చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిషృత నేలను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే ఎఎమ్‌ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో బీజేపీ అగ్రనేతలు సీట్‌షేరింగ్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతు మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన గతంలో ఏఐడీఎంకే అగ్ర నేతగా వ్యవహరించిన శశికలకు మేనల్లుడు. ఇక పన్నీర్ సెల్వంతో బీజేపీ సీట్‌షేరింగ్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు.
మరోపక్క అధికార డీఎంకే, కాంగ్రెస్, కమలహాసన్ పార్టీ, వైకో తదతరులు కలిసి ఇండియా కూటమి గొడుగు కింద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి అన్నామలై సారథ్యంలోని బీజేపీ గట్టిపోటీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీఎం మోదీ నిర్వహించిన సభలకు కూడా ఇక్కడ మంచి స్పందన రావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల రేసులో బీజేపీ కంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment