'నాపై కుట్ర చేస్తున్నారు'
న్యూఢిల్లీ: 2జీ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ మండిపడ్డారు. తమ పార్టీని ఇరుకున పెట్టే క్రమంలోనే సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్ తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఆయన గురువారం పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగరిక దేశంలో మానవహక్కులను హరించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. దీనిపై సీబీఐ డైరెక్టర్ తో పాటు, ఎన్ హెచ్ఆర్సీ( జాతీయ మానవ హక్కుల సంఘం) కి లేఖలు రాయనున్నట్లు మారన్ తెలిపారు.