tamilnadu government
-
కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
Is Kamal Haasan Get Notices From Tamil Nadu Government For Metro: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత మాసీవ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య తమదైన నటనతో మెస్మరైజ్ చేశారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న కమల్ హాసన్‌కు షాక్ తగిలినట్లయింది. కమల్ హాసన్ ఇంటిన తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం తమినాడు సర్కారు కమల్‌కు ఇప్పటికే నోటీసులు పంపించిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో రెండో భాగం దశ మెట్రోను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగంగానే అల్వార్ పేట స్టేషన్ కమల్ హాసన్ నివాసం నుంచే వెళ్తుంది. ఈ స్టేషన్ నిర్మాణం కోసం కమల్ భవనంలో 170 చదరపు అడుగులు కావాలట. ఈ స్థలం కోసమే కమల్‌కు ప్రభుత్వం నోటీసులు పంపించిందని టాక్. ఈ స్థలంలో ప్రధాన భాగం రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం. చదవండి:👇 కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..!
తమిళనాడులో కేంద్రం ‘కొత్త’ ఆట మొదలు పెట్టిందా..? నూతన గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటోందా..? రాజ్‌భవన్ కేంద్రంగా రసవత్తర రాజకీయానికి తెరతీసిందా..? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీలో తొలిసారి కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన గవర్నర్.. మంగళవారం విస్తుగొలిపే ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. సాక్షి, చెన్నై: తమిళనాడులో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తనకు వివర ణ ఇవ్వాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బును ఆదేశించారు. ప్రభుత్వ పాలనలో రాజ్‌భవన్ జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం రాజుకుంది. శాఖల వారీగా పథకాల సమీక్షకు సిద్దంకావాలని గవర్నర్ ఆర్ఎన్ రవి జారీచేసిన ఆకస్మిక ఆదేశాలు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ పర్యటన అనంతరం.. రిటైర్డు ఐపీఎస్ అధికారైన ఆర్ఎన్ రవి ఈనెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులను కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తనకు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఆకస్మిక ఉత్తర్వులు జారీచేయడం, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బుకు ఉత్తరం రాయడం చర్చనీయాంశమైంది. గవర్నర్ తరపున ఆయన కార్యదర్శి అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు మంగళవారం ఉత్తరాలు పంపారు. ( చదవండి: అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు) అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వశాఖల పనితీరు, ఆయా శాఖల పరిధిలోని పథకాల అమల్లో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని గవర్నర్ ఆశిస్తున్నారు. గవర్నర్ కోరుతున్న వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండండి. కంప్యూటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దృశ్యరూపాలను తయారు చేసుకోండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు ఆయా పథకాల తీరుపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించి తేదీ, సమయాన్ని మరలా తెలియజేస్తాం’’ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దురుద్దేశ పోకడ: టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి రాష్ట్ర ప్రభుత్వ పథకాల తీరుపై వివరణ కోరడం వెనుక గవర్నర్ దురుద్దేశపోకడ దాగి ఉందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గవర్నర్ చర్య ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేరు గానీ.. ఆయన ప్రజల చేత ఎన్నుక కాలేదని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎంకు, మంత్రివర్గానికి మాత్రమే ఉంటుందని చెప్పారు. గవర్నర్ ఆదేశాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. ఆర్ఎన్ రవి నియామకం రోజున తలెత్తిన సందేహాలు ప్రస్తుతం నిజమవుతున్నాయని అన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో అడ్డంకులు సృష్టించేందుకు, కేంద్రప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కోసం గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏజెంటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. పథకాల సమీక్ష నిర్ణయాన్ని గవర్నర్ వెనక్కుతీసుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది’’ అని కేఎస్ అళగిరి హెచ్చరించారు. గవర్నర్ తీరు వల్ల రాష్ట్రంలో రెండు పాలనా కేంద్రాలు, గందరగోళ పరిస్థితి ఉత్పన్నం కాగలవని తమిళనాడు మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ ఆల్బెన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోరాదన్నారు. స్టాలిన్ ఏం చేస్తారో..? అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు పథకాలపై వివరణ ఇస్తారనే ఆశిస్తున్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతిస్తారా..? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ స్వచ్ఛభారత్ పథకం కింద జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇందుకు డీఎంకే శ్రేణులు గవర్నర్ చర్యను నిరసిస్తూ నల్లజెండాల ప్రదర్శన చేపట్టారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గవర్నర్ తనదైన శైలిలో సమీక్షలు కొనసాగించారు. భన్వారీలాల్ పురోహిత్ బదిలీకాగానే ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆర్ఎన్ రవి సైతం అదే పోకడలను అనుసరించడం రాజకీయ కలకలానికి దారితీసింది. అయితే గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వం నుంచి సీఎం స్టాలిన్ సహా ఎవ్వరూ స్పందించ లేదు. చదవండి: సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ.. -
అర్చకత్వంలోనూ సగం..
దేవాలయాల్లో అర్చకులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. ఇప్పుడా స్థానాల్లోకి సైతం మహిళలు అడుగుపెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్ వడియార్ (పూజారి) బుధవారం బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అర్చకత్వం చేస్తూ మరెంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ సుహంజనను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. 208 మంది అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిలో మహిళా పూజారిగా సుహంజన, ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్‌గా సేవలందించనుంది. సుహంజనను అర్చకత్వం చేయడానికి ఆమె భర్త, మామగారు ముందుండి ప్రోత్సహించడం విశేషం. తమిళనాడులో మహిళ అర్చకత్వం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తండ్రి మరణించడంతో అతడు చేసే అర్చకత్వాన్ని వారసురాలిగా అతని కుమార్తె చేయవచ్చని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నియక్కళ్ తమిళనాడులోనే తొలి మహిళా పూజారిగా బాధ్యతలు చేపట్టింది. పిన్నియక్కాళ్ తండ్రి పిన్న తేవార్ మధురైలోని అరుల్మిగు దురై్గ అమ్మన్ కోవెలలో పూజారిగా పనిచేసేవారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆలయంలో ఆయన చేయాల్సిన పనులను పిన్నియక్కాళ్ చేసేది. కొంత కాలం గడిచాక ఆరోగ్యం క్షీణించి పిన్నతేవార్ 2006లో మరణించాడు. దీంతో ఆయన స్థానంలో పిన్నియక్కాళ్కు ఆ బాధ్యతలు ఇవ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడం తో పిన్నియక్కాళ్ అర్చకత్వం నిర్వహించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 2007లో పిన్నియక్కాళ్ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విషయాన్ని వక్కాణించి చెప్పడం విశేషం. ‘‘నేను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్ని చదివాను. ఇది ఒక ఉద్యోగ అవకాశంగా నేను చూడడం లేదు. నిర్మాణాత్మకమైన సాంప్రదాయం ఇది. అర్చకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు కూడా ఇది చేయగలరని సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను’’అని సుహంజన చెప్పింది. -
మాజీ సీఎం జయలలిత నివాసంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
‘ఉచిత పథకాలు కాదు.. నీటి నిల్వ ముఖ్యం’
సాక్షి, చెన్నై : మద్రాసు హై కోర్టు.. తమిళనాడు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నీటి నిల్వలను పరిరక్షించేందుకు సీఎస్ అధ్వర్యంలో తక్షణమే ఓ కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజలు కట్టే సొమ్ముతో ఉచిత పథకాలు కాకుండా నీటి నిల్వలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటే మంచిది. ప్రభుత్వం ఇప్పటికైనా నీటి నిల్వలపై దృష్టి సారించకపోతే.. తమిళనాడు మరో దక్షిణాఫ్రికా అతుతుంద’ని కోర్టు హెచ్చరించింది. మంచినీటి కోసం ప్రజలు గొంతెండి బాటిళ్లు కొనుక్కునే దారుణమైన పరిస్థితి రానివ్వకండని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
స్టెరిలైట్ పరిశ్రమపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడంతో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. (స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!) -
అమ్మ... అమృత..
ప్రతి మనిషి జన్మలోనూ ‘తల్లి నిజం.. నాన్న నమ్మకం’ అనేది ప్రాచీన నానుడి. తాను పలానా దంపతుల సంతానం అని చెప్పుకోవాలంటే సదరు భార్యాభర్త జీవించి ఉన్నపుడే ప్రకటించాలి. అది జరగనపుడు సశాస్త్రీయమైన తిరుగులేని విధానం డీఎన్ఏ పరీక్ష. అయితే డీఎన్ఏ పరీక్ష చేయాలంటే రక్త నమూనాలు తప్పనిసరి. జయలలిత తన తల్లి అంటున్న అమృత వాదనలోని నిజానిజాల కోసం జయ పార్థివదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి డీఎన్ఏ పరీక్షలు చేయవచ్చు. అంతటి అవకాశాలు కనుచూపుమేరలో లేవు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం రక్తనమూనాలే. అపోలో ఆస్పత్రిలో జయ సుదీర్ఘకాలం చికిత్స పొందినపుడు వివిధ పరీక్షల కోసం సేకరించిన రక్తం ఉంటుందని కోర్టు భావించింది. అయితే సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశామని, తమ వద్ద నమూనాలు లేవని అపోలో తేల్చి చెప్పేసింది. దీంతో అమృత వారసత్వ కేసుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. డీఎన్ఏ పరీక్ష ద్వారా రుజువుచేసుకునేందుకు అవసరమైన జయలలిత రక్త నమూనాలు తమ వద్ద లేవంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. జయకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్లరూపాయల స్థిర, చరాస్థులు ఉన్నా వారసులుగా ఎవరూ లేరు. జయ అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా గుర్తింపుకోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ దశలో బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి తాను జయలలిత, శోభన్‌బాబుల ప్రేమ ఫలమని ప్రకటించుకుంది. జయ వారసురాలిగా తనను ప్రకటించాలని కోరుతూ గత ఏడాది ఆఖరులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మెరీనా బీచ్ సమాధి నుంచి జయ పార్థివదేహాన్ని బయటకు తీసి అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయాలని, తనకు డీఎన్ఏ పరీక్ష చేయాల్సిందిగా కోర్టును కోరింది. ఈ కేసు న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది. జయలలిత వారసురాలినని చెప్పుకునేందుకు అమృత వద్ద అధికార పూర్వమైన ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించరాదని తమిళనాడు ప్రభుత్వం వాదన ప్రారంభించింది. ఈ పరిస్థితిలో జయలలిత రక్తనమూనాలు ఉన్నాయా అనే విషయంలో బదులివ్వాల్సిందిగా అపోలో యాజమాన్యాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అమృత పిటిషన్ కొట్టివేయాలని.. జయలలిత ఆస్తులను కాజేసే ఉద్దేశంతో అమృతవేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అమృత దాఖలు చేసిన కేసు గురువారం విచారణకు రాగా అపోలో ఆస్పత్రి యాజమాన్యం తరఫు న్యాయవాది మైమునాబాషా బదులు పిటిషన్ దాఖలు చేశారు. అపోలో తరఫున మరో పిటిషన్ అపోలో ఆసుపత్రి న్యాయవిభాగం మేనేజర్ మోహన్‌కుమార్ తరఫున మరో పిటిషన్ వేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘2016 సెప్టెంబరు 9వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు 75 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు మెరుగైన చికిత్సను ఆమెకు అందజేశారు. జయలలిత మరణం తరువాత అదే ఏడాది డిసెంబరు 7వ తేదీన ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశాం. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి స్వాధీనంలో జయలలితకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, రక్త నమూనాలు లేవు’’ అని కోర్టుకు వారు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు 4వ తేదీకి వాయిదావేశారు. -
'వేద' ఘోష!
పోలీస్ వలయంలో పోయెస్‌గార్డెన్ వందకుపైగా బలగాలతో మోహరింపు పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీకి చెక్ శశికళ కుటుంబ ప్రవేశంపై నిషేధం సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయ స్మారక మందిరంగా మార్చనున్నట్లు సీఎం ఎడపాడి చేసిన ప్రకటనతో పోయెస్‌గార్డెన్ పోలీస్ వలయంగా మారింది. గురువారం రాత్రి సీఎం ప్రకటించగానే పోలీసులు చేరుకోగా శుక్రవారం ఉదయానికి భారీ సంఖ్యలో బారికేడ్లు, సుమారు వందమందికి పైగా పోలీసు బలగాలు ప్రత్యక్షమయ్యాయి. వేదనిలయం సమీపించే రోడ్డులో మూడు చోట్ల పోలీసులు పహరా కాస్తున్నారు. శశికళ కుటుంబీకులను లోనికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. అలాగే ఆ పరిసరాలతో సంబంధం లేని వ్యక్తులను సైతం అనుమతించడం లేదు. వేదనిలయం సమీపంలో నివసిస్తున్న వారిని నిర్ధారించుకున్న తరువాతనే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం వేదనిలయం బెంగళూరు జైల్లో శశికళతోపాటు శిక్షను అనుభిస్తున్న ఇళవరసి కుమారుడు వివేక్ స్వాధీనంలో ఉంది. అయితే వీరికి సంబంధించిన వారెవ్వరూ అక్కడ నివసించడం లేదు. ఇటీవల వరకు మన్నార్‌కుడి (శశికళ స్వస్థలం)కి చెందిన కొందరు పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు ఇంటిని కనిపెట్టుకుని ఉండేవారు. అయితే వారిని శుక్రవారం అక్కడి నుంచి పంపివేశారు. నాడు రూ.1.32 లక్షలు.. నేడు రూ.90 కోట్లు పోయెస్‌గార్డెన్‌లోని ఇంటిని జయ తల్లి సంధ్య 1967 జూలై 15 వ తేదీన తనపేరుపై కొనుగోలు చేశారు. 24 వేల చదరపు అడుగుల స్థలంలో 21,662 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించి ఉంది. రూ.1.32 లక్షలతో సొంతం చేసుకున్న వేదనిలయం విలువ నేడు రూ. 90 కోట్లని సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై దీప, దీపక్‌ల వివాదం: వేదనిలయంను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సహించేది లేదని గురువారమే అభ్యంతరం వ్యక్తం చేసిన జయ మేనకోడలు కేసు వేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే దీప సోదరుడు సైతం సదరు భవనం దీపకు, తనకు సొంతమని, అందుకు తగిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని దీపక్ శుక్రవారం ప్రకటిస్తూ సీఎం ఎడపాడికి లేఖ రాశారు. ప్రభుత్వానికి చేతనైతే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని దీపక్ సవాలు విసిరారు. వేదనిలయం తన తదనంతరం కుమారుడు (జయకుమార్), కుమార్తె (జయలలిత)కు చెందాలని సంధ్య వీలునామా రాశారు. ప్రస్తుతం ఆ వీలునామా దీపక్ వద్ద ఉంది. అయితే ప్రజల కోసం ఏ ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. వారసత్వ హక్కును రుజువు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించి వేదనిలయంను స్వాధీనం చేసుకుంటామని మంత్రి సీవీ షణ్ముగం చెబుతున్నారు. చిన్నమ్మ కోసం దినకరన్ పరుగు: జయ మరణంపై విచారణ కమిషన్, పోయెస్‌గార్డెన్ ఇళ్లు ప్రభుత్వపరం కావడం, ఎడపాడి, పన్నీర్ ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకోవడంతో అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు పరుగులు తీశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ తనకు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చితీరుతానని దినకరన్ వ్యాఖ్యానించారు. -
మంత్రులపై ఐటీ పంజా
-
రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం?
►మంత్రి విజయభాస్కర్ క్వారీలపై మళ్లీ దాడులు ►శరత్‌కుమార్, రాధిక ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు ►సర్కార్ రద్దు దిశగా పరిణామాలు చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు అనంతర పరిణామాలు ఎడపాడి ప్రభుత్వ కొంపను ముంచనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ మెడకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగుస్తోందా? పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఎడపాడి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందా? అనే ప్రశ్నలకు అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డింది. ఓటును నోటుతో కొనేయవచ్చనే సులభమార్గాన్ని ఎంచుకుని ఐటీ వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోంది. అధికార పార్టీనే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. మంత్రి క్వారీల్లో మళ్లీ తనిఖీలు మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలపై ఈనెల 7న జరిగిన ఐటీ దాడుల వేడి చల్లారక ముందే పుదుక్కోట్టలోని ఆయన క్వారీల్లో మంగళవారం మరోసారి తనిఖీలు సాగాయి. తిరువేంగవాసల్లో మంత్రికి చెందిన క్వారీలపై కేంద్ర ప్రజాపనులశాఖ అధికారుల సహాయంతో ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సుమారు 150 ఎకరాల్లోని క్వారీల్లోకి ఉదయం 7 గంటల సమయంలో పది మంది అధికారులు ప్రవేశించి నిర్వహణ తీరుపై విచారణ చేపట్టారు. క్వారీల హద్దులను అధిగమించి నిక్షేపాలను కొల్లగొట్టినట్లు కనుగొన్నారు. 7వ తేదీన జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంతోనే ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అలాగే, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, ఆయన సతీమణి, నటి రాధికకు చెందిన చెన్నై టీ నగర్‌లోని రాడాన్ టీవీసీరియల్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆరుగురు మంత్రులకు ఐటీ సమన్లు మంత్రి విజయభాస్కర్ పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన పరిస్థితిలో మరో ఆరుగురు మంత్రులకు ఐటీ అధికారులు మంగళవారం సమన్లు జారీచేశారు. సెంగోట్టయ్యన్ రూ.13 కోట్లు, దిండుగల్లు శ్రీనివాసన్ రూ.13 కోట్లు, తంగమణి రూ.12 కోట్లు, ఎస్పీ వేలుమణి రూ.15 కోట్లు, జయకుమార్ రూ.11 కోట్లు, సెల్లూరు రాజా రూ.48 లక్షలు పంపిణీ చేసినట్లు ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడంతో నోటీసులు పంపారు. మంత్రి విజయభాస్కర్తోపాటూ ఈ ఆరుమంది మంత్రులన త్వరలో విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ విచారణకు హాజరుకాని ఎంజీఆర్ వైద్యవర్సిటీ వీసీ గీతాలక్ష్మికి రెండోసారి నోటీసులు పంపారు. అయితే ఆమె తనపై ఐటీశాఖ జారీచేసిన సమన్లను కొట్టి వేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ తప్పదా? ఆదాయపుపన్నుశాఖ అధికారులు ఈనెల 7వ తేదీన జరిపిన దాడుల్లో వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి నుండి రూ.5.5 కోట్ల స్వాధీనం నేపధ్యంలో డైరక్టర్ ఆఫ్ విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి విజయభాస్కర్‌ను సోమవారం తీవ్రస్థాయిలో విచారించారు. సోమవారం రాత్రి మంత్రికి సంబంధించి ఇద్దరు బంధువుల ఇళ్లపై, అనుచరులున్న ప్యారీస్‌లోని ఒక లాడ్జీపై ఆకస్మిక దాడులు జరిపి మరికొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి కేసును ఆర్కేనగర్లో నగదు పంపిణీ, ఇంటిలో రూ.5.5 కోట్లు కలిగి ఉండటాన్ని రెండుగా విభజించి విచారించనున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2లక్షలకు పైగా నగదు దగ్గర ఉంచుకున్నట్లయితే తగిన కారణాలతో ఐటీ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో సీబీఐ లేదా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారు. ఈ ప్రకారమే కేసు ఈడీకి చేరగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం? ఆర్కేనగర్ ఉప ఎన్నికలను అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గుప్పుమంటోంది. ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేర నగదు, బహుమతుల బట్వాడా సాగినట్లు ఐటీ దాడుల్లో సాక్ష్యాలు లభించడం, ఈ పంపిణీలో ముఖ్యమంత్రి ఎడపాడి, ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ ప్రధానపాత్ర పోషించడం తేటతెల్లమైంది. ఎన్నికల్లో అక్రమాలపై సీఎం సహా అందరినీ విచారించాలని ఐటీ అ«ధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేతగా ఎడపాడి ఎన్నిక, విశ్వాస పరీక్ష వరకు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ఉంచడం, మంత్రుల ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్లు ఆరోపణలతో ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్టపాలై ఉంది. ఐటీ దాడుల వల్ల ప్రభుత్వంపై మరింత మచ్చపడటం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్నట్లుగా కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం సమర్పించేందుకు డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురైమురుగన్, ఎంపీ ఆర్ ఎస్ భారతి తదితరులు మంగళవారం ముంబయికి వెళ్లారు. ఆర్కేనగర్లో అధికార పార్టీ అవినీతిపై నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి ఎడపాడి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్రాజా నాగర్‌కోవిల్‌లో మీడియాతో అన్నారు. ఆయా కారణాల దృష్ట్యా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయవచ్చాని కేంద్ర పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.5లక్షలు తీసుకోలేదు: డాక్టర్ బాలాజీ అమ్మ వేలిముద్రల స్వీకరణ సమయంలో వైద్యమంత్రి విజయభాస్కర్ నుంచి తాను రూ.5లక్షలు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యులు బాలాజీ మంగళవారం ఖండించారు. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉండగా మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల వచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత అభ్యర్థులకు జారీచేయాల్సిన బీఫారంలో ఆమె సంతకానికి బదులు వేలిముద్రలు వేశారు. ఆ సమయంలో డాక్టర్ బాలాజీ సాక్షి సంతకం చేశారు. మంత్రి తనకు కూడా రూ.5లక్షలు ఇచ్చారని, ఆ సొమ్మును లండన్ డాక్టర్ రిచర్డ్ హోటల్ ఖర్చులకు వినియోగించినట్లుగా వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. తాను ఏ మీడియాతో మాట్లాడలేదు, తనకు మంత్రి రూ.5లక్షలు ఇవ్వలేదని డాక్టర్ బాలాజీ ఖండించారు. -
జల్లికట్టుపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు
జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జల్లికట్టు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలవ్వాల్సిన జల్లికట్టు ఉత్సవాలకు అడ్డం లేకుండా పోయింది. అయితే, కొత్త చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ఆ విషయమై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఆరు వారాల సమయం ఇచ్చింది. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. జల్లికట్టు ఉత్సవాన్ని నిర్వహించడానికి అనుమతినిస్తూ రాష్ట్ర అసెంబ్లీ జనవరి 23వ తేదీన ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. తమిళనాడులో జనవరి నుంచి మే నెల వరకు జల్లికట్టుతో పాటు మంజువిరట్టు, వడమాడు, ఎరుదువిడుం లాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచాలని, అలాగే ఉత్సవాల్లో పాల్గొనే ఎడ్లకు ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. -
జల్లికట్టు కోసం రగులుతున్న తమిళనాడు
చెన్నై: జల్లికట్టు క్రీడను నిర్వహించుకోవడానికి అనుమతి రాకపోవడంతో తమిళనాడు ప్రజలు రగిలిపోతున్నారు. జల్లికట్టు నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చినప్పటినుంచీ తమిళనాడులో ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. గత కొన్ని రోజులనుంచి యువత చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. చెన్నై మెరీనా తీరానికి వేలాది మంది యువత చేరుకుని మెరీనా తీరాన్ని బ్లాక్ చేశారు. సీఎం పన్నీర్ సెల్వం వచ్చి హామీ ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేలాదిగా యువత మెరీనా తీరానికి చేరుకుని తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో తమిళనాడు సర్కార్ చేతులెత్తేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ‘జల్లికట్టు’ని నిషేధించాలి’’ అని ఇటీవల తన ట్విట్టర్లో త్రిష పేర్కొనడంతో ఆమెపై తమిళ ప్రజలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. హీరో సూర్య మాత్రం జల్లికట్టుకు పూర్తిగా మద్ధతు తెలిపాడు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ సాహస క్రీడ తప్పకుండా ప్రతిఏటా నిర్వహించాల్సిందే అంటూ ఆందోళన చేపట్టిన యువత వెనక్కి తగ్గడం లేదు. మెరీనా తీరాన్ని బ్లాక్ చేసి తమ నిరసన తెలిపారు. (చదవండి: సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు) -
సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు
చెన్నై: జల్లికట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. పండుగ సందర్భంగా జల్లికట్టును అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. తీర్పు తర్వగా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరగా, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో ఇలా అడగడం భావ్యం కాదని, తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా తమిళుల వంశపారంపర్య జల్లికట్టు క్రీడను యథావిధిగా నిర్వహించుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పొంగల్ పండుగ దినాల్లో సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం అనేకసార్లు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. తమిళుల వీరత్వాన్ని, సంప్రదాయాన్ని చాటే సాహసక్రీడగా జల్లికట్టు రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మధురై జిల్లా అలంగా నల్లూరులో సాగే క్రీడ ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. అయితే, ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికుల వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జల్లికట్టుకు 2014లో తమిళనాట బ్రేక్ పడింది. రెండేళ్లుగా జల్లికట్టులేని సంక్రాంతిని జరుపుకోక తప్పడం లేదు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కేంద్ర, రాష్ట్రంలోని పాలకులు సంక్రాంతికి ముందు ఊరించే వాగ్దానాలు, భరోసా ఇచ్చే ప్రకటనలు సాగించినా, చివరకు న్యాయస్థానంలో మాత్రం నిరాశే మిగిలింది. -
రోశయ్య కొనసాగేనా.. లేదా?
చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య కొనసాగేనా లేదా, కొత్త గవర్నర్ వచ్చేనా అన్న..? చర్చ తమిళనాడు రాష్ట్రంలో సాగుతున్నది. అయితే, రోశయ్య పదవీ కాలం ముగియడానికి రెండు రోజులు మాత్రం సమయం ఉన్న దృష్ట్యా, ఆయన్నే కొనసాగించవచ్చన్న ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు. కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఈనెల 31వ తేదీతో రోశయ్య పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే కొత్త గవర్నర్ నియామకానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇంత వరకు అలాంటి ప్రయత్నాలు జరగనట్టు సమాచారం. అదే సమయంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించాలన్న ప్రతి పాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, కర్ణాటకతో కావేరి వివాదం సాగుతు న్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్‌గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది. తదుపరి శంకర మూర్తి నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ పేరు కాస్త తెర మరుగైనట్టు అయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్‌గా రోశయ్య మళ్లీ కొనసాగుతారా..? లేదా, కొత్త వాళ్లెవరైనా నియమించబడతారా..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. కొత్త గవర్నర్ నియామకం సంబంధించి పాత గవర్నర్ పదవీ కాలం ముగియడానికి పది హేను రోజుల ముందుగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. అయితే, ఇంతవరకు అలాంటివి జరగలేదు. ఇక, మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న దృష్ట్యా, కొణిజేటి రోశయ్య పదవీ కాలాన్ని పొడిగించేనా అన్న చర్చ రాజ్‌భవన్ వర్గాల్లో సాగుతున్నది. తమిళనాడు ప్రభుత్వం కూడా రోశయ్యకు సానుకూలంగా ఉన్న దృష్ట్యా, మరో ఏడాది లేదా, రెండేళ్ల పదవీ కాలం పొడిగించవచ్చన్న ప్రచారం బయలుదేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు వెలువడేనా, లేదా కొత్త గవర్నర్ నియామకం జరిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
కలాంకు ఇదేనా మర్యాద!
చెన్నై : మనిషి ఉన్నంత వరకే విలువ..అన్న నాడికి అద్దం పట్టే రీతిలో భారత రత్న అబ్దుల్ కలాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. స్మారక కేంద్రానికి స్థల కేటాయింపులో సాగుతున్న అలసత్వాన్ని బట్టి చూస్తే, ఇదేనా ఆ మహనీయుడికి ఇచ్చే మర్యాద అన్న ఆవేదన ప్రతి ఒక్కరి మదిలో మెదలక మానదు. రాష్ర్ట ప్రభుత్వ అలసత్వంపై కేంద్ర బృందం సైతం అసహనం వ్యక్తం చేసింది. ‘కలలు కనండి.... వాటిని సాకారం చేసుకోండి.. ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునకు స్పందించిన వాళ్లు దేశ విదేశాల్లో కోట్లల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు గత ఏడాది జూలై 27న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. అల్లంత దూ రాలకు వెళ్లినా, ఆయన సందేశాలు, పి లుపు శాశ్వతం. అందుకే ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకాని కి అమితాభిమానం. అయితే, పాలకుల్లో ఆ అభిమానం, గౌరవం కన్పించడం లే దని చెప్పవచ్చు. మనిషి ఉన్నంత వరకే విలువ...తదుపరి...అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. తాను పుట్టిన గడ్డ రామేశ్వరంలోని తేకరంబు వద్ద శాశ్వత నిద్రలో కలాం ఉన్నారు. ఆ ప్రదేశంలో స్మారక మండపం, ఎగ్జిబిషన్, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించారు. ఇందుకు తగ్గ హామీని కలాం సొదరుడు మహ్మద్ ముత్తు మీరాన్‌కు ఇచ్చారు. అయితే, పనులన్నీ నత్తనడకే. పర్యాటక, ఆథ్యాత్మిక కేంద్రం గా ఉన్న రామేశ్వరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కలాం సమాధిని సందర్శించి వెళ్తున్నారు. అయితే, అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రహరీ నిర్మాణాలు, కంచె ఏర్పాటు పనుల్ని ముగించారు. ఇనుప కమ్మిలను ఏర్పాటు చేసి బయటి నుంచి కూడా జనం సమాధిని వీక్షించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సమాధి మీద ఎండ పడకుండా ఓ షెడ్డును నిర్మించారు. అంతటితో తమ పని ముగిసినట్టే అన్నట్టుగా పాలకుల తీరు స్పష్టం అవుతున్నాయి. ఇదేనా మర్యాద : కలాం భౌతికంగా అందర్నీ వీడి మరో రెండు వారాల్లో ఏడాది కావస్తున్నది. అయినా, ఇంత వరకు కలాం స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, కలాంకు సంబంధించిన వస్తువుల ప్రదర్శన శాల, చిన్న పిల్లల పార్కు పనులు అడుగైనా ముందుకు సాగ లేదు. విజ్ఞాన కేంద్రం తదితర పనులకు రూ. 60 కోట్లను కేంద్రం కేటాయించినట్టు సంకేతాలు ఉన్నా, అందుకు తగ్గ పనులు చేపట్టేందుకు స్థలం సమస్య నెలకొని ఉన్నది. కలాం సమాధి ఉన్నప్రదేశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కలాం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఎకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఆ మహనీయుడు శాశ్వత నిద్రలో ఉన్నారు. అయితే, స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, ఇతర నిర్మాణాలకు తగ్గ స్థలం సమస్య నెలకొని ఉన్నది. ఈ స్థలాన్ని కేటాయించాలంటూ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, రాష్ట్ర పాలకుల్లో స్పందన కరువైనట్టుంది. అసెంబ్లీ ఎన్నికలు అడ్డొచ్చినా, మళ్లీ అమ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నది. అయినా, ఇంత వరకు స్థల కేటాయింపు విషయంగా ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. దీంతో ఏడాదిలోపు పనుల్ని ముగించి తీరుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలకు రాష్ర్ట ప్రభుత్వ తీరు అసహనాన్ని రేకెత్తిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎం మోహన్, ఆర్కే కౌహలాల్, మహేంద్రలతో కూడిన బృందం కలాం సమాధి పరిసరాల్ని మంగళ, బుధవారం పరిశీలన జరిపారు. అక్కడ ఇప్పటి వరకు సాగిన, సాగుతున్న పనుల్ని పరిశీలించి, స్థల కేటాయింపులో జాప్యంపై ఆ బృందం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఆరు రోజులుగా... ఇంటికి దూరమైన హీరో
చెన్నై వరదల్లో తను తీవ్రంగా నష్టపోయినా.. సామాన్యులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన రియల్ హీరో సిద్దార్థ్, తొలిసారిగా వరదలపై మీడియాతో మాట్లాడాడు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రకృతి విపత్తుపై ప్రజలు స్పందించిన తీరు తనకు అద్భుతంగా అనిపించిందంటున్నాడు సిద్దార్థ్. ' జీవితంలో తొలిసారిగా నేను నా ఇంటిని కోల్పోయాను.. మూడు స్టూడియోలు, మూడు కార్లు ఈ వరదల్లో పాడైపోయాయి. నా పరిస్థితే ఇలా ఉంటే ఒక్క రోజులో సర్వం కోల్పోయిన సామాన్యుల పరిస్థితి ఏంటి..?' అని చెన్నై వరద పరిస్థితులపై స్పందించాడు. తన ఇంట్లో నీరు నిలిచిపోవటంతో గత ఆరు రోజులుగా తన ఇంటికి దూరంగా ఉంటున్నాడు సిద్దార్ధ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావటం ఆనందం గా ఉందన్నాడు. ప్రస్థుతం బాధితులకన్నా సాయం చేసేవారు ఎక్కువగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మూలంగానే ఈ స్పందన సాధ్యమైందన్నాడు. ప్రస్తుతం చెన్నై పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. సోషల్ మీడియాలో మరింత భయానకంగా చూపిస్తారని, అలాంటి ప్రచారాలు మానుకోవాలని చెప్పాడు. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను కూడా సిద్దార్ధ్ ఖండించాడు. ఇంతటి భారీ విపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైన అయిదు రోజుల్లో అంత సరిచేయలేదని అందుకు సమయం పడుతుందన్నాడు. ఇదే విషయం పై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై స్పందించడానికి సిద్దార్ధ్ నిరాకరించాడు. -
హెచ్చరించినా... నిర్లక్ష్యం చేశారు
ముందే సమాచారం అందించాం : స్పష్టం చేసిన ఇస్రో డెరైక్టర్ శివన్ చెన్నై: పదిహేను రోజుల ముందే వర్షాలపై ప్రభుత్వాన్ని ఇస్రో హెచ్చరించి ఉంది. అయినా పాలకులు ఖాతరు చేయని దృష్ట్యా, పెను వరదల్ని చవి చూడాల్సి వచ్చింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో నాగర్‌కోయిల్‌లో ఇస్రో డెరైక్టర్ శివన్ వ్యాఖ్యలు చేశారు. వరదలు ప్రజా జీవితాన్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తాజాగా వ్యవహరిస్తోంది. అయితే, ప్రభుత్వానికి పదిహేను రోజుల క్రితమే ఇస్రో సమాచారాన్ని అందించి ఉంది. వర్ష ప్రభావం ఏ మేరకు ఉండబోతోందోనని నివేదిక రూపంలో సమాచారం ఇచ్చినా , పాలకులు ఖాతరు చేయక పోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోమవారం నాగుర్‌కోయిల్‌లో ఓ మీడియాతో ఇస్రో డెరైక్టర్ శివన్ మాట్లాడుతూ భారీ వర్షాలను ముందే గుర్తించి తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వివరించారు. పదిహేను రోజులక్రితం సమాచారం ఇచ్చినా అందుకు తగిన చర్యలు తీసుకోని దృష్ట్యా, పెను విలయం ఏర్పడిందని పేర్కొన్నారు. వాతావరణ సంబంధిత అన్ని వివరాలను తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఇస్రో వద్ద ఉన్నాయని వివరించారు. ఇస్రో హెచ్చరించినా, పాలకులు ఖాతరు చేయక పోవడంపై ప్రజల్లో అసహనం బయల్దేరుతోంది. తమ జీవితాల మీద ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని పెదవి విప్పే వాళ్లు అధికం అయ్యారు. -
నిర్బంధ తమిళం సరికాదు
ఎమ్మెల్సీ పొంగులేటి కొరుక్కుపేట: తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించటం సరైన పద్ధతి కాదని తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాతృభాషను వదలి తమిళంలో చదవాలనే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదని దుయ్యబట్టారు. ఎన్నో దశాబ్దాలు తరబడి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిని తక్కువ చేసి చూడడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమిళనాట తెలుగు భాషా సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తిపరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు. నిర్బంధ తమిళం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అల్పసంఖ్యాకుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కనీసం 10 సంవత్సరాలు పాటు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రంలోని మైనారిటీ భాషలన్నింటికీ ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. -
ఆర్థికమంత్రి మళ్లీ ఆయనే!
తనకు అత్యంత నమ్మకస్తుడు, తాను తిరిగొచ్చేవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుని.. రాగానే తిరిగి ఇచ్చేసిన పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. గతంలో ఆయన పనిచేసిన ఆర్థికశాఖనే కొత్త మంత్రివర్గంలో కూడా ఆయనకు కట్టబెట్టే యోచనలో 'అమ్మ' ఉన్నట్లు చెబుతున్నారు. మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో శనివారం ఉదయం 11 గంటలకు జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూడా తాను కూర్చోకుండా.. జయలలిత ఫొటోను మాత్రమే అక్కడ పెట్టి 'భరతరాజ్యం' పాలించారన్న పేరు పన్నీర్ సెల్వంకు ఉంది. -
సిరిసిల్ల టూ చెన్నై..
మరమగ్గాలపై చీరలు, పంచెల ఉత్పత్తి.. సంక్షోభ సిరిసిల్లకు ఉపాధి.. సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల చీరలకు కొత్త ఆఫర్లు వస్తున్నాయి. కాలం చెల్లిన మగ్గాలపై కాటన్ (ముతక రకం) వస్త్రమే కాకుండా మార్కెట్లో అమ్ముడుపోయే చీరలు, పంచెల ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు చీరలకు మంచి గిరాకీ ఉంటుండగా.. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం భారీగా పంచెలు, చీరలకు ఆర్డర్ ఇవ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పండుగ శోభ.. తమిళనాడులో ఏటా సంక్రాంతి (పొంగల్)కి పేదలకు వస్త్రాలను అందజేస్తారు. మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు అందిస్తారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల చీరలు, మరో మూడు లక్షల పంచెలకు కొత్తగా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేతకార్మికులకు ఉపాధి మెరుగైంది. పండుగకు కొద్ది రోజులే గడువు ఉండడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, ధోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72కోట్ల పంచెలు, మరో 1.73కోట్ల చీరలు అవసరం ఉండడంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో రెండు వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం వంద మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా, రోజుకు రెండు లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పక్షం రోజుల్లో తమిళనాడుకు అవసరమైన చీరలు, పంచెలను ఉత్పత్తి చేసే శక్తి సిరిసిల్ల నేతన్నలకు ఉంది. రాష్ట్రంలోనే అగ్రగామి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిరిసిల్ల మరమగ్గాలు అగ్రగామిగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 78 వేల మరమగ్గాలుండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మరమగ్గాలపై కాటన్(ముతర) రకం వస్త్రం ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఐదు లక్షల మీటర్ల వస్త్రం సిరిసిల్లలో ఉత్పత్తి అవుతుండగా.. ఈ మేరకు మార్కెట్లో వినియోగం లేక ధర లభించడం లేదు. మరోవైపు షోలాపూర్, బీవండి, ఇచ్చంఖరేంజ్ లాంటి ప్రాంతాల నుంచి సిరిసిల్ల కంటే నాణ్యమైన వస్త్రం పోటీకి రావడంతో మన వస్త్రానికి డిమాండ్ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాళ్లు, ధోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. రంగు రంగుల చీరలు... సిరిసిల్లలో ఉత్పత్తవుతున్న చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఆ చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పాలిస్టర్ వస్త్రంను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.45 పైసలు లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.50 చెల్లిస్తున్నారు. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలి దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే వస్త్రం ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తే ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి లభించనుంది. పండుగ ముందు గిరాకీ సిరిసిల్లలో ఉత్పత్తి అయ్యే చీరలకు పండుగ ముందు ఎప్పుడూ గిరాకీ ఉంటుం ది. ఈ సారి కొత్తగా ఆర్డర్లు వచ్చిన విషయం మాకు తెలియదు. కానీ మంచిగనే గుడ్డ అమ్ముడు పోతుంది. పని చేసుకుంటే రోజుకు 350 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. - సబ్బని నర్సయ్య, ఆసామి పని బాగానే ఉంది మరమగ్గాలపై చీరలు ఉత్పత్తి చేస్తాను. పని బాగానే ఉంది. మీటర్‌కు మూడున్నర ఇస్తారు. వారానికి పద్నాలుగు వందలు వస్తాయి. 12 గంటలు పని చేస్తే నెలకు ఐదువేల వరకు సంపాదించవచ్చు. కాటన్ పాలిస్టర్ కంటే కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది. - కొంక విజయ్‌కుమార్, రాజీవ్‌నగర్ -
జయపై పదేళ్లపాటు అనర్హత
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆమెపై అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువరించిన 27 సెప్టెంబర్ 2014 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ విడుదల చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు పడినట్టు పేర్కొంది. అలాగే జయకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం శ్రీరంగం సెప్టెంబర్ 27 నుంచి ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. 18 ఏళ్ల క్రితం నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. -
జోత్స్న, చిన్నప్పలకు తమిళ సర్కారు నజరానా
చెన్నై: కామన్వెల్త్ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన దీపికా పళ్లికల్, జ్యోత్స్న చిన్నప్పలకు తమిళనాడు ప్రభుత్వం 50లక్షల రూపాయల బహుమానం ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 14వ పసిడి పతాకాన్ని స్క్వాష్ క్రీడాకారిణులు దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప అందించారు. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు. -
48కి పెరిగిన చెన్నై మృతులు
సాక్షి, చెన్నై: చెన్నైలో ఈ నెల 28వ తేదీన 11 అంతస్తుల అపార్టుమెంట్ కూలిపోయిన ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయానికి మృతుల సంఖ్య 48కు చేరింది. 27 మందిని శిథిలాల నుంచి రక్షించారు. ప్రమాద కారణాలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం ఆ ప్రాంతమంతా అలుముకుంది. -
విధుల్లో చేరిన రోజే సస్పెన్షన్
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం(56)కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మొదటి మహిళా అదనపు డెరైక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెం డ్ చేస్తూ తమిళనాడు ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. అదనపు డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకునేముందు పాటించాల్సిన విధి, విధానాలను ఉల్లంఘించడం వల్లనే ఆమెను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అర్చన రామసుందరం సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతున్నందున ఆమె చెన్నైలోనే ఉండాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర హోం శాఖ వ్యతిరేకించి, వేరే అధికారి పేరును సూచించినప్పటికీ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అదనపు డెరైక్టర్ పదవికి అర్చన పేరును సిఫారసు చేశారు. దాంతో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అర్చనను ఖరారు చేసింది. సీబీఐలో జాయింట్ డెరైక్టర్ హోదా అందుకున్న మొదటి మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అదనపు డెరైక్టర్‌గా ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరగనుంది. -
ప్రశాంతంగా టెట్
సాక్షి, చెన్నై: ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సరికొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నం గందరగోళం మధ్య సాగింది. పరీక్ష నిర్వహణ తేదీ పలుమార్లు వారుుదా పడింది. ఎట్టకేలకు పరీక్ష జరిగినా అభ్యర్థుల విద్యార్హతతో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడం, 150 ప్రశ్నలకు గంటన్నర మాత్రమే సమయం కేటాయించడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పరీక్ష రాసిన ఆరు లక్షల ప్రశాంతంగా టెట్ మందిలో రెండు వేల మందే ఉత్తీర్ణులయ్యూరు. దీంతో మూడు గంటల సమయాన్ని నిర్ణయించి మళ్లీ పరీక్షలు నిర్వహించి ఖాళీల్ని భ ర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పకడ్బందీ టెట్ నిర్వహించేందుకు ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకుంది. శనివారం పేపర్ 1(డీఎడ్), ఆదివారం పేపర్ 2(బీఎడ్) పరీక్ష జరగనున్నట్లు ప్రకటించింది. నిఘానీడలో పరీక్ష శనివారం తొలి పేపర్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘానీడలో పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉదయూన్నే చేరుకున్నారు. పది నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని 677 కేంద్రాల్లో 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. చెన్నైలోని కేంద్రాల్లో 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో మహిళా అభ్యర్థులు అధికం. ఆదివారం బీఎడ్ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. సుమారు 4.11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. లీక్ కలకలం టెట్ పేపర్ ధర్మపురిలో లీక్ అరుునట్లు వచ్చిన సమాచారం అభ్యర్థులు, అధికారులను ఆందోళనలో పడేసింది. ధర్మపురిలో ఓ ముఠా పేపర్ లీక్‌కు పాల్పడినట్లు, ప్రశ్నపత్రాలను వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఓ చోట అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రచారం బయలుదేరిన పరీక్ష కేంద్రం వద్ద నుంచి విచారణ వేగవంతం చేశారు. ధర్మపురి ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కృష్ణగిరి సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతం చేశారు. ఆ సరిహద్దుల్లో ఐదుగురి వద్ద ప్రశ్నపత్రాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. అరుుతే ఈ ప్రశ్నపత్రాలు నకిలీవిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ప్రశ్నపత్రాల్ని సృష్టించి అభ్యర్థుల్ని మోసగించడం లక్ష్యంగా ఈ ముఠా కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాలను రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు విక్రరుుంచినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో కృష్ణగిరికి చెందిన గణపతి, హోసూరుకు చెందిన కృష్ణ, చంద్రశేఖర్, తలికి చెందిన అశోక్‌కుమార్, మరో వ్యక్తి ఉన్నారు.