
ఆర్థికమంత్రి మళ్లీ ఆయనే!
తనకు అత్యంత నమ్మకస్తుడు, తాను తిరిగొచ్చేవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుని.. రాగానే తిరిగి ఇచ్చేసిన పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. గతంలో ఆయన పనిచేసిన ఆర్థికశాఖనే కొత్త మంత్రివర్గంలో కూడా ఆయనకు కట్టబెట్టే యోచనలో 'అమ్మ' ఉన్నట్లు చెబుతున్నారు.
మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో శనివారం ఉదయం 11 గంటలకు జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూడా తాను కూర్చోకుండా.. జయలలిత ఫొటోను మాత్రమే అక్కడ పెట్టి 'భరతరాజ్యం' పాలించారన్న పేరు పన్నీర్ సెల్వంకు ఉంది.