national human rights commission
-
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా వి.రామసుబ్రమణియన్
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్‌గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు. -
అల్లు అర్జున్ ప్రచార యావే ప్రాణం తీసింది: ‘రాచాల’
సాక్షి, న్యూఢిల్లీ: పుష్ప–2 చిత్రం ప్రచార మోజులో మహిళ ప్రాణాలు తీసిన అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రేక్షకులను నియంత్రించలేమని పోలీసులు హెచ్చరించినా.. లెక్కలేనితనంతో నటుడు అల్లు అర్జున్ వచ్చారని ఆరోపించారు. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైందని, ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడని పేర్కొన్నారు. -
‘లగచర్ల’ ఘటన ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ: ‘లగచర్ల’అరెస్టుల ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు షెడ్యూల్డ్ కులాల వారని, వారిపై జరిగిన దాడి ఆందోళన కలిగించే ఘట న అని పేర్కొంది. ఈ అంశంలో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తి నివేది క ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. లగచర్లలో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటించి పరిశీలిస్తుందని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.. లగచర్ల బాధిత కుటుంబాల మహిళలు 12 మంది ఈ నెల 18న బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావులతో కలిసి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘‘ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరింపుల కు పాల్పడుతున్నారు. మా జీవనాధారమైన భూ ములను ఇవ్వలేమని తేల్చి చెప్పినవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు’’అని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించిన 16 వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ.. ఇక్కడ 1,374 ఎకరాలు సేకరించి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. ఈ అంశాలను ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదులోని అంశాలు నిజ మైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది. ‘‘బాధితులు తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని, తప్పుడు నేరారోపణలు మోపారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. సరైన విధానాలను అనుసరించకుండా ప్రతిపాదిత ‘ఫార్మా విలేజ్’కోసం భూసేకరణ చేయడం, వ్యతిరేకించిన గ్రామస్తులపై దాడి చేయడం సరికా దు. తమపై దాడి జరిగిందని చెప్పివారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. పైగా బలవంతంగా భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయతి్నంచారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులపై దాడి చేశారని.. గర్భిణులను కూడా వదల్లేదని.. సాయం కోసం ఎవరినైనా అడిగే పరిస్థితి లేదని.. ఇంటర్నెట్, విద్యుత్ సేవలు సైతం నిలిపేశారని ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు భయంతో ఇళ్లు వదిలి అడవులు, సాగుభూముల్లో తలదాచుకుంటున్నారని ఫిర్యాదు చేశారు..’’అంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి‘లగచర్ల’ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తోపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న గ్రామస్తుల వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. భయంతో అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో దాక్కున్న గ్రామస్తుల స్థితిగతులను నివేదికలో పొందుపరచాలని సూచించింది. బాధిత మహిళలకు ఏవైనా వైద్య పరీక్షలు చేశారా?, గాయపడిన గ్రామస్తులకు వైద్యం అందించారా? అని కమిషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ్ రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయ భారతిని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎవరెవర్ని అరెస్టు చేశారు, మోపిన కేసుల వివరాలని్నంటినీ ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు.కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు..అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బీఎన్ఎస్ సెక్షన్ 111 పెట్టడం ఘోరమని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులయిన 57 మందిపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసుల వేధింపుల కారణంగా 12 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. హింసించి, భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడకి వెళతాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడామని, ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాధ్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని, వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనూజరాణి భరోసా ఇచ్చారు. -
జైనూర్ ఘటన.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: మహిళపై అత్యాచారయత్నం, ఆపై హత్యాయత్నం ఘటనలతో రెండు వర్గాలు పరస్పర దాడులతో రణరంగంగా మారిన జైనూర్ ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటోంది. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటివారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన.. ఆపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది ఎన్హెచ్ఆర్సీ. మీడియా ఆధారంగా వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆ కథనాల్లో పేర్కొందే గనుక వాస్తవమైతే.. మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయపడింది. రెండువారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు పంపించింది.ఆ నివేదికలో.. ఎఫ్ఐఆర్తో పాటు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందించిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం తరఫున అందించిన పరిహార వివరాలను కూడా పొందుపర్చాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నిమజ్జన టైంలో కోరడం సరికాదు: తెలంగాణ హైకోర్టు -
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
హింసాకాండ.. మణిపూర్ సర్కార్‌కు కీలక ఆదేశాలు
ఢిల్లీ: మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాకాండ పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఏం చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు?.. ఇకపై ఏం చేయబోతున్నారో.. సమగ్ర నివేదిక సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హింస చెలరేగకుండా చూసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసే ఎలాంటి హింసాకాండ జరగకుండా చూడాలని అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు అని ఎన్హెచ్ఆర్సీ ప్యానెల్ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటివరకు చోటు చేసుకున్న అఘాయిత్యాలకు, అకృత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వెల్లడించింది. మణిపూర్ అల్లర్లు-హింసకు సంబంధించి నుంచి రోజుకో ఘటన మా దృష్టికి వస్తోంది. ఇలాంటి తరుణంలో మేం ఓ తుది నిర్ణయం తీసుకోలేం. అందుకే వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి.. అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆరా తీస్తున్నాం అని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని మణిపూర్ సర్కార్‌ను ఆదేశించాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరియడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీస్తున్నాం అని సదరు ప్రకటనలో జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొంది. ఇక నుంచి అయినా అలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది NHRC. అలాగే.. శరణార్ధుల విషయంలో చేపడుతున్న చర్యలు, వాళ్లకు అందిస్తున్న పరిహారం మీదా ఆరా తీసింది మానవ హక్కుల సంఘం. -
సికింద్రాబాద్ విధ్వంసం.. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనలో ఒకరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు రైల్వే ఆస్తి నష్టంపై జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులులు చేపట్టిన నిరసనలు అల్లకల్లోల్లాన్ని సృష్టించాయి. ఈ అల్లర్లలో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి కూడా మరణించాడు. చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్ -
హెచ్చార్సీలో మంత్రి హరీశ్‌రావుపై కేసు
లక్డీకాపూల్ (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదైంది. కేసును విచారణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు బదిలీ చేశారు. ఈమేరకు మంగళవారం ఫిర్యాదు దారుడు, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు నర్సుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ.. హరీశ్‌రావుపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
సైనికులపై హత్య కేసు
కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్ ఫోర్స్ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్ జిల్లాలోని తిజిత్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నాగాలాండ్ బంద్ ప్రశాంతం జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ప్రకటించింది. వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్ఎస్ఎఫ్ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఒక్కరోజు నిలిపివేత సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. హార్న్‌బిల్ ఫెస్టివల్లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్ కోన్యాక్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్‌కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించారు. బలగాల కాల్పులపై మోన్‌లో స్థానికుల ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్‌లాల్ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్’లో పారాట్రూపర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
-
రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు
హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సీఐడీ కేసులకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హెచ్చార్సీకి ఫిర్యాదు ఇటీవల రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌కి ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుతో జత చేశారు. కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. బెయిల్‌పై రఘురామ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా మరో సమస్య ఆయన్ని చుట్టుముట్టింది. -
కరోనా కట్టడి: జాతీయ మానవ హక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు
సాక్షి, ఢిల్లీ: కరోనా కట్టడిపై జాతీయ మానవహక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రియల్ టైం డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొంది. డ్యాష్ బోర్డులో ఆస్పత్రులు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, మందుల వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఆక్సిజన్, మందులను బ్లాక్‌మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది.ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కరోనా యోధుల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిత్యావసర వస్తువులు అమ్మే వేళలను తగ్గించాలని జాతీయ మానవహక్కుల సంఘం పేర్కొంది. చదవండి: డబుల్ మాస్క్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు కొంత ఊరట.. దేశంలో రెండో రోజూ తగ్గిన కేసులు -
ముజఫర్‌పూర్ ఘటనపై కేసు నమోదు
న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానళ్లు, వెబ్సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు లేక ఓ మహిళా వలస కూలీ మృతి చెందింది. విషయం తెలియని ఆ అభాగ్యురాలి కుమారుడు తల్లి చీర పట్టుకుని ఆమెను లేపేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ నేపథ్యంలో దారుణానికి కారకులైన రైల్వే అధికారులు, బిహార్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ లాయర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. బదర్ మహ్మద్ అనే లాయర్ ‘రాజ్యాంగంలోని 21వ ప్రకరణ దేశంలోని ప్రతి ఒక్కరికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత గౌరవానికి హామీ ఇస్తుంది. అలానే ఆదేశ సూత్రాలు ప్రతి రాష్ట్రం తన పౌరులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలుపుతున్నాయి. అయితే రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోలేదు. వలస కూలీలకు అవసరమైన ఆహారం, ఆరోగ్య సేవలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సదరు మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో మే 25 నాటి ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ సీసీటీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకుని ఈ దారుణానికి కారకులైన రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాల మీద తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాక మృతురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందేలా చూడాలి’ అంటూ మానవ హక్కుల కమిషన్‌ను కోరాడుబదర్ మహ్మద్.(వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది) -
కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు
గువాహటి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నిర్మాత అనుష్క శర్మపై గూర్ఖా కమ్యూనిటీ గ్రూపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా విడుదలైన పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌లో తమను కించపరిచే, వివక్ష పూరిత సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ది అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ ఈ మేరకు ఎన్‌హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ విషయం గురించి భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్ అధ్యక్షుడు నందా కిరాటి దేవన్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌లో తమను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. సమాజంలో తమ ప్రతిష్టను దిగజార్చేలా వాటిని చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు సన్నివేశాలు ప్రసారం అవుతున్నపుడు మ్యూట్‌లో పెట్టి.. సబ్‌టైటిల్స్, డిస్క్లేమర్ వేసి తిరిగి అప్లోడ్ చేయాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.(‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్.. రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఇక మేఘాలయలో ఖాసీ తెగకు చెందిన ఓ యువతి... పాతాళ్ లోక్‌లో మహిళను అసభ్యంగా దూషిస్తూ, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేసింది. వెబ్సిరీస్లోని సెకండ్ ఎపిసోడ్లో ఈ మేరకు సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని కోరింది. కాగా అనుష్క శర్మ నిర్మాణ సారథ్యంలో అవినాష్– ప్రొసిత్ రాయ్ డైరెక్ట్ చేసిన పాతాళ్ లోక్ అమెజాన్ ఒరిజినల్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. సుదీప్ శర్మ రచనకు దృశ్యరూపమైన ఈ వెబ్‌సిరీస్(మొత్తం 9 ఎపిసోడ్లు) ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్‌లా సాగుతూనే మూసి ఉంచిన భారతీయ సమాజాన్ని, అందులోని చీకటి కోణాల్ని స్పృశించిందంటూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. (ఒళ్లు గగుర్పొడిచేలా టీజర్) View this post on Instagram सब बदलेगा, समय, लोग और लोक। @primevideoin @officialcsfilms #NewSeriesOnPrime @kans26 #SudipSharma @manojmittra @saurabhma @prositroy @avinasharun24fps @jaideepahlawat #NeerajKabi @gulpanag @swastikamukherjee13 @nowitsabhi A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on Apr 21, 2020 at 12:34am PDT -
బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు మాయం!
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఓ ప్రముఖ ఆస్పత్రి అవయవాలను సేకరించిన వ్యవహారం విశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. ఒడిశాకు చెందిన మృతుడి తల్లిదండ్రులు, బంధువులను మభ్యపెట్టి అవయవాలను తీసుకున్నట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. డబ్బులు లేవనడంతో.. 2016 డిసెంబరు 13న ఒడిశాలోని గంజాం జిల్లా జాగాపూర్ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్ (32) ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం బాధితుడిని విశాఖలోని ఓ ఆసుపత్రికి బంధువులు తెచ్చారు. ఐదు రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. నిరుపేదలమైన తాము వైద్య చికిత్స వ్యయాన్ని చెల్లించలేమని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు పేర్కొనడంతో అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అనంతరం వారి నుంచి సంతకాలు తీసుకుని బ్రెయిన్ డెడ్ అయిన సహదేవ్ నుంచి కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు. అనుమతి తీసుకున్నాకే సర్జరీ చేశాం.. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యం ప్రతినిధి మోహన్ మహరాజ్‌ను వివరణ కోరగా ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉందని, నోటో(నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్) యాక్ట్ ప్రకారం, జీవన్‌దాన్ అనుమతితో అన్ని నియమాలు అనుసరించి ఈ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘అన్నిటికీ మృతుడి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాం. గర్భిణి కావడంతో మృతుడి భార్య రాలేదని చెప్పారు. మృతుడి అవయవాలను జీవన్‌దాన్ అలాట్మెంట్ ప్రకారం వేరే ఆసుపత్రికి తరలించాం. కార్నియాని మోసిన్ ఐ బ్యాంక్ మృతుడి తల్లిదండ్రుల అంగీకారంతో తీసుకుంది. పోలీస్ అనుమతి, ఫోరెన్సిక్ ఇంటిమేషన్, పంచనామా, పోస్టుమార్టం అన్నీ జరిగాయి’ అని చెప్పారు. బీమాకు దరఖాస్తుతో షాక్.. ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణిగా ఉన్న బాధితుడి భార్య లక్ష్మీయమ్మ ఆసుపత్రికి రాలేదు. భర్త అంత్యక్రియల అనంతరం బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహదేవ్ మృతదేహంలో అవయవాలు లేవని బీమా సంస్థ పేర్కొనడంతో నివ్వెరపోయిన ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోరాడ రామారావు తెలిపారు. -
‘దిశ హత్య ప్రాంతంలో అవి ఏర్పాటు చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చోటుచేసుకున్న దిశ హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గచ్చిబౌలి వాని నగర్ ప్రాంత వాసులు హెచ్ఆర్సీ(మానవ హక్కుల కమిషన్)కి పిటిషన్ దాఖలు చేశారు. రాత్రి సమయంలో ఈ ప్రాంత నుంచి వెళ్లలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఆ తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు..
సాక్షి, మహబూబ్‌నగర్ : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే తెలంగాణ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు(శనివారం) ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల బృందం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రానుంది. అక్కడ ఎన్‌కౌంటర్‌లోని మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాతే వారి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు కోరితే.. నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా, శుక్రవారమే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. ఓవైపు నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ జరుగుతుండగా.. మరోవైపు వారి స్వగ్రామంలో అంత్యక్రియలు పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో పోలీసులు అంత్యక్రియలను రేపు సాయంత్రం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో నిందితులు మృతదేహాలను ఈ రాత్రికి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే ఉంచనున్నారు. చదవండి : ఎన్కౌంటర్: చెన్నకేశవుల కుటుంబీకుల ఆందోళన అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం -
ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు
న్యూఢిల్లీ : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కులు సంఘం(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించడానికి తెలంగాణకు నిజనిర్ధారణ కమిటీని పంపాలని ఇన్వెష్టిగేషన్ డీజీని ఆదేశించింది. నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ కావడంపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్లో మృతిచెందారు. నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. ‘సాహో సజ్జనార్... శభాష్ సజ్జనార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్ చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం -
కశ్మీర్ విద్యార్థులపై దాడులు.. హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: కశ్మీర్ విద్యార్థులపై దాడుల విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ అంశంపై జవాబు చెప్పాలని నోటీసులు పంపింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులిచ్చింది. విద్యార్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని చెప్పింది. ఇటువంటి దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో భారత దేశ గౌరవం మంటగలిసే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కశ్మీర్ విద్యార్థుల్లో కొందరు ఉగ్రదాడిని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేయడం..పలు రాష్ట్రాల్లో కొందరు కశ్మీర్ విద్యార్థులపై దాడులు చేస్తామంటూ వారికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా దాడులు చేస్తామన్న వారిని సమర్ధించడంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మానవ హక్కుల సంఘం స్పందించింది. -
శ్రీరెడ్డి వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరిట వేధింపులు)పై నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళను ఆట వస్తువుగానే చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎదుట అర్థ నగ్న నిరసన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జాతీయస్థాయిలో కూడా చర్చ సాగుతోంది. దీంతో ఆమెకు అనూహ్య రీతిలో మద్దతు వస్తోంది. పలు మహిళా సంఘాలు, ఐక్యవేదికలు శ్రీరెడ్డికి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) గురువారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ నోటీసుల్లో పేర్కొంది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిపై ‘మా’ ఆంక్షలు విధించడం, ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్హెచ్ఆర్సీ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్రీరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. ‘మా’ లో లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘం(క్యాష్ కమిటీ) ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. -
హక్కుల కమిషన్ రిపోర్టు వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సంబంధించిన నివేదికను వెల్లడించాలని ఆయన సహచరి వసంత జాతీయ మానవహక్కుల కమిషన్‌ను డిమాండ్ చేశారు. సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే జోక్యం చేసుకో వాలని కమిషన్‌ను వసంత గతంలో ఆశ్రయించింది. దీంతో నాగపూర్ అండాసెల్‌లో ఉన్న సాయిబాబాను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగస్టులో కలిసింది. అయితే, 3 నెలలు కావస్తున్నా మానవ హక్కుల కమిషన్ నివేదికను వెల్లడించలేదని వసంత ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. సాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన నిజాలు, జైలు అధికారుల కక్షసాధింపు చర్యలు బయటపడతాయనే ఆ రిపోర్టును వెల్లడించలేదని అన్నారు. ‘సాయిబాబా కార్డియో మయోపతితో బాధపడుతున్నారు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి, 15 ఏళ్లుగా హైబీపీ ఉంది, పోలియోతో 2 కాళ్లు పూర్తిగా పనిచేయవు. వేరొకరి సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. రోజుకు 8 రకాల మందులు వాడాలి. కానీ ఒక్క మందు సకాలంలో అందించడం లేదు. శరీరం 90% చచ్చుబడిపోయిన ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతాడనే నెపంతో చీకటి గుహలాంటి అండాసెల్‌లో బంధించారు. ఏ నేరానికీ పాల్పడే అవకాశంలేని తను ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎలా చేస్తారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. యుద్ధ ఖైదీలకు సైతం ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదు.’అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీల పట్ల అనుసరించాల్సిన విధానాలను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా సాయిబాబాను జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా విడుదల కోరుతూ నిరసన ‘సాయిబాబా విడుదల కోరుతూ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక చోట్ల నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శించారు. యూరోపియన్ కాన్సులేట్ నుంచి కొందరు ఫోన్ చేసి వివరాలు తీసుకుని సంఘీభావం ప్రకటించారు. పంజాబ్, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోపక్క ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా సస్పెన్షన్‌పై వేసిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సాయిబాబా రాసిన లేఖలను మూడు, నాలుగు రోజులు జైలు అధికారులు తమ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత పోస్ట్ చేస్తున్నారు. మా క్వార్టర్ ఖాళీ చేయించారు. మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదు. మానవతా దృక్పథంతో సాయిబాబాను హైదరాబాద్‌కు మార్చాలి’ అని ఆమె అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా విడుదల కోరుతూ ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సాయిబాబా విడుదల కమిటీ నాయకులు బళ్లా రవీందర్, రవిచంద్ర, నారాయణరావు, విరసం సభ్యురాలు గీతాంజలి, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఖాద్రి తెలిపారు. సాయిబాబా, అతని సహచరుల విడుదల ఉద్యమంలో ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. -
16 మంది మహిళలపై పోలీసుల అకృత్యాలు!
-
16 మంది మహిళలపై పోలీసుల అకృత్యాలు!
న్యూఢిల్లీ: 16 మంది మహిళలపై అత్యాచారంతోపాటు లైంగిక, శారీరక దాడులు చేసినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంటూ శనివారం నోటీసులు జారీచేసింది. మరో 20 మంది బాధితుల వాంగ్మూలం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల చేతిలో 16 మంది మహిళలు అత్యాచారానికి గురవ్వడంతోపాటు లైంగికంగా, శారీరకంగా దాడులు ఎదుర్కొన్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి ఎన్‌హెచ్చార్సీ గుర్తించింది. కాబట్టి బాధితులకు రూ. 37లక్షల పరిహారం ఎందుకు సిఫారసు చేయకూడదో తెలుపాలంటూ ఆ రాష్ట్ర సీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులలో పేర్కొంది. ఈ పరిహారంలో రూ. 3 లక్షలు చొప్పున రేప్‌కు గురైన ఎనిమిది మంది బాధితులకు, రూ. 2 లక్షలు చొప్పున లైంగిక దాడులు ఎదుర్కొన్న ఆరుగురు బాధితులకు, రూ. 50వేల చొప్పున శారీరక దాడులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులకు ఇవ్వాలని కమిషన్ పేర్కొంది. భద్రతా దళాల చేతిలో బాధితుల మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగిందని, కాబట్టి ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కమిషన్ స్పష్టం చేసింది. -
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో 5ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం బుధవారం నోటీసులు వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై 6 వారాల్లో గా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదికలో పేర్కొనాలంది. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రతకు సంబం ధించిందని అభిప్రాయపడింది. -
గ్రీన్‌హంట్ మూడో దశలో భాగమే ఎన్కౌంటర్
► ఆర్కే ప్రాణాలకు హాని చేయకుండా కోర్టులో హాజరుపర్చాలి ► పోలీసుల చట్రంలోమీడియా, హైకోర్టు: విరసం నేత వరవరరావు వరంగల్: సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలకు దేశంలోని అటవీ ఖనిజ సంపదను దోచి పెట్టేందుకు చేపట్టిన గ్రీన్‌హంట్ మూడో దశఆపరేషన్-2016లో భాగంగానే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారన్నారు. బాక్సైట్ వెలికితీసేందుకు ఒప్పుకోని ఆదివాసీలు అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విలువైన ఖనిజ సంపద దేశ పార్లమెంటు బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువని.. సుమారు రూ.142 లక్షల కోట్ల విలువైందన్నారు. తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నంలో వాకపల్లి మహిళలు సామూహిక అత్యాచారాలకు గురైనా పోరాటం ఆపలేదన్నారు. ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటాలకు మావోయిస్టులు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వాలు ఎన్కౌంటర్ల పేరిట మారణకాండ జరుపుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన మీడియా సంస్థలు, హైకోర్టులు పోలీసుల చట్రంలో ఉండి వారు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. భోపాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంత మారణకాండ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం సరికాదన్నారు. పౌరహక్కుల సంఘం నేతలు పలుమార్లు హైకోర్టును ఆశ్రయిస్తే మా పరిధి కాదని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆర్కే ఆచూకీ కేంద్ర ప్రతినిధి ప్రతాప్, రాష్ట కమిటీ, ఏవోబీలు తెలియదని ప్రకటనలు ఇచ్చాయన్నారు. ఆర్కే ఆచూకీ ఒక్క పోలీసులకే తెలిసే అవకాశం ఉందన్నారు. ఆయనను కోర్టు ఆదేశాల మేరకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గురువారం వరకు గాయాలతోనైనా కోర్టులో అప్పగించాలని హైకోర్టు చెప్పిందన్నారు. పోలీసులు చంపడం, బహుళజాతి సంస్థలకు ఖనిజ సంపద అప్పగించడమే కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అవసరం ఉందని కోర్టు వాఖ్యానించడం అభినందనీయమని వరవరరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొన్నారు. భోపాల్ ఎన్కౌంటర్ దుర్మార్గం భోపాల్‌లో జరిగిన సిమి కార్యకర్తల ఎన్కౌంటర్ ఇంతకంటే దుర్మార్గమని వరవరరావు ఆరోపించారు. జైలు నుంచి తప్పించుకున్న సిమి కార్యకర్తలు భోపాల్ శివార్లో జరిగిన ఎన్కౌంటర్ మరణించడం అనుమానాలు తావిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై మీడియా, ప్రజాస్వామ్యులు స్పందించక పోవడం సరికాదన్నారు. మీడియా ఇలా తయారయ్యారకా నరహంతకుడు మోదీ ప్రధాని కాకుండా ఎలా ఉంటారు? సీఎంలు చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు, రమణ్‌సింగ్, నవీన్‌సింగ్‌తో పాట పడ్నవీస్లు సామ్రాజ్యవాద సంస్థలకు ఖనిజ సంపదను కట్టపెట్టేందుకే ఈలాంటి ఘటనలు చేయిస్తున్నారని అన్నారు. -
పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్ : కుల మతాలను కించపరిచే విధంగా తిరుపతి సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా తిరస్కరించారని ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుల మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని ప్రత్యక్షంగా సభలో మాట్లాడటం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సరోజినీదేవి ఆస్పత్రిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సీఎస్, డీజీపీలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని కేసు న మోదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే 15 రోజుల విరామం తర్వాత శుక్రవారం ముగ్గురు బాధితులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు. మరో నలుగురిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్, లోకాయుక్త విచారణకు ఆదేశించగా, ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి, ఉన్నత స్థాయి నిపుణుల బృందం విచారిస్తుంది. అయితే ఇన్ఫెక్షన్కు సెలైన్ బాటిల్లో ఉన్న బ్యాక్టీరియానే కారణమని ఇప్పటికే ఆస్పత్రి వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఫ్యూమిగేషన్ను చేపట్టి ఎలాంటి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే థియేటర్లను తెరిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
పోలవరం నిర్వాసితుల సమస్యలపై నివేదిక
జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం వెల్లడి పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడే రామయ్యపేట గ్రామంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం పర్యటించింది. కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లా) ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రజబీర్‌సింగ్‌లతో కూడిన బృందం గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి నిర్వాసితుల సమస్యలను నమోదు చేసుకుంది. అనంతరం బృంద సభ్యులు పైడిపాక, చేగొండపల్లి, శింగనపల్లి, మామిడిగొంది, దేవరగొంది నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామం ఖాళీ చేయమంటున్నారని రామయ్యపేట, పైడిపాక గ్రామాలకు చెందిన పలువురు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. అద్దె ఇళ్లల్లోకి వెళ్ళమంటున్నారని, తమ భూములకు 2006, 2007 సంవత్సరాలలో తక్కువ నష్టపరిహారం చెల్లించారని చెప్పారు. 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులంతా గ్రామాలు ఖాళీ చేసినట్టు, పునరావాస కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసినట్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక పంపారని ఆర్థిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. నిర్వాసితులు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని చెప్పారు. వారికి కొత్త భూసేకరణ చట్టం వర్తింప చేయాలని కోరారు. ఈసందర్భంగా బృంద సభ్యుల్లో ఒకరైన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్ కుమార్ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రాయితీలు అన్నీ అందుతాయన్నారు. బృందం వెంట భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్డీవో ఎస్.లవన్న ఉన్నారు. -
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ దత్తు
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్హెచ్ఆర్సీకి ఆయన ఏడవ చైర్మన్. గత మేలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీకాలం ముగియడంతో, కమిషన్ సీనియర్ సభ్యుడైన జస్టిస్ సిరియక్ జోసెఫ్ ఇప్పటివరకు ఆపద్ధర్మ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక, ప్రామాణిక తీర్పులను జస్టిస్ దత్తు వెలువరించారు. కర్ణాటకలోని చిక్మగళూరులో డిసెంబర్ 3, 1950లో ఆయన జన్మించారు. బెంగళూరులో లా పూర్తి చేశారు. 1975లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1995లో కర్ణాటక హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2008లో సుప్రీంకోర్టుకు బదిలీ అయి, 2014, సెప్టెంబర్ 28న భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యారు. 2015, డిసెంబర్ 2న పదవీవిరమణ చేశారు. -
కన్హయ్యపై దాడి పోలీసుల వైఫల్యమే
ఎన్హెచ్ఆర్సీ నిజ నిర్ధారణ బృందం వెల్లడి న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందం పేర్కొంది. రాజ్యాంగానికి విధేయుడనని కోర్టుకు తెలిపేలా కన్హయ్యపై పోలీసులు మానసికంగా ఒత్తిడి తీసుకువచ్చారని ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోర్టులో కన్హయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆయన స్వచ్ఛందంగా ఇచ్చింది కాదని పేర్కొంది. పటియాలా కోర్టు హింసలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, విధి నిర్వహణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు స్పష్టంగా తెలుస్తోందని కమిటీ తేల్చిచెప్పింది. కన్హయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత పైనా ఆందోళన వ్యక్తం చేసింది. నిజనిర్ధారణ బృంద నివేదికను ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, తిహార్ జైలు డీజీకి పంపించింది. ఎన్హెచ్ఆర్సీ కమిటీ గురువారం కన్హయ్యను తిహార్ జైళ్లో కలిసింది. కాగా, జేఎన్‌యూలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్ విద్యార్థులకు జాతీయవాదంపై తరగతులు నిర్వహించారు. మరోపక్క.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వివావాదస్పదమైంది. సంయుక్త కార్యదర్శి, ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ శుక్రవారం విద్యార్థి సంఘం భేటీని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. వాటిలో జేఎన్యూకు అప్రతిష్ట తీసుకువచ్చిన విద్రోహ శక్తులను గుర్తించి, శిక్షించాలని, వర్సిటీలో ఇటీవలి ఘటనపై దర్యాప్తు జరపాలని, చట్టబద్ధ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదనే తీర్మానాలు కూడా ఉన్నాయి. దీన్ని అతిపెద్ద వంచనగా విద్యార్థి సంఘం తాత్కాలిక అధ్యక్షురాలు షెహ్లా రషీద్ పేర్కొన్నారు. ఆ భేటీ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. -
రాజమండ్రి ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో పిటీషన్
న్యూఢిల్లీః రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాల నిర్వహణలో విఫలమయ్యారని సంస్థ అధ్యక్షుడు వీర రాఘవరెడ్డి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ల ప్రత్యేక పూజల కారణంగా క్యూ లైన్లను 3 గంటలపాటు నిలిపివేశారని, దీంతో భక్తులు క్యూ లైన్లు వదిలేశాక ఒక్కసారిగా పుష్కర స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు, లోకేష్ సహా 16 మంది కారణంగా చూపుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై విచారణ వేగవంతం
శేషాచలంలో ఏప్రిల్ ఏడో తేదీ జరిగిన ఎర్ర’కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణను వేగవంతం చేస్తామని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రత్యేక బృందం సభ్యుడు పీడీ ప్రసాద్ తెలిపారు -
మా విచారణల్లో ‘శేషాచలమే’ ప్రధానం
విలేకరుల సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ హైదరాబాద్: తమ క్యాంప్ సిట్టింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో విచారించిన కేసుల్లో శేషాచలం ఎన్‌కౌంటరే ప్రధానమైన కేసు అని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు. ఆ తరువాత స్థానంలో తెలంగాణలో వికారుద్దీన్ సహా ఐదుగురి ఎన్కౌంటర్ సంఘటన ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో క్యాంప్ సిట్టింగ్ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌తో పాటు సభ్యులు జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్, ఎస్సీ సిన్హా విలేకరులతో మాట్లాడారు. శేషాచలం ఎన్కౌంటర్ పై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో మేజిస్టీరియల్ విచారణ జరపాలని ఆదేశించామని కమిషన్ పేర్కొంది. వారం రోజుల్లో ఎన్హెచ్ఆర్సీ తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటనా స్థలాల్లో పర్యటిస్తుందని తెలిపారు. దీంతో పాటు వికారుద్దీన్ ఎన్కౌంటర్ పైనా పూర్తి నివేదికలు అందిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకిచ్చే పరిహారం రూ.లక్షగా ఉందని, దీన్ని పెంచాలని సూచించామన్నారు. ఈ మొత్తాన్ని రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని జస్టిస్ బాలకృష్ణన్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని సూచించామన్నారు. ఢిల్లీలో ‘ఆప్’ ర్యాలీ సందర్భంగా రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నట్లు కనిపించట్లేదని అన్నారు. -
వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి
డీజీపీకి జాతీయ హక్కుల కమిషన్ ఆదేశం మెజిస్టీరియల్, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ వివరాలివ్వండి హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఇక్కడి ఎంసీఆర్ హెచ్ఆర్డీ భవనంలో బాలకృష్ణన్ అధ్యక్షతన సభ్యులు సైరియర్ జోసెఫ్, జస్టిస్ డి .మురుగేశన్, ఎస్పీ సిన్హాతో కూడిన పూర్తిస్థాయి కమిషన్ ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలను కమిషన్ ఆలకించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, పక్కా ప్రణాళిక ప్రకారమే వికార్, అతని అనుచరులను కాల్చి చంపారని వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తోపాటు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమిషన్ విచారణ సందర్భంగా వాదించారు. అయితే తమ ఆయుధాలు లాక్కొని దాడి చేసేందుకు ప్రయత్నించడం వల్లనే ఆత్మరక్షణకు కాల్పులు జరపాల్సి వచ్చిందని వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారు ఎంతో ప్రమాదకారులని, గతంలో నలుగురు పోలీసులను హత్య చేశారని కమిషన్ దృష్టికి తెచ్చారు. కాగా, మృతుల్లో ఒకరైన విచారణ ఖైదీ జకీర్‌ను ఒక రోజు ముందుగానే హైదరాబాద్ నుంచి వరంగల్‌కు తరలించారని వికారుద్దీన్ తండ్రి పేర్కొనగా, దీని పూర్వాపరాలపై కమిషన్ ఆరా తీసింది. ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పరిధిలో దీని విచారణ కొనసాగుతున్నందున, మళ్లీ విచారణ అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ కేసును కూడా తమకే బదిలీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. పోలీసుల ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎన్కౌంటర్ చోటుచేసుకున్నదన్న వికార్ తండ్రి వాదనపై కమిషన్ స్పందిస్తూ.. ఏ ప్రాతిపదికన ఈ వాదన చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ హతుల ఫొటోలను చూస్తేనే అర్థమవుతోందని.. కాళ్లకు, చేతులకు బేడీలు వేసి సీటుకు తాళం వేశారని, అలాంటి పరిస్థితిలో 17 మంది పోలీసులుండగా ఆయుధాలు లాక్కోవడం అసాధ్యమని వికార్ తండ్రి పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ మూడేళ్ల క్రితమే వికారుద్దీన్ కోర్టుకు విన్నవించుకున్నట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు. తనను మరో జైలుకు తరలించాలని కూడా కోరినట్లు గుర్తుచేశారు. నేరస్తులు, స్మగ్లర్లు, టైస్టులు, నక్సలైట్లకు కూడా మానవహక్కులు ఉంటాయని, వాటిని కాలరాసి ఏకంగా అంతమొందించడం ఎంతమాత్రం సరికాదని పౌర హక్కుల సంఘం నేతలు రమా మెల్కొటే, జయవింధ్యాల, ఎస్. జీవన్‌కుమార్ తదితరులు కమిషన్ దృష్ఠికి తీసుకొచ్చారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాలని, అందుకు దారితీసిన కారణాలు తెలియాలని తాము కూడా కోరుకుంటున్నట్లు ఐజీ నవీన్‌చంద్ తెలిపారు. రైతు ఆత్మహత్యలపై కూడా.. రాష్ట్రంలో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాలకు అందిన సహాయం, పరిహారం తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. గురువారం బహిరంగ విచారణ సందర్భంగా మెదక్ జిల్లా గజ్వేలు, తొగుట, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామ మండలం నుంచి ఆత్మహత్యలు చేసుకున్న ఏడు రైతుకుటుంబాల సభ్యులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. రాష్ర్టంలో 748 మంది ైరె తులు ఆత్మహత్యలు చేసుకోగా వారి సంఖ్య 96 మాత్రమేనని అధికారులు పేర్కొనడం సరికాదని వివిధ పౌరహక్కుల నేతలు కమిషన్ ముందు అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. కాగా రైతు కుటుంబాల తరఫున ఎస్. ఆశాలత (రైతు స్వరాజ్యవేదిక), కె.సజయ (కేరింగ్ సిటి జన్స్ కలెక్టివ్), జీవన్‌కుమార్ (మానవ హక్కుల వేదిక), ఓపీడీఆర్, రైతు ఆత్మహత్య బాధితుల కుటుంబాల వేదిక, తెలంగాణ రైతు రక్షణ సమితి, మహిళా కిసాన్ అధికార్ మంచ్‌ల ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా వివరణనిచ్చారు. రైతులు పంట నష్టపోయినపుడు నిబంధనల ప్రకారం సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైకోర్టు విచారణ 28కి వాయిదా వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖ లు చేసేందుకు గడువు కావాలని రాష్ర్ట ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించడంతో పాటు, కేసు దర్యాప్తును సీబీ ఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తో పాటు మృతుల సంబంధీకులైన మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను గతవారం విచారించిన కోర్టు.. కౌం టర్ దాఖలు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ఖాకీల్లో టెన్షన్
► శేషాచలం ఎన్‌కౌంటర్‌పై అంతర్మథనం ► హైకోర్టుకు అందిన రీపోస్టుమార్టం నివేదిక ► తొలి పోస్టుమార్టంతో నివేదిక ఏకీభవించేనా? ► తల పట్టుకుంటున్న టాస్క్ఫోర్సు పోలీసులు చిత్తూరు (అర్బన్): శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై జిల్లా పోలీసు యంత్రాంగంలో ఉత్కంఠ మొదలైంది. ఎన్కౌంటర్లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు. చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.. ఎన్కౌంటర్లో మృతి చెందిన తన భర్త శశికుమార్‌ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపారని భార్య మునియమ్మాల్ తొలుత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట్లో శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇ చ్చింది. తర్వాత మురుగన్, మూర్తి, శివాజి, పెరుమాళ్, మునుస్వామి మృతదేహాలకు సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల చేతుల్లో మృతి చెందిన తమ భర్తల శరీరాలపై నిప్పుతో కాల్చిన గుర్తులు, కాళ్లూ, చేతులు కట్టేసి చిత్ర హిం సలు పెట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని మృతుల భార్యలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికితోడు కొందరు కూలీల మృతదేహాల్లో చేతివేళ్లు లేవని, మరికొందరికి శరీరంపై బలమైన ఆయుధంతో కోసిన గుర్తులు ఉన్నాయని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు ఎన్కౌంటర్లో పా ల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. నివేదికలో ఏముందో ? హైకోర్టుకు బుధవారం అందజేసిన మృతుల రీ పోస్టుమార్టం నివేదిక, తొలుత జరిగిన పోస్టుమార్టం నివేదికతో సరిపోలుతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత తిరుపతి రుయా వైద్యశాలలో మృతులకు జిల్లాకు చెందిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఇప్పటికే హైకోర్టులో ఉంది. తాజాగా ఉస్మానియా వైద్యులు నిర్వహించిన రీ పోస్టుమార్టం నివేదిక న్యాయస్థానానికి చేరింది. మొదటిసారి జరిపిన శవపరీక్షకు సంబంధించిన ఫోరెన్సిన్ నివేదిక ఇంకా న్యాయస్థానానికి అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ రెండు శవ పరీక్షల నివేదికను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనంటూ జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర ఉత్కంఠలో ఉంది. -
ఎలా నమ్మించాలి?
♦ చనిపోయిన వారు స్మగ్లర్లే అని నమ్మించేందుకు పోలీసుల యత్నాలు ♦ తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక బృందాలకు నిరాశ ♦ మూడు రోజులుగా తిరుపతిలో ఉన్నతాధికారుల సమావేశాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలం అడవుల్లో పోలీసుల కాల్పుల్లో తమిళనాడు కూలీలు చనిపోయిన ఘటన నుంచి ఎలా బయటపడాలో అర్థంగాక ప్రభుత్వం సతమతమవుతోంది. అటు జనాన్ని, ఇటు తమిళనాడు సర్కారును నమ్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏ మార్గంలో నమ్మించాలా అనే దానిపై అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఉన్నతాధికారులు మూడు రోజులుగా తిరుపతిలో కసరత్తు చేస్తున్నారు. తమిళనాడు కూలీల వ్యవహారం జాతీయ మానవ హక్కుల సంఘం వరకు చేరడం, కేంద్ర ప్రభుత్వమూ దీనిపై వివరాల సేకరణకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. మృతులు పడివున్న తీరు, అక్కడ లభించిన పాత ఎర్రచందనం దుంగలు, ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే బస్సులో ఉన్న సాక్షులు చెప్పిన వివరాలు పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. మరోవైపు తమిళనాడు నుంచి రోజురోజుకూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల ఆస్తులు, అక్కడి తెలుగువారి వ్యాపార సముదాయాలపై దాడులు సాగుతూనే ఉన్నాయి. ఈ గండం నుంచి ఏదో ఒక విధంగా బయట పడేయాలని ప్రభుత్వం ఓ పోలీసు పెద్దను ఆదేశించిందని సమాచా రం. అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పాత ఫుటేజీలను కనీసం తేదీలు మార్చకుండానే కొన్ని మీడి యా సంస్థలకు ఇచ్చి మరో తప్పు చేశారని పోలీసు ఉన్నతాధికారు లు ఆగ్రహంగా ఉన్నారు. కూలీలు ఎన్కౌంటర్లోనే చనిపోయారనే వాదనను సమర్థించేలా కొన్ని పత్రికల్లో కథనాలు రాయించే పనిని ఓ మాజీ పోలీస్ పీఆర్వోకు అప్పగించారు. ఇది కూడా అంతగా ఫలితమివ్వలేదని పోలీసు పెద్దలు నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన వారంతా స్మగ్లర్లే అంటూ నేరుగా మంత్రుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది బెడిసి కొట్టడంతో ఏకంగా పోలీస్ అధికారుల సంఘం సహాయాన్ని అర్థించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు రోజులుగా.. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ సీన్ హైదరాబాద్‌కు చేరింది. డీఐ జీ, ఐజీ స్థాయి అధికారులే వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎదురు కాల్పుల్లోనే కూలీలు మరణించారని నమ్మించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఐజీ గోపాలకృష్ణ, డీఐజీలు బాలకృష్ణ, కాంతారావు, సీఐడీఎస్పీ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, ఈ కేసు విచారణాధికారి ఏఎస్పీ త్రిమూర్తులు, డీఎస్పీలు శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డితో పాటు కొంత మంది సీఐలు, ఎస్ఐలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఎదురు దెబ్బ.. ఎన్కౌంటర్ ఘటనలో ప్రభుత్వానికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఘటనా స్థలిలో పోలీసులు 27సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు బయటకు తీయాలని ఓ పోలీసు పెద్దాయన ఆదేశాలు జారీచేశారు. మృతులంతా కరుడు కట్టిన స్మగ్లర్లే అంటూ వచ్చిన తప్పుడు సమాచారానికి మురిసిపోయారు. ప్రత్యేకంగా రెండు బృందాలను విచారణ కోసం తమిళనాడుకు పంపించారు. అక్కడ నుంచి అనుకున్న మేర ఫలితం రాకపోవడంతో పాటు సహాయ నిరాకరణ ఎదురవడంతో మరో బృందాన్ని రహస్య విచారణ కోసం పంపారు. తీరా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మృతుల్లో ఒకరికి అక్కడి ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉందని తెలుసుకున్నారు. ఇంత హంగామా చేసి తెలుసుకున్నది ఇంతేనా అంటూ ప్రభుత్వ పెద్దలు ఉసూరుమన్నారట. సర్కారును, కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను బయట పడేయడానికి ఏదో బలమైన ఆధారం సంపాదించడానికి మరోసారి లోతుగా విచారించాలని ఆదేశించినట్లు వినికిడి. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ
* శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించండి * చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం * ఏపీ సీఎస్, డీజీపీలకు కమిషన్ ప్రత్యేక ఆదేశాలు * సీఆర్పీసీలోని 176(1)(ఎ) ప్రకారం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌చే ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాలి. * ఘటన సమయంలో విధుల్లో ఉన్న అటవీ అధికారులు, పోలీసు అధికారుల వివరాలను ఈ నెల 22లోపు ఎన్హెచ్ఆర్సీకి సమర్పించాలి. * మృతదేహాలకు శవపరీక్షను ఎన్హెచ్ఆర్సీ-2010 నాటి మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి. * ఎస్టీఎఫ్, బాధితులు ఉపయోగించిన ఆయుధాలను కస్టడీలో ఉంచాలి. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సోమవారం విన్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా అందించాలని ఆదేశించింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను భద్రపరచాలని పేర్కొంది. వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం విన్న అనంతరం కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా తమకు అందించాలని నిర్దేశిం చింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను పూర్తిగా భద్రపరచాలని పేర్కొంది. అలాగే.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, ఆయా గ్రామాల పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రతను కల్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వాంగ్మూలం ఇదే: తామంతా బస్సులో ప్రయాణిస్తుండగా.. ఏపీ పోలీసులు అడ్డుకుని తమను శేషాచలం అడవులకు తీసుకెళ్లే యత్నం చేశారని, తాము తప్పించుకున్నా, తమ వాళ్లని తీసుకెళ్లి కాల్చిచంపారని ఎన్కౌంటర్ ఘటన నుంచి తప్పించుకున్న తమిళనాడుకు చెందిన శేఖర్(54), బాలచంద్రన్(29)లు ఎన్హెచ్ఆర్సీ ఎదుట వాంగ్మూలమిచ్చారు. ‘పీపుల్స్‌వాచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హెన్రీ టిఫాగ్నే, సుప్రీం కోర్టు లాయర్ వ్రిందా గ్రోవర్ సహా యంతో వీరు సోమవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఘటన వివరాలను వివరించారు. అనంతరం హెన్రీ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. పక్కన మహిళ ఉండడంతో.. ‘శేఖర్ ఒక దినసరి కూలీ. తన బంధువు మహేంద్రన్‌కు చెందిన నిర్మాణ పనుల నిమిత్తం మహేంద్రన్, మూర్తి, మునుస్వామిలతో కలసి ఈ నెల 6న తన గ్రామమైన పూడూరు కొల్లమేడు(తిరువాణ్ణమలై జిల్లా) నుంచి బస్సులో చెన్నైకి బయలుదేరారు. మధ్యాహ్నం 2.30కు ఆర్కాట్ బస్టాండ్ దాటుతుండగా 30 ఏళ్ల వయసు, గుబురు మీసాలు ఉన్న ఓ వ్యక్తి బస్సులోకి ఎక్కి మహేంద్రన్ను తనతో రావాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ‘మీరెవరంటూ..’ మహేంద్రన్ ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి చొక్కా పట్టుకుని లాక్కుపోయాడు. శేఖర్ అప్పటికే భయానికి గురై వెనక్కి తిరిగి చూస్తే.. తనతో పాటు వచ్చిన మూర్తి, మునుస్వామి కూడా బస్సులో కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి 7.30కు పోలీసులు మహేంద్రన్ ఫొటో చూపించి తిరుపతి వద్ద అడవిలో చనిపోయాడన్నారు. చనిపోయిన 20 మందిలో మూర్తి, మునుస్వామి ఉన్నారని తెలిసింది. శేఖర్ పక్కన ఓ మహిళ కూర్చోవడంతో.. శేఖర్ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నాడని, ఈ బృందంలో సభ్యుడై ఉండడని భావించిన పోలీసులు అతని జోలికి వెళ్లలేదు’ బాలచంద్రన్ ఇలా..: ‘బాలచంద్రన్ ఒక దినసరి కూలీ. ఈ నెల 4న కాంట్రాక్టు ఏజెంట్ పళని ఫోన్ చేసి.. పాండిచ్చేరిలో ఉపాధి ఉందన్నాడు. దీంతో బాలచంద్రన్ తన తండ్రి హరికృష్ణన్ సహా మరో 8 మందిని తీసుకుని ఈ నెల 5న బయలు దేరాడు. మరుసటి రోజు ఉదయం పళనికి సంబంధించిన మరో వ్యక్తి ఈ బృందంతో కలిశాడు. ఆర్కాట్‌కు వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలచంద్రన్, ఈ కొత్త వ్యక్తి మద్యం సేవించడానికి ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లారు. వీరిద్దరూ తిరిగి బస్టాండ్ చేరేసరికి మిగిలిన బృందం కనిపించలేదు. పళనికి సంబంధించిన వ్యక్తి పళనికి ఫోన్ చేయగా.. నగరి పుత్తూరుకు చేరుకోవాలని పళని సూచించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నగరి పుత్తూరుకు చేరుకునే సమయంలో పళనికి సంబంధించిన వ్యక్తి మరోసారి పళనికి ఫోన్ చేసిన అనంతరం బాలచంద్రన్‌తో.. పళని అరెస్టయ్యాడని చెప్పాడు. కానీ.. పళని ఎందుకు అరెస్టయ్యాడో బాలచంద్రన్‌కు అర్థం కాలేదు. ఆ బృందంలోని తన మరో బంధువు శివకుమార్‌కు ఫోన్ చేయగా.. పరిచయం లేని వ్యక్తి లైన్లోకి వచ్చి ‘మీ వాళ్లు తిరుపతిలో ఉన్నారు. త్వరగా వచ్చేయ్’ అని చెప్పారు. బాలచంద్రన్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలోనే తన తండ్రి, తమ బృందంలోని మరో ఏడుగురు చనిపోయారని తెలిసింది.’ ఇలంగోవన్ అలా తప్పించుకున్నాడు.. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఇలంగోవన్‌కు ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకపోవడంతో ఎన్హెచ్ఆర్సీకి రాలేకపోయినట్టు హెన్రీ చెప్పా రు. ఇలంగోవన్ కూడా దినసరి కూలీయేనని, తన ఊరికే చెందిన పనీర్ సెల్వం పొరుగూరిలో పనులున్నాయని చెప్పడంతో ఏప్రిల్ 6న బయలుదేరారు. రాత్రి 8 సమయంలో నగరి పుత్తూర్‌లో ఆహారం తినేందుకు దిగగా.. 8 మంది పోలీసులు వీరిని చుట్టుముట్టి లారీలోకి ఎక్కిం చారు. అది తిరుపతి వద్ద రేంజర్స్ ఆఫీస్ వద్ద ఆగడంతో కొందరు పోలీసులు లారీ ఎక్కగా.. కొందరు దిగారు. ఈ సమయంలో ఇలంగోవన్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపిం చాలని హెన్రీ, గ్రోవర్లు డిమాండ్ చేశారు. 14, 15 తేదీల్లో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఘటనా ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. -
'మేం చూశాం.. అరెస్టు చేసి.. చంపేశారు'
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్రన్‌ను ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) ముందు ప్రవేశ పెట్టింది. ఎన్‌కౌంటర్‌కు ముందు ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీరు కమిషన్ కు వివరించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. -
శేషాచలం ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం( ఎన్ హెచ్ ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ అంశాన్ని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురుగేశన్ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎన్ కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్న వాదనలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఈనెల 23న హైదరాబాద్ లో వాదనలు వింటామని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. -
శిశుమరణాలపై ప్రభుత్వానికి నోటీసు
ధర్మపురి, సేలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా శిశువులు మరణించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల మరణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల్లో 6 మంది శిశువులు మృతి చెందగా ఆ తరువాత కూడా మరో ఐదుగురు చిన్నారుల మరణాలు కొనసాగాయి. ధర్మపురి ఆస్పత్రి నుంచి సేలం ప్రభుత్వాస్పత్రికి ఆరుగురు చిన్నారులను తరలించారు. వారిలో ఇద్దరు కన్నుమూశారు. అప్పటికే సేలం ప్రభుత్వాస్పత్రిలో పది మంది చిన్నారులు మృతి చెందారు. శిశువుల వరుస మరణాలపై రాష్ట్ర ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేయగా, ప్రభుత్వం రెండు వైద్య బృందాలను ధర్మపురి, సేలంకు పంపింది. ఎక్కువ శాతం కోలుకుంటున్నా మరణాలు మాత్రం ఆగలేదు. సేలం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సుమారు వంద మంది చికిత్స పొందుతుండగా, మూడు రోజుల్లో మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. రెండు ఆస్పత్రులు కలుపుకుని శుక్రవారం నాటికి చిన్నారుల మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఎమర్జెన్సీ, ఈసీయూ వార్డుల్లోని పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సుమోటోగా స్వీకరణ ధర్మపురి,సేలం ఆస్పత్రుల్లో శిశువుల మరణాలపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసినట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు టీ మురుగేశన్ చెప్పారు. పురిటిబిడ్డల వరుస మరణాలను కమిషన్ తీవ్రంగానూ, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ధర్మపురి, సేలం జిల్లాల కలె క్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మరణాలపై నాలుగు వారాల్లోగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. -
‘అవినీతి జడ్జికి అందలం’
మాజీ సీజే ఐ బాలకృష్ణన్ పై కట్జూ తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ కేజీ బాలకృష్ణన్ లక్ష్యంగా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి నేపథ్యం ఉన్న మద్రాసుహైకోర్టు న్యాయమూర్తి ఒకరికి, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమోషన్ కట్టబెట్టడానికి జస్టిస్ బాలకృష్ణన్ తీవ్రంగా ప్రయత్నించారని కట్జూ ఆరోపించారు. అవినీతి జడ్జిని సుప్రీంకోర్టు పదవి వరకూ తీసుకెళ్లడంలో జస్టిస్ బాలకృష్ణన్ అధ్యక్షతలోని కొలీజియం దాదాపుగా సఫలమైందని, జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా అందులో సభ్యుడని కట్జూ పేర్కొన్నారు. అయితే, సదరు జడ్జిపై తమిళనాడు లాయర్లు, భారీఎత్తున డాక్యుమెంటరీ ఆధారాలు చూపడంతో బాలకృష్ణన్ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. కట్జూ ఆదివారం తన బ్లాగ్‌లో తాజా ఆరోపణలు చేశారు. పూర్తిగా అనర్హుడైన జడ్జిని సుప్రీంకోర్టు స్థాయికి తెచ్చేందుకు బాలకృష్ణన్ నేతృత్వంలోని కొలీజియం ప్రయత్నించిందని, తాను మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉండగా, అక్కడే సదరు జడ్జి పనిచేశారు కాబట్టి, ఆయన అపకీర్తి ఏమిటో తనకు తెలుసుసని కూడా కట్జూ వ్యాఖ్యానించారు. అతని గురించి కొలీజియం సభ్యుడైన కపాడియాకు వివరాలందించినా, అదే జడ్జి పేరును సిఫార్సుచేయడం విచిత్రమన్నారు. అందుబాటులో లేని బాలకృష్ణన్ కాగా, కట్డూ చేసిన ఈ ఆరోపణలపై జస్టిస్ బాలకృష్ణన్ స్పందనకోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేరు. జస్టిస్ కపాడియా స్పందిస్తూ, అర్హతలేని ఏ జడ్జినీ తాను సుప్రీంకోర్టువరకూ తేలేదన్నారు. కట్జూ ఆరోపణలన్నీ అర్థరహితమైనవన్నారు. జడ్జి పేరును కూడా కట్జూ తన బ్లాగ్‌లో వెల్లడించలేదని, అతను ఎవరిగురించి ప్రస్తావిస్తున్నారో తనకు తెలియదని క పాడియా అన్నారు. -
ఆంధ బాలల చితకబాదిన ఘటనపై కమిషన్ సీరియస్!
న్యూఢిల్లీ: కాకినాడ గ్రీన్‌ఫీల్డ్ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో పిల్లలను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు చితకబాదిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. బాలల హక్కుల ఉల్లంఘనేనని ఈ ఘటనపై మానవహక్కుల సంఘం వ్యాఖ్యలు చేసింది. అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోమవారం సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. -
48కి పెరిగిన చెన్నై మృతులు
సాక్షి, చెన్నై: చెన్నైలో ఈ నెల 28వ తేదీన 11 అంతస్తుల అపార్టుమెంట్ కూలిపోయిన ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయానికి మృతుల సంఖ్య 48కు చేరింది. 27 మందిని శిథిలాల నుంచి రక్షించారు. ప్రమాద కారణాలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం ఆ ప్రాంతమంతా అలుముకుంది.