చివరి నిమిషం వరకు శశికళపై పోరాటం: పన్నీర్
ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి పార్టీని వెళ్లనిచ్చేది లేదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. శశికళకు వ్యతిరేకంగా తాను చిట్ట చివరి నిమిషం వరకు పోరాడుతానని చెప్పారు.
రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గతంలో క్షమాపణలు చెప్పి మళ్లీ పోయెస్ గార్డెన్‌లోకి వచ్చిన శశికళ.. అమ్మ మరణించగానే ముఖ్యమంత్రి కావాలని కలలు గన్నారని ఆయన అన్నారు. అమ్మ ఆశయ సాధనే తన ధ్యేయమని తెలిపారు.