సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్‌లు మళ్లీ నీటమునిగే ప్రమాదముందని రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన జలసౌధలో మీడియాతో మాట్లాడారు. పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలిస్తేనే మళ్లీ నష్టం జరగకుండా నివారించవచ్చని సూచించారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి తొలుత అనుమతిస్తే తర్వాత 120 మీటర్లకు తగ్గించి జెన్‌కో నుంచి డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని ఆరోపించారు.
అన్నారం పంప్‌హౌజ్‌ను తొలుత 131 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 125 మీటర్లకు తగ్గించారని తెలిపారు. ఎత్తును తగ్గించడంతోనే పంప్‌హౌజ్‌లు మునిగినట్టు ఆరోపించారు. 2022లో మునిగిన తరహాలోనే మళ్లీ ఈ రెండు పంప్ హౌజ్‌లు మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీల గరిష్ట నిల్వ మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్) కంటే ఎక్కువ ఎత్తులో పంప్‌హౌజ్‌లను కట్టాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మించడంతోనే సమస్యలొచ్చాయన్నారు.
నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా పంప్‌హౌజ్‌లను భూఉపరితలంలో నిర్మించాలని సిఫారసు చేస్తే, నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారని ఆరోపించారు. మోటార్లు ఎఫ్‌ఆర్‌ఎల్‌కి తక్కువ ఎత్తులో పెట్టినా పెద్దగా నష్టం ఉండదని, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు మాత్రం ఎత్తులో ఉండాల్సిందేనన్నారు. పటేల్ కంపెనీ తీరుతోనే కల్వకుర్తి లిఫ్టులోని పంప్‌హౌజ్ నీటమునిగి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment