హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం.
మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment