Audio clips
-
మొన్న అశ్లీల వీడియో.. నేడు అసభ్యకర ఆడియో!
సాక్షి టాస్‌్కఫోర్స్: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక వేధింపుల వీడియోల ఘటన మరువకముందే.. మరో మహిళతో అసభ్యకర సంభాషణలతో కూడిన ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 5న నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తనను లైంగికంగా వేధించాడని, అందుకు సంబంధించిన వీడియోలతో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఆ ఘటనకు సంబంధించి హైకోర్టులో కేసు జరుగుతుండగానే సంబంధిత మహిళతో రాజీ చేసుకుని కోర్టులో కేసును ఉపసంహరించుకునేలా పావులు కదిపారు. కాగా, రెండు రోజులుగా ఎమ్మెల్యే ఆదిమూలం మరో మహిళతో కామాంధుడిలా మాట్లాడిన మాటలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల ఘటన బయటకొచ్చిన రోజే టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను త్వరలోనే పార్టీ అధిష్టానం ఎత్తేస్తుందని భావిస్తున్న తరుణంలో ఆడియో క్లిప్పులు బయటికి రావడంతో మరోమారు ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం
తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్‌లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్.. హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్‌ని ట్విట్టర్లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్‌లను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్ ఆధారంగా స్టాలిన్ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్ స్టాలిన్, అల్లుడు శబరీశన్ 30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్‌ల నియమాక విషయమై ఓ ప్రెవేట్ కంపెనీ స్టాలిన్‌కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్‌లో ఆరోపణలు వచ్చాయి. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్‌గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వాయిస్‌తో నేరారోపణ చేసే కంటెంట్ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష) -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సెక్స్ కాల్ దుమారం
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ యూట్యూబ్‌లో ఆ ఆడియో క్లిపులను షేర్ చేశారు. దీంతో పాక్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్ ఖాన్ వాయిస్ అనేది ఆరోపణ. విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్ అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్ క్లిప్స్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్ ఖలీద్ పేర్కొన్నారు. ఇక ఆ ఆడియో క్లిప్‌లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కాస్త ఇమ్రాన్ హష్మీ(బాలీవుడ్ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్ ఏషియా కరస్పాండెంట్, జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఎద్దేవా చేశారు. -
‘సృజనా.. తిన్నావారా?’ అవుతుందనుకుంటే..
బాధలను, భావోద్వేగాలను కూడా సోషల్‌మీడియాలో సరదాగా పంచుకుంటున్న రోజులివి. నాలుగేళ్ల కిందట అనుకుంటా.. సృజనా తిన్నావా రా? అంటూ ఓ భగ్న ప్రేమికుడి వాయిస్.. అదీ 27 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో క్లిప్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. నేషనల్ మీడియా సైతం ఆ క్లిప్ గురించి విపరీతంగా చర్చించింది. తాను ఎంతగా ప్రేమించానో ఆ యువతికి వివరిస్తూనే.. తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లగక్కాడు ఆమెపై వెల్లగక్కాడు ఆ ప్రేమికుడు. అయితే అలాంటి ఎమోషన్స్ పంచుతుందనుకుంటే.. వన్షికా-ఆకాశ్ బ్రేకప్ స్టోరీ బెడిసి కొట్టింది. ఈ-కామర్స్ దిగ్గజాలు సైతం తమ ప్రచారం కోసం ఆ క్లిప్ వాడేసుకోవడంతో.. ఇదంతా డ్రామా వ్యవహారంగా కొట్టిపారేస్తున్నారు నెటిజన్స్. ప్రేమ పుట్టడానికి ఎంతో టైం పట్టదు. అలాగే గిట్టడానికి కూడా!. వన్షికా-ఆకాశ్ బ్రేకప్ కహానీ.. ఇంటర్నెట్లో ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతున్న ఆడియో క్లిపులు. గత వారం రోజులుగా.. వీటి మీద వరుసబెట్టి సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. తన బ్రేకప్ బాధను ఓ స్నేహితురాలితో పంచుకునే క్రమంలో.. వన్షికా అనే యువతి కన్నీటి గాథ ఫోన్ కాల్ వీడియో ద్వారా ట్విటర్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. అంతేకాదు.. ఆమె అమాయకత్వం కొందరికి నవ్వులు సైతం పంచుతోంది. తమ ప్రేమ వార్షికోత్సవం(రెండు నెలల ప్రేమ!) వేడుకల జరిపేందుకు తాను ఏమేం కొనుక్కుంది.. ఎలా ప్రిపేర్ అయ్యింది వివరించింది ఆమె. అలాగే.. ఆ ప్రేమ బంధాన్ని ఎలా తెంచుకోవచ్చనేది ఆకాశ్ తనకు ఎలా చెప్పాడనే విషయాన్ని.. వన్షికా తన ఫ్రెండ్‌తో పంచుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. వన్షికా ఆడియో క్లిప్ వైరల్ అయిన వెంటనే ఆమెకు మద్ధతుగా చాలామంది రీట్వీట్లు చేశారు. అదే సమయంలో ట్రోలింగ్ కూడా ఒక రేంజ్‌లోనే నడిచింది. ఇక ఇదే అదనుగా ఈ కామర్స్ సంస్థలు రెచ్చిపోయాయి. నెటిఫ్లిక్స్, మింత్రా,దుంజోలు తమ ప్రచారం కోసం ఆ క్లిప్‌ను వాడేసుకున్నాయి. అయితే ఆపై ఆకాశ్ వాయిస్ ఓవర్‌తో మరో ఆడియో క్లిప్ వైరల్ కావడం గమనార్హం. వన్షికా అతిగా స్పందించిందని, కేవలం రెండు నెలల ప్రేమకు పెళ్లిదాకా వెళ్లిందని, పైగా తన కోసం వేరే వాళ్లను రిజెక్ట్ చేయడం.. కరీనా కపూర్ తరహా ఓవర్ యాక్టింగ్‌లా ఉందంటూ ఎద్దేవా చేశాడు ఆకాశ్. ఈ రెండు నెలలు తనకు నరకం కనిపించిందంటూ వైరాగ్యంగా మాట్లాడాడు కూడా. ఆపై వాటిని ఆ కంపెనీలు వాడుకున్నాయి. Dear Akaash, we think boldest discounts can fix broken hearts 💁🏻♂️❤️🩹#TeamAakash go use ‘MOVINGON’ on AJIO and avail 25% additional discount* on your next date outfits 👀 #RetailTherapy for the win 🌟#AjioBigBoldSale *T&Cs apply https://t.co/ke0AqyCyXH — AJIO (@AJIOLife) December 11, 2022 Not just groceries, we aim to deliver the love of your life too. Help Vanshika find a better partner in the comments! And follow us to know what happens in her life next 😌#vanshika #lovestory #Trending #ViralVideo pic.twitter.com/itriDwWdxQ — Dunzo (@DunzoIt) December 10, 2022 Some of the most beautiful love stories begin with the main character being heartbroken. You got this, Vanshika ❤️ https://t.co/e0rHq1xkp2 — Netflix India (@NetflixIndia) December 9, 2022 Vanshika, if you’re listening, your entire wardrobe is on us. Our sale has started. Help us find you! https://t.co/R9obLnkAU7 — Myntra (@myntra) December 10, 2022 ఏది ఏమైనా.. ఈ జంట బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాకు.. ప్రత్యేకించి నార్త్ పేజీలకు విపరీతమైన స్టఫ్ పంచుతోంది. కానీ, మన వరకే సృజనా తిన్నావారా మాదిరి మాత్రం నెటిజన్లను భావోద్వేగం మాత్రం పంచలేకపోతోంది. ఎందుకనో.. డెప్త్ మిస్సయ్యింది. -
పొలిటికల్ కారిడర్ 17January 2022
-
కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు
కరాచీలో దిగడానికి ప్రయత్నిస్తూ కుప్పకూలిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న కాక్‌పిట్ సంభాషణల వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం పైలట్లలో ఒకరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌రాకపోకలను గమనించే ప్రసిద్ధ వెబ్సైట్ లైవ్ఏటీసీ.నెట్ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్‌లో ఆఖరి నిమిషంలో పైలట్ రెండు ఇంజిన్లు చెడిపోయాయంటూ ఆందోళన చెందారు. తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనేందుకు సంకేతంగా "మేడే, మేడే, మేడే" అనే సందేశాన్నిచ్చారు. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయే కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా ఇబ్బంది ఏర్పడిందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన ఏటీసీ రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని చెప్పినా, పైలట్ (ఎ) గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్. ఖాన్ తెలిపారు. సంభాషణ ఇలా ఉంది పీకే8303 పైలట్: అప్రోచ్ ఏటీసీ: జీ సర్ పైలట్: మేం ఎడమవైపు తిరగాలా? ఏటీసీ: ఒకే (ధృవీకరణ) పైలట్: మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము. ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి? పైలట్: వినిపించడంలేదు. ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది పైలట్: రోజర్ పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303 ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్వేలు అందుబాటులో ఉన్నాయి. అంతే ఇక్కడితో ఆడియో కట్ అయిపోయింది. కొద్దిసేపటి తరువాత, విమానాశ్రయానికి సమీపంలోని జనావాసప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్పా మిగిలిన అందరూ చనిపోయి వుంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ముందు టవర్ ను ఢీకొట్టిన విమానం, తరువాత జనావాసాలపై కూలిపోయింది. చదవండి : ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు? -
భాష ఏదైనా నో ప్రాబ్లం!
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆంగ్లభాషలోని ఓ వీడియో క్లిప్పింగ్ వీక్షిస్తున్నారనుకోండి. ఆ క్లిప్‌లో మాట్లాడుతున్న వ్యక్తి భాష, లిప్‌మూమెంట్ అర్థంకాక తల పట్టుకుంటున్నారా?.. ఇకపై ఆ అవస్థలు తీరనున్నాయి. భాష ఏదైనా, ఆ మాట్లాడే వ్యక్తి భావాన్ని యథాతథంగా తెలుగు ఆడియో క్లిప్ ద్వారా మీకందించే సరికొత్త టూల్‌ను ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ– హైదరాబాద్ (ఐఐఐటీ–హెచ్) రూపొందించింది. మిషన్ లెర్నింగ్ సాంకేతికతలో ఇదో సరికొత్త ఆవిష్కరణ అని ఐఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో క్లిప్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐఐటీ–హెచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డీన్ సీవీ జవహర్ తెలిపారు. లిప్‌గాన్ మాడ్యూల్ డీన్ జవహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్లిష్ భాష నుంచి పలు భారతీయ భాషల్లోకి వివిధ రకాలైన వీడియో క్లిప్‌లను ఈ టూల్ ద్వారా తర్జుమా చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలు, యానిమేషన్, మీడియా రంగాలకు ఈ టూల్ ఉపయుక్తంగా ఉంటుంది. పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్ సింక్రనైజేషన్ మిస్ కాకుండా తర్జుమా చేసుకోవచ్చు. టెక్నాలజీ పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘లిప్‌గాన్ మాడ్యూల్’అంటారు. తర్జుమా అయ్యే భాషకనుగుణంగా ఈ మాడ్యూల్ వీడియో క్లిప్‌లోని వ్యక్తి లిప్ మూమెంట్‌ను సరిచేస్తుంది. కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాల్లో లిప్ మూమెంట్ సరిగ్గా లేక వీడియో క్లిప్ నాణ్యత అంతగా ఉండదు. లిప్‌గాన్ మాడ్యూల్తో అటువంటి అవస్థలుండవు. దీని ద్వారా గంటల నిడివి ఉన్న వీడియోలను సైతం సులభంగా భారతీయ భాషల్లోకి తర్జుమా చేసుకోవచ్చు. ఈ మెషీన్ టూల్‌పై ‘టువార్డ్స్ ఆటోమేటిక్ ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేషన్’పేరుతో పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ మల్టీమీడియా సదస్సులోనూ దీన్ని సమర్పించారు. మరిన్ని పరిశోధనలు, ప్రయోగ పరీక్షల అనంతరం ఈ మిషన్ లెర్నింగ్ సాంకేతికతను ఆయా రంగాలు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతారు. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్‌లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని డాక్టర్ జవాబిచ్చారు. దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్ శివకుమార్ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్‌లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్‌లో డా.శివకుమార్ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్లో డౌన్లోడ్ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్‌ను కమిషన్ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపించారు. 2016, సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతాప్.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
షీనా హత్య కేసులో కీలక విషయాలు
దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్‌ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి. మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్‌కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్‌లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. సంభాషణలో కొన్ని భాగాలు... పీటర్, రాహుల్ సంభాషణలో... షీనా గురించి తన తండ్రిని రాహుల్ అడిగాడు. కానీ తనకేమీ తెలియదని జవాబు ఇచ్చాడు. కానీ షీనా చివరి మెసేజ్ ఇంద్రాణికే పంపించిందని తెలియగానే, ఈ విషయంపై చర్చించడానికి గోవాకు రావాలని రాహుల్‌ను పీటర్ ఆదేశించాడు. షీనా ఎవరికీ చెప్పకుండా ఎటు వెళ్లదు. తను అలాంటి వ్యక్తి కాదు. షీనా కనిపించకుండా పోవడంపై కొంత బాధను రాహుల్ వ్యక్తపరిచాడు. ఎవరికీ టచ్ లేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా యాక్టివ్‌గా లేదు. మరో టేపు సంభాషణ.. షీనా తన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్‌కు కాంటాక్ట్‌లోనే ఉందని రాహుల్‌కు ఇంద్రాణి చెప్పింది. షీనా లీవ్ తీసుకుంటున్నట్టు హెచ్ఆర్ తెలిపినట్టు ఇంద్రాణి రాహుల్‌కు తెలిపింది. కానీ అధికారికంగా రాజీనామా చేయలేదని వెల్లడించింది. షీనా తన సెల్‌ఫోన్‌ను వాడితే తాము కనుక్కుంటామని పోలీసులు వెల్లడించినట్టు కూడా ఇంద్రాణి పేర్కొంది. నీ నుంచి విడిపోవాలని షీనా భావించిదేమో.. డబ్బున్న మరో వ్యక్తి తనకు దొరికాడేమో అని రాహుల్‌ను ఇంద్రాణి ఓదార్చింది.. తన దగ్గర్నుంచి కూడా డబ్బులు రాబట్టుకున్నాక అసలు కాంటాక్టులోనే లేకుండా పోయిందని ఇంద్రాణి నాటకాలు ఆడింది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్లింది. షీనాను మరచిపోవాలని రాహుల్‌కు పీటర్, ఇంద్రాణి సూచించారు. షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్‌కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు. పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్‌కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు.