resign from the BJP
-
కర్ణాటక బీజేపీలో ముసలం
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం తన రాజీనామా ప్రకటించారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఆత్మగౌవరం ఉన్న రాజకీయ నేతను. టికెట్ కోసం గిన్నె పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి అడుక్కోలేను. ఎవరి ప్రభావం నా మీద లేదు. నా నిర్ణయం నేనే తీసుకున్నా అంటూ లక్ష్మణ్ సవాదీ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇక ఆయన కాంగ్రెస్‌లోకి మారతారనే ప్రచారం ఊపందుకోగా.. కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ స్పందించారు. ఆయన(లక్ష్మణ్) మాతో టచ్‌లో లేడు. ఆయనతో మేం మాట్లాడనూ లేదు అని శివకుమార్ తెలిపారు. లక్ష్మణ్ సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 2012లో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడి.. వివాదంలో చిక్కుకున్నారాయన. మరోవైపు బీజేపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. టికెట్లు రావనే పార్టీ అధిష్టానం స్పష్టత నడుమ.. మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. అలాగే.. మాజీ సీఎం జగదీస్ షెట్టర్‌కు ఊహించినట్లుగానే మొదటి లిస్ట్‌లో చోటు దక్కకపోగా.. ఆయన సైతం వ్యతిరేక గళం వినిపించారు. రెండో లిస్ట్‌లో చోటు దక్కకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్తానంటూ ప్రకటించారాయన. ఇదే బాటలో మరో 30 మంది నేతలు ఉన్నట్లు సమాచారం. -
'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై..
చెన్నై: తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సమాన హక్కులు లేవని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గాయత్రిని గతేడాది నవంబర్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నమళై. ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆమెను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని చెప్పారు. దీంతో రెండు నెలల తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. అనంతరం వరుస ట్వీట్లు చేశారు. హిందూ ధర్మం నా హృదయం, మనస్సాక్షిలో ఉంది. ఓ రాజకీయ పార్టీలో దీని కోసం వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. దీనికి బదులు గుడికి వెళ్లి దేవుడు, ధర్మం కోసం అన్వేషిస్తాన. భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. నాతోనూ ఉన్నాడు. న్యాయం ఆలస్యం చేస్తే, న్యాయాన్ని నిరాకరించినట్లే. అని గాయత్రి ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రజాప్రతినిధుల భావప్రకటన స్వేచ్ఛ.. కీలక తీర్పు -
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
-
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
న్యూఢిల్లీః గత రెండు నెలలుగా నలుగుతున్నవివాదానికి నేటితో తెర పడింది. బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు ఎట్టకేలకు బీజేపీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. జూలైలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారంటూ వచ్చిన వార్తలకు స్వస్తి పలుకుతూ.. వారం క్రితం సొంతగా ఆవాజ్-ఇ-పంజాబ్ పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు బుధవారం ఢిల్లీలో తన బీజేపీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు ఛత్తీస్ గఢ్ లో వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ సభ్యురాలుగా కొనసాగుతున్న ఆమె.. సిద్ధు పార్టీ స్థాపన అనంతరం తానూ బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. 52 ఏళ్ళ నవజోత్ సింగ్ సిద్ధు గతవారం తాను కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో.. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. అన్నదానికల్లా తల ఊపేవారికే కేజ్రీవాల్ తన పార్టీలో చోటిస్తారన్నారు. అంతేకాక తనను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో పోటీ చేయద్దని ఆయన కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం స్థాపించనున్న తన కొత్త పార్టీకి పంజాబ్ లో సిద్ధూనే ముఖ్యమంత్రి అభ్యర్థి కానుండటంతోపాటు.. తనతో కలసి నడిచేవారికి ఆహ్వానం కూడా పలుకుతున్నారు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీనే కాక, కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ కూడా తమ పార్టీలోకి రమ్మంటూ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 12 ఏళ్ళపాటు బీజేపీలో కొనసాగిన సిద్ధూ.. జూలై నెల్లో రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీకి నోటీసులు అందించారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అభ్యంతరం తెలిపిన అనంతరం.. సిద్ధూ పార్టీలో అన్యమనస్కంగానే కొనసాగుతున్నారు. అయితే బీజేపీ సభ్యులు మాత్రం సిద్ధూ నిర్ణయం పార్టీకి వెన్నుపోటు చర్యగా అభివర్ణిస్తున్నారు.