శేషాచలం ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్ | national human rights commission seek report on chittoor encounter | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్

Published Tue, Apr 7 2015 6:49 PM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

national human rights commission seek report on chittoor encounter

న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం( ఎన్ హెచ్ ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ అంశాన్ని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురుగేశన్ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎన్ కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్న వాదనలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఈనెల 23న హైదరాబాద్ లో వాదనలు వింటామని మానవ హక్కుల సంఘం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement