చెన్నైలో ఈ నెల 28వ తేదీన 11 అంతస్తుల అపార్టుమెంట్ కూలిపోయిన ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయానికి మృతుల సంఖ్య 48కు చేరింది. 27 మందిని శిథిలాల నుంచి రక్షించారు.
సాక్షి, చెన్నై: చెన్నైలో ఈ నెల 28వ తేదీన 11 అంతస్తుల అపార్టుమెంట్ కూలిపోయిన ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయానికి మృతుల సంఖ్య 48కు చేరింది. 27 మందిని శిథిలాల నుంచి రక్షించారు. ప్రమాద కారణాలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం ఆ ప్రాంతమంతా అలుముకుంది.