
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆడియో క్లిప్పుల కలకలం
సాక్షి టాస్‌్కఫోర్స్: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక వేధింపుల వీడియోల ఘటన మరువకముందే.. మరో మహిళతో అసభ్యకర సంభాషణలతో కూడిన ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 5న నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తనను లైంగికంగా వేధించాడని, అందుకు సంబంధించిన వీడియోలతో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆ ఘటనకు సంబంధించి హైకోర్టులో కేసు జరుగుతుండగానే సంబంధిత మహిళతో రాజీ చేసుకుని కోర్టులో కేసును ఉపసంహరించుకునేలా పావులు కదిపారు. కాగా, రెండు రోజులుగా ఎమ్మెల్యే ఆదిమూలం మరో మహిళతో కామాంధుడిలా మాట్లాడిన మాటలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల ఘటన బయటకొచ్చిన రోజే టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను త్వరలోనే పార్టీ అధిష్టానం ఎత్తేస్తుందని భావిస్తున్న తరుణంలో ఆడియో క్లిప్పులు బయటికి రావడంతో మరోమారు ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.