Tamil Nadu Minister In A Spot After State BJP Chiefs Audio Clip Attack, Details Inside - Sakshi
Sakshi News home page

తమిళనాట డీఎంకే ఫైల్స్‌ కలకలం.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన అన్నామలై

Published Wed, Apr 26 2023 1:38 PM | Last Updated on Wed, Apr 26 2023 2:02 PM

Tamil Nadu Minister In A Spot After State BJP Chiefs Audio Clip Attack - Sakshi

తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్‌లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్‌ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్‌.. హాట్‌ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్‌ని ట్విట్టర్‌లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్‌' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్‌లను ట్వీట్‌ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగ రాజన్‌ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది.

తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్‌ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్‌ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్‌ ఆధారంగా స్టాలిన్‌ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్‌ స్టాలిన్‌, అల్లుడు శబరీశన్‌  30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్‌ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్‌ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్‌ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్‌ల నియమాక విషయమై ఓ ప్రెవేట్‌ కంపెనీ స్టాలిన్‌కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్‌లో ఆరోపణలు వచ్చాయి.

ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్‌గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు.

తన వాయిస్‌తో నేరారోపణ చేసే కంటెంట్‌ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్‌పై ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  

(చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement