panneer selvam
-
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్‌మారన్. గతంలో ఓపీఎస్‌ను పార్టీ టాప్ పోస్ట్‌కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్‌తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్‌ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్‌గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్‌కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్‌ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్‌లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్‌గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్‌లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్‌కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్‌పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని
సాక్షి, చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో ఇద్దరు అగ్రనాయకులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరుకి తెరపడింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామినే తిరిగి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారం చేపట్టడానికి ఇరువురు అగ్ర నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సా హాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాల యంలో స్వయంగా పన్నీర్ సెల్వం నేతల హర్షధ్వానాల మధ్య సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరుని ప్రకటించారు. ‘‘నా ప్రియ సోదరుడు పళనిస్వామిని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2021 ఎన్నికల్లో ఆయన విజేతగా నిలుస్తారు’’అని పళనిస్వామి అన్నా రు. ఆ తర్వాత 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పట్నుంచో పన్నీర్ సెల్వం ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ ఉంటే, పళనిస్వామి దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థిత్వంపైనా ఇరువురు నేతల మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. సెప్టెంబర్ 28న పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఇద్దరూ సీఎం పదవి తనకి కావాలంటే, తనకంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు పైనా కూడా ఇద్దరి మ«ధ్య మాటా మాటా పెరిగింది. అప్పట్నుంచి పన్నీర్ సెల్వం ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ వచ్చారు. కొందరు నాయకుల చొరవతో మళ్లీ ఇద్దరూ రాజీకి రావడంతో సంక్షోభం ముగిసింది. వచ్చే ఏప్రిల్, మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పన్నీర్‌ను మించిపోయేలా జయలలిత మృతి తర్వాత సీఎం అయ్యే అవకాశం తొలుత పన్నీర్ సెల్వంకే వచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. కానీ సరిపడినంత ఎమ్మెల్యేల బలం లేక పదవిని కోల్పోయారు. అదే సమయంలో శశికళకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడడంతో ఆమెకు అత్యంత విధేయుడిగా పేరు పడిన పళనిస్వామిని శశికళ సీఎంని చేశారు. ఆమె జైలుకి వెళ్లిన అనంతరం పన్నీర్‌తో చేతులు కలిపిన పళనిస్వామి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ని పార్టీ నుంచి గెంటేశారు. క్రమక్రమంగా ఆయన తనకున్న రాజకీయ చాతుర్యంతో పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జయలలిత మరణానంతరం పార్టీ, ప్రభుత్వంలో శశికళ తర్వాత అంతటి పట్టు సాధించిన వారు పళని. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కి పోటీ ఇవ్వగలిగిన నాయకుడు ఏఐఏడీఎంకేలో పళనిస్వామి తప్ప మరొకరు లేరన్న అభిప్రాయం ఉంది. -
అకస్మాత్తుగా సీఎం, డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష
సాక్షి, చెన్నై: కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిరాహార దీక్ష దిగారు. వెంటనే కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి. -
ఆ నలుగురు.. రంజుగా తమిళ రాజకీయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మూడు నెలల్లో పళని ప్రభుత్వం కూలిపోతుందంటూ ఫలితాల రోజున దినకరన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం పళని, శనివారం ఊటీలో నిర్వహించిన ఎంజీఆర్ జయంతి ఉత్సవాల్లో స్పందించారు. ‘‘1974లో నేను అన్నాడీఎంకేలో చేరా. కార్యకర్త స్థాయి నుంచి పని చేసి ఆ స్థాయికి ఎదిగా. నాతోపాటు చాలా మంది అన్నాడీఎంకే కోసం అహర్శిశలు కృషి చేశాం. కానీ, దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారు అని అన్నారు. ఆర్కే నగర్ లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని పళని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళతారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని పళని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంత కాలం మాత్రమే అనుభవించగలరని.. భవిష్యత్తులో అతనికి గుణపాఠం చెప్పి తీరతామని పళని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దినకరన్ ఓ బచ్చా... పన్నీర్ సెల్వం మరోవైపు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దినకరన్ పై మండిపడ్డారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ బచ్చా.. ఎల్కేజీ స్టూడెంట్ అని ఎద్దేవా చేశారు. జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీని కూల్చాలని దినకరన్, డీఎంకేలు చేసే యత్నాలు ఫలించవని ఆయన చెప్పారు. రజనీ ఎంట్రీపై దినకరన్ స్పందన... రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ... దినకరన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రకటన వెలువడటానికి ముందే నిన్న ఓ జాతీయ మీడియాతో దినకరన్ మాట్లాడుతూ.. తమిళనాడుకు ఒకే ఎంజీఆర్.. ఒకే అమ్మ(జయలలిత) ఉంటారు. వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని తెలిపారు. అమ్మ విధేయులను తప్ప వేరే ఏ ముఖాన్ని ఆమె అభిమానులు అంగీకరించబోరని దినకరన్ చెప్పారు. తమిళ రాజకీయంలో ప్రస్తుతానికి ప్రతిపక్ష డీఎంకే ప్రేక్షక పాత్ర వహిస్తుండగా.. ఈ నలుగురు మాత్రం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌గా మారారు. -
చిన్నమ్మ వద్దు..‘అమ్మ’నే శాశ్వతం
-
చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం
► పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ తొలగింపు ► జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి ► అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ► ప్రభుత్వాన్ని కూలుస్తా: దినకరన్ సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి ‘చిన్నమ్మ’ శశికళ, ఆమె కుటుంబీకులను దూరం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు మరింత వేగం పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను మంగళవారం తొలగించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. గతంలో శశికళ తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే.శశికళ చేసిన నియామకాలు చెల్లవని పార్టీ తీర్మానించడంతో దినకరన్‌ను నియామకం కూడా రద్దైనట్లైంది. దినకరన్ సృష్టించిన అడ్డంకులను అధిగమించి, హైకోర్టు అనుమతితో కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై నగరంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్నాడీఎంకేకు శాశ్వత అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్, శాశ్వత ప్రధాన కార్యదర్శి ‘అమ్మ’ జయలలితేననీ, వారి స్థానాలను మరెవ్వరితోనూ భర్తీ చేయకూడదంటూ సమావేశంలో పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తగా పార్టీలో కో–ఆర్డినేటర్, జాయింట్ కో–ఆర్డినేటర్ పదవులను సృష్టించి వాటిని వరసగా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలకు కేటాయించారు. వచ్చే ఎన్నికల వరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు. కొత్త నిబంధనల ప్రకారం పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ పదవుల్లోని వారికి ఉంటుంది. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అధ్యక్షతన పళని, పన్నీర్ల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ల ఆధిపత్యాన్ని నిలువరించడమే లక్ష్యంగా పళని, పన్నీర్ల వర్గాలు ఇటీవల ఏకమైన విషయం తెలిసిందే. పళని మాట్లాడుతూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదనీ, వెయ్యి మంది దినకరన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. జయ ఉన్న సమయంలో ఏయే కట్టుబాట్లు పార్టీలో అమల్లో ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతామని పన్నీర్ పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు చేశారు. మదురైలో దినకరన్ మంతనాలు శశికళను పదవి నుంచి తొలగించడంతో ఆమె మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పళని, పన్నీర్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మరోవైపు సర్వసభ్య సమావేశం సాగుతుండగానే దినకరన్ మదురైలో తన వర్గం వారితో మంతనాలు సాగించారు. సర్వసభ్య సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, కాబట్టి పళని, పన్నీర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం చెల్లదని దినకరన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం మార్పు కోసం ప్రయత్నించాననీ, ఇకపై ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ శపథం చేశారు. త్వరలోనే శశికళ ఆదేశాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ప్రకటించారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే తీర్పు సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని మద్రాసు హైకోర్టు చెప్పడం తెలిసిందే. శశికళను పదవి నుంచి తప్పించడం చెల్లుతుందో లేదో హైకోర్టే తన తీర్పులో చెబుతుందని దినకరన్ అన్నారు. కాగా, మైసూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఒకరు... తాము అక్కడ బందీలుగా ఉన్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేలా విశ్వాస పరీక్ష పెట్టేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. -
నోటీసులు
♦ ఓపీఎస్, శశి, టీటీవీలకు నోటీసులు ♦ రెండాకుల కేసులో ధర్మాసనం నిర్ణయం ♦ కోర్టుకు వేద నిలయం సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఓపీఎస్(పన్నీరు సెల్వం), అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. ఇక, పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు తగ్గ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో వివాదాలు రెండాకుల చిహ్నం సీజ్‌కు కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓపీఎస్, ఈపీఎస్ ఒక్కటైనా, దినకరన్ రూపంలో చిక్కులు బయలు దేరాయి. ఇక, ఈ రెండాకుల విషయంగా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ దాఖలైంది. తిరుచెందూరుకు చెందిన రామ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్లో గతంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల్లో చీలికలు వచ్చిన తరుణంలో, మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న శిబిరానికి అధికారిక గుర్తులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చీలికలు బయలు దేరడంతో 45 ఏళ్లుగా అందరి మదిలో పాతుకుపోయిన గుర్తు సీజ్ చేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, తీర్పులను పరిగణలోకి తీసుకుని మెజారిటీ ఎటు వైపు ఉన్నదో వారికి ఆ గుర్తు అప్పగించేందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ సూచనను న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులను జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేశారు. కోర్టుకు వేదనిలయం : దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లోని వేదా నిలయంను స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ పనులకు అధికార వర్గాలు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ నిర్ణయాన్ని జయలలిత మేనల్లుడు దీపక్, మేన కోడలు దీపలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముసిరికి చెందిన తంగవేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలిత కోర్టు ద్వారా దోషిగా పరిగణించి బడినట్టు గుర్తు చేశారు. ఆమె ప్రస్తుతం లేకున్నా, ఆ కేసులో నిందితురాలేనని పేర్కొన్నారు. అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన లావేదేవిలు, చర్చలు వేదనిలయం వేదికగా సాగినట్టుగా గతంలో కోర్టు పేర్కొందని వివరించారు. కోర్టు జాబితాలో ఉన్న ఆ వేదనిలయాన్ని ఎలా స్మారక మందిరంగా మార్చేందుకు వీలుందని పేర్కొంటూ, ఆ భవనాన్ని స్మారక మందిరంగా మారిస్తే, కోర్టులకు విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. దీనిని పరిగణలోకి తీసుకుని స్మారక మందిరం పనులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. -
మోదీ ఆశ పడ్డారు !
► విలీనంపై పన్నీరు వ్యాఖ్య ► పళనితో ఫలితం శూన్యం ∙అన్నీ నాటకాలే ► ప్రజాభీష్టం మేరకే ఎవరైనా నాయకుడు ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే, అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మతో ఇక విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపికచేసిన కమిటీని కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో పన్నీరు స్పందించారు. మోదీ ఆశపడ్డారు దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహాశక్తిగా అన్నాడీఎంకే అవతరించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తనమీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటు, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని వివరించారు. తాను ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడీఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహితపాలన సాగాలంటే, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయటపడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశపడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తుచేశారు. నాటకాలు రక్తికట్టాయి విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని అద్భుతంగా రక్తి కట్టించారని మండిపడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అసలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్ చెప్పినట్టుగానే పళనిస్వామి నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆధ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు. దినకరన్ నాటకం నమ్మకాన్ని కల్గించలేదని, పళని తృప్తిపరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనానికి ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడీఎంకే ముక్కలైనా కేడర్ చెల్లాచెదురు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తనవైపు కిందిస్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటు ప్రజలు కూడా ఉన్నారన్నారు. వారివైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి వెళ్లలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడీఎంకే బలం అన్నా డీఎంకేదేనని, ఇతరులు ఎవరూ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు. రజనీకాంత్ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభీష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోటే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. -
‘మోదీ’ ఆశ పడ్డారు ...!
► విలీనంపై పన్నీరు వ్యాఖ్య ►పళనిస్వామితో ఫలితం శూన్యం ► అన్నీ నాటకాలే సాక్షి, చెన్నై : ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే, అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకే అమ్మతో ఇక, విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవీ శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపిక చేసిన కమిటీనీ కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీరు స్పందించారు. మోదీ ఆశపడ్డారు : దివంగత నేతలు ఎంజియార్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహా శక్తిగా అన్నాడిఎంకే అవతరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటుగా, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలే దని వివరించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడిఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహిత పాలన సాగాలంటే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయట పడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడుతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడిఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు. నాటకాలు రక్తికట్టాయి విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని ఎంత అద్భుంతంగా అంటే, అంతగా...రక్తి కట్టించారని మండి పడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అస్సలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్ చెప్పినట్టుగానే పళని స్వామిలు నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆథ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు. దినకరన్ నాటకం నమ్మకాన్ని కల్గించ లేదని, పళని తృప్తి పరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనంకు ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడిఎంకే ముక్కులైనా కేడర్ చెల్లా చెదరు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన వైపు కింది స్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటుగా ప్రజలు ఉన్నారని, వారి వైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి వెళ్ల లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడిఎంకే బలం అన్నాడిఎంకేదేనని, ఇతరులు ఎవ్వరూ కేడర్‌ను తమ వైపుకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు. రజనీ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభిష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేడని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోట్టే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. -
రజనీ రాజకీయాలపై నేతలు ఏమన్నారు?
''యుద్ధం వచ్చినపుడు చెబుతా.. సిద్ధంగా ఉండండి''... ఇదీ తన అభిమానులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సందేశం. అంటే, తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు చెబుతానని, అందుకు ఇప్పటినుంచే మానసికంగా రెడీగా ఉండాలని పరోక్షంగా చెప్పినట్లేనని అంతా భావిస్తున్నారు. అయితే ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మరే పార్టీ వచ్చినా అది మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లే అవుతోందన్నది చరిత్ర చెబుతున్న నిజం. మరి రజనీకాంత్ చరిత్రను తిరగరాస్తాడా.. సొంతంగా పార్టీ పెడతాడా లేదా ఇప్పటికే ఉన్న ఏవైనా పార్టీలో చేరుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తమిళ రాజకీయ వర్గాలలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేసినట్లే ఆయన మాట్లాడారు. అయితే కేంద్ర మాజీమంత్రి, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్‌కు మాత్రం రజనీ రాజకీయాలు పెద్దగా నచ్చినట్లు లేవు. రజనీకాంత్ మంచివాడేనని, ఆ విషయం అందరికీ తెలుసని చెబుతూనే... తమిళ రాజకీయాలకు ఇప్పుడు డాక్టర్ కావాలి గానీ యాక్టర్ అక్కర్లేదన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఐసీయూలో ఉందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా వైద్యుడిని కావడంతో.. ఆయనిలా స్పందించారని అనుకుంటున్నారు. యాక్టర్లు రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు నాశనం చేశారని, అది ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు అందరూ అలాగే చేశారని అన్నారు. కేవలం నటనా నైపుణ్యాలు మాత్రమే రాష్ట్రానికి సరిపోవన్న విషయం యువతకు బాగా తెలుసని ఆయన చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యంస్వామి కూడా రజనీ విషయంలో నెగెటివ్‌గానే స్పందించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఆయన ఈరోజు ఒకమాట చెబితే రేపు మరోమాట చెబుతారని, ఎల్టీటీఈ బెదిరింపుల కారణంగా ఆయన ఎప్పటికప్పుడు తన మనసు మార్చుకుంటారని స్వామి ఆరోపించారు. ఇప్పటికే ఉన్న నాయకులను ప్రశంసిస్తూనే.. వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పడం ద్వారా తాను రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న విషయాన్ని రజనీ చెప్పకనే చెప్పినట్లయింది. ''మనకు స్టాలిన్, అన్బుమణి రాందాస్, సీమన్ లాంటి మంచి నాయకులున్నారు. కానీ, వ్యవస్థ పాడైనప్పుడు, ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు వాళ్లేం చేస్తారు? వ్యవస్థను మార్చాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. నాకు నా వృత్తి ఉంది, మీకు మీ ఉద్యోగాలున్నాయి. మీరు వెళ్లి మీ ఉద్యోగాలు చేసుకోండి. సమరానికి సమయం ఆసన్నమైనప్పుడు మనం తిరిగి కలుద్దాం'' అని 67 ఏళ్ల సూపర్ స్టార్ తన అభిమానులతో అన్నారు. తాను తమిళుడిని కానన్న విమర్శలను ఆయన దీటుగా తిప్పికొట్టారు. తాను 23 ఏళ్లు కర్ణాటకలో ఉంటే 43 ఏళ్లుగా తమిళనాడులోనే ఉన్నానని చెప్పారు. ''కర్ణాటక నుంచి వచ్చిన మరాఠీని అయినా, మీరంతా కలిసి నన్ను మలిచారు, నన్ను అసలైన తమిళుడిగా మార్చారు'' అని అన్నారు. -
మమ్మీ రిటర్న్స్ ?
-
అన్నాడీఎంకేలో మరో చీలిక?
చెన్నై: జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో మరో కీలక పరిణామం సంభవించబోతోంది. మాజీ మంత్రి తోపు వెంకటాచలం సహా అధికార పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వీరంతా కలిసి మరో చీలిక వర్గంగా ప్రకటించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీంఎం పన్నీరు సెల్వం వర్గాలు అన్నాడీఎంకే పార్టీలో పైచేయి కోసం పావులు కదుపుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మరో కుంపటి పెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఇక విలీన చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. -
ఇలాగైతే చర్చలు రద్దు: పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఇక విలీన చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలు వాళ్లను తాము ఎలా నమ్మగలమని పన్నీర్ అంటున్నారు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరోవైపు వాళ్లు శశికళ, టీటీవీ దినకరన్‌ల పేర్లతో కూడిన ఒక అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించి, రెండాకులు గుర్తు కావాలంటున్నారని.. అసలు వాళ్లకు విలీనం కావాలని ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం తాము బేషరతు చర్చలకు సిద్ధంగానే ఉన్నామంటున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారు కాబట్టి.. రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శశికళ, దినకరన్‌లను తాము పక్కకు పెడతామని ఈపీఎస్ చెబుతున్నా.. వాళ్లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద సీబీఐ విచారణ జరిపించాలన్నది కూడా ఆ వర్గం ప్రధాన డిమాండ్లలో ఒకటి. కానీ ఇది కోర్టు పరిధిలో ఉందని సీఎం అంటున్నారు. దానికి తోడు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చర్చల సందర్భంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాగైతే తాము ఎందుకు సహించి భరించాలని పన్నీర్ వర్గం అంటోంది. దాంతో.. ఇక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి, ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం బలాన్ని పెంచుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
-
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని, ముందుగా తానే త్యాగం చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీ సంక్షేమం కోసం తన పదవి పోయినా పర్వాలేదని ఆయన విలేకరులతో చెప్పారు. అయితే, అదే మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. పన్నీర్ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ గురించి ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే ఓపీఎస్ వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని మాత్రం చెప్పారు. వాళ్ల డిమాండ్లు ఏంటో బయటపెట్టాలని, రెండు వైపుల నుంచి కూడా డిమాండ్లు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జయకుమార్ అన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, వాళ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. పళనిసామి వర్గం ఓ రాజీ ఫార్ములాతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇస్తామని వాళ్లు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు అన్నారు. మరోవైపు.. పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది. ఏది ఏమైనా సాయంత్రానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ కార్యాలయంలో చర్చలు మొదలవుతున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారే డిమాండ్లు తీసుకొచ్చారు. ఒకరికి ప్రభుత్వాన్ని, మరొకరికి పార్టీని అప్పగించాలని మధ్యేమార్గంగా సూచిస్తున్నారు. కొంతమంది మంత్రులపై వేటు వేయాలని కూడా అంటున్నారు. రెండు వర్గాల వెనక బీజేపీ ఉందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటు తిరుగుతాయో ప్రశ్నార్థకంగా ఉంది. -
తమిళనాట కాషాయం ‘పన్నీరు’!
చెన్నై: తమిళనాట దాదాపు 20 ఏళ్ల ఎన్నికల అనుభవాలు బీజేపీని పాలక అన్నాడీఎంకేకు దగ్గరయ్యేలా చేస్తున్నాయా? అన్నది నేటి ప్రశ్న. మాజీ సీఎం జయలలిత బతికుండగా, ఆమె మరణించాక ఈ పార్టీ వెంట జాతీయపార్టీ ఇంతగా పడడం చాలా మందికి అర్ధంకాని విషయం. ఒంటరిగా తమిళనాట ఎదగడానికి బీజేపీ చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదు. ద్రవిడ పార్టీలతో సయోధ్య లేకుండా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడం ప్రస్తుతానికి అసాధ్యం అన్న విషయం బీజేపీ అనుభవసారం. ఇక్కడ కాషాయపక్షం తొలిసారి లోక్‌సభ సీట్లను గెల్చుకున్నది 1998 ఎన్నికల్లో. అదీ జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు వల్లే ఇది సాధ్యమైంది. జయ పార్టీతో కలిసి ఐదు సీట్లకు పోటీచేసి 6. 9 శాతం ఓట్లతో మూడు సీట్లు గెల్చుకుంది. ఏడాది తిరిగేసరికి తమిళనాట అధికారంలో లేని జయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి ఏబీ వాజ్‌పేయి సర్కారును కూలదోయడంతో డీఎంకే బీజేపీకి దగ్గరయింది. 1999 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 6 సీట్లకు పోటీచేసి, నాలుగు సీట్లు గెలుచుకుంది. 2004 ఎన్నికలకు ముందు డీఎంకే ఎన్డీఏ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌తో చేతులు కలపింది. దీంతో వేరే దారిలేక ఏఐఏడీఎంకేతో మళ్లీ కలిసి పోటీచేసినా ఒక్క సీటూ గెలవలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే కేవలం 2.3 శాతం ఓట్లతో ఒక్క సీటూ బీజేపీ సాధించలేదు. ఆ తర్వాత 2012 చివరి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఎంత ప్రయత్నించినా లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుకు ఏఐఏడీఎంకే అంగీకరించలేదు. చివరికి ఆరు చిన్నాచితకా పార్టీలతో కలిసి బీజేపీ 7 సీట్లకు పోటీచేసి గెలిచింది ఒక్క సీటే(నాగర్‌కోయిల్ నుంచి గెలిచిన పొన్ రాధాకృష్ణన్ కేంద్రమంత్రి). 1996లో కూడా ఒంటరి పోరులో బీజేపీ 17 సీట్లకు పోటీచేసి ఒక్క సీటూ కైవసం చేసుకోలేకపోయింది. ఒక్క నాగర్‌కోయిల్‌లో మాత్రం బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో దేశం యావత్తూ మోదీ హవా పనిచేసి కాషాయపక్షానికి ఏకంగా 282 సీట్లు తెచ్చిపెట్టింది. అలాంటిది తమిళనాట ఈ గాలి జయలలిత ప్రభంజనం ముందు నిలబడలేక కేవలం రెండు సీట్లతో(మిత్రపక్షం పీఎంకేకు ఒక సీటు) చతికిలపడింది. హిందూత్వ శక్తుల విస్తరణే లక్ష్యం! హిందూ సమాజంలో బ్రాహ్మణాధిపత్యాన్ని, మూఢ విశ్వాసాలను ఖండించి వ్యవసాయ, వృత్తి కులాల మద్దతుతో ముందుకు సాగిన ద్రావిడ ఉద్యమం విజయం సాధించిన తమిళనాట 20వ శతాబ్దం చివరికి బీజేపీ కాలుమోపే వాతావరణం అతి స్వల్ప స్థాయిలో ఏర్పడింది. కాని సొంతగా పోటీచేస్తే ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ఏదో ఒక ప్రధాన ద్రావిడ ప్రాంతీయ పక్షంతో పొత్తుపెట్టుకున్న ప్రతిసారీ మూడు నాలుగు సీట్లు గెల్చుకోగలిగింది. సిద్ధాంతరీత్యా డీఎంకేతో బీజేపీకి పొసగే అవకాశాలు లేవు. ఏఐడీఎంకేకు చేరువకావాలనుకున్నా జయలలిత ఆధిపత్య ధోరణి వల్ల ఆమె బతికుండగా బీజేపీ సఫలం కాలేదు. పొత్తుపెట్టుకున్నాగాని జయ నీడలో బీజేపీ విస్తరించలేదు. బీజేపీని ఆమె ఎదగనివ్వలేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే పొత్తుపెట్టుకుని 1996–2004 మధ్య వేగంగా విస్తరించినట్టు తమిళనాట ఎదగడానికి జయ మరణం బీజేపీకి అనుకూలాంశంగా కనిపించింది. కాని, జయ సన్నిహితురాలు శశికళ కూడా కాషాయపక్షాన్ని తమిళ రాజకీయాల్లో బలపడకుండా అడ్డుకుంటుందని తెలిసి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్)పై బీజేపీ కన్నేసింది. అదీగాక, ఓపీఎస్ జయ బతికుండగా రెండుసార్లు తాత్కాలిక సీఎంగా ఉండడంతో జయ వారసుడిగా జనం భావిస్తున్నారనే అంచనాతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఓపీఎస్ పక్షాన నిలిచింది. పైకి కనిపించకుండా వెనక నుంచి ఓపీఎస్‌కు మద్దతిస్తూ చివరికి నాలుగోసారి ఆయన సీఎం కావడానికి వ్యూహం రూపొందించింది. మంచి తరుణం డీఎంకే నేత ఎం.కరుణానిధి 92 ఏళ్ల వయసులో ఆనారోగ్యంతో రోజూవారీ రాజకీయ పరిణామాలపై మాట్లాడే స్థితిలో లేరు. ఆయన కొడుకు ఎంకే స్టాలిన్ సమర్థునిగా ఇంకా నిరూపించుకోలేదు. ఈ పరిస్థితుల్లో జయ ‘వారసురాలు’ శశికళ జైలుపాలవడంతో అన్నాడీఎంకేను చీల్చకుండా, ఈ పార్టీ నేతలను తనకు అనుకూలంగా ‘మలుచుకుని’, కర్ణాటకలో మాదిరిగా వేగంగా పట్టు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ వ్యూహాన్ని చాకచక్యంగా అమలుచేస్తూ ముందుకుసాగుతున్నట్టే కనిపిస్తోది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
-
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది. అయితే ప్రస్తుతం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళ ఉన్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడే పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కూడా సాధ్యం కాని పనే అవుతుంది. ముందుగా ఎన్నికల కమిషన్‌కు గతంలో పళనిస్వామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్‌ను ఎన్నుకున్నట్లుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నిక నిర్వహించి, అప్పుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. దీనంతటికీ ఎంత లేదన్నా రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసి, పళని స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించడం లాంటి అవకాశాలను కూడా చర్చిస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంతవరకు తగ్గడం, రెండోది.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తు మీద పోటీ చేయడం.. తద్వారా జయలలిత వారసత్వం పూర్తిగా తమకు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడం. ఇదే లక్ష్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాల విలీనం జరిగితేనే ఇది సాధ్యమని.. ఎన్నికల కమిషన్ జూన్ 16 వరకు సమయం ఇచ్చినా ఈలోపే విలీనానికి సంబంధించిన లేఖలను కూడా ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల గుర్తును క్లెయిమ్ చేసుకుంటే మంచిదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకుల మధ్య చిన్న చిన్న విషయాలలో తప్ప చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
రెండాకులు దక్కేనా?
-
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్‌సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్‌సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
ఇంటెలిజెన్స్ బాస్‌గా మళ్లీ ఆయనే
రెండు నెలల క్రితం రాష్ట్రంలో నిఘా బాస్‌గా ఆయన ఉండేందుకు వీల్లేదంటూ బయటకు పంపేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన్నే తెచ్చుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎన్ సత్యమూర్తిని తమిళనాడు ప్రభుత్వం మళ్లీ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ మీద మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రకటించిన కీలకమైన తరుణంలో ఫిబ్రవరి 12న ఆయనను తప్పనిసరిగా వేచి ఉండాలంటూ బదిలీ చేశారు. ఆయనను మళ్లీ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమిస్తున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నిరంజన్ మర్దీ ఒక ప్రకటనలో తెలిపారు. సత్యమూర్తిని తప్పించినప్పుడు.. ఆయన స్థానంలో ఎస్. డేవిడ్సన్ దేవసిర్వతంను నియమించారు. అయితే, పది రోజుల్లోనే ఆయన్ను మళ్లీ వెనక్కి పంపారు. 2015 డిసెంబర్ నాటికి డేవిడ్సన్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో సత్యమూర్తిని నియమించింది. -
చిన్నమ్మ శిబిరంలో కలవరం!
చెన్నై : ‘ న్యాయం జరగాల్సిందే...ఎవ్వరికీ భయపడను, పది రోజులు గడువు ఇస్తున్నా...లేదంటే శిబిరం మారతా...’ అని అన్నాడీఎంకే సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ హెచ్చరిక చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. తమతో చేతులు కలపాలని పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు ఆయనకు ఆహ్వానాలు పలికే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలు జారుకుంటే చాలు ప్రభుత్వం కుప్పకూలినట్టే. ఈ సమయంలో తరచూ ఏదో ఒక ఎమ్మెల్యే చడీ చప్పుడు కాకుండా అధిష్టానానికి బెదిరింపులకు ఇవ్వడం, బుజ్జగింపుల సమయంలో తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో కోయంబత్తూరు జిల్లా సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ బహిరంగంగా ఆదివారం బెదిరింపులు ఇవ్వడం చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ప్రమాదంతో బెదిరింపు : సూళూరు పచ్చపాళయంలో ఆనందకుమార్‌కు చెందిన క్వారీ ఉంది. ఇక్కడ శుక్రవారం జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్ కార్మికులు గాయపడ్డారు. శనివారం వీరు ఆసుపత్రిలో మరణించారు. ఆ కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ముట్టచెప్పి, సాధారణ ప్రమాదంగా మార్చేసి ఆ యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈ సమాచారంతో ఎమ్మెల్యే కనకరాజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆదివారం ఆ క్వారీ పరిసరాల్లో పరిశీలించారు. అక్కడి ప్రజలు ఈ క్వారీ రూపంలో ఎదుర్కొంటున్న కష్టాలను, వారి గోడును విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ రూపంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఇక, తానెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం పళనిస్వామికి కూడా భయపడనని స్పష్టం చేశారు. క్వారీకి శాశ్వతంగా తాళం వేయడం, ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పది రోజుల్లో న్యాయం జరగని పక్షంలో, ప్రజలు కోరుకునే శిబిరంలోకి చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను వెనక్కు తగ్గనని, చిన్నమ్మ శిబిరంకు గుడ్‌బై చెప్పి మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన ఆ ప్రకటన చేశారో లేదో ఆగమేఘాలపై మంత్రి ఉడుమలై కే రాధాకృష్ణన్ కనకరాజ్ ఇంటికి చేరుకుని బుజ్జగించారు. ఇందుకు ఏ మాత్రం ఆ ఎమ్మెల్యే తగ్గని దృష్ట్యా, నిరాశతో వెనుదిరిగారు. ఇక, తమ శిబిరం వైపు త్వరితగతిన వచ్చేయాలని మాజీ సీఎం పన్నీరు మద్దతు ఎమ్మెల్యే కనకరాజ్‌కు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. ఇక, జయలలిత మేన కోడలు దీప పేరవైలో కీలక నేతగా ఉన్న తిరుచ్చికి చెందిన మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ టాటా చెప్పేసి పన్నీరు శిబిరం వైపుగా వచ్చేశారు. వస్తూ వస్తూ, దీపకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పేరవై వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే పనిలో దీప మద్దతు సేన నిమగ్నమైంది. -
మరింత వేడెక్కిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా పోటీ చేసిన ఇ. మధుసూదనన్‌ను తమ వర్గం తరఫున అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అన్నాడీఎంకే అభ్యర్థిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. డీఎంకే నుంచి మరుతు గణేశ్ పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి గౌతమి బరిలోకి దిగుతున్నారని వినిపించింది. ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఆమెకు ఎంతమంది మద్దతుగా ఉంటారో తెలియరాలేదు. అయితే.. అవతలి నుంచి ఎంతమంది పోటీలో ఉన్నా తాను మాత్రం కనీసం 50వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతానని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తు మీద ఈనెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. అయితే, ఆ గుర్తు తమకే చెందాలంటూ పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయంలో ఈసీ ఇంకా తన నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
జయ మృతిపై..పన్నీర్ దీక్ష
చెన్నై: జయలలిత మృతిపై న్యాయ, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం బుధవారం ఉదయం చెన్నైలో నిరాహారదీక్ష దిగారు. ఆయనతోపాటు ఆయన వర్గ పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టారు. జయలలిత మరణానంతరం శశకళ వర్గం నుంచి బయటకు వచ్చిన పన్నీరుసెల్వం ఆమెపై తవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఆయన రాష్ట్రవ్యాప్త మద్దతును కూడగడుతున్నారు. తదనుగుణంగా జయ మృతిపై అనుమానాలను లేవనెత్త మృతిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన వర్గీయులతో స్థానిక చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం ఐదు వరకు కొనసాగే తమ దీక్ష ద్వారా జయ మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ ఉండాలని, ఈ దీక్ష చేస్తున్నామని పన్నీరుసెల్వం తెలిపారు. -
జయ మృతిపై..పన్నీర్ దీక్ష
-
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
-
తమిళనాట ముగియని రాజకీయ సంక్షోభం
-
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ఓపీఎస్ తలపెట్టారు. ఇందుకోసం ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహీంద్రా జీపును కొంత మార్పు చేర్పులు చేయించుకుని ఆయన రెడీ చేయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే బలపరీక్ష నిర్వహించి, పళని స్వామి నెగ్గినట్లుగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో పనిచేయడంతో పాటు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వాన్ని స్వయంగా అమ్మే ముఖ్యమంత్రిగా నియమించారు. అయినా ఆమె కుర్చీలో కూర్చోకుండా.. అందులో జయలలిత ఫొటోను మాత్రం ఉంచి, ఆయన పక్కన వేరే కుర్చీలో కూర్చున్న సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వానికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. సామాన్య ప్రజలు ఆయన పట్ల ఆదరణ కనబర్చినా, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేకపోవడం.. అసెంబ్లీలో పరిణామాలు చకచకా మారిపోవడంతో పన్నీర్ సెల్వం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
ఆ ఎమ్మెల్యేలకు గాలం..
చెన్నై: పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తగ్గ కసరత్తుల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వ్యూహరచనల్లో పడ్డారు. ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఆదేశాను సారంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించడమా లేదా పదవీ గండం తప్పదన్న హెచ్చరికతో బలవంతంగా తిప్పుకోవడమా అన్న అస్త్రాల్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో పన్నీరును వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చడం విశేషం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలింది. చిన్నమ్మ శశికళ శిబిరం, అమ్మ విధేయుడు పన్నీరు శిబిరంగా కార్యకర్తలు చీలారు. అధికారం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగినా, స్పీకర్ ధనపాల్ రూపంలో క్యాంప్ రాజకీయాలతో చిన్నమ్మ విధేయుడు పళనిస్వామికి బలం సమకూరింది. చిన్నమ్మ వీరశపథాన్ని నెరవేర్చామన్న ఆనందంలో ఉన్న టీటీవీ దినకరన్, ఇక, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు. పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరత్తుల్ని వేగవంతం చేశారు. ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దృష్ట్యా, ఇటువైపుగా వస్తే భవిష్యత్తు బాగుటుందని, లేనిపక్షంలో పాతాళంలోకి నెట్టడం ఖాయం అన్న బెదిరింపు ధోరణితో ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ అనంతరం ఆమె ఆదేశానుసారంగా ఆహ్వానం పలకడం లేదా, పదవీ గండాన్ని సృష్టించే విధంగా హెచ్చరికలతో ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు ఆ శిబిరంలో చర్చ సాగుతోంది. ప్రధానంగా తమకు ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా ఉన్న దృష్ట్యా, 11 మంది ఎమ్మెల్యేలను గురిపెట్టి గాలం వేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మెజారిటీ నలుగురే ఉన్నందున, డీఎంకే ఎత్తుగడల్ని ఢీకొట్టాలంటే, అటు వైపుగా ఉన్న వాళ్లను ఇటువైపు రప్పించుకోవడం ద్వారా సాధ్యమన్న భావనతో దినకరన్ అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. అమ్మ డీఎంకేతో ముందుకు: అధికారం చిన్నమ్మ శిబిరం చేతికి చేరినా, ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం కొనసాగేనా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా తమ వైపు నుంచి పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు వేగవంతం చేయడానికి నిర్ణయిం చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు శిబిరం నుంచి బయటకు వచ్చి ఉండడంతో, తమ సన్నిహితుల ద్వారా తమకు మద్దతుగా నిలిచేందుకు ఇది వరకు నిర్ణయించిన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. చిన్నమ్మ అధికారాన్ని ఢీకొట్టే విధంగా పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా చేజిక్కించుకునే ప్రయత్నాలు వేగవంతం చేయడం లేదా, అమ్మ డీఎంకే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం మద్దతు ఇస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. పన్నీరు వెన్నంటే: ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా పన్నీరు వెంట నడిచేందుకు 11 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరును, ప్రధాన ప్రతి పక్షం మీద జరిగిన దాడిని రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది. బలపరీక్ష ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా జరిగిందని, దీనిని అంగీకరించ వద్దు అని, మళ్లీ బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం పన్నీరు సెల్వం తరఫున ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాండియరాజన్ మీడియాతో మాట్లాడారు.మరో రోజు బలపరీక్షకు స్పీకర్ చర్యలు తీసుకుని ఉండాల్సిందని, అయితే, ప్రధాన ప్రతి పక్షంతో పాటు, కాంగ్రెస్ సభ్యులు సైతం సభలో లేని సమయంలో ఓటింగ్ నిర్వహించారని మండిపడ్డారు. అన్ని వివరాలను, ఆధారాలను గవర్నర్ ముందు ఉంచామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పన్నీరు వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు. శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
బలపరీక్ష: తుదిదాకా నిలబడింది వారే!
చెన్నై: తమిళనాట ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ హైడ్రామా ఎట్టకేలకు అనేక ట్విస్టులతో ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్ష ఘట్టంలోనూ అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరివరకు హైవోల్టేజ్ డ్రామా నడిచింది. శాసనసభలో డీఎంకే సభ్యుల ఆందోళన, రాద్ధాంతం, గలాటా, స్టాలిన్‌తో సహా వారిని బలవంతంగా సభ నుంచి మార్షల్ గెంటివేయడం.. ఈ క్రమంలో స్టాలిన్ చొక్కా చినగడం.. చినిగిన చొక్కాతోనే నిరసనకు స్టాలిన్ పూనుకోవడం.. బలపరీక్ష సందర్భంగా ఇలా రోజంతా తమిళనాడు రాజకీయాలు అట్టుడికిపోయాయి. చివరకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గి.. తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకున్నారు. అయితే, ఈ తుదిఘట్టంలో పన్నీర్ సెల్వం బలమెంతో తేలిపోయింది. శశికళకు ఎదురుతిరిగి.. ఆమె గూటిలో ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ఓపీఎస్ చివరివరకు ప్రయత్నించినా.. ఆయనకు మద్దతుగా నిలిచింది 11మందేనని బలపరీక్ష ద్వారా తేలింది. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా 231 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో డీఎంకేకు చెందిన 89మంది సభ్యులపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తొమ్మిది మంది కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలింది 133మంది సభ్యులు. ఇందులో 122 మంది పళనిస్వామికి మద్దతుగా విశ్వాసపరీక్షకు అనుకూలంగా ఓటేయగా.. 11మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. అంటే.. దాదాపు రెండువారాలపాటు రాజకీయ హైడ్రామాను నడిపిన పన్నీర్ సెల్వానికి చివరివరకు మద్దతు పలికింది ఈ 11 మందే అని చెప్పవచ్చు. -
ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్ జోడించారు. Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM — Gautami (@gautamitads) 16 February 2017 ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్‌కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు. In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate. — arvind swami (@thearvindswami) 18 February 2017 Rajbhavantamilnadu@gmail.com ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு — Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017 -
బలపరీక్షపై సినీ స్టార్స్ మండిపాటు!
తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు. అయితే, అంతకుముందు తమిళనాడు శాసనసభలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు మైక్‌లు, బల్లాలు విరిచివేయడమే కాకుండా..స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. తీవ్ర గలాటా సృష్టించారు. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు. 'మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు. సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా మీడియాను బ్లాక్ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. -
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
-
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
చెన్నై: తీవ్ర గందరగోళ పరిస్థితులు, నాటకీయ పరిణామాల నడుమ జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 122మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ సహా.. ఆ పార్టీ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ బయటకు గెంటేశారు. దీంతో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. స్పీకర్ తీరు, మార్షల్స్ బలవంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టాలిన్ తన ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే స్పీకర్ ధనపాల్ సభను సమావేశపరిచి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌తోపాటు, ముస్లింలీగ్ తదితర విపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. విపక్షం లేకుండానే స్పీకర్ బలపరీక్ష చేపట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పళనిస్వామి విజయం నల్లేరు మీద నడకే అయింది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో సునాయసంగా పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా తన పదవిని సుస్థిరం చేసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలయ్యాయి. -
విశ్వాపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
-
విశ్వాసపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా నిలబడినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం సభ్యులు లేకుండానే నిర్వహించిన బలపరీక్షలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి కె. పళనిస్వామి విశ్వాసపరీక్షలో ఓడిపోయారు. శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 116 ఓట్లు కావల్సి వచ్చాయి. బహిరంగ పద్ధతిలో డివిజన్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ... ఓట్లు, వ్యతిరేకంగా ... ఓట్లు వచ్చాయి. దాంతో రెండురోజుల వయసున్న పళనిస్వామి ప్రభుత్వం పడిపోయింది. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
-
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. తాము నియమించిన విప్‌ను ఒప్పుకోవాలని, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్లకు డీఎంకే కూడా అండగా నిలిచింది. ఎమ్మెల్యేలను ఖైదీల్లా తీసుకొచ్చారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం నియమించిన విప్‌ను ఒప్పుకోడానికి పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. అలాగే రహస్య ఓటింగుకు కూడా వాళ్లు అంగీకరించలేదు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీర్ సెల్వం అన్నారు. తాము ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్న ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం కల్పించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. -
30 ఏళ్ల క్రితం కూడా.. తమిళనాట ఓ బలపరీక్ష
తమిళనాడు అసెంబ్లీలో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి బలపరీక్ష జరుగుతోంది. ఇంతకుముందు ఎంజీ రామచంద్రన్ మరణించిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, వీఆర్ నెడుంజెళియన్ నేతృత్వంలోని జయలలిత వర్గాల మధ్య పోటీ ఫలితంగా 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. అప్పట్లో నెడుంజెళియన్ పోషించిన పాత్రను ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం పోషిస్తున్నారు. ఇప్పుడు బలపరీక్ష విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఇక 2006 సంవత్సరంలో డీఎంకేకు పూర్తి మెజారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 96 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే 34 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్ల పాటు బయటి నుంచి మద్దతిచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండటంతో తమిళనాడులోనూ పట్టు ఉండాలని అలా చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉందన్న విషయం స్పష్టం కావడంతో అప్పట్లో డీఎంకేను బలం నిరూపించుకోవాలని గవర్నర్ అడగలేదు. 1988లో ఏం జరిగింది... అప్పట్లో తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. చివరకు ఆర్టికల్ 356ను ప్రయోగించి, జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని దించేశారు. 1989లో మళ్లీ ఎన్నికలు నిర్వహించగా, డీఎంకే సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
► నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ ► బలపరీక్షకు ఎలాంటి పద్ధతి అనుసరిస్తారో ► పన్నీర్ సెల్వం వర్గంలోనే స్పీకర్ ధనపాల్ ► అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఎంజీఆర్ మనిషి చెన్నై నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ కనిపించింది. చివరకు ఆయన పళనిస్వామికే మొదటి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అంత సమయం అయితే లేదు గానీ.. స్పీకర్ ధనపాల్ ఏం చేస్తారనే విషయంలో కూడా అంతకు మించిన ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మృతితో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో 233 మంది సభ్యులుంటారు. మొత్తం వీళ్లందరి దృష్టి కూడా స్పీకర్ ధనపాల్ మీదే ఉంది. పన్నీర్ సెల్వం కోరినట్లుగా ఆయన రహస్య ఓటింగ్ నిర్వహిస్తారా.. లేక బహిరంగ బలపరీక్ష వైపు మొగ్గుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఎవరీ ధనపాల్? డీఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను 1972లో స్థాపించినప్పుడు ఆయన పార్టీలో చేరిన కొద్దిమందిలో ధనపాల్ కూడా ఒకరు. 1977 ఎన్నికలకు సేలం జిల్లాలోని శంకరగరి (రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. సి. పొన్నయన్, పన్రుట్టి ఎస్ రామచంద్రన్, కేఏ సెంగొట్టయన్లతో కలిసి ఆయన తొలిసారి అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గారు. ఆ తర్వాత 1980, 84లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలితకు మద్దతుగా ఉన్నారు. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో శంకరగిరి నుంచి తొలిసారి ఓడిపోయారు. 2001లో అక్కడే గెలిచిన తర్వాత శంకరగిరి జనరల్ స్థానంగా మారడంతో 2011లో ఆయన రాశిపురం నియోజకవర్గానికి మారారు. ఒక ఏడాది తర్వాత స్పీకర్ పదవికి జయకుమార్ రాజీనామా చేయడంతో సీనియర్ నాయకుడైన ధనపాల్‌ను జయలలిత స్పీకర్‌గా చేశారు. జయకుమార్ మద్దతుదారులైన ఆరుగురిని కూడా పదవుల నుంచి జయలలిత తప్పించారు. ఆ తర్వాత కూడా రెండోసారి జయలలిత వరుసగా అధికారం చేపట్టినప్పుడు ఆయనకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇలా రెండు వరుస అసెంబ్లీలలో ఒకే స్పీకర్ ఉండటం అరుదుగా జరుగుతుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్లను మార్చిన సందర్భాలున్నాయి. ఇక శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో స్పీకర్‌గా ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది ఆధారపడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బహిరంగ బలపరీక్ష నిర్వహించారు. అలాగే చేస్తారా లేక రహస్య ఓటింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!
గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం కల్పించారు.. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. అంతవరకు బాగానే ఉంది గానీ, అసెంబ్లీలో బలం నిరూపించుకునే విషయం వచ్చేసరికి మాత్రం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిసార్టులో ఉన్న మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా తనకు మద్దతిస్తారన్న నమ్మకం లేకపోవడమే ఈ ఆందోళనకు కారణం. అందుకే ఆయన చిన్నమ్మ శశికళను చూసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లాల్సిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ అయిన నటరాజ్ శుక్రవారం ఉదయమే ముందుగా పళనిస్వామికి ఝలక్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తాను అమ్మ ఫొటో పెట్టుకుని గెలిచానని, అందువల్ల అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన చెప్పారంటున్నారు. కావాలంటే అమ్మ ఫొటోతో మరోసారి ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామం కారణంగానే పళనిస్వామి బెంగళూరు వెళ్లడం మానుకుని నేరుగా రిసార్టుకు వెళ్లి అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డారంటున్నారు. సెంగొట్టియాన్ లాంటి వాళ్లకు మంత్రిపదవి ఇవ్వడం కూడా అమ్మ భక్తులైన కొంతమంది ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇంతకుముందు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్న సెంగొట్టియాన్‌కు, రెండోసారి వరుసగా ఎన్నికైన జయలలిత తన కేబినెట్లో అవకాశం కల్పించలేదు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలే అందుకు కారణం. అలాంటి వ్యక్తికి పళనిస్వామి రెడ్‌కార్పెట్ పరవడం, శశికళ కుటుంబ సభ్యులు కూడా పార్టీ పైన, ప్రభుత్వంలోను పట్టు పెంచుకోవడం లాంటి పరిణామాలను అమ్మ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్లు ఎదురు తిరిగే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఒక్క నటరాజ్ మాత్రమే కాక.. దాదాపు మరో 18 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రిసార్టులో ఎదురు తిరిగినట్లు సమాచారం. ఇదే జరిగితే పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే, నిజంగానే ఈ 18 మంది ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేదా అన్నది మాత్రం బలపరీక్ష తర్వాతే తెలియాల్సి ఉంది. పన్నీర్ క్యాంపులో ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామితో కలిపి ఆ వర్గానికి 124 మంది బలం ఉంది. మేజిక్ ఫిగర్ 117. అంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో కనీసం 117 మంది అనుకూలంగా ఓటు వేస్తే తప్ప పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండదు. ఉన్న 124 మందిలో ఒక్క ఎనిమిది మంది అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం కూడా ఉండబోదు. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయి ఉంటే, ఆ ప్రభుత్వాన్ని పడగొడితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు పన్నీర్‌కు సానుభూతి కూడా పెరుగుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడున్నది మాత్రం శశికళ వర్గీయుడైన పళనిస్వామి కాబట్టి.. ప్రజల్లో ఆ వర్గం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టినా పెద్ద నష్టం ఉండబోదు. అన్నాడీఎంకే ఎటూ రెండు వర్గాలుగా చీలిపోతోంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో సులభంగా తాము గెలిచి రాజమార్గంలో అధికారం చేపట్టవచ్చన్నది స్టాలిన్ వ్యూహంలా కనిపిస్తోంది. ఎటూ కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకే మిత్రపక్షమే కాబట్టి వాళ్లది కూడా అదే నిర్ణయం కావచ్చు. -
ఓపీఎస్ ఆట ముగిసింది..కానీ!
-
ఎల్లుండే బలనిరూపణ.. రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు!
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ నెల 18న (శనివారం) అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఈమేరకు బలనిరూపణ తేదీ ఖరారైంది. శనివారం ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభ ఇందుకోసం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పళనిస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా రిసార్ట్‌కు వచ్చేశారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి శశికళ వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఇక్కడ ఉంచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈ తంతును సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. మెజారిటీ చాటుకోవాలని పళనివర్గం భావిస్తున్నది. తమకు ప్రస్తుతం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం చెబుతున్నది. బలపరీక్ష నాటికి పన్నీర్ గూటికి చేరిన మిగత ఎమ్మెల్యేలు కూడా తమవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు చివరివరకు ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు ప్రయత్నిస్తానని ప్రకటించిన పన్నీర్ సెల్వం.. పళని బలపరీక్షలో నెగ్గకుండా ఏమైనా ఎత్తులు వేస్తారా? మరింత మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోగలుగుతారా? అన్నది వేచి చూడాలి. -
సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..
-
సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..
పళని, మంత్రుల వెంట వెళ్లి.. జయలలిత సమాధి వద్ద నివాళులు.. తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన అనంతరం ఎడపాడి కె.పళనిస్వామి తన మంత్రులతో కలిసి నేరుగా మేరినా బీచ్‌లోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రుల వెంట వచ్చిన వీకే శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం వెంట ముందువరుసలో నిలుచొని దినకరన్ నివాళులర్పించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో తనకు జైలు శిక్ష పడటంతో శశికళ తన అక్క కొడుకు దినకరన్‌ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. శశికళ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీని తన కనుసన్నలలో ఉంచుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్టు భావిస్తున్న నేపథ్యంలో దినకరన్‌ను కొత్త కేబినెట్లో మంత్రిగా తీసుకోవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా.. పార్టీలో ఆయన ఆధిపత్యం, శశికళ పట్టు తగ్గలేదని అంటున్నారు. -
బలనిరూపణకు 15రోజులా?
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15రోజుల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. బలనిరూపణకు 15రోజులు ఇవ్వడం చాలా ఎక్కువ గడువు అని, దీనివల్ల ఎమ్మెల్యేలకు తాయిలాలు ఎరవేసి.. కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా గవర్నర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డీఎంకే ఎంపీ ఎలంగోవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బలనిరూపణ కోసం 15 రోజులు ఇవ్వడాన్ని చూస్తే.. ఆయన మెజారిటీ నిరూపించుకుంటారని గవర్నర్‌కి కూడా నమ్మకం లేనట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడులో పదిరోజులుగా నెలకొన్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరదించుతూ.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు అందించిన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
పన్నీర్‌ను దెబ్బతీసింది వాళ్లే!
ముచ్చటగా మూడోసారి కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మూడోసారి ఆయన ముఖ్యమంత్రి పదవీకాలం నేటితో ముగిసిపోయింది. శశికళ నమ్మినబంటు పళనిస్వామి 31మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిన్నటివరకు తానే ముఖ్యమంత్రి అంటూ ధీమాగా ఉన్న పన్నీర్ సెల్వానికి ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? ఆయన అంచనా ఎక్కడ తప్పింది? సెల్వం ఆశించినట్టుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అన్నదానిపై ఆసక్తికర విశ్లేషణలు తమిళ మీడియాలో వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేలో 20 మందిదాక రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం ఉంది. వారు పరోక్షంగా స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలుశిక్ష పడటంతో ఆ రెబల్ ఎమ్మెల్యేలు తన గూటికి చేరుతారని ఓపీఎస్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన ఆశలు తల్లకిందులయ్యాయి. రెబల్ ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవాళ్లే. వాళ్లు తెగించి పన్నీర్ గూటికి రాలేకపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒకవేళ తమపై వేటు పడితే.. తిరిగి ఎన్నికలకు వెళ్లి గెలుపొందుతామా? అన్న నమ్మకం కూడా వారిలో చాలామందికి లేదని అంటున్నారు. అందుకే వారు భద్రంగా ఉండే మెజారిటీ వైపే మొగ్గుచూపారని చెప్తున్నారు. ఇది అన్నాడీఎంకేను ఐక్యంగా ఉంచడంలో సాయపడింది. ఈ ఐక్యత వల్లే పళనిస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు పోరాడుతానని పన్నీర్ సెల్వం అంటున్నారు. పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయమిచ్చారు. ఆలోపు ఏదైనా అద్భుతం జరిగి మూడింట రెండొంతుల మంది ఓపీఎస్‌కు జై కొడితే తప్ప ఆయన ఆశ నెరవేరే అవకాశం లేదు. ఇక పళనిస్వామి సీఎం కావడంతో ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు దాదాపు అంధకారమేనని భావిస్తున్నారు. -
రజనీ ఎంట్రీపై అమిత్ షా ఆసక్తికర కామెంట్..!
తమిళనాడులో గత పదిరోజులుగా సాగుతున్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరపడిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామితో గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించడంతో ప్రస్తుతానికి సంక్షోభం ముగిసింది. అయితే, తమిళనాడులో ఇప్పటికీ కొంత రాజకీయ అనిశ్చితి, శూన్యత నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న బీజేపీ తమిళనాట పట్టు సాధించేందుకు తెరవెనుక ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇందులోభాగంగానే పన్నీర్ సెల్వానికి అండగా ఉంటూ.. శశికళకు వ్యతిరేకంగా బీజేపీ రాజకీయ చదరంగానికి తెరలేపిందన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే, తాజాగా తమిళ రాజకీయాలపై పెదవి విప్పిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పన్నీర్ సెల్వం వెనుక బీజేపీ ఉన్నదన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 'తమిళనాడుకు సంబంధించినంతవరకు మాకు ఎలాంటి పాత్ర లేదు. ఇది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం. తమిళనాడులో అస్థిరత ఉందని నేను అనుకోవడం లేదు. పన్నీర్ సెల్వం వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదు' అని అమిత్ షా 'ఇండియాటుడే'తో పేర్కొన్నారు. తమిళనాట పట్టు కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీ బరిలోకి దింపే అవకాశముందా?, బీజేపీ ప్రోద్బలంతో ఆయన పార్టీ పెట్టబోతున్నారా? అని ప్రశ్నించగా.. 'మీరు హెడ్లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం నేను ఇవ్వను. ఏం జరగనుందో వేచిచూడండి.. వెయిట్ అండ్ వాచ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
ఓపీఎస్ ఆట ముగిసింది..కానీ!
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నమ్మినబంటు ఎడపాడి పళనిస్వామి ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కోసం ఆయనను గవర్నర్ ఆహ్వానించడంతో.. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం ఆడుతున్న రాజకీయ చదరంగానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయింది. జయలలితకు నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ కోసం సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే తిరుగుబాటుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన సంగతి తెలిసిందే. సెల్వానికి మొదట అనూహ్య మద్దతు లభించింది. అమ్మ సమాధి వద్ద మౌనదీక్షతో ఆయన ప్రారంభించిన ఈ రాజకీయ చదరంగం తమిళనాట తీవ్ర ఉత్కంఠ రేపింది. తన వ్యూహాలతో, ఎత్తులు-పైఎత్తులతో కొంతవరకు అన్నాడీఎంకే నేతలను చీల్చగలిగిన సెల్వం.. శశికళపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన ఎంత ఒత్తిడి చేసినా మన్నార్గుడి కుటుంబం గుప్పిటను దాటి ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో శశికళ కుటుంబానిదే ఆధిపత్యం. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోలేకపోయిన సెల్వం.. భవిష్యత్తులో ఆ పార్టీకి వ్యతిరేక గళంగా కొనసాగుతూ పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారులు తమ వర్గాన్ని ఐక్యంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు పన్నీర్ గూటికి చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిపి ఉంచేందుకు త్వరలోనే నాయకుడిని ఎన్నుకుని ముందుకుసాగుతామని పన్నీర్ మద్దతుదారులు అంటున్నారు. తమదే నిజమైన అన్నాడీఎంకే అని వారు వాదిస్తున్నారు. జయలలిత పాలన కోసం ప్రజలు ఓటేశారని, చిన్నమ్మ కుటుంబసభ్యుల కనుసన్నలలో ఉండే ప్రభుత్వం కోసం కాదని వారు అంటున్నారు. -
చివరి నిమిషం వరకు శశికళపై పోరాటం: పన్నీర్
ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి పార్టీని వెళ్లనిచ్చేది లేదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. శశికళకు వ్యతిరేకంగా తాను చిట్ట చివరి నిమిషం వరకు పోరాడుతానని చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గతంలో క్షమాపణలు చెప్పి మళ్లీ పోయెస్ గార్డెన్‌లోకి వచ్చిన శశికళ.. అమ్మ మరణించగానే ముఖ్యమంత్రి కావాలని కలలు గన్నారని ఆయన అన్నారు. అమ్మ ఆశయ సాధనే తన ధ్యేయమని తెలిపారు. -
తమిళనాడు సీఎంగా పళనిస్వామి
-
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి నియమితులయ్యారు. ఆయనను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆహ్వానించారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి తదితరులు లేఖ అందించడంతో గవర్నర్ ఆయనకు ముందుగా అవకాశం కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో శశికళ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు ట్రయల్ కోర్టు విధించిన జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలకు గండి పడింది. దాంతో వెంటనే ఆమె రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామిని తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాక, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నట్లు వెంటనే ప్రకటించారు. దాంతో.. ఆయనకు తొలుత అవకాశం కల్పించాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు నిర్ణయించారు. 15 రోజుల్లోగా ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 1954 మార్చి 2న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. బీఎస్సీని మధ్యలోనే ఆపేశారు. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
-
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా శశికళ వర్గీయుడైన మంత్రి ఎడపాడి పళనిస్వామికి పిలుపు వచ్చింది. ఉదయం 12.30 గంటలకు ఆయనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా శశికళ వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. పళని స్వామి, సెంగొట్టయాన్తో పాటు మరో నలుగురు నేతలు రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. గవర్నర్ అవకాశం ఇస్తే తాము ఈరోజే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే జరిగితే శశికళ జైలుకు వెళ్లినా, ఆమె జేబులోని మనిషి అయిన పళని స్వామే ముఖ్యమంత్రి అవుతారంటే.. పరోక్షంగా శశికళ వర్గం తన పట్టు నిరూపించుకున్నట్లు అవుతుంది. అయితే, అసలు గవర్నర్ పిలిచింది ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకేనా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత వాళ్లు చెబితే తప్ప అధికారికంగా ఏ విషయమూ చెప్పలేని పరిస్థితి ఉంది. బుధవారం కూడా పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని గవర్నర్ పిలిచి మాట్లాడారు. దాంతో ఇప్పుడు నేరుగా పళనిస్వామికి చాన్స్ ఇచ్చారా లేదా అన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాలేదనే చెప్పాలి. ఇక తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి వర్గం చెబుతోంది. అన్నాడీఎంకేకు అసెంబ్లీలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లలో 120 మంది వరకు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్టులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పళనిస్వామికి పిలుపు రావడంతో పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, అసెంబ్లీలో బల నిరూపణ సమయానికి తాము బలం పుంజుకోవచ్చని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామికి ఉండదని పన్నీర్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం వద్ద కనీసం 17-20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది నిజం అయితే మాత్రం పళని స్వామి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవడం కష్టమే అవుతుంది. ప్రజల మద్దతు తనకు స్పష్టంగా ఉన్నందున కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు పెట్టాలని, అది జరిగితే ఎవరికి ఎంతమంది మద్దతుందో స్పష్టంగా తేలిపోతుందని పన్నీర్ వర్గం అంటోంది. మరోవైపు అసలు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకే పిలిచారా, లేక కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తికి బలం నిరూపించుకోడానికి కొంత సమయం ఉంటుంది. కానీ శశికళ వర్గం మాత్రం వెంటనే బల నిరూపణ చేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
రొంబ సస్పెన్స్
-
తీర్పుపై మురళీధర్ రావు స్పందన
-
‘బీజేపీకి సంబంధం లేదు’
ఢిల్లీ: తమిళనాడులో జరుగుతున్న సంక్షోభానికి, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు తెలిపారు. శశికళ నటరాజన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు క్లీన్ పాలిటిక్స్ దిశగా గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా సర్వోన్నత న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అదేవిధంగా శశికళకు రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ నేపధ్యంలో వారం రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. -
శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు
-
శశికళ దోషి: సుప్రీంకోర్టు తీర్పు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. పన్నీర్ సెల్వానికి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు భావించాలి. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్లయింది. ఏ నేరంలోనైనా శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉండటంతో.. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పూర్తిగా పోయాయి. -
తమిళనాట మారుతున్న రాజకీయం
-
తమిళనాట మారుతున్న రాజకీయం
తమిళనాడులో రాజకీయం పలు రకాలుగా మారుతోంది. మరికొద్ది సేపట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఆమె వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం గూటికి చేరుకున్నారు. షెమ్మలయ్ అనే ఎమ్మెల్యే కూడా శశికళకు గుడ్‌బై చెప్పి పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. మరోవైపు సోమవారం ఒక ఎమ్మెల్యే గోడ దూకి.. మారువేషంలో బయటపడి మరీ శశి క్యాంపు నుంచి పన్నీర్ గూటికి చేరిన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలతో ఇరు వర్గాలూ అందోళనగా కనిపిస్తున్నాయి. ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటని పన్నీర్ వర్గం, దోషిగా తేలితే ఏం చేయాలని ప్రత్యామ్నాయాలకు సంబంధించిన ఆలోచనలతో శశికళ వర్గం తల మునకలుగా ఉన్నాయి. రాత్రి నుంచి శశికళ రిసార్టులోనే ఉండిపోయారు. ఆమెకు గట్టి మద్దతుదారుగా ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయాన్నే రిసార్టుకు వెళ్లి, శశికళతో మాట్లాడి, కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చేశారు. తీర్పు నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్టు వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
ఇంతకీ.. శశికళ క్యాంపు రిసార్టు బిల్లు ఎంత?
దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వాళ్లకు సహాయంగా (కాపలాగా) దాదాపు మరో 200 మందికి పైగా బౌన్సర్లు దాదాపు వారం రోజుల నుంచి విలాసవంతమైన బీచ్ రిసార్టులో ఉంటున్నారు. వాళ్లకు అక్కడ సకల మర్యాదలు జరుగుతున్నాయి. మరి వీళ్లందరూ అక్కడ ఉండేందుకు ఎంత బిల్లు అయ్యిందో ఎవరైనా అడిగారా, ఆ డబ్బులు ఎవరు పెట్టుకుంటున్నారో చూశారా? గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 60 గదులున్నాయి. వాటిలో మూడు రకాలు ఉంటాయి. ట్రాంక్విల్ రూంలు అయితే రోజుకు రూ. 5,500 చొప్పున, బే వ్యూ రూంలు అయితే రూ. 6,600 చొప్పున, పారడైజ్ సూట్లు అయితే రూ. 9,900 చొప్పున అద్దెలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని రకాల గదులను రూ. 7వేల చొప్పున రోజుకు బుక్ చేసుకున్నారని అనుకున్నా కూడా.. దాదాపు ఆరు రోజులకే బిల్లు రూ. 25 లక్షల వరకు వెళ్తుంది. ఇది కాక ఇంకా ఆహారం, మంచినీళ్లు, స్నాక్స్, పండ్లు, మద్యం.. ఇతర ఖర్చులన్నీ వేరు. దాదాపు ప్రతిరోజూ రాత్రి పూట ఎమ్మెల్యేల వినోదం కోసం భారీ ఎత్తున పార్టీలు జరుగుతున్నాయని సమాచారం. సుమారు 200 మంది మాత్రమే రిసార్టులలో ఉన్నారని అనుకున్నా, వాళ్లకు తిండి, ఇతర పానీయాల ఖర్చు రోజుకు రూ. 2వేలు మాత్రమే వేసుకుంటే మరో రూ. 25 లక్షలు అవుతుంది. బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిన తర్వాత అటునుంచి అటే వాళ్లందరినీ రిసార్టుకు తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్లు అసలు కనీసం దుస్తులు కూడా తెచ్చుకోలేదు. దాంతో ప్రతి ఒక్కరికీ ఇన్నిరోజులకు సరిపడా కొత్త దుస్తులు కొని తెచ్చారు. దానికోసం రోజుకు వెయ్యిరూపాయలు వేసుకున్నా, ఆరు రోజులకు కలిపి రూ. 12 లక్షలు అవుతుంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు ఏవైనా అదనపు సదుపాయాలు, సేవలు కోరుకుంటే వాటిని కూడా కల్పించాల్సిందే కాబట్టి వాటి ఖర్చు కూడా లెక్క వేసుకోవాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఈ వారం రోజులకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన వీకే శశికళకు తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించే అధికారం లేదని ఓ పన్నీర్ సెల్వం ఇప్పటికే చెప్పడమే కాదు, బ్యాంకులకు లేఖలు కూడా రాసేసి, అన్నాడీఎంకే పార్టీ నిధులన్నింటినీ స్తంభింపజేశారు. మరి అలాంటప్పుడు ఈ రిసార్టుల బిల్లులు ఎవరు భరిస్తున్నారో, దానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయనేది కూడా అనుమానించాల్సిన విషయమేనని అంటున్నారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
ఏపీ,తమిళ రాజకీయాల మధ్య విరుద్ధ పోలిక
-
పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ!
తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. బద్ధశత్రువులైన డీఎంకే - అన్నాడీఎంకే నేతలు సమావేశమవుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పన్నీర్ సెల్వం.. ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారు. డీఎంకేను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రిగా పనిచేసి, అమ్మకు అత్యంత విధేయుడిగా పేరొందిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ కావడం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. అవసరమైతే పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఒక సందర్భంలో స్టాలిన్ అన్నట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి భేటీ నేపథ్యంలో నిజంగానే మద్దతు గురించి చర్చిస్తారా లేక వేరే ఏమైనా చర్చలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
పన్నీర్ అమ్ముడుపోయారు చిన్నమ్మే కావాలి
-
పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి
నిన్న మొన్నటి వరకు బోసిపోయిన పోయెస్ గార్డెన్స్ ఒక్కసారిగా శశికళ మద్దతుదారులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలువురు మద్దతుదారులు, కార్యకర్తలు పోయెస్ గార్డెన్స్ వద్దకు వెల్లువెత్తారు. పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్నారని, కానీ ఒకరోజు ఆలస్యమైనా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కచ్చితంగా చిన్నమ్మేనని ఆమె మద్దతుదారులు అన్నారు. ఇంతకుముందు వరకు ఎక్కడ చూసినా జయలలిత ఫొటో మాత్రమే కనిపించగా, ఇప్పుడు అక్కడకు చేరుకున్న అందరివద్ద జయలలిత, శశికళ ఇద్దరూ ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. తమకు కావల్సింది చిన్నమ్మేనని, ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయమని మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. గవర్నర్ ఎందుకంత మౌనంగా ఉన్నారని.. ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్ద ఉన్నది ఏడు- ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని, వాళ్లతోనే ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తారని, అసెంబ్లీలో బలం ఎలా నిరూపించుకుంటారని మండిపడ్డారు. మొత్తమ్మీద ఇన్నాళ్ల తర్వాత మళ్లీ శశికళకు క్షేత్రస్థాయి మద్దతు కొంతవరకు కనిపించినట్లు అయింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం
నిన్న మొన్నటి వరకు మెత్తటి మనిషిలా కనిపించిన పన్నీర్ సెల్వం గర్జించారు. శశికళ మొసలికన్నీరు ఆపాలని, ఆమెవద్ద ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటకు వదలాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లు చేస్తున్నారని, గూండాలు ఉండటం వల్ల తాము బయటకు రాలేకపోతున్నట్లు చెప్పారని ఆయన అన్నారు. వాళ్లను రిసార్టులో బంధించలేదని శశికళ చెబుతున్నారని.. అలా అయితే వాళ్లను ఇంటికి ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోం మంత్రి పదవి కూడా చేతిలోనే ఉన్నప్పుడు.. ఆ హోదాతో రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తేవచ్చుగా అని మీడియా ఆయనను ప్రశ్నించగా, ఇప్పటికే రాష్ట్రంలో అసాధారాణ పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో తాను ఏం చేసినా దానివల్ల అనవసరంగా సమస్యలు వస్తాయని అన్నారు. అందుకే తాను సహనంతో ఊరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో కమెడియన్ వడివేలు తనకు తానే పోలీసు జీపు ఎక్కి.. తనను జైలుకు తీసుకెళ్తున్నారని చెప్పినట్లు శశికళ తనను తాను సింహం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 75 రోజుల పాటు జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు బయట తామంతా అక్కడే ఉత్కంఠతో వేచి చూశామని, అప్పుడు అమ్మ పక్కనే ఉన్న శశికళ ఒక్కరోజైనా బయటకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి తనను ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి తాను శశికళ చేతుల్లో చిత్రహింసకు గురయ్యానని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపా జయకుమార్‌లను కనీసం లోపలకు రానివ్వలేదని, జయలలిత మరణించినప్పుడు కూడా దీప అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున 6.30 వరకు వేదనిలయం వద్దే వేచి చూసినా.. కనీసం అమ్మ మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని పన్నీర్ సెల్వం మండిపడ్డారు. -
సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం!
-
సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం!
తమిళనాడు రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పన్నీర్ సెల్వం.. తాను సోమవారం సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లడం ఇదే మొదటిసారి. సచివాలయంలో ఆయన ఏం చేస్తారన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియరావట్లేదు. మరోవైపు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం కూడా సోమవారమే జరగనుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు. దాంతో డీఎంకే సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంకోవైపు గవర్నర్ ఇప్పటికైనా నిర్ణయం తీసుకోని పక్షంలో తాను కేసు దాఖలు చేస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి హెచ్చరించారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునేదీ కూడా సోమవారమే తెలియనుంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాలపై మద్రాస్ హైకోర్టుకు పోలీసులు కూడా సోమవారం నివేదిక సమర్పించాల్సి ఉంది. శుక్ర, శనివారాల్లో పోలీసులు గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పారన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో పోలీసులు కోర్టుకు తెలియజేయాల్సి ఉంది. -
హైడ్రామా వెనుక బీజేపీ హస్తం ఉందా ?
-
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. రంగంలోకి శశి!
-
రిసార్ట్ కు వెళుతున్న శశి.. క్షణక్షణం ఉత్కంఠ!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ కోసం పోరు ఇంకా కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం శశికళ 90కి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో ఉన్న గోల్డెన్ బే రిసార్టుకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం శశికళ కలుసుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతల్లో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిసార్ట్ ప్రాంతానికి వెళ్లే ముందు చెన్నై మెరీనా బీచ్ లో జయ సమాధిని శశికళ సందర్శించనున్నారు. మెరీనా బీచ్ నుంచి నేరుగా తాను ఎమ్మెల్యేలను తరలించి ఉంచిన రిసార్ట్ వద్దకు వెళ్లనున్నారు. రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో నేరుగా భేటీలో పాల్గొని.. వారికి తాను ఏం చేయనున్నారో, ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నారో వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సెల్వం వర్గంలో చేరుతుండటం ఆమె ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ తరుణంలో సీక్రెట్ రిసార్టుకు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలను తనకే మద్ధతు తెలపాలని మరోమారు కోరనున్నారు. రిసార్ట్ ప్రాంతానికి ఎమ్మెల్యేలకు అవసరమైన నూతన దుస్తులు, ఇతరత్రా సామాగ్రి పంపినట్లు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయాన్ని తెలపక పోవడంతో శశికళ కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి. తన కనుసన్నల్లో నడుచుకుంటున్న నేతలు పన్నీర్ వర్గంలో చేరకుండా ఉండాలంటే నేరుగా వెళ్లి వారితో చర్చించాలని శశికళ భావిస్తున్నారు. తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని కీలక కథనాలు: తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్! శరీరాలు రిసార్టులో.. మనస్సు సెల్వంపై! శశికళపై విజయశాంతి కామెంట్! గవర్నర్‌కు శశికళ మరో లేఖ -
రిసార్టులో ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పోలీసులు
శశికళ - పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న కుర్చీలాటలో భాగంగా రిసార్టులో దాచిపెట్టిన ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు ఎట్టకేలకు చేరుకున్నారు. మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. సుమారు 120 మంది వరకు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు సమాచారం రావడంతో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఉదయం అక్కడకు భారీ పోలీసు బలగాలతో వెళ్లిన విషయం తెలిసిందే. అదనపు డీఎస్పీ తమిళ్ సెల్వన్, డీఆర్వో రామచంద్రన్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ఉదయం 6.30 గంటలకే అక్కడకు చేరుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడటం మొదలుపెట్టింది. రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా లేక ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి అక్కడ ఉంచారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా చెప్పాలని కూడా పోలీసులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను నిజంగానే నిర్బంధిస్తే అది చాలా పెద్ద నేరం అవుతుందని మద్రాస్ హైకోర్టు మండిపడింది. సోమవారానికల్లా ఎమ్మెల్యేల విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని చెప్పింది. దాంతో పోలీసులు చురుగ్గా కదిలారు. అక్కడకు వెళ్లిన పోలీసులు, మీడియా ప్రతినిధులపై స్థానికులు, రిసార్టుల వద్ద ఉన్న ప్రైవేటు గార్డులు రాళ్లతో దాడులు చేశారు. కొంతమంది బౌన్సర్లను కూడా అక్కడ పెట్టి మరీ ఎమ్మెల్యేలను బయటకు కదలకుండా ఆపుతున్నట్లు కథనాలు వచ్చాయి. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
సీటు ముడి
-
శశికళ కుటుంబానికి సేవలు చేయాలా?
-
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని.. నిజంగా వాళ్లు బందీలుగానే ఉన్నారా, ఎక్కడున్నా సోమవారానికల్లా అందరినీ తీసుకురావాలంటూ తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా ఆదేశించింది. ఎమ్మెల్యేలు బందీలు కావడంపై ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో క్యాంపు రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఇదే పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎస్, డీజీపీలు గవర్నర్‌కు వివరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు వద్దకు డీజీపీ స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా రిసార్టు.. ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు చెబుతున్న రిసార్టు ఒకరకంగా చెప్పాలంటే దుర్భేద్యమైనది. సముద్ర తీరానికి కిలోమీటరు దూరంలో సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఈ రిసార్టు ఉంటుంది. దానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా పడవల్లో వెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అక్కడినుంచి తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉందోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'సాక్షి' ప్రతినిధులు మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులకు ఫోన్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్విచాఫ్ అని వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు కలిశాయి గానీ .. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనకరమైన స్వరంతో మాట్లాడారు. రిసార్టులకు తాము ఇష్టపూర్వకంగా వెళ్లామా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా తంజావూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు కాపలా ఉన్నాయి. దాంతో మీడియా కూడా అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేకపోతోంది. సుప్రీంలో శశికి ఊరట మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది అంత అత్యవసరమైనది కాదని, అందువల్ల సాధారణ పద్ధతిలోనే ఈనెల 17న దాన్ని విచారిస్తామని తెలిపింది. దాంతో శశికళకు ప్రమాణస్వీకారం అవకాశాలు కాస్త పెరిగినట్లయ్యాయి. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!