Dayanidhi Maran
-
స్పీకర్Vsమారన్.. లోక్‌సభలో వివాదం
న్యూఢిల్లీ:లోక్‌సభ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై డీఎంకే ఎంపీ దయానిధిమారన్ అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో దయానిధి మాట్లాడారు.‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారని తేలింది.సంస్కృతం ఎవరికీ అర్థం కాదు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలంతో చేస్తున్న పని. సంస్కృతంలోకి అనువదించడం వల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృథా అవుతున్నాయి’అని మారన్ వ్యాఖ్యానించారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా స్పందించారు. మారన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.‘క్‌సభలో కేవలం సంస్కృతమే కాదు హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావడం లేదు’అని మారన్‌ను ఉద్దేశించి స్పీకర్ అన్నారు.స్పీకర్ మాట్లాడుతుండగా డీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
TN: అన్నామలైపై దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఒక జోకర్ అని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ‘అన్నామలై ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీట్ పరీక్షను వ్యతిరేకించాడు. ఇప్పుడు నీట్‌ను సమర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన తనకు హిందీ రాదన్నాడు. ఇప్పుడేమో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్నామలై లాంటి వాడు కావాలి. అతను మంచి వినోదం పంచే వ్యక్తి. ప్లీజ్ అన్నామలై కంటిన్యూ’ అని మారన్ ఎద్దేవా చేశారు. కాగా, అన్నామలైని ఉద్దేశించి ఇటీవల దయానిధి మారన్ ఓ నేషనల్ టీవీలో చేసిన జోకర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం గమనార్హం. అన్నామలైపై మారన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే క్యారెక్టర్‌ను తెలియజేస్తున్నాయని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని ఈ గ్యారెంటీలు ఇవ్వగలరా.. మోదీకి స్టాలిన్ సవాల్ -
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్‌తో రూ.లక్ష మాయం..
టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్‌తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్‌కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది. తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు. మాజీ టెలికాం మంత్రి.. దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, డెల్‌తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
బీజేపీకి ఓటేయలేదని మాపై కేంద్రం వివక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి ఓటేయలేదని తమిళ ప్రజలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మండిపడ్డారు. తీవ్ర నీటి ఎద్దడితో తమిళనాడు గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన మారన్... కావేరీ జలవివాదం విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందీ, నీట్ వంటి అంశాలను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం వల్లే తమిళులు బీజేపీని తిరస్కరించారన్నారు. -
కంచుకోటలో ‘సూర్యుడు’ ఉదయించేనా?
తమిళనాడు రాజధాని చెన్నై ప్రతిపక్ష డీఎంకేకు మొదటి నుంచీ కంచుకోట. నగరం పరిధిలోని చెన్నై సెంట్రల్ నియోజకవర్గం 1977లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2014 వరకూ జరిగిన 11 ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు విజయం సాధించింది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత ప్రభంజనంలో ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థి ఎస్సార్ విజయ్‌కుమార్ తన సమీప డీఎంకే అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ను ఓడించారు. అంతకు ముందు వరుసగా రెండుసార్లు దయానిధి డీఎంకే టికెట్‌పై ఎన్నికై యూపీఏ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. డీఎంకే నేత, మాజీ సీఎం ఎం.కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ చిన్న కొడుకు దయానిధి. మురసోలి మారన్ ఇదే నియోజకవర్గం నుంచి 1996, 98, 99 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. నగరంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు చెన్నై సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ స్థానంలో 13, 32, 135 మంది ఓటర్లు ఉన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ లోక్ నియోజకవర్గంలో ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలతో పాటు చెపాక్–తిరువల్లికేని, ఎగ్మోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లక్షల మందికి పైగా ముస్లిం జనాభా ఉంది. తెలుగువారు, మలయాళీలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అన్నానగర్ వంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పాటు పక్కనే జీహెచ్ క్వార్టర్స్ వంటి మురికివాడలు ఉన్న నియోజకవర్గం ఇది. మళ్లీ డీఎంకే చేతికి చిక్కేనా? మధ్య చెన్నై సీటు డీఎంకేకు గతంలో కంచుకోటగా పేరున్నా ఈ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమీప బంధువైన దయానిధి మారన్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘చెన్నై సెంట్రల్లో డీఎంకేకు నల్లేరుపై నడకే. కాని, 2014లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్సార్ విజయ్‌కుమార్ గెలిచాక పరిస్థితి మారిపోయింది’ అని తమిళ రాజకీయ విశ్లేషకుడు సీఎస్ కోటీశ్వరన్ అభిప్రాయపడ్డారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పాలక ఏఐఏడీఎంకే కూటమి తరఫున పీఎంకే అభ్యర్థి ఎస్ఆర్ శామ్ పాల్ పోటీ చేస్తున్నారు. కరుణానిధి సమీప బంధువైన దయానిధి మన్మోహన్సింగ్ కేబినెట్లో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఆయన అన్న కళానిధి మారన్ ఆసియాలోనే అతిపెద్ద టీవీ నెట్వర్క్ సన్ గ్రూప్ అధిపతి. జయలలిత మరణానంతరం డీఎంకేకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఇక్కడ దయానిధి మారన్ గెలుపు ఖాయమని యూపీఏ భావిస్తోంది. బరిలో ముస్లింల పార్టీ అభ్యర్థి ముస్లింలలో పలుకుబడి ఉన్న సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కేకేఎస్‌ఎస్‌ఎం దెహ్లాన్ బకావీని ఇక్కడ నిలబెట్టింది. సినీ నటుడు కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) అభ్యర్థిగా కమీలా నాసర్ పోటీచేస్తున్నారు. కానీ, పోటీ ప్రధానంగా దయానిధి మారన్, శామ్ పాల్ మధ్యనే ఉంటుంది. పీఎంకే అభ్యర్థిగా వ్యాపారి పాల్ ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి తరఫున వన్నియార్ల పార్టీగా అందరికీ తెలిసిన పీఎంకే పోటీ చేస్తోంది. పీఎంకేకు నగరంలో చెప్పుకోదగ్గ బలం లేకున్నా అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడింది. పీఎంకే అభ్యర్థి శామ్ పాల్ మైనారిటీ మతానికి చెందిన ధనిక వ్యాపారి. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అయితే, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన చెబుతున్నారు. మురికివాడల ప్రజల సంక్షేమానికి పాటుపడతానని, నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తానని పాల్ హామీ ఇస్తున్నారు. గణనీయ సంఖ్యలో ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల మద్దతు తమ కూటమికే ఉందని ఆయన ప్రకటించారు. అవినీతిపరుడుకాని అందుబాటులో ఉండే నాయకుడినే మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారన్న ధీమా పాల్ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు.. ►3,33,296 ఎస్సార్ విజయకుమార్ (ఏఐఏడీఎంకే) ►2,87,455దయానిధి మారన్(డీఎంకే) ►1,14,798కాన్స్టాంటిన్ రవీంద్రన్ (డీఎండీకే) ►25,981సీడీ మెయ్యప్పన్(కాంగ్రెస్) ►45,841విజయ్‌కుమార్ మెజారిటీ -
మారన్ సోదరులకు సుప్రీం షాక్..
సాక్షి, చెన్నై : అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్లు విచారణను ఎదుర్కోవాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ కేసులో మారన్ సోదరులను సీబీఐ తప్పించడాన్ని తోసిపుచ్చుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. మీ సోదరుల టీవీ ఛానెల్‌కు మీరు సహకరించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని కేసు నుంచి తప్పించాలన్న దయానిధి మారన్ అప్పీల్‌ను సుప్రీం తిరస్కరించింది. సన్ గ్రూప్ సారధులైన మారన్ సోదరులపై 12 వారాల్లోగా అభియోగాలు నమోదు చేయాలని గత వారం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మారన్ సోదరులతో పాటు ఇతరులను ఈ ఏడాది మార్చిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తప్పించింది. కాగా, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని, ఈ విషయాలన్నీ విచారణలో నిర్ధారించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మారన్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ పేర్కొంది. 2004-06లో దయానిధి మారన్ టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలోని తన ఇంట్లో అక్రమంగా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేశారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ 1.78 కోట్ల నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. సన్ టీవీ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఈ ఎక్స్ఛేంజ్ను ఉపయోగించారని సీబీఐ ఆరోపిస్తోంది. -
కార్తీక్ సుబ్బరాజ్‌కు లక్కీచాన్స్!
తమిళసినిమా: దేనికైనా లక్కు ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి అదృష్టం ఎప్పుడు? ఎవరిని పడుతుందో ఊహించడం కష్టం. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చేయాలని ఆశపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పత్రి నటీనటుడికి, దర్శక నిర్మాతలకు అలాంటి కోరిక ఉంటుంది. ఇక వర్ధమాన దర్శకులకైతే అదో కలనే చెప్పవచ్చు. కే.బాలచందర్, ఎస్పీ.ముత్తురామన్ లాంటి సీనియర్ దర్శకుల నుంచి శంకర్ వంటి స్టార్ దర్శకుల చిత్రాల్లో నటించిన రజనీకాంత్ ఇటీవల అనూహ్యంగా వర్ధమాన దర్శకులపై దృష్టిసారిస్తున్నారని చెప్పవచ్చు. రెండు చిత్రాలనే చేసిన దర్శకుడు పా.రంజిత్‌కు అవకాశం ఇచ్చి కబాలి చిత్రంలో నటించి ఆశ్చర్యపరచిన సూపర్‌స్టార్ మళ్లీ వెంటనే కాలా చిత్రానికి ఆయన్నే ఎంచుకోవడం విశేషమే. కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అంతకు ముందు చిత్ర టీజర్‌ను మార్చి ఒకటో తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో నటించిన 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ నెక్ట్స్ అన్న ప్రశ్న తలెత్తినప్పుడు రజనీకాంత్ దృష్టిలో రెండు మార్గాలు కదలాడుతున్నాయి. అందులో ఒకటి రాజకీయరంగప్రవేశం. ఇందుకు ఇప్పటికే తెరవెనుక పనులు వేగంగా జరగుతున్నాయి. ఈ లోగా ఒక మంచి రాజకీయనేపథ్యంలో చిత్రం చేయాలన్నది సూపర్‌స్టార్ బలమైన భావన. అందుకు పావులను కదుపుతూ వచ్చారు. ఇందుకు కారణం లేకపోలేదు. మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశంచే ముందు ఈ తరహా చిత్రాలు చాలానే చేసి ప్రజల మనసులను దోచుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఆ తారకమంత్రాన్నే పఠించాలనుకుంటున్నారు. ఈయన ఆలోచనలకు తగ్గట్టుగా పలువురు కథలను రెడీ చేసుకుంటున్నారు. సమయం లేదు మిత్రమా అన్న చందాన సూపర్‌స్టార్‌తో ఒక్క చిత్రం అయినా చేసి తీరాలన్న తపనతో కథలను తయారు చేసుకున్న దర్శకుల్లో కేవీ.ఆనంద్, అట్లీ, మణికంఠన్ లాంటి దర్శకులు ఉన్నారు. వీరందరూ రజనీని కలిసి కథలను వినిపించినవారే. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రచారం జోరుగానే జరిగింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురికే కాదు ఆయనతో ఒక్క చిత్రం అయినా చేయాలని కలలు కంటున్న చాలా మందికి సూపర్‌స్టార్ షాక్ ఇచ్చేలా మరో యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్కు అవకాశం కల్పించారు. ఎస్. సూపర్‌స్టార్ బాల్ ఈ యువ దర్శకుడు కోర్టులో పడింది. ఈయన కథ రజనీకాంత్ రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందట. తొలి చిత్రం పిజ్జా తోనే విజయాన్ని తనవైపునకు తిప్పుకున్న ఈ దర్శకుడు జిగర్తండా చిత్రంతో తమిళసినిమానే తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఇరవి అంటూ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా మెర్కురి చిత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌తో చిత్రం చేసే అదృష్టం కలిసొచ్చింది. ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను శుక్రవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా ఎందిరన్ వంటి బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థనే అన్నది గమనార్హం. అయితే ఈ తాజా చిత్రం ఎప్పుడు సెట్‌పైకి వెళ్లేది ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కోర్టుకు బ్రదర్స్!
► చార్జ్‌షీట్ నకలు అప్పగింత ► మీడియాపై న్యాయవాదుల చిందులు ► మౌనంగా మారన్ ముందుకు సాక్షి, చెన్నై: మారన్ బ్రదర్స్ మంగళవారం చెన్నై సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును వీరికి కోర్టు వర్గాలు అప్పగించాయి. తదుపరి విచారణ జూలై 28కి న్యాయమూర్తి జవహర్ వాయిదా వేశారు. యూపీఏ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో దయానిధిమారన్ హై స్పీడ్ ఇంటర్నెట్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. ఈ కనెక్షన్లను తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌కు అప్పగించడంతో ప్రభుత్వానికి కోటి 78 లక్షల మేరకు ఆదాయానికి గండి పడిందని సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. దయానిధిమారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు అప్పటి బీఎస్ఎన్ఎల్ అధికారులు బ్రహ్మనాథన్, వేలుస్వామి, మారన్ వ్యక్తిగత కార్యదర్శి గౌతమన్, సన్‌టీవీ సిబ్బందికన్నన్, రవి మీద అభియోగం మోపుతూ ఈ కేసులు దాఖలయ్యాయి. కేసు విచారణ చెన్నై సీబీఐ కోర్టులో సాగుతూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ ఎనిమిదో తేదీన సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి జవహర్ ఆదేశించారు. ఆ మేరకు మారన్ బ్రదర్స్ మంగళవారం కోర్టుమెట్లు ఎక్కారు. కోర్టుకు బ్రదర్స్ : కళానిధి మారన్, దయానిధి మారన్‌తో పాటు మిగిలిన వారు ఉదయాన్నే హైకోర్టు ఆవరణలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు హాజరైన వీరిని వీడియో, ఫొటోలు తీయడానికి మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ బ్రదర్స్ తరఫు న్యాయవాదులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టులో న్యాయమూర్తి జవహర్ ఆదేశాల మేరకు 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ అందజేశారు. వీటిని పరిశీలించి, తదుపరి తమ వాదన వినిపించేందుకు తగ్గ సమయాన్ని కోర్టు కేటాయించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న మారన్ బ్రదర్స్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా యత్నించగా, వారి న్యాయవాదులు మళ్లీ అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోల్ని తీయనివ్వకుండా మీడియా మీద తిరుగబడ్డారు. మీడియా వర్గాలను బెదిరిస్తూ, కాస్త దూకుడు ప్రదర్శించారు. న్యాయవాదులు రవీంద్రన్, స్నేహ అయితే, కాస్త దూకుడుగా ప్రదర్శించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీడియా మీద తమ న్యాయవాదులు దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నా, ఓ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న మారన్ బ్రదర్స్ వారించకుండా మౌనంగా ముందుకు సాగడం గమనార్హం. -
మారన్ల చుట్టూ మళ్లీ ఉచ్చు
ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ హైకోర్టు విచారణ - అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాలున్నాయన్న ఈడీ న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు మళ్లీ ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసు ఉచ్చు బిగుసుకోనుంది. ఈ కేసునుంచి మారన్ సోదరులకు విముక్తి కల్పించిన ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. వారి అక్రమాలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలున్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్పీ గార్గ్.. ఈడీ పిటిషన్‌పై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని మారన్ సోదరులతోపాటు ఐదుగురికి నోటీసులు జారీచేశారు. దయానిధి, కళానిధి, కావేరీ కళానిధి (ఎస్‌ఏఎఫ్‌ఎల్), ఈ సంస్థ ఎండీ షణ్ముగం, సన్ డైరెక్ట్ టీవీలకు నోటీసులిచ్చారు. ఫిబ్రవరి నాటి తీర్పులో ఈడీ, సీబీఐ వేసిన కేసులను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందంతో మారన్ సోదరులతోపాటు మిగిలిన వారికి సంబంధం లేదని తీర్పునిచ్చింది. తాజా పిటిషన్లో ఈ కేసుకు సంబంధించిన కార్పొరేట్ ప్రముఖుల అక్రమాలపై ఇచ్చిన వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ‘కళానిధి, కావేరిలు, మారన్ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి’ అని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ మొదట సుప్రీంకోర్టును సంప్రదించింది. కార్తీపై ఈడీ కేసు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఈడీ శుక్రవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న కార్తీ, ఐఎన్ఎక్స్ మీడియా, దాని డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జియా, ఇతరులపై పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను నమోదు చేసింది. కార్తీకి ఐఎన్ఎక్స్ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఈడీ తొలుత సమాచారం వెల్లడించడంతో ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్‌కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు. -
మారన్ సోదరులకు ఊరట
ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసుల్లో అభియోగాలు కొట్టేసిన ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ – మాక్సిస్ ఒప్పందా నికి సంబంధించిన కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరు డు కళానిధి మారన్ కు ఊరట లభించింది. ఈ కేసులకు సంబంధించి వారిపై సీబీఐ, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన అభియోగాలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దయానిధి మారన్, కళానిధి మారన్ తో పాటు కళానిధి మారన్ భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, సన్ డైరెక్ట్ టీవీ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీలకు విముక్తి లభించినట్లయింది. అయితే ఈ ఉత్తర్వులు మలేసియా జాతీయు లైన రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ కు వర్తించవని, వారిపై విచారణను ప్రత్యేకంగా చేపట్టినందున ఈ ఉత్తర్వులు మారన్ సోదరులు మిగిలిన వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం చేసింది. ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి మారన్ సోదరులతో పాటు రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ , సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్వర్క్స్, మాక్సిస్ కమ్యూనికేషన్స్ , సౌత్ ఏషియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అదనపు కార్యదర్శి(టెలికాం) జేఎస్ శర్మపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీరిపై 120బీ(నేరపూరిత కుట్ర), ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. కేసు దర్యా ప్తు సమయంలో జేఎస్ శర్మ మరణించారు. ఈడీ కూడా మారన్ సోదరులతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి, సౌత్ ఏషియా ఎఫ్ఎం లిమిటెడ్ ఎండీ కె.షణ్ముగం, ఎస్‌ఏఎఫ్‌ఎల్, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 2006లో మలేసియాకు చెందిన మ్యాక్సిస్‌కు ఎయిర్‌సెల్‌ను విక్రయిం చాలని దయానిధి ఆ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ ను ఒత్తిడి చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ ఆరోపిం చారు. అయితే ఈ ఆరోపణలను దయానిధి మారన్ తో పాటు మిగతా నిందితులు ఖండిం చారు. ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూ లం తీసుకున్న న్యాయస్థానం వీరిపై దాఖలైన అభియోగాలకు సంబంధించి సరైన సాక్ష్యా లు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
కేంద్ర మాజీ మంత్రిపై సీబీఐ చార్జ్ షీట్
చెన్నై: టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లపై సీబీఐ అధికారులు చార్జ్ షీటు దాఖలుచేశారు. ప్రైవేట్ టీవీ(సన్ టీవీ నెట్ వర్క్) ఛానల్‌కు అక్రమంగా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు (ఎయిర్ సెల్-మాక్సిస్)ప్రొవైడ్ చేసిన కేసులో మారన్ సోదరులు నిందితులుగా ఉన్నారు. చెన్నైలోని స్పెషల్ కోర్టులో మారన్ సోదరులతో పాటు మరికొందరు నిందితులపై అవినీతి నిరోధక చట్టం పరిధికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎలాంటి బిల్లులే లేకుండా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు ఇవ్వడం వల్ల బీఎస్ఎన్ఎల్ సంస్థతో పాటు చెన్నై, ఢిల్లీకి చెందిన ఎంటీఎన్ఎల్ టెలికాం కంపెనీలు 1.78కోట్లు నష్టపోయాయి. అయితే ఆ సమయంలో సన్ టీవీ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన కళానిధి మారన్ సహా ఆ టీవీ ఇద్దరు ఉన్నత అధికారులు, ఆయన అనుయాయుల పేర్లను చార్జ్‌షీటులో చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లకు పైగా టెలికాం స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. -
'వాళ్లు తమ ఆత్మను దెయ్యానికి అమ్మేశారు'
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే విజయం సాధించడంపై మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బులు తీసుకుని తమ 'ఆత్మని దెయ్యానికి అమ్మేశారు' అంటూ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో డీఎంకేకు విజయావకాశాలు స్పష్టం కావటంతో ...అన్నాడీఎంకే డబ్బులు కుమ్మరించి గెలిచిందంటూ మారన్ ఆరోపించారు. 'నేను పరీక్షలో పాసైనా నన్నెందుకు ఫెయిల్ చేశావమ్మా' అని మారన్ మరో ట్వీట్ చేశారు. కాగా పోలింగ్ పూర్తి అయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. అయితే ఓటమి భారంతో ఉన్న ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. దాంతో మారన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మారన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే స్పందిస్తూ... మారన్ ఇన్నిరోజులు నిద్రపోయి ఇప్పుడే మేల్కొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలను అవమానిస్తున్నారని ట్విట్ చేసింది. -
కేంద్ర మంత్రి మారన్‌ను ప్రశ్నించిన CBI
-
మారన్ సహకరించడం లేదు: సీబీఐ
న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ దర్యాప్తుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయనను కస్టడీలో ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. 'టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ లో మారన్ ను కస్టడీలో విచారించాల్సిన అవసరముంది. ప్రభుత్వ టెలిఫోన్ వ్యవస్థను అక్రమంగా సన్ టీవీ కోసం వాడుకున్నారని వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే ఆయనను విచారించాల్సిందే' అని అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలని దయానిధి మారన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. మారన్ కు ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అంతకుముందు స్టే విధించింది. -
సుప్రీంకోర్టులో దయానిధి మారన్‌కు ఊరట
-
సుప్రీంకోర్టులో దయానిధి మారన్‌కు ఊరట
న్యూఢిల్లీ : టెలిఫోన్ ఎక్స్ఛేంజి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మారన్ లొంగిపోవాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసులో సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో మారన్ ముందస్తు బెయిల్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మారన్ మూడు రోజుల్లోపు లొంగిపోవాలని పేర్కొంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా మారన్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ జూలై నెలలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి కేంద్రమంత్రిగా 2004 - 2007 కాలంలో పని చేశారు. ఆ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్‌కు 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్లు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. -
దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే
-
మారన్‌కు షాక్
బీఎస్ఎన్ఎల్ అక్రమ కనెక్షన్ల వ్యవహారం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ మెడకు ఉచ్చుగా బిగుసుకుంటోంది. మారన్‌కు షాక్ ఇచ్చే రీతిలో సోమవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దుతో ఇక అరెస్టు అయ్యేనా అన్న ఉత్కంఠ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం ఎక్కడ డిఎంకేకు శాపంగా మారుతుందోనన్న బెంగ డీఎంకేలో ఉంది. చెన్నై: 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే మాజీ మంత్రి ఎ.రాజ, కరుణానిధి గారాల పట్టి కనిమొళి ప్రమేయంతో ఆ పార్టీ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎం కేకు చావు దెబ్బ తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఈ సారి అధికార పగ్గాలు లక్ష్యంగా ఉరకలు తీస్తున్న ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించే పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి మనవడు , కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ మెడకు అక్రమ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల వ్యవహారం ఉచ్చు బిగుస్తుండడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన బయల్తేరింది. ఈ వ్యవహారం ఎలాంటి గడ్డు పరిస్థితులకు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఇదీ కేసు : 2004-2007 కాలంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ వ్యవహరించారు. ఈ సమయంలో తన అధికారాన్ని ప్రయోగించి నాలుగు వందల మేర అక్రమ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల పొందిన ట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్ సంస్థకు ఉపయోగించినట్టు, తద్వారా ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల మేరకు నష్టం జరిగినట్టుగా ఆరోపణలు బయల్దేరాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తమ చేతిలోకి తీసుకున్న సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల మేరకు గండి పడ్డట్టు విచారణలోనూ వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో కొన్ని నెలల క్రితం దయానిధి మారన్ సన్నిహితుడు గౌతమన్, సన్ గ్రూప్ అధికారి టివి కణ్ణన్, ఎలక్ట్రిషియన్ రవిలను సీబీఐ అరెస్టు చేసింది. వీరిని తమ కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులతో మారన్ బ్రదర్స్ ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. ఈ కేసులో మారన్ బ్రదర్స్ అరెస్టు అవుతారన్న ప్రచారం బయలు దేరినా, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో బతికి బట్టకట్టారు. బెయిల్ రద్దు: తనను అరెస్టు చేస్తారన్న ప్రచారంతో హైకోర్టును ఆశ్రయించి నెల రోజుల క్రితం ముందస్తు బెయిల్‌ను దయానిధి మారన్ తెచ్చుకున్నారు. అదే సమయంలో సీబీఐ పిలిస్తే, ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి విచారణలకైనా తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు హామీ సైతం ఇచ్చారు. అయితే విచారణకు మారన్ సహరించడం లేదంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ హైకోర్టులో న్యాయమూర్తి ఎస్ వైద్యనాథన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. సోమవారం విచారణ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని విన్పించారు. వాదనల అనంతరం మారన్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లోపు సీబీఐ ఎదుట లొంగి పోవాలని పేర్కొంది. లేకుంటే చట్టపరంగా మారన్‌పై చర్యలు తీసుకోవచ్చని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు కాస్త మారన్ అరెస్టు అయ్యేనా..? అన్న చర్చకు దారి తీస్తున్నాయి. -
దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. మారన్ ముందస్తు బెయిల్‌ను కోర్టు సోమవారం రద్దు చేసింది. అంతే కాకుండా మారన్ మూడు రోజుల్లోపు లొంగిపోవాలని పేర్కొంది. దయానిధి మారన్ టెలిఫోన్ ఎక్స్ఛేంజి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మారన్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ జూలై నెలలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి కేంద్రమంత్రిగా 2004 - 2007 కాలంలో పని చేశారు. ఆ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్‌కు 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్లు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. -
కేంద్ర మాజీమంత్రిని ప్రశ్నించిన సీబీఐ
టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌ను సీబీఐ బుధవారం ప్రశ్నించింది. చెన్నైలోని తన ఇంట్లోనే ఏకంగా 300 హై డేటా కెపాసిటీ ఉన్న బీఎస్ఎన్ఎల్ టెలికం లైన్లతో ఓ భారీ ఎక్స్ఛేంజి పెట్టుకున్న కేసులో ఆయనను సీబీఐ విచారించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన హాజరయ్యారు. సీబీఐ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మారన్‌ను విచారించారు. వాస్తవానికి సోమవారమే మారన్ రావాల్సి ఉన్నా, ఆయన రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ బెయిల్ మంగళవారం వచ్చింది. ఇంతకుముందు ఇదే కేసులో సీబీఐ అరెస్టుచేసిన ముగ్గురు సన్ టీవీ అధికారులకు కూడా మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పేరుతో ఏకంగా 323 రెసిడెన్షియల్ లైన్లను మారన్ టెలికం మంత్రిగా ఉన్న సమయంలో తన ఇంట్లో పెట్టుకుని, వాటిని సన్ టీవీ కోసం వాడుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఇవన్నీ కూడా ఐఎస్‌డీఎన్ లైన్లని.. అంటే టీవీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి కావల్సిన సామర్థ్యం వాటికి ఉంటుందని తెలిపింది. -
దయానిధిమారన్కు ముందస్తు బెయిల్
సాక్షి, చెన్నై:అక్రమ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల వ్యవహారంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు మంగళవారం మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దుకు వెనుకాడబోమంటూ హెచ్చరించింది. కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న కాలంలో దయానిధి మారన్ తన అధికారాన్ని ప్రయోగించి నాలుగు వందల మేర అక్రమ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్ సంస్థకు ఉపయోగించినట్టు ఆరోపణలు బయలు దేరడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల మేరకు గండి పడ్డట్టు విచారణలో వెలుగు చూసింది. ఈవ్యవహారంలో ఇటీవల దయానిధి మారన్ సన్నిహితుడు గౌతమన్, సన్ గ్రూప్ అధికారి టీవీ కణ్ణన్, ఎలక్ట్రీషియన్ రవిలను సీబీఐ అరెస్టు చేసింది. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులతో మారన్ బ్రదర్స్ ఇరకాటంలో పడ్డారు. ఈ కేసులో మారన్ బ్రదర్స్ అరెస్టు అవుతారన్న ప్రచారం బయలు దేరింది. ముందస్తు బెయిల్ : తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం షికారు చేయడంతో దయానిధి మారన్ మేల్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ పిలిస్తే , ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి విచారణలకైనా తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తూ , ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం న్యాయమూర్తి ఆర్ సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ మారన్ తరపున న్యాయవాది సుందరేషన్, సీబీఐ తరపున న్యాయవాది రాజగోపాలన్ హాజరై తమ వాదనల్ని విన్పించారు. వాదనల అనంతరం మారన్‌కు ఆరు వారాల ముందస్తు బెయిల్ మంజూరు అయింది. విచారణకు ఆయన సహకరించని పక్షంలో బెయిల్ రద్దుకు వెనుకాడబోయేది లేదని పరోక్షంగా బెంచ్ హెచ్చరించింది. ఇందుకు తగ్గ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసి, బెయిల్ రద్దుకు విజ్ఞప్తి చేయవచ్చంటూ సీబీఐకు బెంచ్ సూచించింది.