
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఒక జోకర్ అని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.
‘అన్నామలై ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీట్ పరీక్షను వ్యతిరేకించాడు. ఇప్పుడు నీట్‌ను సమర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన తనకు హిందీ రాదన్నాడు. ఇప్పుడేమో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్నామలై లాంటి వాడు కావాలి. అతను మంచి వినోదం పంచే వ్యక్తి. ప్లీజ్ అన్నామలై కంటిన్యూ’ అని మారన్ ఎద్దేవా చేశారు.
కాగా, అన్నామలైని ఉద్దేశించి ఇటీవల దయానిధి మారన్ ఓ నేషనల్ టీవీలో చేసిన జోకర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం గమనార్హం. అన్నామలైపై మారన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే క్యారెక్టర్‌ను తెలియజేస్తున్నాయని ప్రధాని అన్నారు.
ఇదీ చదవండి.. ప్రధాని ఈ గ్యారెంటీలు ఇవ్వగలరా.. మోదీకి స్టాలిన్ సవాల్