జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ‘రాచాల’ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: పుష్ప–2 చిత్రం ప్రచార మోజులో మహిళ ప్రాణాలు తీసిన అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రేక్షకులను నియంత్రించలేమని పోలీసులు హెచ్చరించినా.. లెక్కలేనితనంతో నటుడు అల్లు అర్జున్ వచ్చారని ఆరోపించారు. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైందని, ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment