సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్‌స్టార్‌లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు.
‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది.
.. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు.
#WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY
— ANI (@ANI) December 24, 2024
ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ను ఆనాడు అడ్డుకుని ఉంటే..
Comments
Please login to add a commentAdd a comment