సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్‌పూర్‌కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur.
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024
Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC
కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్‌ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్‌పూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment