Annamalai
-
అన్నామలైకే మళ్లీ ఛాన్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైకు మళ్లీ ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రంలో తుది దశకు చేరిన విషయం తెలిసిందే. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధిష్టానం ఆమోదంతో జాబితా వెలువడాల్సి ఉంది. ఆ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవుల ప్రక్రియ సాగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విస్తృతంగాఅ న్నామలై పర్యటిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేతో వైర్యం పెట్టుకోవడం ఇతర బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారంలో సీనియర్ నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఈనెల 17వ తేది జరగబోతోంది. అధ్యక్ష ఎంపికకు నియంచిన కమిటీ బాధ్యతల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఈసారి అధ్యక్ష పదవి రేసులో మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ సైతం రేసులో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే వారు సుముఖంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతం దిశగా అన్నామలై పరుగులు తీస్తుండడం, అధిష్టానం మద్దతు పాటూ రాష్ట్రంలో కేడర్ అంతా ఆయన వైపు చూస్తుండడంతో మరోమారు అన్నామలై అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయం అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG— ANI (@ANI) December 26, 2024 ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి.. -
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.ఏదైనా జరగొచ్చు..అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.బలమైన కూటమి ఏర్పాటు చేస్తాంఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.ఈసారి అటువంటి పొరపాటు చేయంలోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు. -
రాజకీయాల కన్నా.. ఉద్యోగమే మిన్న
సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్‌సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకో సమస్య.. తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది కనిపెట్టేయవచ్చ అని అన్నారు. చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘అన్నామలై’కు మంత్రి పదవి దక్కేనా?
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్రంలో మంత్రి పదవి దక్కేనా అన్న చర్చ ఊపందుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి అన్నామలై కీలక పాత్రనే పోషించారు. గతంలో 3 శాతం మేరకు ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్‌ను తాజా ఎన్నికల ద్వారా 11 శాతానికి చేర్చారు. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో తమిళనాడులో బలమైన కూటమి ఏర్పాటు చేశారు. అయితే, డీఎంకే కూటమి హవా ముందు అందరూ ఓటమి పాలయ్యారు. ఓడినా తమిళనాడులో తమ బలం పెరిగిందన్న ధీమా బీజేపీ వర్గాల్లో నెలకొంది. ఇదే విషయాన్ని శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రకటించారు. తమిళనాడులో బలం పెరిగిందని, రాబోయే రోజుల్లో పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ బలోపేతంలో అన్నామలై పనితీరు ప్రధాన కారణం అన్న విషయాన్ని ఇప్పటికే బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈదృష్ట్యా, కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కేనా? అని ఆయన మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ మురుగన్‌కు కొత్త ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించారు. ఇదే తరహాలో ప్రస్తుతం పార్టీ బలోపేతానికి వీరోచితంగా శ్రమించిన, శ్రమిస్తున్న అన్నామలైకు కేంద్రంలో గుర్తింపు కల్పించేలా మంత్రి పదవి కేటాయించేనా అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో అన్నామలై వ్యాఖ్యల తీరుతోనే అన్నాడీఎంకేకు దూరమయ్యామని, కలిసి కట్టుగా పోటీచేసి ఉంటే కనీస స్థానాలలో విజయకేతనం ఎగుర వేసి ఉంటామని పలువురు బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్‌గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు
చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకేలు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో పోలింగ్‌లో భాగంగా అన్నామలై కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే నుంచి గణపతి పి.రాజ్‌కుమార్, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులో బీజేపీ వ్యక్తి తమను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఒక్కరినైనా తీసుకురాగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నామలై సవాలు విసిరారు. బీజేపీ సొంతంగా 25 శాతం దాటుతుందని, సీట్ల సంఖ్య కూడా రెండంకెల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఈ రోజు నేను నా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించాను. దేశంలోని ప్రతి పౌరునికి ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో పనిచేసే ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ పౌరులు ప్రజాస్వామ్యాన్ని పని చేసేలా చేస్తారు. మంచి వ్యక్తులు, పాలనపై ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చూపిస్తారని మాకు నమ్మకం ఉంది. తమిళనాడు ప్రజలు చరిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతారు” అని అన్నామలై పేర్కొన్నారు. -
TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్ లేదు: అన్నామలై
చెన్నై:తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్‌కుమార్‌ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్‌ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
TN: అన్నామలైపై దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఒక జోకర్ అని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ‘అన్నామలై ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీట్ పరీక్షను వ్యతిరేకించాడు. ఇప్పుడు నీట్‌ను సమర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన తనకు హిందీ రాదన్నాడు. ఇప్పుడేమో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్నామలై లాంటి వాడు కావాలి. అతను మంచి వినోదం పంచే వ్యక్తి. ప్లీజ్ అన్నామలై కంటిన్యూ’ అని మారన్ ఎద్దేవా చేశారు. కాగా, అన్నామలైని ఉద్దేశించి ఇటీవల దయానిధి మారన్ ఓ నేషనల్ టీవీలో చేసిన జోకర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం గమనార్హం. అన్నామలైపై మారన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే క్యారెక్టర్‌ను తెలియజేస్తున్నాయని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని ఈ గ్యారెంటీలు ఇవ్వగలరా.. మోదీకి స్టాలిన్ సవాల్ -
అన్నామలై Vs కమల్: తమిళనాట రసవత్తర రాజకీయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్‌పూర్‌కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur. Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC — Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024 కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్‌పూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
దేశ ప్రధానులు వాళ్లే.. బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు..
వేసవి హీట్‌తో పాటు దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాడీవేడి రాజకీయం నడుస్తోంది. ఎలక్షన్ సమయం కాబట్టి ఒక పార్టీ నేత మరో పార్టీ నేతపై విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జనరేషన్. ఏ మూలకు చీమ చిట్టుకుమన్నా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దీంతో, సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !! And another BJP leader from South says Mahatma Gandhi was our PM !! Where did all these people graduate from? 😁 — KTR (@KTRBRS) April 5, 2024 ఇక, ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రౌత్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశ మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఈ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ వీరంతా ఎక్కడ చదువుకున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. Whatsapp University students😁👇 Subhash Chandra Bose was the first Prime Minister of India - BJP candidate Kangana Ranaut. Mahatma Gandhi was out Prime Minister - BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez — Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024 -
కచ్ఛాతీవు రగడ.. భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. దేశ భద్రత ఏమాతం పట్టించుకోకుండా, స్పృహలేకుండా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దీంతో మరోసారి కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం తెరమీదికి వచ్చింది. తాజాగా కచ్ఛాతీవు ద్వీపం విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహార్‌లాల్ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విమర్శలు చేశారు.కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ మీడియాతో మాట్లాడారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించి 1974లో పార్లమెంట్లో మాజీ కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి స్వరణ్ సింగ్ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘స్వేచ్ఛ, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో ఇరుదేశాల మధ్య మత్స్యకారుల వేట, నేవిగేషన్ హక్కులను పొందినట్లుగానే భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సమానంగా పొందుతాయి’అని అప్పటి కేంద్రమంత్రి చెప్పినట్లు జైశంకర్ మీడియాకు వివరించారు. ఇలా జరిగిన రెండు ఏళ్లలో అప్పటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీలకం సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య 1974 ఈ ఒప్పందం జరిగితే.. 1976లో అమల్లోకి వచ్చిందన్నారు. అప్పుడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6184 భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారు. 1175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్ చేశారని జైశంకర్ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదేవిషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాదానం ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదని.. ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక.. కచ్ఛాతీవు ద్వీపం ఒప్పందానికి సంబంధించిన వివరాల కోసం తమిళాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ పిటిషన్ వేయటంతో దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ కాంగ్రెస్ విమర్శలు చేయటంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి విమర్శలుపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకొని 111ప్రాంతాలు బంగ్లాకు,55 ప్రాంతాలు భారత్‌త్ పరస్పరం బదిలీ చేసుకున్న విషయం మర్చి పోయాయా? 1974లో జరిగింది కూడా అచ్చం అలాంటి ఒప్పందమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎమిటీ కచ్ఛాతీవు కథాకమామిషు? కచ్ఛాతీవు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఉన్న 163 ఎకరాల అతి చిన్న ద్వీపం. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా ఆధీనంలో ఉండేది. బ్రిటిష్‌వారి రాకతో శ్రీలంక, భారత్ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్రం పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగటంతో అది తమదంటే తమదని శ్రీలంక, భారత్ ప్రకటించుకున్నాయి. చదవండి: కచ్ఛాతీవు ద్వీపం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు -
TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్ 28)రాత్రి కరూర్‌లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో కరూర్ నుంచి పోటీ చేశారు. సెంథిల్ బాలాజీ భయంతోనే ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు. గతంలో కరూర్ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ రాజీనామా -
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్‌పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్ రాజు మిమ్మల్ని కమల్ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత స్థాయి. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా ప్రకటనలో చైనా జెండా ముద్రించటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
సీఎం ఎంకే స్టాలిన్‌కు ఆ అధికారంలేదు : అన్నమలై
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 'సీఏఏ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు అధికారాలు లేవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. స్టాలిన్ రాజకీయంగా సీఏఏని వ్యతిరేకించినప్పటికీ, తమిళనాడులో కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి వ్యతిరేకంగా అతను అధికారికంగా తీసుకోలేరు. సీఏఏ సంబంధిత నిబంధనలను అమలు చేయకూడదని నిర్ణయించే రాజ్యాంగం ప్రకారం అతనికి ఎటువంటి అధికారం లేదని అన్నామలై నొక్కిచెప్పారు. కీలక వ్యాఖ్యలు పౌరసత్వ (సవరణ) చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాన్ని అమలు చేయదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘సిఏఏ అనవసరం. రద్దు చేయాలి. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయడానికి మేము ఏ విధంగానూ అనుమతించము. భారతదేశాన్ని ప్రభావితం చేసే ఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చోటు ఇవ్వదని నేను తమిళనాడు ప్రజలకు స్పష్టం చేస్తున్నాను అని తెలిపారు. -
రవిశంకర్ గురూజీని కలిసిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ - ఫోటోలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కోసం బీజేపీ నాకు కొంత బాధ్యతను అప్పగించిందని, తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అన్నామలై కోయంబత్తూరులో గురుదేవ్ రవిశంకర్ ఆశీస్సులు పొందే అవకాశం లభించిందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. కోయంబత్తూరులో ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ హోలిస్టిక్ సొసైటీ' కోసం గురుదేవ్ చొరవ చాలా ముఖ్యమైందని అన్నారు. గురుదేవ్ రవిశంకర్ గురూజీని అన్నామలై కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గురూజీ అన్నామలైను సత్కరించడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. It was a divine morning to have had the opportunity to seek the blessings of Gurudev Sri Sri Ravi Shankar avl in Coimbatore today. Gurudev’s initiative for a ‘Drug-Free India for a holistic society’ in Coimbatore comes at a very important & appropriate time! pic.twitter.com/BYJ2OARdAr — K.Annamalai (@annamalai_k) March 3, 2024 -
అమ్మ ఒడి ‘హాయిగా’... గున్న ఏనుగు సాక్షిగా..!
చెన్నై: తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో తప్పిపోయిన గున్న ఏనుగును తల్లి చెంతకు చేర్చారు. తల్లిని కలిసిన అనంతరం చిన్న ఏనుగు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది. ఈ దృశ్యాలను అటవీ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు సోషల్ మీడియాలో పంచుకోగా.. విశేష స్పందనలు వచ్చాయి. గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చినందుకు అటవీ అధికారులకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. అటవీ సిబ్బందికి నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల్లోనైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని కొనియాడారు. When a picture is worth a million words ❤️ the rescued baby elephant after uniting with the mother takes an afternoon nap in her mother's comforting arms before moving again with the big herd. Picture taken by Forest field staff somewhere in Anamalai Tiger reserve who are keeping… https://t.co/EedfkKjLHj pic.twitter.com/ttqafSudyM — Supriya Sahu IAS (@supriyasahuias) January 2, 2024 ఇదీ చదవండి: Ram Mandir: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
'బీజేపీతో, అన్నాడీఎంకే పొత్తు ఉండదు'
చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్ సోమవారం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..