authority
-
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ(జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై విచారణ పూర్తి చేసిన ఎన్డీఎస్ఏ.. తుది నివేదికను కేంద్ర జలశక్తికి ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ అందజేశారు. జలశక్తి శాఖ పరిశీలన తర్వాత రాష్ట్రానికి ఎన్డీఎస్ఐ నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకూడదని మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ.. ప్రాజెక్టు పని చేస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనుంది.కాగా, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలిన విషయం తెలిసిందే. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు.దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి.నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
గుంటూరు: రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11): మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8మండలాలు, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(134): శ్రీకాకుళం జిల్లా 17 మండలాలు, విజయనగరం జిల్లాలో -25, పార్వతీపురంమన్యం-11, అల్లూరిసీతారామరాజు-10, విశాఖపట్నం-3, అనకాపల్లి- 16, కాకినాడ- 10, కోనసీమ- 9, తూర్పుగోదావరి- 19, పశ్చిమగోదావరి- 4, ఏలూరు- 7, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో-2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైనలస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్‌లో -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్ రాజ్యాంగ బెంచ్‌కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది. ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్‌ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్‌ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు చట్టబద్ధమే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పండ్లను పక్వానికి వచ్చేలా చేసేందుకు ఎథిఫాన్, ఎన్‌రైప్‌ల వినియోగానికి అనుమతిస్తూ ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జారీచేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. అనేక పరిశోధనల తర్వాత ఎథిఫాన్, ఎన్‌రైప్ రసాయనాలు ప్రమాదకరం కాదనే విషయం తేలడంతో వాటి వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఎథిఫాన్, ఎన్‌రైప్ వినియోగానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కొట్టేయాలంటూ కాలేజ్ ఆఫ్ పోస్టుగాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ నళిన్ వెంకట్ కిషోర్ కుమార్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, మరో రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘‘పండ్లను మగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్‌రైప్’వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్‌రైప్ ద్వారా కూడా ఎథిలీన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎన్‌రైప్‌ను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. పరిశోధనలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎథిఫాన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎన్‌రైప్‌ను వినియోగించాలని కోరుతోంది. ఎథిఫాన్‌ను విక్రయించరాదని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’’అని ధర్మాసనం పేర్కొంది. -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది.. స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. -
పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి
సాక్షి, పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పీపీఏ కమిటీ సీఈవో పనులను పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్పిల్ వే పైన ఉన్న కాంక్రీట్ నిర్మాణ పనులను చంద్రశేఖర అయ్యర్‌తో పాటు కమిటీ సభ్యులు డి.గణేష్ కుమార్, కే.లలిత కుమారి ఆయనతో పాటు పనులను పరిశీలించారు. నిర్మాణం వివరాలు నిర్మాణం జరుగుతున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.(చదవండి: చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి) ఇప్పటివరకు జరిగిన పనులను మ్యాపు ద్వారా ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నాగిరెడ్డిలు వివరిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్న కమిటీ బంధం సభ్యులు పని జరిగిన విధానాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతరం స్పిల్‌వేలో ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన ఆర్మ్ గడ్డర్ల నాణ్యతను, బిగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నాలుగు రోజులపాటు పశ్చిమ, తూర్పు గోదావరి జలాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరం లో పనులు ఏవిధంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వచ్చామని ప్రాజెక్ట్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పిల్ వే, కాంక్రిట్ , ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువలు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామఅని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2230 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు. -
కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన ఉబెర్ మెడిక్ సేవ ద్వారా ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పట్నా నగరాల్లో వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందివ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన150 కార్లను అందుబాటులో వుంచింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపింది. ప్రతీ రైడ్ తరువాత శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. డ్రైవర్లు భద్రతా విధానాలలో ప్రత్యేకంగా శిక్షణతోపాటు మాస్క్ లు శానిటైజర్లు సహా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అపూర్వ సేవలందిస్తున్న వైద్య సిబ్బదికి ఉబెర్ ఇండియా సౌత్ అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు. -
పోలవరంపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ డంపింగ్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌ను ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాధానమిచ్చారు. దాంతో ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్లో వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని, పోలవరం డంపింగ్ కేసుతో పాటే వరద ముంపు పిటిషన్‌ను కూడా విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. -
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న ప్రాజెక్ట్ అధారిటీ
-
తెలంగాణ రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్
ఎట్టకేలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్సైట్ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్పూర్లో నిర్మిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ పరిధిలో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. ఇవన్నీ 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని పేర్కొన్నారు. రెరాకు ముందు.. తర్వాత.. స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్ బాగున్నప్పుడు బుకింగ్ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసేవారు. కానీ, ఇప్పుడు బుకింగ్ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తే ప్రాజెక్ట్ మీద ప్రభావం çపడుతుంది. కస్టమర్ల చరిత్ర, ఆర్థిక క్రమశిక్షణ పరిశీలించాక నిజమైన కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టుబడిదారులూ అంతే! మార్కెట్ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుంది. రెరాలో కస్టమరే బాహుబలి.. రెరాలో కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. ఫ్లాట్ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయటం ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అందులోనే వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడు వు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుంది. ఉత్పత్తుల వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా 10–15 శాతం ధరలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది. -
అభిశంసనే సమాధానం కాదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అభిశంసన అన్ని సమస్యలకు పరిష్కారం కాదని.. వ్యవస్థను సరిచేయటమే సరైన మార్గమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనాలకు కేసులు కేటాయించటంలో సీజేఐ పాత్రకు సంబంధించిన పలు ప్రశ్నలకూ చలమేశ్వర్ సమాధానమిచ్చారు. ‘రోస్టర్‌పై సంపూర్ణాధికారం సీజేఐదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ధర్మాసనాలను ఏర్పాటుచేయటం సీజేఐకి ఉన్న అధికారం. అయితే ఇది అధికారాన్ని అనుభవించేందుకు మాత్రమే కాదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారాలిచ్చేందుకు కూడా దోహదపడాలి. అలాగని అభిశంసన సరైన సమాధానం కాదు. పరిష్కారం వెతకాలి కానీ.. తొలగింపు సరికాదు’ అని చలమేశ్వర్ తెలిపారు. జనవరి 12న ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐపై బహిరంగ విమర్శలు చేసిన నలుగురిలో జస్టిస్ చలమేశ్వర్ ఒకరన్న విషయం విదితమే. హార్వర్డ్ క్లబ్ ఆఫ్ ఇండియా (అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయులు ఏర్పాటుచేసుకున్న క్లబ్) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్.. జస్టిస్ చలమేశ్వర్‌కు కొంతకాలంగా న్యాయవ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ప్రభుత్వానికి మేలు చేసే ఉద్దేశంతోనే సీజేఐ ధర్మాసనాలను ఏర్పాటుచేస్తున్నారా? తను కోరుకున్న తీర్పులు ఇప్పించుకునేందుకే సీజేఐ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా?’ అనే ప్రశ్నలపై స్పందించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. ‘జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై వెల్లడించిన తీర్పులోనూ మేం (జస్టిస్ గొగోయ్‌తో కలిసి).. వ్యవస్థను సరైన దార్లో పెట్టాల్సిన మెకానిజం గురించే పేర్కొన్నాం’ అని అన్నారు. కొలీజియంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సీజేఐతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న వ్యాఖ్యలపై చలమేశ్వర్ విభేదించారు. ‘మేం మా వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడటం లేదు. సంస్థాగత అంశాలపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. దీనర్థం మేం ఒకరినొకరం విమర్శించుకుంటామని కాదు’ అని తెలిపారు. జూన్ 22న తన రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవులూ ఆశించటం లేదన్నారు. విపక్ష పార్టీలు అభిశంసనకోసం సంతకాల సేకరణ చేపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చలమేశ్వర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
అహుడాకు రూ.10 కోట్లు విడుదల
అనంతపురం న్యూసిటీ : అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ జీఓ 421 విడుదల చేశారు. వాస్తవంగా ఏడాదికి రూ.40 కోట్లు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా రూ.10 కోట్లు విడుదల చేశారు. అహుడాకు కార్యాలయం, అవసరమైన సామగ్రి, వాహనాలు, ఉద్యోగులకు వేతనాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అహుడా ఏర్పాటుకు జీఓ 279 విడుదల చేసిన విషయం విదితమే. అనంతపురం, హిందూపురంలోని 18 మండలాలకు సంబంధించి 180 గ్రామాలు అహుడా పరిధిలోకి వస్తాయి. అహుడా విస్తీర్ణం 3,120 చదరపు కిలోమీటర్లు. అహుడా పనులు వేగవంతం చేసేందుకే కమిషనర్‌గా ఉన్న పీవీవీఎస్ మూర్తికి అహుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ పనులు ఏ మేరకు వేగవంతం చేస్తారో వేచి చూడాలి. -
ఆయనలదే పెత్తనం
భార్యల మౌనం భర్తలదే రాజ్యం అధికారికమైనా అంతావారే ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల దగ్గరా అదేసూత్రం పెచ్చుమీరిపోతున్న ‘పచ్చ’పాతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతల పెత్తనం పెచ్చుమీరిపోతోంది. ఆ పార్టీ నేతలు జిల్లాలో రా జ్యాంగేతర శక్తులుగా తయారయ్యా రు. ఇందుగలడందు లేడనే సామెత ను తలపించే రీతిలో ఆ పార్టీ నేతలు అన్నింటా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతలే తమకు ముఖ్యమని, వారు చెప్పిన పనులు చేయాల్సిందేనని హుకుం జారీచేశారు. సీఎం స్థాయి నుంచే అటువంటి ఆదేశాలు రాడంతో కలెక్టర్లే చేసేదేమీ లేక వారు చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల సిఫార్సులకు అగ్రతాంబూలం వేయాల్సిన అనివార్య పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, గృహనిర్మాణాలు, బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరవ్వాలన్నా పార్టీ నేతల సిఫార్సులు తప్పడం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన అర్హత పార్టీ నేతల ఆమోదముద్రే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ వరకు అడుగడుగునా జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ప్రతి చోటా వారి పెత్తనమే కనిపించడంతో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదురైంది. ప్రజాగ్రహంతో తమకు పని లేదన్నట్టుగానే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదిగో తాజా ఘటన... తాజాగా రెండు రోజుల కిందట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశం తీరు ఆ పార్టీ నేతల వ్యవహారశైలికి అద్దంపడుతోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాపు, బీసీ రుణాలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. కానీ మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో విశ్వనాథరెడ్డి వేదికపై ఉన్నా ఎప్పటి మాదిరిగానే పెత్తనమంతా ఎమ్మెల్యే భర్త, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబుదే. సత్తిబాబుతోపాటు ఆ మండల ఎంపీపీ, జడ్పీటీసీలు పుల్లా సుధ, కాకరపల్లి సత్యవతి భర్తలు చందు, చలపతిరావులు పెత్తనం చెలాయించడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోను దాదాపు ఇదే ఒరవడిని పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలైనా, పనుల కాంట్రాక్ట్లైనా, అధికారులు బదిలీలైనా పెత్తనమంతా వారిదే. చివరకు శిలాఫలకాలపై వారి పేర్లు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే ధైర్యం అక్కడి అధికారులకు లేనేలేదు. ఈæ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా నామ్కేవాస్తే అన్నట్టుగా మార్చేశారని నియోజకవర్గ ప్రజలు ఆక్షేపిస్తున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోయే అధికార పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేతోపాటు మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోటా అంతే... జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న కొత్తపేట, తుని, రంపచోడవరం నియోజకవర్గాల్లో వారిని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. కొత్తపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కాదని పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSఛార్జి బండారు సత్యానందరావుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు మైక్‌ను లాగేసుకుని దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాదని పార్టీ నేతలే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అక్కడ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెత్తనమంతా తమ్ముళ్లదే. మిగిలిన నియోజకవర్గాల్లోను దాదాపు ఇదేరకంగా పార్టీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. -
సెలవుల నిర్ణయాధికారం హెచ్ఎంలకు ఇవ్వాలి
ఎస్టీయూ డిమాండ్ భానుగుడి (కాకినాడ) : పాఠశాలల్లో స్థానిక సెలవుల నిర్ణయాధికారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాలకే ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్టీయూ భవ¯ŒS ఆదివారం సమావేశమైన కార్యవర్గ సభ్యులు ఈ విషయమై తీర్మానం చేశారు. దీనిపై డీఈఓ స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటివరకు సెలవుల నిర్ణయాధికారం ఎంఈఓ లేదా డీవైఈఓల ప్రత్యేక అనుమతితో తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై ఉపా«ధ్యాయులకు సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఈ నిబంధనను మార్చాలని కోరింది. దీనిపై డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, ఆయన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్టీయూ జిల్లా అ««దl్యక్షుడు పి.సుబ్బరాజు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్, కార్యవర్గ సభ్యులు పి.రాంబాబు, ఎం.శివప్రసాద్, డి.వెంకటరావ్, పి.వి.వి.సత్యనారాయణరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి జిల్లా కేంద్రానికి అథారిటీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు ► చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు ► అన్నింటికీ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం ► పట్టణాలు అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికలు ► శరవేగంగా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతి కాలంలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయని... అవి అడ్డదిడ్డం గా, అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధం గా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతర పాలనా వ్యవస్థపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి అదర్ సిన్హా, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పట్టణ జనాభా ఇప్పటికే 45 శాతం ఉందని.. ఇది ఇంకా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సమగ్ర ప్రణాళిక ఉండాలి ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని.. ప్రభుత్వ కార్యాలయాలు, నివా స గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఎలా ఉండాలనే దానిపై సమగ్ర ప్రణాళికలు ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరపకుండా, సమగ్ర పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేలా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పట్టణాల పరిధిలోనే కాకుండా చుట్టూ దాదాపు 10 కి.మీ. విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలన్నారు. హైదరాబాద్ నగరం మాదిరిగా కిక్కిరిసిపోకుండా ఉం డేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెరిగే జనాభాను కూడా అంచనా వేసి పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వారికి తగు సూచనలు చేస్తూ పాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక వనరులను గుర్తించి ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు.