Viral News: Vanshika And Akaash Breakup Story Is Real, Know Everything - Sakshi
Sakshi News home page

Vanshika-Akash Breakup Story: మరో ‘ సృజనా తిన్నావారా?’ అవుతుందని అనుకుంటే..

Published Tue, Dec 13 2022 12:05 PM | Last Updated on Tue, Dec 13 2022 3:17 PM

Viral News: Vanshika Akaash breakup story Is Real - Sakshi

బాధలను, భావోద్వేగాలను కూడా సోషల్‌మీడియాలో సరదాగా పంచుకుంటున్న రోజులివి. నాలుగేళ్ల కిందట అనుకుంటా.. సృజనా తిన్నావా రా? అంటూ ఓ భగ్న ప్రేమికుడి వాయిస్‌.. అదీ 27 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో క్లిప్‌ తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసింది. నేషనల్‌ మీడియా సైతం ఆ క్లిప్‌ గురించి విపరీతంగా చర్చించింది. తాను ఎంతగా ప్రేమించానో ఆ యువతికి వివరిస్తూనే.. తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లగక్కాడు ఆమెపై వెల్లగక్కాడు ఆ ప్రేమికుడు. అయితే అలాంటి ఎమోషన్స్‌ పంచుతుందనుకుంటే.. వన్షికా-ఆకాశ్‌ బ్రేకప్‌ స్టోరీ బెడిసి కొట్టింది. ఈ-కామర్స్‌ దిగ్గజాలు సైతం తమ ప్రచారం కోసం ఆ క్లిప్‌ వాడేసుకోవడంతో.. ఇదంతా డ్రామా వ్యవహారంగా కొట్టిపారేస్తున్నారు నెటిజన్స్‌.  


ప్రేమ పుట్టడానికి ఎంతో టైం పట్టదు. అలాగే గిట్టడానికి కూడా!. వన్షికా-ఆకాశ్‌ బ్రేకప్‌ కహానీ.. ఇంటర్నెట్‌లో ఈ మధ్య విపరీతంగా వైరల్‌ అవుతున్న ఆడియో క్లిపులు.  గత వారం రోజులుగా.. వీటి మీద వరుసబెట్టి సోషల్‌ మీడియా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. తన బ్రేకప్‌ బాధను ఓ స్నేహితురాలితో పంచుకునే క్రమంలో.. వన్షికా అనే యువతి కన్నీటి గాథ ఫోన్‌ కాల్‌ వీడియో ద్వారా ట్విటర్‌ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. అంతేకాదు.. ఆమె అమాయకత్వం కొందరికి నవ్వులు సైతం పంచుతోంది.

తమ ప్రేమ వార్షికోత్సవం(రెండు నెలల ప్రేమ!) వేడుకల జరిపేందుకు తాను ఏమేం కొనుక్కుంది.. ఎలా ప్రిపేర్‌ అయ్యింది వివరించింది ఆమె. అలాగే.. ఆ ప్రేమ బంధాన్ని ఎలా తెంచుకోవచ్చనేది ఆకాశ్‌ తనకు ఎలా చెప్పాడనే విషయాన్ని.. వన్షికా తన ఫ్రెండ్‌తో పంచుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. వన్షికా ఆడియో క్లిప్‌ వైరల్‌ అయిన వెంటనే ఆమెకు మద్ధతుగా చాలామంది రీట్వీట్లు చేశారు. అదే సమయంలో ట్రోలింగ్‌ కూడా ఒక రేంజ్‌లోనే నడిచింది.

ఇక ఇదే అదనుగా ఈ కామర్స్‌ సంస్థలు రెచ్చిపోయాయి. నెటిఫ్లిక్స్‌, మింత్రా,దుంజోలు తమ ప్రచారం కోసం ఆ క్లిప్‌ను వాడేసుకున్నాయి. అయితే ఆపై ఆకాశ్‌ వాయిస్‌ ఓవర్‌తో మరో ఆడియో క్లిప్‌ వైరల్‌ కావడం గమనార్హం.  వన్షికా అతిగా స్పందించిందని, కేవలం రెండు నెలల ప్రేమకు పెళ్లిదాకా వెళ్లిందని, పైగా తన కోసం వేరే వాళ్లను రిజెక్ట్‌ చేయడం.. కరీనా కపూర్‌ తరహా ఓవర్‌ యాక్టింగ్‌లా ఉందంటూ ఎద్దేవా చేశాడు ఆకాశ్‌. ఈ రెండు నెలలు తనకు నరకం కనిపించిందంటూ వైరాగ్యంగా మాట్లాడాడు కూడా. ఆపై వాటిని ఆ కంపెనీలు వాడుకున్నాయి. 

ఏది ఏమైనా.. ఈ జంట  బ్రేకప్‌ స్టోరీ సోషల్‌ మీడియాకు.. ప్రత్యేకించి నార్త్‌ పేజీలకు విపరీతమైన స్టఫ్‌ పంచుతోంది.  కానీ, మన వరకే సృజనా తిన్నావారా మాదిరి మాత్రం నెటిజన్లను భావోద్వేగం మాత్రం పంచలేకపోతోంది. ఎందుకనో.. డెప్త్‌ మిస్సయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement