు లోతుకు కుంగినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ నమోదు.. బ్యారేజీ కుంగిన ఘటనపై మహదేవపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పోలీసు స్టేషన్లలో అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో మహదేవపూర్ పోలీసులు 174/2023 యూ/ఎస్ ఐపీసీ 427, సెక్షన్ 3 పీడీపీసీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. జనం ఇబ్బందులు మేడిగడ్డ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి వరకు గోదావరిపై 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజీని నిర్మించారు. ప్రస్తుతం వంతెన కొంత కుంగడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వారంతా కాళేశ్వరం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం తెలంగాణ వైపు పత్తి, మిరప తోటలకు వచ్చే కూలీలు కూడా పని లేక ఇబ్బందులు పడుతున్నారు. రబీ పంటకు నీరెట్లా? మేడిగడ్డను ఖాళీ చేస్తుండటంతో రబీ పంటకు నీరెట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు రోజుల క్రితం వరకు బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన మహారాష్ట్ర ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే బ్యారేజీ 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిగా మరమ్మతులు చేసే వరకు ఇందులో నీటిని నిల్వ చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలోనే ఈసారి రబీ సీజన్లో ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మేడిగడ్డపై వాస్తవాలు వెలికి తీయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి ఎవరు బాధ్యులో తేల్చాలని కోరుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. బ్యారేజీ భద్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. కాగా గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి మేడిగడ్డ వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికి తీయా లని కేంద్రానికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి కోరారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవ డం దురదృష్టకరమని పేర్కొంటూ, 6వ బ్లాక్‌లోని గేట్ నంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయని తెలిపారు. పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపాక, బ్యారేజీ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు. సాగునీటి కోసం నిల్వ చేసిన నీళ్లన్నీ ఇలా వృ«థాగా కిందికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? లేదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా? వాటన్నింటినీ పరిశీలించాలని కోరారు. ఫౌండేషన్‌లో నాణ్యత లోపం ‘పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్య తతో నిర్మించలేదని స్పష్టమైంది. పియర్స్ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్ ట్రీట్మెంట్ జరగలేద నేది అర్థమవుతోంది. ఫౌండేషన్ తనిఖీ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్ట మవుతోంది..’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొ న్నారు. ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్ – కన్స్ట్రక్షన్) పద్ధతిలో కాంట్రాక్ట్ కంపెనీ చేసిందా? లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన సీడీవో (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా? అన్న విషయాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. -
లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడానికి సీఎం కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగిపోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావే పూర్తి బాధ్యత వహించాలని, ఏమాత్రం నిజాయితీ ఉన్నా సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ టెండర్ పిలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడు దల చేయాలని కోరారు. సోమవారం పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ...సీఎం కేసీఆర్‌కు నష్టపోయిన ప్రా జెక్ట్ చూపించేందుకు గానీ, ఏమైందో చెప్పేందుకు నిపుణు ల కమిటీ వేసి దానిని బయటకు వివరించే దమ్ముగానీ లేదన్నా రు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా త ప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇరిగేషన్ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన విషయా న్ని గుర్తు చేశారు. లక్ష్మీ బ్యారేజీని ఇసుక మీదనే ఫౌండేషన్ వేశారని, పిల్లర్ల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవటంతో ప్రాజెక్టు కుంగిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. ప్రాజెక్టు నింపే సమ యంలో కూడా వన్ బై ఫోర్త్ మొదట, హాఫ్ ట్యాంక్ రెండవసారి నింపుతారని చెప్పారు. కానీ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టు లీక్ అవుతున్నా కూడా పట్టించుకోలేదని ఈటల ఆరోపించారు. -
అనిల్ జైన్ నేతృత్వంలో పరిశీలించిన ఆరుగురు సభ్యుల బృందం
-
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది. బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుండి ఎనిమిదవ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో లక్ష్మీ బ్యారేజ్‌ను నిర్మించారు. 24 నెలల్లో బ్యారేజ్ నిర్మాణాన్ని ఎల్అండ్ టీ పూర్తి చేయగా, దీని నీటీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ పొడువు 1.6 కిలోమీటర్లు. -
మేడిగడ్డ డ్యాంపై ఆందోళన...!
-
ఇవాళ మేడిగడ్డ డ్యామ్ ను సందర్శించనున్న కేంద్ర బృందం
-
కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్‌ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా? -
కుంగిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పై స్పందించిన L అండ్ T కంపెనీ
-
మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్ధ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గితే ప్రమాదమేంటి? దానికి కారణమేంటి? అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉన్నట్టుండి నీటిని వదలడంతో గోదావరిలో, తీరం వెంట మేపుతున్న గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయని.. వ్యవసాయ మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. వంతెనపై రాకపోకలు నిలిపివేత బ్యారేజీ వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలను శనివారం రాత్రి నుంచే నిలిపివేశారు. బ్యారేజీ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి, బారికేడ్లు పెట్టి ఎవరూ రాకుండా చూస్తున్నారు. కుంగిన ప్రాంతం వద్దకు వెళ్లడానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు బ్యారేజీని పరిశీలించడానికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. తొలుత వారిని అడ్డుకున్న పోలీసులు తర్వాత బ్యారేజీ పరిశీలనకు అనుమతించారు. బ్యారేజీకి ప్రమాదం లేదు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించాక ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్అండ్టీ సంస్థ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పెద్ద శబ్ధం వచ్చిందని, ఇంజనీర్లు వెళ్లి పరిశీలించగా బ్యారేజీ పియర్ కుంగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 7వ బ్లాక్‌లోని 20వ పియర్ దెబ్బతిన్నదని.. అయితే పక్కన ఉన్న పియర్లపై దీని ప్రభావం ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని.. నెలన్నర రోజుల్లో పూర్వ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ నిర్వహణ బాధ్యతను ఎల్అండ్టీ సంస్థ చూస్తోందని.. ప్రస్తుతం మరమ్మతుల బాధ్యతనూ చేపడుతుందని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తామని.. కుంగిన చోట ఏం జరిగింది? సరిచేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది తేల్చుతామని వివరించారు. ఈ ఘటనలో దుష్ట శక్తుల హస్తం ఏదైనా ఉందో, లేదో తెలుసుకునేందుకు మహదేవపూర్తోపాటు మహారాష్ట్ర వైపు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రపంచ రికార్డు వేగంతో నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై రూ.1,849 కోట్ల వ్యయంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీని నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ కేవలం 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు, దీనికి 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 110 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన పియర్స్ (గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్ నిర్మాణం) మధ్య ఈ గేట్లను అమర్చారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నిర్మాణ సంస్థ తమ వెబ్సైట్లో పేర్కొనడం గమనార్హం. నేడు మేడిగడ్డకు డ్యాం సేఫ్టీ బృందం బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని ‘సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ నిపుణుల బృందం సోమవారం పరిశీలన జరపనుంది. కుంగిన ప్రాంతాన్ని సందర్శించి జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా మరమ్మతు పనులు చేపడతారు. వాస్తవానికి బ్రిడ్జిలు, బ్యారేజీలను బ్లాకులుగా నిర్మిస్తారు. పునాదుల పరంగా ఒక బ్లాక్‌కు మరో బ్లాక్‌తో సంబంధం ఉండదు. దీనివల్ల ఏదైనా బ్లాక్‌లో విపత్తు/ప్రమాదం ఎదురైతే మొత్తం బ్రిడ్జి/బ్యారేజీ దెబ్బతినకుండా సదరు బ్లాక్ వరకే నష్టం పరిమితం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా నిర్మించారు. తెలంగాణ వైపు నుంచి వాటికి నంబరింగ్ ఇచ్చారు. అలా మహారాష్ట్ర వైపు చివరన ఉన్నది ఏడో బ్లాక్. దీనిలోని 20వ నంబర్ పియర్ ప్రస్తుతం కుంగిపోయింది. దీని ప్రకారం ఏడో బ్లాక్ వరకు నష్టం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని.. పునాదికి నష్టం జరిగితే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల ‘డిఫెక్ట్ లయబిలిటీ (లోపాలుంటే సరిచేయాల్సిన బాధ్యత)’ సమయం ఇంకా పూర్తి కానందున.. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే మరమ్మతుల వ్యయం భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వచేసే అవకాశం ఉండదని అంటున్నాయి. -
కేంద్రం విచారణకు ఆదేశించాలి: రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రమాదానికి సీఎం కేసీఆర్ కుటుంబమే కారణమని.. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని వ్యాఖ్యానించారు. గతంలో పంపుహౌజ్‌లు మునిగితే వర్షాలను సాకుగా చూపారని.. మరిప్పుడు వంతెన ఎందుకు కుంగిపోయిందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి.. ఇప్పటికైనా విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర విజిలెన్స్‌తో విచారణ చేయించి, సిట్టింగ్ జడ్జి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు ప్రమాదమేంటి? లోపమేమిటన్న దానిపై చర్చించేందుకు తాను, సీఎల్పీ నేత భట్టి వస్తామని.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, కేటీఆర్ రావాలని సవాల్ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రమాదంపై గవర్నర్, ఈసీ స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని కేసీఆర్, కేటీఆర్ చెప్తుంటారని, ఇప్పుడేం చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రానికి కాళేశ్వరం గుదిబండగా మారబోతోందన్నారు. ప్రాజెక్టుకు స్వయంగా ప్లాన్లు్ల గీశానని కేసీఆర్ చెప్పారని.. భారీగా ప్రజాధనాన్ని గోదారి పాలు చేశారని విమర్శించారు. -
కాళేశ్వరం: పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎంతో కీలకమైంది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎల్అండ్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు మాట్లాడుతూ.. చీకటిగా ఉండటంతో ఏం జరిగిందనేది స్పష్టత లేదని తెలిపారు. 10.17 టీఎంసీల జలాలు 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’ -
7 నుంచి మేడిగడ్డ బ్యారేజీపై ‘మహా’ రైతుల నిరసన
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ బ్యాక్ వాటర్‌తో తమ పంట భూములు మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్రలోని సిరొంచ తాలూకాలోని 12 గ్రామాల రైతులు ఈ నెల 7నుంచి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సిరొంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టనున్నామని రైతు నేతలు సూరజ్ దూదివార్, రాము రంగువార్‌లు తెలిపారు. శుక్రవారం వారు అక్కడి విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మహారాష్ట్ర రైతుల విలువైన పంట భూముల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ఎకరానికి రూ.10.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు తెలిపారు. అప్పుడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసిన పంట భూముల కన్నా ప్రస్తుతం ఎక్కువగా నీట మునిగి తీవ్ర నష్టం ఏర్పడుతోందని పేర్కొన్నారు. తాజాగా ముంపు భూముల రైతులకు రూ.3 లక్షలే ఇస్తామంటున్నారని, తమకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వారంలో మేడిగడ్డ ఖాళీ?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని వారంలో పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించింది. దిగువ బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను పెంచుతూ, మేడిగడ్డలో అవసరమైన మరమ్మతులు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలనకు వీలుగా నీటినంతా దిగువకు పంపింగ్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి నాలుగు టీఎంసీల మేర నీటిని పంపింగ్ చేయగా, ఆది వారం సైతం ఏడు పంపుల ద్వారా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగింది. ఈ నీరంతా దిగువ అన్నారం (సరస్వతి), అటు నుంచి సుందిళ్ల (పార్వతి) మీదుగా ఎల్లంపల్లికి చేరుతోంది. అనుకున్న దానికన్నా ముందుగానే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటినంతా ఏప్రిల్‌లో ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయిం చింది. అయితే ప్రస్తుతం కాస్త ముందుగానే ఖాళీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు పెరగడం, లభ్యత తగ్గిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం సీజన్లో 45 టీఎంసీల నీటిని దిగువకు ఎత్తిపోయగా, ఈ వారం రోజుల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. బ్యారేజీలో 16.12 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, కొన్నిరోజుల్లో నీటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆదివారం సైతం ఏడు మోటార్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ అన్నారం తరలించారు. ఇదే రీతిని పంపింగ్ కొనసాగిస్తే వారంలో మేడిగడ్డ ఖాళీ కానుంది. ఇక్కడ కనీసంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. ఇప్పుడు ఖాళీ చేస్తేనే మార్చి నుంచి జూన్ ఆరంభం వరకు మూడు నెలలపాటు ఇసుకను తరలించవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ చేసిన అనంతరం బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అవసరమైన మరమ్మతులు సైతం చేయనున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో అన్నారంలో లభ్యత పెరగడంతో అక్కడ 10.87 టీఎంసీలకు గానూ 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీంతో ఇక్కడి పంప్‌హౌస్‌లోని 8 మోటార్లతో నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. సుందిళ్ల నుంచి మరో 4 పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లి చేరుస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 20.18 టీఎంసీలకు గానూ 8.30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ఖాళీ చేయనున్నారు. ఈ నీటితో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో నిల్వలను పెంచనున్నారు. అనంతరం వీలునుబట్టి నీటిని పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి పంపనున్నారు. -
ఒక్క చుక్క పోవద్దు : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్సారెస్పీ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పంపులు, కాల్వల ద్వారా చివరాఖరు ఆయకట్టు వరకు వ్యవసాయ భూములను తడిపేలా సునిశిత పర్యవేక్షణ చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కేసీఆర్ గురువారం కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు. నాణేలు వదిలి.. పుష్పాంజలి ఘటించి.. కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలోని గోదా వరి ఘాట్‌కు చేరుకున్న కేసీఆర్.. గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్య స్థలిని దర్శించుకున్నారు. ప్రాణహిత గోదారి గంగ పవిత్ర జలాలను తలపై చల్లుకుని నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గోదావరి ఘాట్ నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని పూజలు చేశారు. తర్వాత లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్ వద్ద నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నదీ జలాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎం.. బ్యారేజ్ మీద నుంచి నదీ జలాల్లో నాణేలు వదిలి, ఉద్యమ కాలం నాటి మొక్కు చెల్లించుకున్నారు. ‘సాగునీటి’పై అధికారులకు క్లాస్ మేడిగడ్డ వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం, నీటి సరఫరా విషయంలో ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్లెస్, వాకీటాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. సమాచారాన్ని ప్రతి క్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తోంది.. ఏ పంపు పోస్తోంది.. ఎంత నీరు ఎత్తిపోయాలి.. ఎప్పుడు ఆపాలే.. ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి’అని కేసీఆర్ తెలిపారు. అలా సమన్వయంతో పనిచేస్తేనే గోదావరి జలాలను నూరు శాతం సద్వినియోగపర్చుకోవడం సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజన అనంతరం కరీంనగర్ బయల్దేరారు. ముక్తేశ్వర స్వామికి పూజలు.. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు.. కాళేశ్వర క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐజీ నాగిరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు గండ్ర జ్యోతి, అలుగు శ్రీవర్షిణి, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. -
‘మేడిగడ్డ’లో పెరిగిన ముంపు!
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిధిలో ముంపు మరింతగా పెరిగింది. ఈ బ్యారేజీకి ఆనుకుని ప్రవహించే ప్రధానమైన నాలుగు పిల్ల వాగులు గోదావరిలో కలిసే చోట కరకట్టల నిర్మాణం జరగలేదు. దీంతో పంట చేన్లలోకి నిల్వ నీరు బ్యాక్ వాటర్ రూపంలో చేరుతోంది. తెలంగాణ, మహారాష్ట్రంలో వందల ఎకరాల్లో పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్ 21 నుంచి లక్ష్మీ బ్యారేజీలోని 85 గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రాణహిత ద్వారా వచ్చే నీటిని బ్యారేజీ వద్ద ఒడిసి పడుతున్నారు. ప్రాణహిత ద్వారా 2,200 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. లక్ష్మీ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. మంగళవారం సాయంత్రం వరకు 14 టీఎంసీలకు చేరింది. బ్యారేజీలో ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) 99 మీటర్ల వరకు చేరగా ఈనెల 14లోగా 100 మీటర్లకు చేర్చి పూర్తి సామర్ధ్యంతో నీటిని నిల్వ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాకాలంలోనే.. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసి భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.5 టీఎంసీల వరకు మాత్రమే నిలిపారు. అప్పుడు పాణహిత, గోదావరి ద్వారా వచ్చే వరద ప్రవాహంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో బ్యాక్ వాటర్ మొత్తం ఇరురాష్ట్రాల్లోని బ్యారేజీ సరిహద్దులోని పంట చేలలోకి చేరాయి. అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీలోని 85 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ఆ సమయంలో రోజుకు 3 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వృథాగా తరలిపోయింది. తెలంగాణ, మహారాష్ట్రాలలో పంట నష్టం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో నిర్మించారు. గోదావరి అవుతలి వైపు1.6 కిలోమీటర్ల దూరం వరకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి ఒడ్డుపైకి మేడిగడ్డ బ్యారేజీ వ్యాపించి ఉంది. ఈ నిర్మాణం కోసం మండలంలోని అంబట్పల్లిలో 698 ఎకరాలు, మహారాష్ట్ర వైపున 568 ఎకరాల వరకు భూసేకరణ చేసి రైతులకు పరిహారం అందజేశారు. ప్రస్తుతం నవంబర్ 21 నుంచి మేడిగడ్డ గేట్లు పూర్తిగా మూసివేయడంతో బ్యాక్‌వాటర్ నిల్వ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రోజుకు 0.2 టీఎంసీ చొప్పున నీరు పెరుగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 14 టీఎంసీల నీరు చేరడంతో పంట చేనుల్లోకి నీరు అధికంగా చేరిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహదేవపూర్ మండలంలో ఇంజనీరింగ్ అధికారులు పంట నష్టంపై సర్వే చేపట్టారు. రైతులు అధైర్యపడొద్దు కాళేశ్వరం ప్రాజెక్టులోనే కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. ఇందులో పూర్తి 100 ఎఫ్ఆర్ఎల్ నీరు నిల్వ చేసేందుకు టెస్టింగ్ చేస్తున్నాం. వర్షాకాలంలో పూర్తి సామర్థ్యం చూడలేం. ఇప్పుడు సాధ్యమైంది కనుక బ్యారేజీలో 100 ఎఫ్ఆర్ఎల్ వరకు నీరు చేరితే ఎంత వరకు ముంపునకు గురవుతుందనేది సర్వే ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో 190, మహారాష్ట్రలో 40 ఎకరాల్లో పంట నష్టం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా రైతులకు పరిహారం చెల్లిస్తాం. ముంపు భూములను తీసుకోవడానికి కూడా సీఎం అనుమతి తీసుకున్నాం. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లోని రైతులు అధైర్యపడొద్దు. – నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎన్సీ బ్రాహ్మణపల్లిలో నీట మునిగిన మిర్చి పంటను చూపుతున్న రైతు -
కాళేశ్వరం కదా.. కలెక్టర్లు ఫిదా!
సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అద్భుతమని, అతి తక్కువ సమయంలో నిర్మించిన ప్రాజెక్టు తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్మాణ స్ఫూర్తితో జిల్లాల్లో సంక్షేమాభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని వారు తెలిపారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని వార్తాపత్రికల్లో చదవడమే తప్పితే నేరుగా చూసింది లేదని, ఇన్నాళ్లకు తమ కోరిక తీరిందని అన్ని జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ (మేడిగడ్డ)బ్యారేజ్, లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లను సందర్శించారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కలెక్టర్లందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి రావాలని సూచించారు. పర్యటనలో భాగంగా మంగళవారం హన్మకొండలో విడిది చేసిన కలెక్టర్లు బుధవారం ప్రత్యేక బస్సులో జిల్లాకు చేరుకున్నారు. కాళేశ్వరం రాచబాట కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ కల అని, బంగారు తెలంగాణ ఏర్పాటుకు కాళేశ్వరం రాచబాట అని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరును సమీక్షిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్లందరికీ వివరించారు. కేవలం 29 నెలల్లోనే ప్రాజెక్టు నిర్మించిన తీరును చూసి కలెక్టర్లందరూ ప్రేరణ పొందుతున్నారని సోమేశ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు ఇది అవుతుందా అని అనేకమంది సందేహాలు లేవనెత్తారని అలాంటిది సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సోమేశ్ కుమార్ వివరించారు. బ్యారేజ్, పంప్‌హౌస్‌ల సందర్శన ప్రాజెక్ట్‌పై ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించిన సమావేశం అనంతరం కలెక్టరందరూ మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. మందుగా మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన కలెక్టర్లకు ఇంజనీర్లు నిర్మాణం, నీటి ప్రవాహం, గేట్ల పనితీరును వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన కలెక్టర్లు మోటార్ల పనితీరును, నీటి లభ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్ నుంచి నీటిని గ్రావిటీ కెనాల్లోకి వదిలే డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజలు.. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం చేరుకున్న పాలనాధికారులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. -
మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సందర్శించారు. అధికారులు, ఇంజనీర్లతో కలిసి బ్యారేజీ వద్ద గోదావరి వరదను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక మేడిగడ్డ సందర్శన అనంతరం కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్, ఆ తర్వాత ఎల్లంపల్లి బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు నిరసనగా.. ‘మా నీళ్లు మాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి ఇంచార్జి కన్నం అంజన్న వెల్గటూరులో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇక ధర్మపురి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడనున్నారు. -
6వ మోటార్ ట్రయల్ రన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో వేగం పెరిగింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో సీఎం ప్రారంభించనున్న 6వ మోటార్‌కు అధికారులు మంగళవారం అర్ధరాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. మిగితా మూడు మోటార్లకు గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే.. మేడిగడ్డ వద్ద హోమశాల, అక్కడే వీఐపీలు కూర్చునేందుకు ప్రాంగణం ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ల నుంచి హోమశాలకు వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్లు నిర్మించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు కూర్చునే ప్రాంగణం పూర్తి కావచ్చింది. భోజనాలు చేసే స్థలంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వంటశాల నిర్మాణం పూర్తికావచ్చింది. వీవీఐపీల కోసం ఏసీ బస్సులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీవీఐపీలు హెలిప్యాడ్ల నుంచి బ్యారేజీ, పంపుహౌస్‌లకు చేరుకోవడానికి కన్నెపల్లిలో 6 క్యాంపరింగ్ వ్యాన్ బస్సు (కార్విన్)లను ఏర్పాటు చేశారు. వీటిలో ఏసీతోపాటు వీవీఐపీలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉన్నాయి. బ్యారేజీ, పంపుహౌస్‌ల్లో శిలాఫలకం రెడీ! మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో ముఖ్య అతిథులు ఆవిష్కరించడానికి శిలాఫలకాల నిర్మాణం పూర్తి కావచ్చింది. ముగ్గురు సీఎంలతో పాటు గవర్నర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రొటోకాల్ సభ్యుల పేర్లు వాటిపై ఏర్పాటు చేయనున్నారు. రాత్రికి రాత్రే.. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో రాత్రికి రాత్రే అంతర్గత రోడ్లు వేస్తున్నారు. సీఎంలు, మంత్రుల కాన్వాయ్ వెళ్లే వీలుగా బీటీ రోడ్లు వేస్తున్నారు. ఈరోజు చూసింది.. మరునాడు కనిపించకుండా మారిపోతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో హోమశాల, బ్యారేజీలు, ఆవలి వైపు భద్రత, కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు, వంటశాల, క్యాంపు కార్యాలయం, అప్రోచ్‌కెనాల్, ఫోర్‌బే తదితర స్థలాల్లో భద్రతను జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏఎస్పీ సాయిచైతన్యతో కలసి పరిశీలించారు. 16 హెలిప్యాడ్లు సిద్ధం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో మొత్తం 16 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఇంతకు ముందు 12 మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఆ సంఖ్య 16కు చేరింది. తెలంగాణ వైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో 7 నిర్మించగా, మరొకటి మహారాష్ట్ర వైపు పోచంపల్లి గ్రామంలో ఒకటి, కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 9 హెలిప్యాడ్ సిద్ధమయ్యాయి. మరిన్ని హెలిప్యాడ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
3 పంపులతో ఆరంభం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని 3 పంపులతో ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణహిత నదిలో వరద ప్రవాహాలు ఇంకా పుంజుకోని నేపథ్యంలో ఈ నెల 21న ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా 3 పంపులను ప్రారంభించి, అనంతరం వరద ప్రవాహాలకు అనుగుణంగా పంపులను ఒక్కొక్కటిగా ఆరంభిస్తూ పోవాలని నిర్ణయించింది. జూలై నుంచి ప్రవాహాలు ఉధృతంగా ఉండే నేపథ్యంలో ఆ నెల 20 నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అన్ని పంపులను సిద్ధం చేసి బ్యారేజీలను నింపుతూనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. వరద రాకున్నా పంపింగ్‌కు ఏర్పాట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటి గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో మోటార్ల బిగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. అత్యంత ముఖ్యమైనదీ, తొలి పంప్‌హౌస్ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 పంపు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 9 సిద్ధమయ్యాయి. మరో రెండింటినీ వచ్చే నెలలో పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో పంపు గరిష్టంగా 2,118 క్యూసెక్కులు (0.182 టీఎంసీ) నీటిని తోడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులతో గరిష్టంగా 2 టీఎంసీలని తోడే సామర్థ్యమున్నా, ప్రస్తుతం గోదావరిలో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని 3 మోటార్లను ఆరంభించి నీటి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మేడిగడ్డ వద్ద 100 మీటర్ లెవల్లో ప్రవాహాలు కొనసాగితే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మోటార్లను ఆన్ చేసి కనీస నీటిని ఎత్తిపోయాలన్నా 93 మీటర్ల మట్టంలో నీరుండాలి. కానీ ప్రస్తుతం రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా ప్రాణహితలో ప్రవాహాలు లేకపోవడంతో గోదావరి వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల మేర కొనసాగుతున్న నీటి ప్రవాహాలకి క్రాస్ బండ్ ద్వారా అడ్డుకట్ట వేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం 95 మీటర్ల మట్టం నీరుంది. 21 నాటికి ఈ మట్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ లెవల్లో ఉన్న నీటితో మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 3 మోటార్లు ఆరంభించి గరిష్టంగా 6 వేల క్యూసెక్కులు (సుమారు అర టీఎంసీ) నీటిని గ్రావిటీ కెనాల్‌కు వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రావిటీ కెనాల్ పనులన్నీ పూర్తయ్యాయి. అడ్డుకట్ట ద్వారా నిలిచే నీటిని వినియోగిస్తూ మేడిగడ్డ పంప్‌హౌజ్ నుంచి అన్నారం, సుందిళ్లకు వదిలి అక్కడి మోటార్లను ఒక్కొక్కటిగా ఆరంభించాలని, జూలై నుంచి ప్రవాహాలు పెరుగుతున్న కొద్దీ మోటార్ల సంఖ్యనూ పెంచుతూ పోవాలని భావిస్తున్నారు. అన్నారంలో 4.47 టీఎంసీల నిల్వ... మేడిగడ్డ నుంచి 8 రోజుల పాటు నీటిని పంపింగ్ చేస్తే 10.87 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నారం పంప్‌హౌజ్‌లో 4.47 టీఎంసీల మేర నిల్వలు చేరతా యి. అప్పుడే ఇక్కడి పంపు మోటార్లను ఆరంభించే అవకాశం ఉంది. అన్నారంలో ఇప్పటికే 8 మోటార్ల లో 5 సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 2 మోటార్లను ఆరంభించి వచ్చే నెల చివరి నుంచే సుందిళ్ల బ్యా రేజీకి నీటిని పంపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇక 8.83 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్లలో 4.25 టీఎంసీల నీరుంటేనే అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు సాధ్యపడనుంది. ఇప్పటికే సుందిళ్లలో 9 మోటార్లలో 6 రెడీ అయ్యాయి. ఇందులోనూ తొలుత 3 మోటార్లతో ఆరంభించి వరద పెరుగుతున్న కొద్దీ మొత్తం మోటార్లను నడపాలని భావిస్తున్నారు. జూలై 20 నాటికి వరద తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున, అప్పటికీ అన్ని మోటార్లను ఆరంభించి నిర్ణీత 2 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీని జూలై చివరికి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి తరలించి ఆయకట్టుకు నీరివ్వాలని, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరు నుంచి దిగువ కొండపోచమ్మ సాగర్ వరకు తరలించాలని నిర్ణయించారు. ప్రొటోకాల్ అంశంపై సీఎస్ చర్చ.. కాగా 21న కాళేశ్వరం పథకం ఆరంభ కార్యక్రమానికి సంబంధించిన ప్రొటోకాల్ అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇరిగేషన్ శాఖ సహా ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవానికి వచ్చే ఆహ్వానితులు, వారి వసతులు, హెలీ ప్యాడ్, ఆహ్వాన పత్రికలు వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, విద్యాసాగర్‌రావు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రొటోకాల్ ఎలా ఉండాలన్న దానిపై పలు నిర్ణయాలు చేసినట్లు సమాచారం. -
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్
సాక్షి, జగిత్యాల: రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు (మంగళవారం) ఎస్సార్సెస్పీ పునర్జీవ పథకం పనులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా మొదట ఆయన జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ పంప్‌హౌస్ మొదటి మోటర్‌కు ఇటీవల డ్రైరన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని అక్కడి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రాజెక్టు పరిసరాల్లో తిరిగి.. పనులు జరుగుతున్న తీరును స్వయంగా తెలుసుకున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి.. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
20న ముహూర్తం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల చివరి నుంచి ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఒక టీఎంసీ నీటిని మిడ్‌మానేరు కింది అవసరాలకు, మరో టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథక సాగు అవసరాలకు మళ్లించేలా అన్ని పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పనులను మంగళవారం పరిశీలించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి ఎత్తిపోతలపై అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. వరద ఉధృతమయ్యే నాటికి అంతా సిద్ధం... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 200 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తవగా, పంప్‌హౌజ్‌ల్లో మోటార్ల బిగింపు పాక్షికంగా పూర్తయింది. గోదావరిలో వరద మొదలవగానే నీటిని ఎత్తిపోసేలా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు 6, అన్నారంలో 8లో 5, సుందిళ్లలో 9లో 6 మోటార్ల బిగింపు పూర్తయింది. మిగతా వాటిని వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో బిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగింపు పూర్తయిన మోటార్లకు ఈ నెల మొదటి వారంలోనే వెట్‌రన్ నిర్వహించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నెల రెండో వారంలో అన్ని పంపులకు ఒకేమారు వెట్‌రన్ నిర్వహించి, అవి ఫలప్రదం అయిన వెంటనే నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 20 నుంచి మేడిగడ్డ లిఫ్ట్ ద్వారా రోజుకి 0.55 టీఎంసీల నీటితో మొదలు పెట్టి, క్రమంగా వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి అన్నారం, వచ్చే నెల 4 నుంచి సుందిళ్ల మోటార్ల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి దాన్ని పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లలో 4 పూర్తవగా, ప్యాకేజీ–8లో 7కు గానూ 5 పూర్తయ్యాయి. మిగతా వన్నీ వచ్చే నెలలో పూర్తవనున్నాయి. జులై 20 నాటికి ప్యాకేజీ– 8 ద్వారా మిడ్‌మానేరుకు ఒక టీఎంసీ, మరో టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి తరలించేలా ప్రస్తుతం కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే రెండు పంప్‌హౌజ్‌ల్లో రోజుకు 0.65 టీఎంసీ నీటిని ఎత్తిపోసి కనిష్టంగా 55 టీఎంసీలు ఆయకట్టుకు తరలించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నీటితో ఎస్సారెస్పీ కింది 9 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశాలున్నాయి. ఇక మిడ్‌మానేరు కింద కొత్తగా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలిస్తూనే చెరువులన్నీ నింపనున్నారు. సీఎం పరిశీలన.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లో మొదటి మోటర్‌కు ఇటీవల డ్రైరన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను సీఎం పరిశీలించి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా మరోమారు డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. నేడు సీఎం షెడ్యూల్ ఇలా... ► ఉ. 6 గంటలు: ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. ► ఉ. 7 గంటలు: హెలిక్యాప్టర్‌లో రాంపూర్ చేరుకొని పంపులను పరిశీలిస్తారు. ► ఉ. 7.45: మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని అక్కడి పనులను పరిశీలించి మార్గనిర్దేశం చేస్తారు. ► ఉ. 11.45 గంటలు: మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. -
‘కాళేశ్వరం’ బాటలో సీఎం
-
డెడ్‌లైన్ మార్చి 31
సాక్షి, భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్‌లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. మేడిగడ్డ నిర్మాణ పనులపై అసంతృప్తి.. కాగా మేడిగడ్డ బ్యారేజీ పనులపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ముందుగా మేడిగడ్డ చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనులను దగ్గర నుంచి పర్యవేక్షించారు. మార్చి 31లోగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎల్అండ్టీ అధికారులకు సీఎం సూచిం చారు. కొన్ని సమస్యలు నెలకొంటున్నం దున మరో 15 రోజులు గడువు పెంచాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ 15లోగా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి విన్నవించారు. మార్చి 15లోగా కరకట్ట పనులు పూర్తి చేస్తామని సీఎండీ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రాజెక్ట్ ఉండాలని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలి... తర్వాత కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. పంప్‌హౌస్ నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లో భాగంగా 11 మోటర్లకు గాను ప్రస్తుతం నాలుగు బిగించినట్లు వారు తెలిపారు. మార్చి 15 నాటికి మిగతా వాటిని బిగించి డ్రైరన్ నిర్వహిస్తామని వివరించారు. జూన్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని మోటార్లను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే నదికి కాపర్ డ్యాం నిర్మించి వెట్‌రన్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి గ్రావిటీ కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. గ్రావిటీ కెనాల్ లైనింగ్, స్ట్రక్చర్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అప్రోచ్ కెనాల్లో గైడ్బండ్లు నిర్మించాలని, మట్టి పనులు పూర్తి చేయాలన్నారు. ఫ్లడ్బంకుల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. పనులు సమాంతరంగా సాగాలి... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీ నిర్మాణంతో పాటు పంపుహౌస్, మోటార్ల ఏర్పాటు పనులన్నీ సమాంతరంగా పూర్తికావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదికి ఇరువైపులా ఉండే ఫ్లడ్ బ్యాంకుల పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్మెంట్ పనులను జలాశయ మట్టందాకా పూర్తి చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కాంక్రీటు వర్క్ రోజుకు 10,000 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన కేసీఆర్ హెడ్ రెగ్యులేటర్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను సవరించాలని సూచించారు. సముద్రమార్గం ద్వారా చెన్నై పోర్టుకు చేరుకున్న మోటార్లను తెప్పించి వెంటనే బిగించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను సీఎంఓ సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని తెలిపారు. సీఎంను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను టీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబం«ధించిన వినతులు అందించారు. కాళేశ్వరం నీటిని మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు అందించాలని కోరారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, సీఎంఓ ప్రత్యేకాధికారిణి స్మితా సభర్వాల్, ప్రాజెక్ట్ సీఈఓ నల్లా వెంకటేశ్వర్లు, ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూర్లో హరీశ్‌రావు మిస్.. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు బాటలో భారీ నీటి పారుదల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2016, మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసినప్పటి నుంచి హరీశ్ ప్రాజెక్టులపైన తనదైన మార్క్ వేసుకున్నారు. సంవత్సర కాలంలో సుమారు తొమ్మిదిసార్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు గ్రావిటీ కాల్వ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంప్‌హౌస్‌లను చుట్టేశారు. తనదైనశైలిలో ప్రాజెక్టులను రాత్రిపగలు తేడా లేకుండా పర్యటిస్తూ పనులను పరుగులు పెట్టించాడు. 2016, మే 2.. 2017, డిసెంబర్ 7న సీఎం రెండుసార్లు పర్యటించగా.. హరీశ్‌రావు ఆయనతో వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట హరీశ్‌రావు లేకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో తమ గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని.. ఈ మేరకు ఆర్అండ్ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బ్యారేజీ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను అడ్డుకోవాలని యత్నించిన కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి వాసులను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ నేటి పర్యటన.. ముఖ్యమంత్రి బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కాల్వ, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించనున్నారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వసతి గృహం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 13.02 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించి అన్నారం బ్యారేజీ చేరుకుంటారు. మంగళవారం రోజునే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీì కాల్వ, అన్నారం బ్యారేజీలు పరిశీలించాల్సి ఉండగా.. సమయాభావం కారణంగా బుధవారానికి వాయిదా పడినట్లు కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. -
కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్
సాక్షి, భూపాలపల్లి/పెద్దపల్లి: రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మేడిగడ్డకు చేరుకున్న కేసీఆర్ ప్రాజెక్టు పనుల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పట్టిలోగా పూర్తవుతాయని ఆరా తీశారు. బ్యారేజీ పనులు సకాలంలో పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ పంపుహౌస్ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజీ పనులను కేసీఆర్ పరిశీలించారు. కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన సీఎం మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్ అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్ అధికారులను అడిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. పంపుహౌజ్ పనుల పురోగతిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆయన అన్నారం బ్యారేజీకి చేరుకోనున్నారు. కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన కేసీఆర్‌ను మేడిగడ్డ పంపుహౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో సీతక్క, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలు ఉన్నారు. -
రెండోరోజూ ఆగిన ‘మేడిగడ్డ’ పనులు
మహదేవపూర్: మహారాష్ట్రలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటి కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నదిలో నిర్మిస్తున్న బ్యారేజీ గేట్ల మధ్యన తవ్వకం చేపట్టిన ప్రదేశాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. అలాగే బ్యారేజీ పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ క్యాంపు కార్యాలయం, ఇంజనీర్ల కంటెయినర్లు, కార్మికులు నివాసం ఉండే షెడ్లలోకి నీరు చేరింది. నిల్వ నీటిని రెండు రోజుల పాటు భారీ మోటార్లతో తోడితే తప్ప పనులను చేపట్టే పరిస్థితి కనిపించడంలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. వర్షాలు, నదుల ప్రవాహం తగ్గితేనే బ్యారేజీ నిర్మాణ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ పనులు వర్షం కారణంగా శుక్రవారం నిలిచిపోయిన విషయం తెలిసిందే. శనివారం వరద ఉధృతి కొంత తగ్గడంతో కాంక్రీట్ పనులు మాత్రం నడుస్తున్నాయి. పిల్లర్ల చుట్టూ చేరిన నీటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. -
వర్షాలతో దిగువకు భారీ వరద
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. ఎగువ నీరంతా గోదావరి వైపు ఉరకలెత్తి వస్తోంది. ప్రాణహితకు 2.25 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఉండటం, అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. ఐదు రోజుల కిందట వరకు ప్రాణహిత నదికి 3 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, 3 రోజుల కిందట అది 7 వేలకు చేరింది. మంగళవారం కాళేశ్వరం వద్ద వరద 36 వేల క్యూసెక్కుల మేర నమోదు కాగా, బుధవారం ఒక్కసారిగా 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. 2016లో ఇదే సమయానికి ఈ స్థాయి వరద రాగా, ప్రస్తుతం అంతకు మించి కొంత ఎక్కువ వరదే వస్తోంది. ప్రాణహిత నది నుంచి భారీగా ప్రవాహాలు వస్తుండటంతో మున్ముందు వరద పెరిగే అవకాశాలున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పనులపై ప్రభావం ప్రాణహిత వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడింది. వరద ప్రవాహం వల్ల కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. మంగళ వారం ఇక్కడ 3,009 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగ్గా, బుధవారం ఒక్క క్యూబిక్ మీటర్ పనికూడా జరగలేదు. ప్రాణ హిత గోదావరిలో కలవక ముందు ప్రాంతంలో నిర్మి స్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు యథావిధిగా కొనసాగాయి. బుధవారం అన్నారం పరిధిలో 2,315 క్యూ.మీ., సుందిళ్ల పరిధిలో 2,596 క్యూ.మీ. పనులు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో గోదావరి నది నుంచి మహారాష్ట్ర వైపునకు రాకపోకల కోసం రోడ్డు వేయగా, ప్రస్తుత వరదలతో పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నియంత్రణకు కాఫర్ డ్యామ్ నిర్మించాలని భావించగా, తెలంగాణ వైపు (కుడి) పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర వైపు (ఎడమ) పనులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు సాగక పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పాటే 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. వీటిని 8 బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం వరద నేపథ్యంలో 4 బ్లాకుల్లోని పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ పంప్‌హౌజ్ పరిధిలోని 13 కి.మీ. గ్రావిటీ కెనాల్‌లోనూ నీళ్లు చేరడంతో అక్కడ పనులు నెమ్మదించాయి. 60 హెచ్‌పీ మోటార్లు 6 ఏర్పాటు చేసి డీ వాటరింగ్ చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో నిన్నమొన్నటి వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగవ ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరగ్గా, బుధవారం నుంచి క్రమంగా తగ్గాయి. మంగళవారం 21 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా, బుధవారం ఉదయానికి 13 వేల క్యూసెక్కులకు చేరాయి. సాయంత్రానికి 5,050 క్యూసెక్కులకు చేరాయి. మహారాష్ట్ర బాబ్లీ గేట్లను తిరిగి ఈ నెలాఖరున ఎత్తిన తర్వాతే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంటుంది. సింగూరులోకి 2,113 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలో 2,040, కడెంలో 1,860 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఇక కృష్ణా బేసిన్లో తుంగభద్రలోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాలకు 2,700 క్యూసెక్కుల వరద వస్తోంది. -
కాళేశ్వరం కాంక్రీట్ పనుల్లో రికార్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనుల్లో వేగం పెరిగింది. గత కొన్ని నెలలుగా మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో సగటున 1,169 క్యూబిక్ మీటర్ల మేర పనులు జరగ్గా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్ 7న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన సమయానికి 77,946 క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయని... ప్రస్తుతం నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగినట్లు నీటిపారుదలశాఖ వెల్లడించింది. కాంక్రీట్ పనుల్లో వేగం పెరగడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ సంస్థ, ఇరిగేషన్ యంత్రాంగాన్ని ఆదివారం ఓ ప్రకటనలో అభినందించారు. ఇదే పట్టుదల, వేగాన్ని కొనసాగించాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు, ఇతర ప్రభుత్వశాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమష్టిగా పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అతితక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణం....ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను చరిత్రలో తిరగరాస్తుందన్నారు. -
ప్రాణం పోయినా పంట భూములు ఇవ్వం
మహదేవపూర్: మేడిగడ్డ బ్యారేజీకి అవసరమైన సామగ్రి, యంత్ర పరికరాలను తరలించేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ప్రాణాలు పోయినా పంట భూములను ఇచ్చే ది లేదని బెగులూరు, సూరారం రైతులు తేగేసి చెప్పారు. బ్యారేజీ వల్ల ముంపునకు గురవుతున్న పంట భూముల ను ఇవ్వాలని గతంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ప్రాజెక్టు సీఈ, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడిగిన సమయంలో గోదావరిలో కోతకు గురైన తమ పట్టా భూములకు కూడా ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా అంగీకరించారని, ఇప్పుడు మాట మార్చి ఎకరానికి రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి మాయ చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేశారని, కొంత మేర దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం పనులను చేపట్టారని రైతులు మండిపడ్డారు. బెగులూరు గ్రామ శివారులో 78 ఎకరాలు, సూరారం శివారులో 48 ఎకరాలు కోతకు గురై గోదావరిలో కలిసింది. ఇప్పటికే బినామీ పేర్లతో పంట భూములు కొనుగోలు చేసి భూసేకరణలో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో గోదావరి ముంపు భూముల సమస్య తెరపైకి రావడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. పంట భూములు ఇచ్చేది లేదు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో గోదావరిలో కలిసిపోయిన పట్టా భూములకు కూడా పరిహారం చెల్లిస్తామని మాట ఇచ్చిన అధికారులు రైతులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే పంట భూములు ఇచ్చేది లేదు. –బుర్రి శివరాజు, రైతు ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలి మేడిగడ్డ బ్యారేజీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ యోగ్యమైన భూమికి చెల్లిస్తున్న విధంగా గో దావరిలో కలిసిపోయిన భూమికి కూడా రూ.10.50 లక్షలు చెల్లిస్తేనే భూములు ఇస్తాం. లేకపోతే అధికారులను పంట భూముల్లో కాలుపెట్టనివ్వం. –పంతంగి రాజయ్య,సింగిల్ విండో డైరెక్టర్ దౌర్జన్యం చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం రూ.82 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీద రైతులకు ఎకరానికి రూ.10.50 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రాణాలు పోయినా సరే పంట భూములను ఇవ్వంగాక ఇవ్వం. దౌర్జన్యంగా పంట భూములను లాక్కుంటే కోర్టుకెళ్తాం. –పంతంగి తిరుపతి, రైతు -
కాళేశ్వరానికి 1,300 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కి ఆంధ్రాబ్యాంకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ కన్సార్షియంలో లీడ్ బ్యాంకుగా వ్యవహరించేందుకు గతంలోనే ఆంధ్రాబ్యాంకు ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.17,500కోట్లలో రూ.7,400 కోట్ల టర్ము లోను ఇవ్వడానికి అంగీకరించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం (లింక్–1)కు అవసరమైన రూ.9,250 కోట్ల నిధులపై కేఐపీసీ ప్రతిపాదనలను బ్యాంకుకు అందజేసింది. దీంతో రూ.1300 కోట్ల టర్ము లోనును మం జూరు చేస్తూ నిబంధనలను ప్రభుత్వానికి తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో 20% మార్జిన్ మనీగా రూ.325కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
101 మీటర్లకు ‘మహా’ ఓకే
- మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం - 102 మీటర్లకు అంగీకరించాలన్న తెలంగాణ - సీఎంల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదన - మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో హరీశ్ చర్చలు - అంతర్రాష్ట్ర బోర్డు భేటీకి వచ్చేందుకు ఫడ్నవిస్ సుముఖం - మేడిగడ్డ డిజైన్లు, ప్రణాళికలు రెండు రాష్ట్రాల సీడీఓల పరిశీలనకి.. - నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర సీఎం భేటీ! సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. 102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని తెలంగాణ కోరగా.. 101 మీటర్లకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. 102 మీటర్ల ఎత్తుపై ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే సమావేశంలో చర్చించి తుది నిర్ణయం చేద్దామని ప్రతిపాదించింది. అలాగే సీఎంల స్థాయిలో ఏర్పాటైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సానుకూలత తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అంశంపై చర్చించేందుకు ముంబై వెళ్లిన భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం సాయంత్రం సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో త్వరలో జరిగే అంతర్రాష్ట్ర బోర్డు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సమావేశం తేదీని నిర్ణయించాలని కోరారు. ఈ భేటీలో పాల్గొంటానని ఈ సందర్భంగా ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికలు, ఇతర సాంకేతిక వివరాలను రెండు రాష్ట్రాల సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ఇంజనీర్లు ఖరారు చేసుకోవాలని, బోర్డు సమావేశంలో సీడీఓ అధికారులిచ్చే నివేదికను తుది ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం మంత్రి హరీశ్ మహారాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి గిరీశ్ మహజన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంబరీష్ ఆత్రం, ముఖ్య కార్యదర్శి ఐఎస్ చహాల్, సీఈ చౌహాన్లు పాల్గొన్నారు. మహారాష్ట్రకు ముంపు సమస్య లేదు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీతో గడ్చిరోలీ జిల్లా సిరోంఛ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దుల్లో కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నట్లు మంత్రులు నిర్ధారించుకున్నారు. అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంకల్పించారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్ర గ్రామాలకు పెద్దగా ముంపు సమస్యలేదని మంత్రి హరీశ్ ఈ సందర్భంగా వివరించారు. ఈ వాదనతో మహారాష్ట్ర ఏకీభవించింది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని లెండి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరగా.. అందుకు గిరీశ్ మహ జన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో 25 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని, 25 వేల హెక్టార్లలో భూములు ముంపునకు గురవుతాయంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండటాన్ని ఖండించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాంతానికో విధానం, రాష్ట్రానికో సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అవలంబిస్తోందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు సంయుక్తంగా లైడార్ సర్వేలు నిర్వహించిన అనంతరమే ప్రాజెక్టు నిర్మాణంపై అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. నేడు ఫడ్నవీస్, కేసీఆర్ భేటీ! మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలోనే ఉన్న సీఎం కే సీఆర్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరువురు సీఎంల మధ్య మేడిగడ్డ ఎత్తు, ముఖ్యమంత్రుల సమావేశం తేదీ, ఒప్పందాల ఖరారు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
మేడిగడ్డకు త్వరలోనే శంకుస్థాపన
► మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ► శంకుస్థాపనకు రానున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం క్యాంపు కార్యాలయంలో తనను కలవడానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం మాట్లాడారు. ముంబై పర్యటన విజయవంతమైందని, మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన చేస్తామని, ఈ కార్యక్రమానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఈ రెండు జిల్లాలు గోదావరి జిల్లాలుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం వస్తుందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌తో ఎస్సారెస్పీకి కూడా మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీరు పంపించవచ్చని, ఉత్తర తెలంగాణతో పాటు అవసరమనుకుంటే దక్షిణ తెలంగాణకు నీటిని అందించేలా ప్రాజెక్టులు డిజైన్ చేసుకోవాలని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా పెద్ద మొత్తంలో నీరు గోదావరిలో కలుస్తోందని, ఏడాదికి సగటున2,423 టీఎంసీల నీరు దిగువకు పోతోందని సీఎం చెప్పారు. ఈ నీటిని పంట పొలాలకు అందించటమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిపై దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి జగన్నాథపురం, రోళ్లపాడు రిజర్వాయర్ల ద్వారా జిల్లా మొత్తానికి నీరందించగలుగుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూసేకరణ తదితర పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బోధన్ వరకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ మేరకు మంగళవారం గడ్కరీతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-బోధన్ రహదారిలో రద్దీ ఎక్కువైందని, అందుకే జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. బోధన్ నుంచి ఇప్పటికే మహారాష్ట్రకు జాతీయ రహదారి ఉన్నందున 2 రాష్ట్రాల మధ్య రవాణాకు ఇది దోహదపడుతుందని సీఎం చెప్పారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వివరించి, ఒప్పందానికి సహకరించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మహారాష్ట్ర గవర్నర్‌కు కృతజ్ఞతలు అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదరడంలో ముఖ్య పాత్ర పోషించటంతో పాటు సహకరించిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన రాజ్‌భవన్‌లో విద్యాసాగర్‌రావును కలిశారు. మేడిగడ్డ బ్యారేజీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. -
మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం
హైదరాబాద్: త్వరలో జరగబోయే మేడిగడ్డ బ్యారేజి శంకుస్థాపనకు మహారాష్ట్ర సీఎం దేవింద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసులో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వరంగల్, కరీంనగర్‌లు గోదావరి జిల్లాల్లా మారుతాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీకి కూడా మేడిగడ్డ నుంచి నీరు అందుతుందని కేసీఆర్ తెలిపారు.