అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన | Wont Wear Footwear Till: Tamil Nadu BJP Chief Big Promise For 2026 Polls | Sakshi
Sakshi News home page

అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

Published Thu, Dec 26 2024 8:12 PM | Last Updated on Thu, Dec 26 2024 8:26 PM

Wont Wear Footwear Till: Tamil Nadu BJP Chief Big Promise For 2026 Polls

చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.

డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.

కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

 

 

ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement