మాన్యువల్‌ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు? | NHRC recommends special Act against manual scavenging | Sakshi
Sakshi News home page

మాన్యువల్‌ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?

Published Thu, Sep 30 2021 5:55 AM | Last Updated on Thu, Sep 30 2021 5:55 AM

NHRC recommends special Act against manual scavenging - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్‌ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్‌హెచ్‌ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది.

ఎన్‌హెచ్‌ఆర్సీ సిఫార్సులు
► మాన్యువల్‌ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి.
► కార్మికుల డేటాబేస్‌ ఏర్పాటు చేయాలి.
► సెప్టిక్‌ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి.
►  ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం వర్తింపజేయాలి.
► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి.
► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి.
► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement