న్యూఢిల్లీ: ‘ఎయిర్‌సెల్, మాక్సిస్’ ఒప్పందానికి సంబంధించిన కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధిల మారన్‌లపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ అభిప్రాయపడ్డారు. రోహత్గీ నుంచి సోమవారం ఉదయం ఆ అభిప్రాయం అందిందని, దాన్ని సీబీఐ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే, ఏజీ అభిప్రాయాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం సీబీఐకి లేదన్నాయి. మారన్ సోదరులపై చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో దర్యాప్తు బృందానికి, సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో.. ఆ అంశాన్ని ఏజీకి నివేదించారు. చార్జిషీట్‌కు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు బృందం పేర్కొనగా.. సాక్ష్యాధారాల్లోని లోపాలను సిన్హా ఎత్తిచూపారు.
‘మారన్‌లపై చార్జిషీట్ నమోదు చేయొచ్చు!’
Published Tue, Aug 5 2014 2:15 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM
Advertisement