Dam Safety
-
కమీషన్ కోసమే ప్రాణహితను కాళేశ్వరంగా మార్పు: మంత్రి ఉత్తమ్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ కమీషన్ కోసమే రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రజల లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ శనివారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులు, తదితర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిపై కూడా చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులు తదితర అంశాలపై చర్చించారు. ఇక, ఈ చర్చ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ అధికారులతో రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో మరోసారి సమావేశం జరుగుతుంది. ఎక్కువ కమీషన్ కోసం రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజక్టు మార్చడం తప్పు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఏడాదికి తొమ్మిది వేల కోట్లు తెలంగాణ ప్రజల డబ్బును వడ్డీ రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం కింద అరకొరగా సాగు మాత్రమే అవుతోంది. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ఆరు అడుగుల లోతుకు ప్రాజెక్ట్ కుంగిపోయింది.మేడిగడ్డ పునాది బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని కిందకి వదలాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన చేసింది. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో ఈ నిర్మాణం పూర్తి చేస్తాం. పెద్దవాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు. దాని ఆయకట్టంతా ఏపీలోనే ఉంది. దానికి మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్‌లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్‌వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. 7వ నంబర్ బ్లాక్ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్‌కుమార్ సిబల్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పునాది కుంగడం వల్లే.. ర్యాఫ్ట్ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్ పైల్స్ (కటాఫ్ వాల్స్) నిర్మించారు. ర్యాఫ్ట్ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్), ఇతర కారణాలతో ర్యాఫ్ట్కి ముందు భాగంలోని సెకెంట్ పైల్స్ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యత లోపం నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్ పైల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ గ్యాప్ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయింది. డిజైన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్ చేసి, రిజిడ్ స్ట్రక్చర్(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గోడలు (సెకెంట్ పైల్స్) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్లిఫ్ట్ ఫోర్స్) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్ కుంగిపోయింది. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అడిగిన సమాచారం ఇవ్వలేదు.. నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు. సమగ్ర దర్యాప్తు జరపాలి.. బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి. అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్‌ను అత్యవసరంగా పరీక్షించాలి. -
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా ఇస్తారా? లేదా?
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ లేఖ రాసింది. రేపటిలోగా(ఆదివారం) ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారంలేదని భావిస్తామని లేఖలో పేర్కొంది. వివరాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు డేటా కేంద్రానికి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 20 రకాల సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగింది. కాగా, ఇప్పటివరకు నాలుగు అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మిగితా 16 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అయితే, ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్ స్టడీ , కాంట్రాక్టర్ లయబిలిటీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో, ఈ విషయాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. డెడ్‌లైన్ విధింపు.. రేపటిలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అయినప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తాము భావిస్తామని తెలిపింది. ఈ క్రమంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్యారేజీల్లో సమస్యలు సహజమే.. మరోవైపు.. ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారేజీ తట్టుకుందన్నారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పిలర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలకు పెద్దపీట -
డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరం: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డ్యాం సేఫ్టీ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించడానికి తీవ్ర కాలాయపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయన్నారు. ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాంలు తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరమని.. అదే విధంగా డ్యాంల డేటాబేసు అందుబాటులో ఉంచాలన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని అన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే జలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయపరమైన వాటాదక్కాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. -
‘శ్రీశైలం’ భద్రతపై దృష్టి
18, 19 తేదీల్లో కేంద్ర జల సంఘం సమీక్ష హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు అంచనాకు మించి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్ దెబ్బతినకుండా తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులపై కేంద్ర జల వనరుల శాఖ దృష్టిపెట్టింది. శ్రీశైలం డ్యామ్ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఈ నెల 18, 19 తేదీల్లో రూర్కీలో జరిగే నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ (ఎన్సీడీఎస్) సమావేశంలో దీన్ని చర్చించనుంది. 216 టీఎం సీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం డ్యామ్ ఎత్తు 885 అడుగులు కాగా, పొడవు 512 మీటర్లు (1,680 అడుగులు). 12 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి నిర్వహణ చేపడుతున్నారు. ఈ ఎత్తులో ప్రస్తుతం ఉన్న క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తంగా 15 లక్షల క్యూసెక్కుల వరదకు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుమించి జలాలు వచ్చిన సమయంలో డ్యామ్ నిర్వహణ సులభమయ్యేది కాదు. 2009 కృష్ణాలో వచ్చిన వరదలు డ్యామ్ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. డ్యామ్ సామర్థ్యాన్ని మించి 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నిర్వహణ కష్టసాధ్యమై భారీ నష్టం చేకూరింది. కుడి, ఎడమ కాల్వ కింద ఉన్న 1,670 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు ముంపునకు గురయ్యాయి. దీంతో దీనిపై చర్చించిన ఎన్సీడీఎస్ ఈ ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. దీంతో పాటే ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిలో కొంత భాగాన్ని మళ్లించాలని సూచించినా అమల్లోకి రాలేదు. దీంతో దీనిపై మళ్లీ చర్చించి ముందస్తు చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తోంది.