tamilnadu chief minister
-
తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం
తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్‌లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్.. హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్‌ని ట్విట్టర్లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్‌లను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్ ఆధారంగా స్టాలిన్ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్ స్టాలిన్, అల్లుడు శబరీశన్ 30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్‌ల నియమాక విషయమై ఓ ప్రెవేట్ కంపెనీ స్టాలిన్‌కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్‌లో ఆరోపణలు వచ్చాయి. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్‌గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వాయిస్‌తో నేరారోపణ చేసే కంటెంట్ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష) -
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
-
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది. అయితే ప్రస్తుతం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళ ఉన్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడే పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కూడా సాధ్యం కాని పనే అవుతుంది. ముందుగా ఎన్నికల కమిషన్‌కు గతంలో పళనిస్వామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్‌ను ఎన్నుకున్నట్లుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నిక నిర్వహించి, అప్పుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. దీనంతటికీ ఎంత లేదన్నా రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసి, పళని స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించడం లాంటి అవకాశాలను కూడా చర్చిస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంతవరకు తగ్గడం, రెండోది.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తు మీద పోటీ చేయడం.. తద్వారా జయలలిత వారసత్వం పూర్తిగా తమకు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడం. ఇదే లక్ష్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాల విలీనం జరిగితేనే ఇది సాధ్యమని.. ఎన్నికల కమిషన్ జూన్ 16 వరకు సమయం ఇచ్చినా ఈలోపే విలీనానికి సంబంధించిన లేఖలను కూడా ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల గుర్తును క్లెయిమ్ చేసుకుంటే మంచిదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకుల మధ్య చిన్న చిన్న విషయాలలో తప్ప చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
చివరి నిమిషం వరకు శశికళపై పోరాటం: పన్నీర్
ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి పార్టీని వెళ్లనిచ్చేది లేదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. శశికళకు వ్యతిరేకంగా తాను చిట్ట చివరి నిమిషం వరకు పోరాడుతానని చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గతంలో క్షమాపణలు చెప్పి మళ్లీ పోయెస్ గార్డెన్‌లోకి వచ్చిన శశికళ.. అమ్మ మరణించగానే ముఖ్యమంత్రి కావాలని కలలు గన్నారని ఆయన అన్నారు. అమ్మ ఆశయ సాధనే తన ధ్యేయమని తెలిపారు. -
పన్నీర్ సెల్వం వెంట ముగ్గురేనా?
-
పన్నీర్ సెల్వం వెంట ముగ్గురేనా?
తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ఉన్నది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్న కథనాలు వస్తున్నాయి. మిగిలిన 130 మంది శశికళ వెంట ఉన్నారని చెబుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమైనప్పుడు మొత్తం 130 మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతు చెప్పారని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కనిపించారు. అయితే ఒకవైపు పన్నీర్ సెల్వం తనకు 50-70 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని, మరికొంత సమయం ఇస్తే పూర్తిస్థాయిలో మెజారిటీ నిరూపించుకుంటానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి క్లెయిము వాస్తవం అన్నది అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే తప్ప స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుంటారు. వారిలో ఒక నామినేటెడ్ సభ్యుడిని తీసేసి, జయలలిత మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని కూడా మినహాయిస్తే మొత్తం 233 మంది అవుతారు. అప్పుడు మేజిక్ ఫిగర్ 117 అవుతుంది. అన్నాడీఎంకేకు సభలో మొత్తం 135 మంది సభ్యులున్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం, ఆయన వెంట ఉన్న ముగ్గురు కలుపుకొంటే మిగిలిన 131 మంది శశికళ వెంటే ఉన్నారా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. తనతో ఎవరొస్తారన్న విషయం ముందుగా చూసుకోకుండానే అత్యంత విధేయుడిగా ఉండే పన్నీర్ సెల్వం ఇంత ధైర్యం చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మైత్రేయన్ లాంటి సీనియర్ మోస్ట్ పార్లమెంటు సభ్యులు, పాండియన్ లాంటి పార్టీ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుతం బహిరంగంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. అయితే, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి... ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని వేచిచూడాల్సిందే. -
'అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా'
-
శశికళకు పన్నీర్ సెల్వం సవాల్
పార్టీ కార్యకర్తలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను తాను ఉపసంహరించుకుంటానని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ వర్గానికి ధైర్యం ఉంటే వాళ్లు కూడా తమ బలం నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. తన బలమెంతో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదని, అదేదో సభలోనే చూపిస్తానని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన నివాసంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ కేడర్, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే లక్ష్యమని, తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎప్పుడూ పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయలేదని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తనవెంట 70 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని, తగినంత సమయం ఇస్తే మరింతమంది వెంట వస్తారని, తన బలం నిరూపించుకుంటానని అన్నారు. జయలలిత తనకు దేవతతో సమానమని, ఆమె అడుగు జాడల్లోనే నడుస్తానని పన్నీర్ సెల్వం అన్నారు. ఆమె మరణంపై తమకు అనుమానాలున్నాయని, అమ్మ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నంతకాలం శశికళ తప్ప పెవరూ ఆమెను చూడలేదు, మాట్లాడలేదని గుర్తు చేశారు. అమ్మ చూపిన బాటలోనే డుస్తానని, పార్టీ పటిష్ఠత కోసమే పనిచేస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి విధేయుడినేనని అన్నారు. -
పండుగవేళ.. రాష్ట్రమంతా కరువు!
తమ రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ఆయన ప్రకటించారు. దక్షిణాది వారికి, అందునా తమిళులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి సమయంలో ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన నీటి కొరత కారణంగా.. రైతులకు భూమిపన్నును మినహాయిస్తున్నట్లు చెప్పడంతో పాటు పలు రాయితీలు కూడా ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 160 కోట్లు, పల్లెల్లో సాగునీటి కోసం రూ. 350 కోట్లను విడుదల చేశారు. ప్రధానంగా కర్ణాటకతో కావేరీ జలాల వివాదం కారణంగా తమిళనాడుకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. తాగు, సాగునీటి కోసం తమిళులు అల్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా కూడా ప్రకటించడంతో కావేరీ జలాల కోసం మరింతగా కర్ణాటకను పట్టుబట్టే అవకాశం ఏర్పడింది. తమిళనాడుకు ఇప్పటికే కర్ణాటక నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల కావేరీ జలాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ఈ నీటిని వదులుతోంది. -
సీఎం పదవి కూడా చిన్నమ్మకే?
ఇప్పటికే పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయి. ఈ మేరకు సీనియర్ నాయకులు కొంతమంది కలిసి శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారు. జయలలిత మరణించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా పలువురు సీనియర్ నాయకులకు వెళ్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాల్సిందిగా చిన్నమ్మను కోరారు. జీవితాంతం జయలలిత అదే పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి.. చిన్నమ్మ శశికళే ఈ బాధ్యతలు తీసుకోవాలని వాళ్లంతా కోరారు. అంతేకాదు, ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాల్లో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు కూడా వెలిశాయి. మరోవైపు అన్నాడీఎంకేలోని ఒక విభాగమైన జయలలిత పెరవై.. శశికళ ఈ రెండు పదవులనూ చేపట్టాలని, ఇంతకుముందు జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఒక తీర్మానం కూడా ఆమోదించింది. తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి, పెరవై సెక్రటరీ అయిన ఆర్బీ ఉదయకుమార్ ఈ మేరకు 'తాయి తంట వరం' (అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ) అనే శీర్షికతో ఉన్న తీర్మానం కాపీని శశికళకు అందించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి కదంబూర్ రాజు, దేవాదాయ శాఖ మంత్రి సెవూర్ ఎస్. రామచంద్రన్, మరో 50 మంది పెరవై సభ్యులు అంతా ఉదయకుమర్‌తో సహా వెళ్లి శశికళను కలిసి వచ్చారు. గృహనిర్మాణ శాఖ మంత్రి, పార్టీ తిరుపూర్ రూరల్ జిల్లా కార్యదర్శి ఉడుమలై కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు కూడా ఇదే డిమాండ్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవితో ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కాపాడాల్సింది చిన్నమ్మను కోరామని రాధాకృష్ణన్ చెప్పారు. వీళ్లతో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారు. జయలలిత నింసించిన పోయెస్ గార్డెన్స్ భవనంలోనే ఇప్పుడు శశికళ కూడా ఉంటున్నారు. ఆ భవనానికి ఇటీవలి కాలంలో సందర్శకుల రాకపోకలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో... ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్లు శశికళను వ్యతిరేకించినట్లు కథనాలు వచ్చినా.. తర్వాత ఏమైందో గానీ వాళ్లు కూడా సమాధాన పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అన్నాడీఎంకేలోని ఏ ఒక్కరూ శశికళను బహిరంగంగా వ్యతిరేకించలేదు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. -
టీ షాపు నుంచి సీఎం దాకా..
చెన్నై: తెలతెలవారుతుండగా చల్లని గాలులు మెల్లగా వీస్తుంటే మంద్రస్వరంతో తమిళపాటలు వీనులు విందుగా వినిపిస్తుంటే వెచ్చని ఛాయ్ కమ్మకమ్మగా తాగుతుంటే... ఆహా ! ఆ మధుర స్మృతులే వేరయా! అనుకోక తప్పదు. ఈ అనుభవం కావాలంటే ఇప్పుడైనా తమిళనాడులోని థేని జిల్లా, పెరియాకులంలోని రోజీ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఛాయ్ మాత్రం పది రూపాయలకు కప్పు. చిక్కదనం, రుచి కారణంగానే పదిరూపాయలు వసూలు చేస్తున్నారని, అందులో తప్పేమిటని కస్టమర్లు కితాబిస్తారు. పార్సిల్ కావాలంటే 18 రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ టీ దుకాణాన్ని పీవీ క్యాంటీన్ అని పిలుస్తారు. పీ... అంటే పన్నీర్ సెల్వమ్, వీ... అంటే విజయన్. వీరిద్దరు చిన్నప్పటి నుంచి కలసి పెరిగిన బాల్యమిత్రులు. వీరిద్దరు కలసి 1970లో ఈ రోజీ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. అందుకే ఇద్దరి పేర్లతో ముద్దుగా పీవీ క్యాంటీన్ అని పిలుస్తారు. తాను 40 ఏళ్ల నుంచి ఇక్కడ టీ తాగుతున్నానని, అప్పుట్లో 15 పైసలకు కప్పు టీ ఇచ్చేవారని, ఇప్పుడు పది రూపాయలకు కప్పు టీ సరఫరా చేస్తున్నా, ఇక్కడే తాగుతున్నానని శేఖర్ అనే ఓ యాభై ఏళ్ల డ్రైవర్ తెలిపారు. పన్నీర్‌సెల్వం అంటే.... పన్నీర్ సెల్వం అంటే నేడు తమళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఓ పన్నీర్‌సెల్వమే. ఆయన ఈ క్యాంటీన్‌ను 1980 దశకంలో తన సోదరుడు ఓ రాజాకు అప్పగించారు. ఆయన మిత్రుడు విజయన్ మాత్రం మరో చోటుకు వెళ్లి వేరే చాయ్, స్నాక్స్ దుకాణం పెట్టుకున్నారు. పన్నీర్ సెల్వం సోదరుడు రాజా పదేళ్ల కుమార్తే రోజీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మరణించింది. ఆమె పేరుతో రాజా పీవీ క్యాంటీన్ పేరును రోజీ క్యాంటీన్‌గా మార్చారు. అందుకనే క్యాంటీన్లో ఓ పక్క రోజీ ఫొటో, మరో పక్క గోడపై మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్, జయలలిత ఫొటోలు కనిపిస్తాయి. రాజకీయాల్లోకి.... ఓ పన్నీర్‌సెల్వం రాజకీయాల్లో ప్రవేశించి అఖిలభారత అన్నాడీఎంకే నాయకుడిగా ఎదిగారు. జయలలిత వీర విధేయుడిగా ఉంటూ ఒక్కసారి కాదు, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగారు. 2001లో జయలలిత జైలుకెళ్లినప్పుడు మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కాకుండా పక్క కుర్చీలో కూర్చోవడం ద్వారా విస్తృత ప్రచారాన్ని పొందారు. ఆర్థిక, ప్రజాపనులు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ లాంటి కీలక శాఖలను నిర్వహించారు. మరోసారి ముఖ్యమంత్రిగా.... 2014లో ముఖ్యమంత్రి మరోసారి జైలుకు వెళ్లాల్సి రావడంతో పన్నీర్‌సెల్వం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన తన కన్నీళ్లకు ఆపుకోలేకపోయారు. అప్పుడు ఆయన్ని కన్నీర్సెల్వం అని పిలుస్తూ వచ్చారు. దక్షిణ తమిళనాడులో ప్రాబల్యకులమైన దేవర్లు ఉపకులమైన మరవార్ కులంలో ఆయన పుట్టారు. ఆయనకు పుట్టినప్పుడు పెచ్చియమ్మన్ దేవత పేరు వచ్చేలా పెచ్చిముత్తూ అని పేరు పెట్టారు. వారి పెద్దనాన్న పేరు కూడా పెచ్చిముత్తూ అవడంతో పెద్దవారి పేరును ఉచ్ఛరించకూడదనే పట్టింపు కారణంగా ఆయన తన పేరును పన్నీర్సెల్వంగా మార్చుకున్నారు. ఎంజీఆర్‌పై అభిమానంతో... పీవీ క్యాంటీన్‌తోపాటు పన్నీర్‌సెల్వం డెయిరీ ఫామ్‌ను కూడా నడిపేవారు. ఆయన తండ్రి కుటుంబంలో మొదటి సంతానం ఆయన. ఆస్తి పంపకాల్లో డెయిరీ ఫారమ్ ఒకరికి, క్యాంటీన్ ఒకరికి వెళ్లాయి. పన్నీర్‌సెల్వం ఎంజీఆర్ మీదున్న అభిమానంతో ఆయన పార్టీలో చేరారు. 1987లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన జానకి రామచంద్రన్ పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత జయలలితే వారసురాలవుతుందని తెలిసి ఆమె వర్గంలో చేరిపోయారు. అప్పటి నుంచి ఆమెకే వీరవిధేయుడిగా ఉండిపోయారు. -
జయలలిత కన్నుమూత
తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చితలైవి జె.జయలలిత (68) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి సోమవారం వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత, మధ్యలో లేచి కూర్చున్నారని, అన్నం తిన్నారని, కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని కూడా తెలిపారు. అయితే, ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి, వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 1948 ఫిబ్రవరి 24వ తేదీన నాటి మైసూరు రాష్ట్రంలోని మేలుకోటే ప్రాంతంలో జయరాం, వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించారు. ఆమె అసలుపేరు కోమలవల్లి. తర్వాత స్కూల్లో రెండో తరగతిలో చేర్చినప్పుడు జయలలిత అనే పేరు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తన తల్లి బలవంతంతో 15వ యేట సినిమా రంగంలో ప్రవేశించారు. ఆమె నటించిన తొలి సినిమా చిన్నడ గొంబె (కన్నడ) పెద్ద హిట్టయ్యింది. తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను సినీరంగంలో పెద్దస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన జయలలిత.. రాచమంద్రన్ మరణానంతరం పెద్దస్థాయికి ఎదిగారు. 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా నిలిచారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సాధించారు. ఐదేళ్లు పూర్తి పదవీకాలంలో ఉన్నా.. 2006 మేలో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూశారు. ఆమె పార్టికి కేవలం నాలుగు స్థానాలే దక్కాయి. తర్వాత మళ్లీ ఫీనిక్స్ పక్షిలా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మధ్యలో ఒకసారి అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన అనుంగు అనుచరుడు పన్నీరుసెల్వంకు పదవి అప్పజెప్పినా, మళ్లీ సుప్రీంకోర్టు ఊరటనివ్వడంతో పదవి చేపట్టారు. గుండె పగిలిన తమిళనాడు తాము ఎంతగానో ఆరాధించే 'అమ్మ' ఇక లేరని తెలిసి ఒక్కసారిగా తమిళుల గుండె పగిలింది. ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో ఆస్పత్రివద్దకు చేరుకున్న అభిమానులు అమ్మకు ఏమైందోనని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు. ఇక విషయం తెలిసిన తర్వాత వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సామాన్య ప్రజల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ విలపిస్తున్నారు. -
అమ్మ పరిస్థితి అత్యంత విషమం: అపోలో
అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ చాలా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఈ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కార్డియాక్ అరెస్టు వచ్చిన ఆమె.. ప్రస్తుతం ఎక్మో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్) తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంల మీద ఉన్నారని ఆ బులెటిన్‌లో తెలిపింది. ఆమెకు నిపుణుల బృందం చికిత్స అందిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తోందని ఆ బులెటిన్‌లో పేర్కొంది. అపోలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరు మీద ఈ బులెటిన్ విడుదలైంది. -
అమ్మ పరిస్థితి చాలా విషమం: అపోలో
-
మెరుగుపడిన జయలలిత ఆరోగ్యం
-
జయలలిత మాట్లాడారు!
-
జయలలిత మాట్లాడారు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కోలుకుంటున్నారని, ఆమె కీలక అవయవాలన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాలర్ మైకు ద్వారా ఆమె కొద్ది నిమిషాలు మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రతిరోజూ కొంతసేపు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. అయితే 90 శాతం సమయం మాత్రం ఆమె తనంతట తానే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ఆమెకు స్టాటిక్ మరియు యాక్టివ్ ఫిజియోథెరపీ అందిస్తున్నామని.. ఇక తర్వాత ఆమె లేచి నిలబడి, నడవడమే తరువాయి అని వివరించారు. జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఎప్పుడు డిశ్చార్జి అయి వెళ్లాలన్నది ఆమె ఇష్టమేనని ఆయన అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ పాలనాపగ్గాలు చేపట్టాలంటూ అన్నాడీఎంకే అభిమానులు, కార్యకర్తలు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు, అన్నదానాలు చేశారు. -
58 రోజుల తర్వాత అమ్మ...
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను.. 58 రోజుల తర్వాత వైద్యులు సీసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆమె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడటంతో ఆమెను సాధారణ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 20 గంటల పాటు సహజంగా శ్వాసను తీసుకునే స్థాయికి ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయేటపుడు మాత్రమే కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపాయి. కాగా, ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. -
జయలలితదే తుది నిర్ణయం
-
జయలలితదే తుది నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ సోకకూడదని జయలలితను ఇంకా ఐసీయూలోనే ఉంచామని చెప్పారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది జయలలితే నిర్ణయించుకుంటారని ప్రతాప్ సి.రెడ్డి పేర్కొన్నారు. అయితే డిశ్చార్జ్ తేదీ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తమ అధినేత్రి పూర్తి స్థాయిలో కోలుకోవడంతో అన్నాడీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత తనంతట తాను శ్వాస తీసుకుంటున్నారని... ఆమెకు ఇది పునర్జన్మ అని చెబుతున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. -
రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి?
ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. కీలకమైన అంశాలన్నీ అదుపులోనే ఉన్నాయని.. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో 15 రోజుల్లో ఇంటికి పంపే అవకాశం ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్‌లోకి మార్చే విషయంపై మీడియా ప్రశ్నించగా.. అక్కడకు, ఇక్కడకు తేడా అత్యవసర పరికరాలు మాత్రమేనని ఆయన వివరించారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. పూర్తిస్థాయిలో కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు. మరికొన్ని రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలోనే ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించిన వెంటనే ఆమె తనంతట తానుగా కూర్చోలేకపోతున్నారని, ప్రస్తుతం ఘన-ద్రవం లాంటి పదార్థాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు తప్ప వేరే ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) లోపలకు అనుమతించడం లేదు. అక్కడి నుంచే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తన సలహాదారులతో ప్రత్యేకమైన ఆడియో వ్యవస్థ ద్వారా మాట్లాడుతున్నారని పొన్నియన్ చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
అమ్మ కోసం యజ్ఞం చేస్తే.. తేనెటీగలు కుట్టాయి!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగుపడాలని రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా పూజలు, యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. అలాగే వెల్లూరు జిల్లాలో కూడా ఒక మహాయజ్ఞం చేపడుతున్నారు. అయితే పరిసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మ ధ్యాసలోనే మునిగిపోయిన మహాభక్తులు.. అక్కడున్న తేనెటీగలను చూసుకోలేదు. వీళ్లు చేస్తున్న యజ్ఞంతో తమకు ఇబ్బంది అనిపించిందో ఏమో గానీ.. అంబూరు ఎమ్మెల్యే ఆర్. బాలసుబ్రమణితో సహా పదిమంది అన్నాడీఎంకే నేతలను అవి కుట్టికుట్టి వదిలిపెట్టాయి. వడచేరి శక్తి మరియమ్మన్ కోయిల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో బాలసుబ్రమణితో పాటు గుడయతం ఎమ్మెల్యే జయంతి కూడా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని ఒక రావిచెట్టు కింద ఈ యజ్ఞం చేశారు. ఆ చెట్టు కొమ్మల్లోనే ఓ పెద్ద తేనెపట్టు ఉంది. దాన్ని వాళ్లు అసలు చూసుకోలేదు. చెట్టుకింద చేస్తున్న యజ్ఞం కారణంగా వచ్చిన పొగతో ఆ తేనెటీగలకు ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే, కింద ఉన్నవాళ్లు ఎవరన్న విషయం పట్టించుకోకుండా.. వారందరినీ కుట్టిపెట్టాయి. గుడియట్టం ఎమ్మెల్యే సమయానికి దగ్గర్లో ఉన్న ఓ కారు చూసుకుని అందులో దూరి తాళం వేసుకున్నారు. అయితే ఆమె భర్త పద్మనాభన్, ఎమ్మెల్యే బాలసుబ్రమణి, మరో 8 మంది మాత్రం తేనెటీగల బారిన పడ్డారు. ఎమ్మెల్యే బాలసుబ్రమణి కూడా కారులోకి దూరినా.. అవి కూడా కారులోకి వెళ్లి మరీ ఆయన్ను కుట్టాయి. ఆయనను వెంటనే అంబూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ తక్షణ చికిత్సలు అందించారు. ఇతరులను అంబూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. -
అమ్మకు సందర్శకుల తాకిడి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సందర్శకుల తాకిడి వెల్లువెత్తుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తదితరులు సోమవారం నాడు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అయితే జయలలిత ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నందున ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని వైద్యులు సూచించడంతో.. వైద్యులతోనే మాట్లాడి బయటకు వచ్చేశారు. జయలలిత కోలుకుంటారని, ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని బయట మీడియాతో చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు. మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పాలన వ్యవహారాలను చూసుకుంటున్నారని, అమ్మ మళ్లీ వస్తారని, పాలన పూర్తిగా గాడిలో పడుతుందని చెబుతున్నారు. -
బాంబు పేల్చిన శశికళ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. సుమారు గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని ఆమె తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వాళ్లు కుట్ర పన్నుతున్నారన్నారు. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విషయంలో గానీ, మరేదైనా విషయంలో గానీ జయలలిత నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా సంతకాలు జాగ్రత్తగా చూడాలని విజ్ఞప్తి చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఏ ఒక్కరినీ ఆమెను చూసేందుకు అనుమతించలేదు. కేవలం వైద్యులతో మాత్రమే మాట్లాడనిచ్చారు. చివరకు జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్, మేనకోడలు దీప కూడా జయలలిత వద్దకు వెళ్లలేకపోయారు. కానీ, జయ సన్నిహితురాలు శశికళ మాత్రం.. ఇన్నాళ్లుగా ఐసీయూలోనే ఆమె పక్కనే ఉంటున్నారు. దీనిపైనే రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంతకీ అది 'అమ్మ' గొంతేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో.. చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్న 'అమ్మ' మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేందుకు ఈ ఆడియోనే సాక్ష్యం అంటూ కొందరు అన్నాడీఎంకే అభిమానులు చెబుతున్నారు. వాట్సప్‌లో దీనికి సంబంధించిన ఆడియో ఫైలు విపరీతంగా షేర్ అవుతోంది. అందులో జయలలిత మాట్లాడినట్లుగా చెబుతున్నా.. నిజానికి ఇది అమ్మగొంతులా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. అయితే, ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నారు కాబట్టి, గొంతు కొంత మారి ఉంటుందన్న వాదన సైతం వినిపిస్తోంది. ఆ ఆడియోలో ఇలా ఉంది... ''నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ.. ప్రతిరోజూ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. దేవుడి దయవల్ల నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత.. నేను మీ అందరి ముందుకు వచ్చి, మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతా, నా అనారోగ్యానికి కారణం ఏంటో కూడా చెబుతా. నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరుతున్నా. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయాన్ని, అన్నాడీఎంకే అందిస్తున్న శాంతియుత పాలనను ఏమాత్రం జీర్ణించుకోలేని ప్రతిపక్షమే నా ఆరోగ్యం గురించి లేనిపోని వదంతులు వ్యాపింపజేయడానికి ఓవర్‌టైం పనిచేస్తోంది. కోట్లాది మంది మద్దతుదారుల ఆశీస్సులు, ఎంజీఆర్ సోదర సోదరీ మణుల ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం నన్ను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఇంతకుముందు చెప్పినట్లుగానే.. నేను మీ వల్లే, మీ అందరికోసమే ఉన్నాను. అందువల్ల ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించినట్లు గానే.. ఈనెల 17, 19 తేదీలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండు ఆకుల గుర్తుమీద ఓట్లు వేసి.. పార్టీకి ఘనవిజయం అందించాలని కోరుకుంటున్నా. జై అన్నా.. జై ఎంజీఆర్'' -
జయలలితపై ఫేస్బుక్లో వదంతులు.. యువతిపై కేసు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేసినందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఎన్నారై యువతిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జయలలిత రెండు రోజుల క్రితమే మరణించినట్లు తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఫ్రాన్సులో నివసించే తమిళచి అనే యువతి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తమిళనాడులో అల్లర్లు సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ వర్గాలే ఆమెను హత్యచేశాయని కూడా ఆమె ఆరోపించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు, వీహెచ్‌పీ నేత సూరి హత్యకేసు, హిందూ మున్నానీ నాయకుడు శశికుమార్ కేసు.. వీటన్నింటినీ కూడా ఆమె తన పోస్టులో ప్రస్తావించింది. ఈ కేసుల్లో ముస్లింలపై ఆరోపణలు చేశారని.. ఆర్ఎస్ఎస్ వాళ్లు హిందూ ముస్లిం అల్లర్లు రెచ్చగొట్టబోతే జయలలిత అడ్డం పడ్డారని, అందుకే ఆమెను కూడా వాళ్లు చంపేశారని ఆమె తన ఫేస్బుక్లో రాసింది. జయలలిత ఆరోగ్యం గురించిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కూడా ఆమె కోరారు. దీంతో జయలలిత ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ అన్నాడీఎంకే ఐటీ విభాగం ఆమెపై ఫిర్యాదుచేసింది. క్రైం బ్రాంచి విభాగం పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 153ఎ, 505 (1), (2) కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. -
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
-
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పది రోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె గురించి గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డ్ జాన్ ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ అంటూ ఆస్పత్రిలో చేరినా.. ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని, అదుకే ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రి ఆవరణ మొత్తం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. జయలలిత ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని రెండు రోజుల క్రితం ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాతి నుంచి బులెటిన్లు ఇవ్వడం కూడా మానేశారు. జయలలితతోపాటే ఐసీయూలో ఆమెకు తోడుగా ఉంటున్న నెచ్చెలి శశికళ అసలు బయటకే రావడం లేదు. ఆమె ఇంటికి కూడా వెళ్లడంలేదు. దాంతో ఇది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం రెండురోజులకు ఒకసారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు గానీ, మీడియాకు చెప్పేందుకు మాత్రం వెనకంజ వేస్తున్నారు. ఏ విషయం బయటకు చెప్పొద్దని ఆమె ఆస్పత్రిలో చేరకముందే వాళ్లకు ఆదేశాలు వచ్చినట్లు అన్నాడీఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. రెండు రోజల క్రితం పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మాత్రం.. జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రపతికి సుప్రీం న్యాయవాది లేఖ జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు ఏమీ చెప్పడం లేదని రీగన్ ఎస్. బెల్ అనే న్యాయవాది ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఆగిపోయిందని, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆమె ఆరోగ్యం గురించి ఏమీ తెలియదని చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలో వేలాదిమంది పోలీసులను మోహరించారని, చివరకు సీఎంను చూసేందుకు గవర్నర్‌ను కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించే పరిస్థితిలో జయలలిత ఉన్నారో లేదో చెప్పాలన్నారు. -
జయలలితకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ ప్రత్యర్థులపై వరుసపెట్టి పరువునష్టం దావాలు వేయడాన్ని విమర్శించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని తలంటు పోసింది. పరువునష్టం దావాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడినంత మాత్రాన పరువునష్టం దావాలు వేయడం కుదరదని, ప్రజా జీవితంలో ఉండే వ్యక్తిగా విమర్శలను ఎదుర్కోవాలని కోర్టు సూచించింది. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినందుకు గడిచిన ఐదేళ్లలో రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలపై మొత్తం 213 పరువు నష్టం దావాలను తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసింది. ముఖ్యమంత్రి సెలవుల గురించి, నీటి సమస్య గురించి, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎవరేమన్నా అవన్నీ పరువునష్టం కిందే పరిగణించారు. గత రెండు నెలల్లో తమిళనాడు ప్రభుత్వాన్ని పరువునష్టం కేసుల్లో సుప్రీంకోర్టు విమర్శించడం ఇది రెండోసారి. ఇలా కేసులు వేయడం వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అవుతుందని సుప్రీం అప్పట్లో తెలిపింది. ఇలాంటి కేసులతో భయపెట్టి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని జయలలిత అనుకుంటారని ఆరపణలున్నాయి. పరువునష్టం విషయంలో సివిల్, క్రిమినల్ రెండు రకాల విచారణలు జరిగే అతికొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ కేసుల్లో రెండేళ్ల జైలుశిక్ష, లేదా జరిమానా లేదా రెండుశిక్షలూ వేయొచ్చు. తమిళనాడుకు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది ఆరోసారి. -
అమ్మ విజయమే
చెన్నై: నటిగా, పురట్చితలైవిగా, అమ్మగా, తమిళనాట సంచనాలకు మారు పేరుగా, గత చరిత్రను తిరగరాసిన ఘనత అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలితకే దక్కుతుంది. నిర్ణయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీసుకోవడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, ఉపసంహరించుకునే రీతిలో కన్నెర్ర చేసినా రాజకీయంగా ఆమె రూటే సెపరేటు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చేసిన సాహసం, తీసుకున్న నిర్ణయం మళ్లీ అధికార పీఠాన్ని దగ్గరకు చేర్చింది. మరి కాసేపట్లో ఆరోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో సీఎం జయలలిత జీవిత గమనం, సంచనాలు, ప్రత్యేక శైలి గురించి ఓ మారు గుర్తుకు తెచ్చుకుందాం. బాల్యం: 1948 ఫిబ్రవరి 24న మైసూర్లో తమిళ అయ్యంగార్ సంతతికి చెందిన జయరామన్, పాత తరం నటి సంధ్య దంపతులకు జయలలిత జన్మించారు. రెండేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆమె, తదనంతరం తల్లితోపాటుగా స్వస్థలం తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని చర్చ్‌పార్క్ స్కూలులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు స్కూల్ టాపర్‌గా నిలిచారు. ఉన్నత చదువు మీద కన్నా, తల్లిబాటలో సినీ రంగంలో అడుగు పెట్టేందుకు మక్కువ చూపించారు. సినీ రంగం: కథక్, భరతనాట్యం, మోహినీఆట్టం, మణిపురి వంటి నాట్యాలలో ప్రా వీణ్యురాలైన జయలలిత వెన్నిరాడై చిత్రంతో చిత్ర సీమలో అడుగు పెట్టారు. త దుపరి సినీ వినీలాకాశంలో తారగా వెలుగొందారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించారు. అత్యధికంగా దివంగత మాజీ ముఖ్యమం త్రి ఎంజీఆర్‌తో కలసి ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఏ రంగంలోనైనా సరే, తన ప్రత్యేకతను చాటుకునే జయలలిత పది పాటలను సైతం ఆలపిం చడం మరో విశేషం. తొలిసారిగా, అడిమైపెన్ చిత్రంలో అమ్మా ఎండ్రాల్.. అనే చరణంతో మొదలయ్యే పాట ఆలపించగా.. ఈ పాటలోని తొలి అక్షరం. ఇప్పుడు అందరి నోట జయలలితను అమ్మ...అమ్మ అని పిలిపిస్తున్నది. రాజకీయ పయనం: కరుణానిధితో ఏర్పడ్డ విభేదాల కారణంగా డీఎంకేను వీడి వేరు కుంపటి పెట్టిన దివంగత ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)తో ఉన్న సన్నిహితం జయలలిత చూపును రాజకీయాల వైపుగా మరల్చాయి. ఎంజీఆర్ అడుగుజాడల్లో 1981లో అన్నాడీఎంకేలో అడుగు పెట్టిన జయలలిత వెనుదిరిగి చూసుకోలేదు. పార్టీలో చేరగానే, కార్యదర్శి పదవిని దక్కించుకుని, తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జయలలితలోని ధైర్యసాహసాలను గుర్తించిన ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభకు పంపించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆకర్షించే దిశగా జయలలిత ప్రసంగం రాజ్యసభలో సాగిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో కీలకంగా మారిన జయలలిత రాజకీయ గురువుగా భావించే ఎంజీఆర్ మరణంతో సమస్యల్ని, ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ సీఎంగా తెర మీదకు రావడంతో వెన్నంటి ఉన్న నాయకులంతా జయలలితను దాదాపుగా ఒంటరిని చేశారు. అదే సమయంలో జానకీ రామచంద్రన్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం కావడం జయలలితకు కలిసి వచ్చిన అంశం. తదుపరి ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం పతనం కావడం, తనతో పాటుగా పలువురు మాత్రమే అసెంబ్లీ మెట్లు ఎక్కడం జయలలిత హోదాను ఎక్కడికో తీసుకెళ్లింది. దేశంలోనే తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయలలిత అవతరించారు. ప్రజా సమస్యలపై ఆమె సాగించిన సమరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు దోహదకారిగా మారింది. 1991లో జరిగిన ఎన్నికలతో తొలిసారిగా ముఖ్యమంత్రి పగ్గాల్ని చేపట్టారు. వివాదాల గండం: రాజకీయ పయనంలో దూసుకొస్తున్న సమయంలో జయలలితను పలు వి వాదాలు చుట్టుముట్టాయి. ఇందులో అవినీతి, అక్రమ ఆస్తులు వంటి కేసుల్లో జ యలలిత పేరు చేరడం సంచలనమే. టాన్సీ భూముల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడం, తదుపరి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడడం వంటి పరిణామాలతో దేశంలో జైలు శిక్షల్ని ఎదుర్కొన్న సీఎంగా మరో సంచలన వార్తల్లోకి ఎక్కారు. రెండు సార్లు సీఎం పదవిని కోల్పోయి, కేసుల్ని ఎదుర్కొని మళ్లీ పగ్గాలు చేపట్టడంలో జయలలితకు సరి లేరెవ్వరు. ఈ రెండుసార్లు తన నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు. పథకాలు: వివాదాలు చుట్టిముట్టినా, జైలుకు వెళ్లొచ్చినా ప్రజా హితాన్ని కాంక్షించే పథకాల్ని ప్రవేశ పెట్టడంలో జయలలిత దిట్ట. గతంలో ఆమె ప్రవేశ పెట్టిన ఉయ్యాల బేబి పథకం నుంచి నేటి అమ్మ పథకాలన్నీ ప్రజాకర్షణ మంత్రాలే. ఇక రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్లకు పెద్ద పీట వేసిన ఘనతఆమెకే దక్కుతుంది. పేదల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పెట్టిన అమ్మ పథకాలు ప్రస్తుతం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో ఆమెకు కలిసి వచ్చిన అంశం. అధికార పగ్గాలు చేపట్టినప్పుడల్లా మహిళా సాధికారత ధ్యేయంగా ఆమె ప్రవేశ పెట్టే పథకాలు మరో ప్రత్యేకత. అందుకే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా మంత్రాన్ని జపించి మార్కుల్నే కొట్టేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతోనే తన పొత్తు అన్నట్టుగా ముందుకు సాగిన అమ్మకు అన్నీ విజయాలే. వ్యక్తిగతం: ప్రజలే తనకు జీవితం...ప్రజలే తన కుటుంబంగా భావించే జయలలిత పూర్తిగా శాఖాహారాన్ని ఇష్టపడతారు. తల్లి సంధ్య రాజకీయ గురువు ఎంజీఆర్, తన స్కూల్ హెడ్మాస్టర్- టీచర్, భరతనాట్య గురువు అంటే ఎంతో ఇష్టం. అలాగే, న్యాయశాస్త్రం అంటే మక్కువ. పుస్తకాలు అంటే మరెంతో ఇష్టం. అందుకే తన ఇంట్లో ఆమె పెద్ద గ్రంథాలయాన్ని కూడా పెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ఇక, ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ. అలాగే, బద్ధవిరోధి కరుణానిధి. కాగా, జయలలితకు దైవభక్తి ఎక్కువే. మంచి ముహూర్తం చూడందే ఏ పని తలబెట్టరు. ఆలయాల్లో అన్నదానాలు చేయించడం ఎంతో ఇష్టం. అందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో అన్నదాన పథకం అమల్లో ఉన్నదని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఏనుగులు అంటే అమిత ప్రేమ. తాను ఏదేని ఆలయానికి వెళ్లినా అక్కడ ఓ గున్నఏనుగును బహుకరిస్తుంటారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రతి ఏటా ఏనుగుల కోసం పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా: 1989లో తేని జిల్లా బోడినాయకనూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1991లో బర్గూర్, కాంగేయంల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కి సీఎం పగ్గాలు చేపట్టారు. 1996లో బర్గూర్ ఓటర్లు కన్నెర్ర చేయడంతో ఓటమి చవిచూశారు. 2001 ఎన్నికల్లో ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, అరుప్పుకోటైల నుంచి నామినేషన్లు దాఖలు చేసినా, టాన్సీ కేసు చుట్టుముట్టడంతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ కేసు నుంచి బయటకు వచ్చినానంతరం 2002, 2006లలో ఆండిపట్టి నుంచి వరుసగా గెలిచారు. 2011లో తన మకాంను తిరుచ్చి జిల్లా శ్రీరంగంకు మార్చుకున్నారు. ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కినా, అక్రమాస్తుల కేసులతో అర్హతను కోల్పోయారు. ఈ కేసు నుంచి బయటకు వచ్చినానంతరం ఆర్కే నగర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుని రెండుసార్లు విజయ కేతనం ఎగుర వేశారు. -
తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలసి పన్నీరు సెల్వం రాజీనామా లేఖ అందజేశారు. సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం వైదొలిగారు. ఈ రోజు ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. రేపు జయ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు
-
తోట నుంచి కోటలోకి..!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 231 రోజుల పాటు అధికారానికి దూరంగా ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోయస్ గార్డెన్స్ (తోట) నుంచి... మళ్లీ తమిళనాడు అసెంబ్లీ (కోట)లోకి అడుగు పెట్టేందుకు ఆమె ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన మరోసారి ఆమె ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయ అనుంగు అనుచరుడు పన్నీర్ సెల్వం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆయన జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్స్‌కు వెళ్లారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించడంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయారు. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన ఎవరైనా తమ పదవులను కోల్పోతారు. అందుకే ఆమె తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. అయితే.. కర్ణాటక హైకోర్టు మాత్రం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయడంతో.. ఇప్పుడు మళ్లీ ఆమె ఎమ్మెల్యే అయ్యేందుకు, ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. -
జయ కేసు సాగిందిలా..
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టు తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. జయపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు కొట్టివేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా.. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసును ఒకసారి పరిశీలిద్దాం. * 1991 నుంచి 1996 జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులో కేసు ఫైల్ * రూ.66 కోట్లకు పైగా కూడబెట్టిందంటూ నమోదైన ఆ కేసులో డిసెంబర్ 7, 1996న జయ అరెస్ట్ * జయతో పాటు మరో ముగ్గురిపై నమోదైన ఆస్తుల కేసులో 1997 లో సెషన్స్ కోర్టులో కేసు విచారణ *1997 జూన్ 4న 120-బి ఐపీసీ, 13(2), 13(1) సెక్షన్ల కింద చార్జిషీట్ నమోదుకు కోర్టు ఆదేశం *1997లో జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు * ఇదే కేసులో అప్పటి గవర్నర్ ఫాతిమా బీవీపై విచారణకు హైకోర్టు ఆదేశం *2000 సంవత్సరం, ఆగస్టులో 250 సాక్షుల విచారణ *2000 సంవత్సరం ,అక్టోబర్ లో తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల శాఖలో అవినీతికి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు * ఆ కేసులో నమోదైన అభియోగాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు * 2001లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు.. అన్నా డీఎంకేకు పూర్తి మెజారిటీ * జయపై అభియోగాలు ఉండటంతో అంతకుముందు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచి 2002 ఫిబ్రవరి 21న ప్రమాణ స్వీకారం * 2003 లో డీఎంకే జనరల్ సెక్రటరీ కె అన్ బాంజ్ గాన్ ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ చేయాలని పిటిషన్ * జయలలిత సీఎంగా ఉండటంతో ఆ కేసు పక్కదోవ పడుతుందని పిటిషన్ లో ఆరోపణ * అందుకు సుప్రీం అంగీకారం తెలపడంతో కేసు విచారణ కర్ణాటకకు బదిలీ * 2014 సెప్టెంబర్ 27న అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలను దోషులుగా తేల్చిన స్పెషల్ కోర్టు. నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల జరిమానా విధింపు * 2014 సెప్టెంబర్ 29న తీర్పును సవాలుచేస్తూ, బెయిల్ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన జయలలిత * 2014 అక్టోబర్ 7: బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి కారణాలు లేవని స్పష్టీకరణ * 2014 అక్టోబర్ 9: బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయలలిత * 2014 అక్టోబర్ 17: జయలలితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు * 2015 మే 11: అక్రమాస్తుల కేసులో జయలలిత, మరో ముగ్గురు నిర్దోషులంటూ కర్ణాటక హైకోర్టు ప్రకటన -
జయలలిత ఇంటి వద్ద కోలాహల వాతావరణం!
-
'జయలలిత కేసులో అప్పీల్ కు వెళతా'
-
అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు!
-
మళ్లీ తమిళనాడు సీఎంగా జయ?
అక్రమాస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడటంతో ఆమెకు రాజకీయంగా కూడా పెద్ద ఊరట లభించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జైల్లోకి వెళ్లడంతో పాటే.. తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, ముఖ్యమంత్రి పదవికి దూరమైన జయలలిత.. ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత కోసం ఏ క్షణంలోనైనా తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ కోసం ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. ఎట్టకేలకు 'అమ్మ' మళ్లీ ముఖ్యమంత్రి కానుండటంతో.. తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు. -
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
-
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రోశయ్య ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్ సెల్వంతో పాటు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పన్నీర్ సెల్వం భావోద్వేగానికి గురయ్యారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం ఇది రెండోసారి. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. -
తమిళనాడులో దోతినే గెలిచింది.
-
అమ్మ... అమ్మ... అమ్మ... అమ్మ
అమ్మ అమ్మా మాయమ్మ అమ్మంటేనే నీవమ్మా.... అంటూ తమిళ తంబిలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు, పురచ్చితలైవి కుమారి జయలలితను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాది అత్యంత తక్కువ ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పొంగల్ అంటూ ఆమె ప్రారంభించిన 'అమ్మ క్యాంటీన్' పథకం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జయలలిత అదే బాటలో పయనిస్తూ...'అమ్మ కూరగాయల మార్కెట్', 'అమ్మ మినరల్ వాటర్' పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆ పథకాలు తమిళనాట ప్రజలను మరింత దగ్గర చేసింది. దీంతో జయలలిత ఇప్పుడు అమ్మ మెడికల్ షాపులను ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ఈ 'అమ్మ కాన్సెఫ్ట్'తో తమిళనాడు ప్రజల మనసులు 'చోరీ' చేసింది. అమ్మ కాంటీన్ ప్రారంభంతోనే జయలలిత అదృష్టం సునామీలా సుడి తిరిగింది. అందుకే తమిళనాట ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం అవతరించిన తర్వాత ఒక పార్టీ ఇన్ని లోక్‌సభ స్థానాలను జయలలిత కైవసం ఇదే మొదటిసారి. అంత 'అమ్మ' చలవే అని పలువురు అభిప్రాయపడ్డుతున్నారు. అందుకే అమ్మకు తమిళ ప్రజలు ఓట్లు గుద్ది పారేశారు. దేశవ్యాప్తంగా మోడీ హావా నడుస్తున్నా... బీజేపీతో పాటు ఏఐఏడీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ డీఎంకే సోదిలో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకే అమ్మ పథకం వస్తుందో అని తమిళ నాట ప్రజలు అతృతతో ఎదురు చుస్తున్నారు. అమ్మ ఇలా 'అమ్మ' కాన్సెఫ్ట్‌తో ముందుకు దూసుకుపోతే వచ్చే రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఏఐఏడీఏంకే విజయ ఢంకా మోగించడం ఖాయమని తమిళనాట తీవ్రంగా చర్చ జరుగుతుంది.