
చెన్నై: అటు బీజేపీ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది.
గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది.
ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.
For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk
— K.Annamalai (@annamalai_k) February 21, 2025
ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు.
కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment