Respect for Women
-
మహిళల పట్ల సున్నితత్వంతో మెలగాలి: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని మన రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. నవభారత్ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆల్ వుమెన్ బైక్ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపారు. ‘మహిళలను గురించి ప్రతి పౌరుడు గౌరవప్రదంగా ఆలోచించాలి. మహిళల పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తనకు పునాది కుటుంబమే. తల్లులు, సోదరీమణులు తమ కొడుకులు, సోదరుల్లో మహిళలకు గౌరవం ఇచ్చే విలువలను పెంపొందించాలి. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని, సున్నితత్వంగా మెలిగే సంస్కృతిని ఉపాధ్యాయులు పెంపొందించాలి’అని ద్రౌపదీ ముర్ము కోరారు. ‘మహిళల్లో మాతృత్వ సామర్ధ్యం, నాయకత్వ సామర్ధ్యం సహజంగానే ఉంటాయి. అనేక పరిమితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మహిళలు తమ అసమానమైన ధైర్యం, నైపుణ్యాలతో కొత్త విజయ రికార్డులను నెలకొల్పారు’అని ఆమె పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై..
చెన్నై: తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సమాన హక్కులు లేవని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గాయత్రిని గతేడాది నవంబర్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నమళై. ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆమెను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని చెప్పారు. దీంతో రెండు నెలల తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. అనంతరం వరుస ట్వీట్లు చేశారు. హిందూ ధర్మం నా హృదయం, మనస్సాక్షిలో ఉంది. ఓ రాజకీయ పార్టీలో దీని కోసం వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. దీనికి బదులు గుడికి వెళ్లి దేవుడు, ధర్మం కోసం అన్వేషిస్తాన. భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. నాతోనూ ఉన్నాడు. న్యాయం ఆలస్యం చేస్తే, న్యాయాన్ని నిరాకరించినట్లే. అని గాయత్రి ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రజాప్రతినిధుల భావప్రకటన స్వేచ్ఛ.. కీలక తీర్పు -
మహిళలంటే ఇదేనా గౌరవం?
విజయనగరం కంటోన్మెంట్ : వారంతా మధ్య తరగతి కుటుంబాల మహిళలు. తమ ప్రాంతంలో జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు కావడంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రోజురోజుకూ ఎక్కువవుతున్న మందుబాబుల ఆగడాలు భరించలేకపోయారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం వల్ల మహిళలతోపాటు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల మంత్రి కిమిడి మృణాళినిని కలసి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ దుకాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని వేడుకున్నారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. మద్యం దుకాణాన్ని మరో చోటకు తరలిస్తామని, కొద్ది రోజులు సమయమివ్వండని వారికి నచ్చజెప్పారు. మంత్రి కూడా ఓ మహిళే కదా.. తోటి మహిళల ఆవేదనను అర్థం చేసుకుంటారులే అనుకుని వారంతా ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇప్పుడా ఆ దుకాణం తొలగించలేదు సరికదా.. ఏకంగా మరింత లోపలికి వచ్చింది. ‘ఇది మీకు న్యాయమా? మీరూ ఒక మహిళే కదా.. మహిళల సమస్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద’ని నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌లోని మహిళలు మంత్రి కిమిడి మృణాళినిని ప్రశ్నిస్తున్నారు. మరోమారు కలెక్టరేట్‌కు వచ్చిన మహిళలు గురువారం నెల్లిమర్లలోని రామతీర్థం జంక్షన్‌కు చెందిన మహిళలంతా మరోమారు కలెక్టరేట్‌కు వచ్చారు. ఎంపీటీసీ పి.మహాలక్ష్మి, రత్నకుమారిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఎక్సైజ్ డీసీని కలిసేందుకు వచ్చారు. స్థానిక విలేకరుల ఎదుట కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఉసిరికల వైన్స్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని, మద్యం సేవించిన వారి అసభ్య ప్రవర్తనలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాపోయారు. ఈ ప్రాంతంలో గుట్టుగా జీవిస్తున్న మహిళలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో ఆందోళనలు చేస్తే కాస్త సమయమడిగారని, మరింత సమస్యలు ఎక్కువయ్యే ప్రాంతంలో ఇప్పుడు దుకాణం ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. టీడీపీకి చెందినవారి దుకాణమనా వివక్ష? కాగా, మహిళలంతా ఇప్పటికే రెండు సార్లు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఓ సారి ధర్నా కూడా చేశారు. అయినా ఎటువంటి ఫలితమూ దక్కలేదు. అసలు ఈ దుకాణం కొండవెలగాడకు మంజూరయితే(షాపు నెం:67) ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆ దుకాణం తెలుగు దేశం పార్టీ నాయకులకు చెందినది కావడంతోనే మంత్రి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. షాపు మెయిన్రోడ్లోని జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టారని, దీని వల్ల ప్రమాదాలు కూడా జరిగే వీలుందని చెబుతున్నారు. మంత్రి, కలెక్టర్లకు మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. ఈ షాపును వేరే చోటకు తరలించాలని కోరుతున్నారు.