
కోయంబత్తూర్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.
ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.

‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.
Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR
— ANI (@ANI) April 4, 2025