చెన్నై: తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సమాన హక్కులు లేవని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే గాయత్రిని గతేడాది నవంబర్‌లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నమళై. ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆమెను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని చెప్పారు. దీంతో రెండు నెలల తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. అనంతరం వరుస ట్వీట్లు చేశారు.
హిందూ ధర్మం నా హృదయం, మనస్సాక్షిలో ఉంది. ఓ రాజకీయ పార్టీలో దీని కోసం వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. దీనికి బదులు గుడికి వెళ్లి దేవుడు, ధర్మం కోసం అన్వేషిస్తాన. భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. నాతోనూ ఉన్నాడు. న్యాయం ఆలస్యం చేస్తే, న్యాయాన్ని నిరాకరించినట్లే. అని గాయత్రి ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
చదవండి: ప్రజాప్రతినిధుల భావప్రకటన స్వేచ్ఛ.. కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment