చెన్నై:తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి.. పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment