DMK leader
-
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
మళ్లీ ఈడీ దాడుల కలకలం.. మరో మంత్రి టార్గెట్‌గా!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారం వేడి చల్లారకముందే.. మరో మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసింది. సోమవారం ఉదయం చెన్నైలోని తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిలో, ఆఫీసులు.. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి పొన్ముడితో పాటు ఆయన తనయుడు గౌతమ్ సిగమణి ఇంటా, ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. 2007-11 మధ్య పొన్ముడి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో గనుల లైసెన్స్‌లను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అడ్డగోలు రేటుకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఆయన తనయుడు గౌతమ్ సహ నిందితుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మంత్రి పొన్ముడి వ్యవహారంపైనా విపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు పొన్ముడి విల్లాపురం ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. తమిళనాడు అసెంబ్లీకి ఐదు సార్లు ఎన్నికయ్యారాయన. ఇదిలా ఉంటే.. అవినీతి ఆరోపణల కేసులో ఊరట కోసం పొన్ముడి మద్రాస్ హైకోర్టును జూన్ నెలలో ఆశ్రయించారు. అయితే కోర్టులో ఆయనకు ఉపశమనం దక్కలేదు. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన వీ సెంథిల్ బాలాజీ.. క్యాష్ ఫర్ జాబ్స్ స్కాంలో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన నివాసాలు, ఆఫీసులపై జూన్ నెలలో ఈడీ తనిఖీలు చేపట్టి.. మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది కూడా. -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
స్టాలిన్‌కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి జగదీశన్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 1947లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష్మి జగదీశన్.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. -
కన్నా.. నీ వెంటే మేమూ.. కుమారుడి మృతితో భార్యతో పాటు డీఎంకే నేత..
సాక్షి, చెన్నై: ప్రమాదంలో తనయుడు మరణించిన వేదనను తట్టుకోలేక డీఎంకేకు చెందిన ఓ నాయకుడు తన భార్యతో పాటూ మంగళవారం బలన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..కన్యాకుమారి జిల్లా కళియకావిళైకు చెందిన సహాయం(60) డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఆయన భార్య సుగంధి(55). ఈ దంపతుల ఏకైక కుమారుడు (21) ఏడాది క్రితం బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రెండు రోజుల క్రితం కుమారుడు సంవత్సరికం జరిగింది. తనయుడు మరణించినప్పటి నుంచి పార్టీ కార్యాక్రమాలకు సైతం సహాయం దూరంగా ఉంటూ వచ్చారు. సంవత్సరికం సంప్రదాయాల్ని ముగించినానంతరం భార్యాభర్తలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే మౌనంగా ఉంటూ వచ్చారు. బంధువులు ఎంతగా ఓదార్చిన ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం సహాయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో పక్కింటి వారు బంధువులకు సమాచారం అందించారు. వారు పోలీసుల సాయంతో ఆ ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా , దంపతులు ఇద్దరు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఇద్దరి మృత దేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనయుడి మరణంతో మనో వేదనతో ఉన్న ఈ దంపతులు, అతడికి సంవత్సరంలో చేయాల్సిన సంప్రదాయాల్ని ముగించినానంతరం నీ వెంటే..కన్నా అంటూ బలన్మరణానికి పాల్పడడం స్థానికులను శోకంలో ముంచింది. చదవండి: చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
డీఎంకే నాయకుడి హత్య
తిరువొత్తియూరు: అన్నానగర్‌కు చెందిన టి.పి.సత్రం 16వ వీధికి చెందిన డీఎంకే నాయకుడు సంపత్‌కుమార్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చెన్నై అన్నానగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి సంపత్‌కుమార్ బైకులో వెళ్తుండగా.. ఆటోలో నుంచి కిందకు దిగిన ముగ్గురు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త దాడిలో భార్య మృతి: అంబత్తూరు సమీపం సూరప్పటు జేపీ ఏపీ నగర రెండవ వీధికి చెందిన ముత్తు (40) బేకరీ నడుపుతున్నాడు. భార్య విజయలక్ష్మి (34). వీరికి దీపశ్రీ (14) అనే కుమార్తె, వసంత్ (10) అనే కుమారుడు ఉన్నారు. గత 14వ తేది భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన ముత్తు భార్య ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు. మరుసటిరోజు ఆమె ముఖం వాపు ఏర్పడి వాంతులు కావడంతో ఆమెను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి గురువారం ఉదయం మృతి చెందారు. పోలీసులు ముత్తును అరెస్టు చేశారు. పెట్రోల్ చోరీని అడ్డుకున్నందుకు.. తిరువళ్లూరు జిల్లా నందిబాక్కం రైల్వేస్టేషన్ సమీపంలోని మీంజూర్ మేలూరు జోసెఫ్ వీధికి చెందిన వ్యక్తి రాజేష్ (24). తన బైక్‌ను రైల్వేస్టేషన్ పక్కన నిలిపి బుధవారం కట్టడ పనులకు వెళ్లాడు. రాత్రి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతడి బైక్ నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్నారు. దీంతో వారిని రాజేష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు కత్తులతో దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
డీఎంకే సీనియర్ నేత కన్నుమూత
-
డిఎంకే కార్యాలయంపైనా ఐటీ దాడి
-
కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
వెల్లూరులో ఎన్నిక రద్దు
న్యూఢిల్లీ: డీఎంకే నేతకు సన్నిహితుడి వద్ద ఇటీవల భారీ మొత్తంలో నగదు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. డీఎంకే కోశాధికారి దురైమురుగన్ కొడుకు కథీర్ ఆనంద్ ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. మార్చి 30న దురై మురుగన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను అధికారులు.. లెక్కలు లేని రూ. 10.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండ్రోజుల తర్వాత, ఏప్రిల్ 1న దురైమురుగన్ సన్నిహితుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో సోదాలు చేసి, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 11.53 కోట్ల నగదును సైతం పట్టుకున్నారు. దీంతో వెల్లూరులో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేనందున ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. ధన ప్రవాహం భారీగా ఉందన్న కారణంతో ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. వెల్లూరులో పోలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఈసీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. కాగా, అధికారులకు పట్టుబడిన రూ. 11.53 కోట్లలో 91 శాతం డబ్బు 200 రూపాయల నోట్ల రూపంలోనే ఉందనీ, అదంతా ఒకే బ్యాంకు శాఖ నుంచి తీసుకున్నదని ఆదాయపు పన్ను అధికారులు చెప్పారు. కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్ సెల్వం చనిపోయాడు. రాజ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, జయశంకర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు. -
మహిళను కాలుతో తన్నిన సెల్వకుమార్
-
హీరో విశాల్‌కు ఊహించని సపోర్టు..!
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
అన్నాడీఎంకేను సాగనంపండి: కరుణ
చెన్నై: రైతుల జీవితాలు బాగుపడాలంటే అన్నాడీఎంకే సర్కారును ఇంటికి సాగనంపాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలావున్నాయి. అన్నాడీఎంకే పాలనలో గత ఐదేళ్లుగా రైతులు అనుభవిస్తున్న వెతలకు, కష్టాలకు కొదువలేదని, రైతులు తీసుకున్న ఏడు వేల కోట్ల రూపాయల సహకార వ్యవసాయ రుణాలన్నీ 2006 డీఎంకే రాష్ట్రంలో అధికారం చేపట్టినపుడు మాఫీ చేసేందుకు జీవో జారీ చేశామని, ఆ కారణంగా రాష్ట్రంలో వున్న 22 లక్షల 40 వేల 739 మంది రైతు కుటుంబాలు లబ్ధిపొందాయన్నారు. రైతుల పంట రుణాల వడ్డీ అన్నాడీఎంకే పాలనలో 2005-06లో తొమ్మిది శాతం ఉండగా రైతుల శ్రేయస్సు కోసం 2006-07లో డీఎంకే పాలనలో ఏడు శాతంగా తగ్గించబడిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం తంజావూరు జిల్లాలో అధిరామపట్టణంకు చెందిన బాలన్ అనే రైతు ట్రాక్టర్ వాయిదా సొమ్మును బాకీ వున్నట్లు తెలిపి పోలీసులు, గూండాల ద్వారా తీవ్రంగా దాడికి గురయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అరియలూరు సమీపాన అళగర్ అనే రైతు పంట రుణాన్ని చెల్లించలేని స్థితిలో క్రిమిసంహారక మందును సేవించి మృతిచెందాడనే వార్త వెలువడగానే 13మార్చి 2016లో తాను విడుదల చేసిన ప్రకటనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడకూడదని, త్వరలో అధికారం మార్పు తథ్యమని, రైతుల శ్రేయస్సును కోరే ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపినట్లు పేర్కొన్నారు. గత 2011 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయం మూడింతలుగా పెరుగుతుందని అన్నాడీఎంకే తెలిపిందని, అయితే రైతుల రుణాలే మూడింతలుగా పెరిగాయని తెలిపారు. ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో 2,423 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్థితిలో ఏప్రిల్ ఐదవ తేదీన రాష్ట్రస్థాయిలో రైలు రోకో ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ విజయం సాధించేందుకు అందరూ కృషిచేయాలని కోరారు. దీంతో రైతుల శ్రమలు తొలగిపోయి, జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. -
దింపుడు కళ్లం ఆశ
డీఎండీకే కోసం డీఎంకే ఎదురుచూపులు విజయకాంత్ వస్తాడన్న కరుణానిధి ఎన్నికలకు సిద్ధమన్న స్టాలిన్ ఎన్నికల వేళ డీఎంకే దింపుడు కళ్లం ఆశలో పడిపోయింది. డీఎండీకే తమ జట్టులో చేరడం ఖాయమని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏర్పడినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే అన్నది నిర్వివాదాంశం. డీఎంకే, కాంగ్రెస్ కలిసిపోగా డీఎండీకేకు కరుణ ఆహ్వానం పంపా రు. డీఎంకేలో కాంగ్రెస్‌తోపాటూ మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియ యూనియన్ ముస్లింలీగ్, ఎస్టీపీఐ, పెరుందలైవర్ మక్కల్ కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. అయితే డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే పెద్దపార్టీ. పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రజల్లో పరపతి అంతంత మాత్రమే. రాష్ట్రంలో ఎంతో కొంత ప్రజాబలం, కార్యకర్తల బలం ఉన్న పార్టీగా పేరొందిన డీఎండీకే మాత్రం డీఎంకేకు ముఖం చాటేసింది. డీఎండీకేను కూటమిలోకి తెచ్చే బాధ్యతను మిత్రపక్ష కాంగ్రెస్‌కు అప్పగించారు. కాంగ్రెస్ కంటే డీఎండీకేనే బలమైన పార్టీగా డీఎంకే నమ్ముతోంది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తమ సీట్లు తగ్గించుకుని డీఎండీకేకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవరెన్ని ఆఫర్లు ప్రకటించినా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చున్న విజయకాంత్ ఒంటరిపోరుకు పోతున్నట్లు ప్రకటించారు. కింగా, కింగ్‌మేకరా అంటూ నినాదాలు చేసిన పార్టీ శ్రేణులు తనను కింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు విజయకాంత్ తేల్చిచెప్పారు. డీఎండీకే కలిసిన పక్షంలో మాత్రమే డీఎంకే బలమైన కూటమిగా మారి అన్నాడీఎంకేను ఎదుర్కోగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విశ్లేషణ కొంత వరకు నిజమేనని పలువురు హెచ్చరిస్తున్న తరుణంలో విజయకాంత్‌ను బుజ్జగించే చర్యలు ప్రారంభమైనాయి. ఓట్లను చీల్చడం ద్వారా విజయకాంత్ అన్నాడీఎంకేకు గెలుపు సులువు చేయగలడని డీఎంకే ఆందోళన చెందుతోంది. నేను రాను మొర్రో అంటూ విజయకాంత్ స్పష్టం చేసినా డీఎంకే మాత్రం చివరి ప్రయత్నంలో పడింది. కెప్టెన్ మాతోనే: కరుణ : ఈ నేపథ్యంలో అన్నా అరివాలయంలో సోమవారం డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ డీఎండీకే తమ కూటమిలో చేరుతుందనే విశ్వాసాన్ని కోల్పోలేదని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఈ నెల 23వ తేదీన ప్రారంభం అవుతాయని తెలిపారు. పార్టీ పరంగా కనీసం 190 సీట్లలో పోటీచేయనున్నట్లు చెప్పారు. చర్చలను వేగంగా ముగించి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తామని అన్నారు. అలాగే మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరి డీఎండీకే మా టేమిటని ప్రశ్నించగా, తమ కూటమిలోకి విజయకాంత్ వస్తాడని తాను మొద టి నుంచి నమ్ముతున్నానని, ఆ నమ్మకం వమ్ము కాదని కరుణ స్పష్టం చేశారు. అధికారం మాదే - స్టాలిన్ ధీమా :రాబోయే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ కోశాధికారి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే కోసం పార్టీ అర్రులు చాస్తున్న క్రమంలో స్టాలిన్ ప్రకటన చర్చనీయాంశమైంది. తాను చేపట్టిన నమక్కు నామే పర్యటన ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన పర్యటన సమయంలో ప్రజలతో చేసిన సంభాషణలు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. సుమారు నాలుగున్నర లక్షమంది ప్రజలు తను విజ్ఞప్తులను ఇచ్చి డీఎంకే అధికారంలోకి వచ్చి తమ కోర్కెలను నెరవేర్చాలని కోరినట్లు స్టాలిన్ తెలిపారు. అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీలోని కుమ్ములాటలు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన చెబుతున్నారు. ‘అన్నాడీఎంకేను అధికారంలో నుంచి దింపుతాను, జయలలితను మరోసారి ముఖ్యమంత్రిని కానివ్వను, ఇవే లక్ష్యాలున్న కూటమితోనే పొత్తుపెట్టుకుంటా ను’ అంటూ విజయకాంత్ ప్రతిజ్ఞ చేశారని స్టాలిన్ అన్నారు. ఈ ప్రతిజ్ఞలకు ఆకర్షితుడై కరుణానిధి పొత్తుకు ఆహ్వానం పంపారని తెలిపారు. అయితే విజ యకాంత్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని అన్నారు. ఏదైమైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. -
రాజకీయలబ్ధి కోసం పాకులాట
టీనగర్ : రాజీవ్ హంతకులు ఏడుగురి విడుదల వ్యవహారంలో జయలలిత రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయస్ అనే ఏడుగురికి విచారణ కోర్టు మరణ శిక్షను విధించిందని, తర్వాత నళిని, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చిందని పేర్కొన్నారు. ఈ ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో మరణ శిక్ష పొందిన మరుగన్, శాంతన్, పేరరివాళన్ శిక్షను కూడా యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం మాట్లాడుతూ నేరస్థుల మరణశిక్షను యావజ్జీవ శిక్షకు మాత్రమే తగ్గించినట్లు పేర్కొన్నట్లు తెలిపారు. వారి విడుదల గురించి తామేమీ వ్యాఖ్యానించలేదన్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సరైన న్యాయ నిబంధనలు అనుసరించవచ్చని తీర్పులో విశదీకరించినట్లు తెలిపారు. దీని ప్రకారం నేరస్థులు పిటిషన్ అందజేయాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోర్టులో నివేదిక దాఖలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారం గురించి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అంతరార్థం ఏమైనప్పటికీ, కేసు విచారణ చాలా ఆలస్యమైన ప్రస్తుత తరుణంలో వీరి విడుదల చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందనే విశ్వాసాన్ని తెలిపారని పేర్కొన్నారు. నేరస్థులను విడుదల చేసే అధికారం ఎవరికి ఉందనే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానం కాలయాపన చేయకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడుగురు నేరస్థులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లేదా 161 సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంకే తరఫున కోరుతున్నట్లు తెలిపారు. -
కరుణ వైపు చూపు
*తమీమున్ రెడి *కార్తీక్ కూడా *దరిదాపుల్లో విజయకాంత్ చెన్నై: రానున్న ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వెంట పయనం సాగించేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో మనిద నేయ జననాయగ కట్చి, అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. డీఎండీకే నేత విజయకాంత్ దరిదాపుల్లోకి చేరుకుని ఉన్నా, తుది నిర్ణయాన్ని సస్పెన్షన్‌లో పెట్టి ఉన్నారు. అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలతో ముందుకు సాగుతున్న డీఎంకేతో పొత్తుకు కాంగ్రెస్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. పాత స్నేహం మళ్లీ చిగురించడంతో ఇక, సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ డిఎంకే వెంటే పయనం కొనసాగించేందుకు నిర్ణయించింది. మరికొన్ని చిన్న పార్టీలు కరుణ వెంట నడిచేందుకు సిద్ధం కాగా, ప్రస్తుతం మరికొన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇందులో తమీమున్ అన్సారి నేతృత్వంలోని మనిద నేయ జననాయగ కట్చి, సినీ నటుడు కార్తీక్ నేతృత్వంలోని అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. ఎంఎంకేను చీల్చి తన బలాన్ని చాటుకునేందుకు తమీమున్ అన్సారి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో చెన్నై వేదికగా మైనారిటీ సామాజిక వర్గం తన వెంటే అని చాటుకునే విధంగా భారీ మహానాడుకు తమీమున్ అన్సారీ కార్యచరణలో పడ్డారు. ఇక, తన తొలి పయనాన్ని డీఎంకేతో కలసి సాగించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చాక, తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసి అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చిని సినీ నటుడు కార్తీక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతు కాక తప్పలేదు. తాజాగా, డిఎంకే వెంట నడిచేందుకు కార్తీక్ సిద్ధ పడ్డారు. తమకు అక్కున చేర్చుకునే విధంగా డిఎంకే వర్గాలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఇక, అందరి చూపు డీఎండీకే అధినేత విజయకాంత్ వైపు ఉంటూ వస్తోంది. నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వస్తున్న విజయకాంత్, డీఎంకేతో పొత్తుకు గోపాలపురం దరిదాపుల్లోకి వచ్చి ఆగి ఉన్నారని చెప్పవచ్చు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమకు తప్పని సరి కావడంతో, రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికేందుకు డిఎంకే వర్గాలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే, దరిదాపుల్లో ఆగిన విజయకాంత్ రెండు మూడు రోజుల్లో గోపాలపురంలోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో గురువారం తన నియోజకవర్గం రిషివంధియంలో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం ఆలోచించాల్సిందే. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం విదేశీ ఆస్తుల వ్యవహారంలో పార్లమెంట్, రాజ్య సభల్లో అన్నాడీఎంకే నానా రాద్దాంతం సృష్టిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీలో ఓ న్యాయం, రాష్ట్రంలో ఓ న్యాయమా ..? అంటూ అసెంబ్లీలో అధికార పక్షం తీరును దుయ్యబట్టారు. విజయకాంత్‌తో మంతనాలకు బీజేపీ పెద్దలు చెన్నై చేరుకునే సమయంలో ఆయన, రిషివంధియంకు చెక్కేయడం గమనార్హం. ఇక, డిఎంకేకు క్యాథలిక్ క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన సంఘం పెద్ద యూనికో హృదయ రాజ్ తమ మద్దతును డీఎంకేకు ఇస్తున్నామని ప్రకటించారు. -
ఆటంబాంబు పేల్చిన అళగిరి
అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యాఖ్యలు లక్ష్యం లేని కాంగ్రెస్, డీఎంకేలు స్టాలిన్ పర్యటన ఓ జోక్ చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత అళగిరి మరోసారి ఆటంబాంబు పేల్చారు. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించి, అన్నాడీఎంకేకు వత్తాసు పలికారు. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడైన అళగిరి, చిన్న కుమారుడైన స్టాలిన్ మధ్య ఎంతోకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. డీఎంకేలో దక్షిణ తమిళనాడుకు సారథ్యం వహిస్తున్న అళగిరి మదురై జిల్లాను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్టాలిన్ పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. కరుణ తర్వాత పార్టీకి వారసులు ఎవరనే అంశంతో వారిద్దరి మధ్య కరుణానిధి తన చిన్నకుమారుడైన స్టాలిన్‌ను ప్రో త్సహిస్తూ వస్తున్నారు. ఇది సహించలేని అళగిరి బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. స్టాలిన్ కారణంగా సర్వనాశనం అంటూ పార్టీని తూర్పారబట్టారు. కరుణానిధి పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించారు. దీంతో మరింత స్వేచ్ఛ లభించిందని భావించిన అళగిరి పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని బహిరంగ ప్రకటన చేశారు. ఆయన అన్నట్లుగానే డీఎంకే ఘోర ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని పేర్కొన్నారు. స్టాలిన్ నిర్వహిస్తున్న మనకు మనమే పర్యటన ఒక జోక్‌గా మారిందని అని ఎద్దేవా చేశారు. అళగిరి మాటలపై మరింతగా మండిపడిన కరుణానిధి, అతని మాటలు పట్టించుకోవద్దని, అతనికి డీఎంకేకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. డీఎంకే అభివృద్ధికి తాను ఎంతోపాటూ పడ్డాను, జైలుకు వెళ్లాను, విమర్శించే హక్కు తనకు ఉందని తండ్రికే సవాలు విసిరాడు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి పేలుస్తున్న అవాకులు చవాకులు డీఎంకేకు తలనొప్పిగా మారింది. -
డీఎంకేలోకి మళ్లీ అళగిరి?
కుటుంబీకుల ఒత్తిడి కరుణ అంగీకరించినట్టు సమాచారం కొత్త ఏడాదిలో కింగ్ మేకర్ రీ ఎంట్రీ అవకాశం చెన్నై : డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి మళ్లీ రీ ఎంట్రీకి మార్గం సుగమం అవుతున్నట్టుంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, ఆయన్ను మళ్లీ ఆహ్వానించేందుకు కుటుంబీకులు అధినేత ఎం కరుణానిధి మీద ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో కొత్త ఏడాదిలో ఈ కింగ్ మేకర్ మళ్లీ రీ ఎంట్రీ కాబోతున్నట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు ఎంకే అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. యూపీఏ హ యాంలో ఎంపీగా, కేంద్ర కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించినా తన దృష్టిని అంతా రాష్ట్రం మీదే అళగిరి కేంద్రీకరించే వారు. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని పార్టీ వర్గాలు తన చేతి నుం చి జారీ పోకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే, తన కోటలో ఆయన సోదరుడు, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ క్రమంగా పాగా వేయడం మొదలెట్టడంతో అళగిరి బహిరంగ యుద్దానికి ది గారు. అన్నదమ్ముళ్ల మధ్య ఏళ్ల తరబడి చాప కింద నీరులా సాగుతూ వచ్చిన వారసత్వ సమరం ఈ పరిణామాలతో డీఎంకేలో పెను కలకలాన్ని సృష్టించిం దని చెప్పవచ్చు. అళగిరి తీరుపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. డీఎంకే బహిష్కృత నేతగా ముద్ర పడ్డ ఎంకే అళగిరి తదుపరి తన వేగాన్ని పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో డిఎంకేను చావు దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తదుపరి పరిణామాలతో వెనక్కి తగ్గిన అళగిరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేందుకు యత్నిం చారు. పలు మార్లు తన తండ్రి, అధినేత కరుణానిధి కలిసేందుకు యత్నించినా అనుమతి దక్కలేదు. చివరకు మౌనంగా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన అళగిరి గత కొంత కాలంగా మీడియాకు దూరంగానే ఉం టూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెం బ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే , అళగిరి సేవల్ని మళ్లీ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమతో దోస్తికి ప్రధాన పార్టీలు కలిసి రాని దృష్ట్యా, ఒక వేళ కాంగ్రెస్ వస్తేకలుపుకోవడం లేదా , ఒంటరిగా నైనా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు అధినేత కరుణానిధి వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో అళగిరి వెన్నం టి ఉంటే, దక్షిణ తమిళనాడులో కొంత మేరకు లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని పలువురు కరుణానిధి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇదే విషయాన్ని కుటుంబీకులు సైతం కరుణానిధి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కుటుంబీకులు ఒత్తిడి, తాజా పరిణామా ల్ని పరిగణలోకి తీసుకున్న కరుణానిధి అళగిరిని ఆహ్వానించేందుకు అంగీకా రం తెలిపినట్టు సమాచారం. దళపతి స్టాలిన్‌తో అంగీకరించినట్టు, చివరకు కరుఔ తుది నిర్ణయానికే కట్టుబడుతాననని తేల్చినట్టు సమాచారం. కరుణ తీసుకునే ఏ నిర్ణయాని కైనా కట్టుబడే మనస్తత్వం స్టాలిన్దని చెప్పవచ్చు. -
కూటమిలో చేరండి
కాంగ్రెస్‌కు కరుణ ఆహ్వానం ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం చెన్నై : తమ కూటమిలోకి రావాలని కాంగ్రెస్‌కు డీఎంకే అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వికసించింది. డీఎండీకేను కూటమిలోకి ఆహ్వానించిన డీఎంకే అధినేత ఎం కరుణానిధి తమ ఊసెత్తక పోవడం కాంగ్రెస్ వర్గాల్ని జీర్ణించుకోలేకుండా చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ నేతృత్వంలో కూటమి లేదా, ఒంటరి పయనం అన్న నినాదాల్ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అందుకున్నారు. రోజుకో వ్యాఖ్యల్ని ఈయన సందిస్తుండడంతో కాంగ్రెస్ వర్గాలు అయోమయంలో పడక తప్పలేదు. తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని పరిగణించిన కాంగ్రెస్ వర్గాలు, ఈ ఎన్నికల్ని కూడా ఒంటరిగా ఎదుర్కోవాల్సిందేనా అన్న డైలమాలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూటమిలోకి రావాలని అన్ని పార్టీలకు తాను ఆహ్వానం పలికానని, ఇందులో కాంగ్రెస్ కూడా ఉందని వ్యాఖ్యానించారు. తమను అక్కున చేర్చుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమవుతూ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వికసించింది. డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొంటే,కొన్ని సీట్లైనా గెలుచుకోవచ్చని, ఒంటరిగా ఎదుర్కొంటే, లోక్ సభ ఎన్నికల్లో పట్టి గతే ఎదురై ఉండేందని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, కరుణానిధి తమకు ఆహ్వానం పలకడంతో ఈవీకేఎస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన ఇచ్చిన పిలుపును తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాననని, తుది నిర్ణయం తమ అధినేత్రి సోనియాగాంధీ తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే డీఎంకే నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా..? అన్న ఎదురు చూపుల్లో ఉన్న ఢిల్లీలోని పలువురు కాంగ్రెస్ పెద్దలు కరుణానిధి ఇచ్చిన పిలుపుతో హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక, డీఎంకేతో కాంగ్రెస్ మళ్లీ దోస్తి కట్టడం ఖాయం అన్నది తాజా పరిణామాలతో స్పష్టం అవుతోంది. -
విచారణకు ఆదేశించండి!
సెంబరంబాక్కం చెరువు నుంచి ఒకే సమయంలో భారీ ఎత్తున నీటి విడుదలతోనే చెన్నై అతలాకుతలమైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్‌ను కలుసుకున్నారు. చెన్నై : సెంబరంబాక్కం చెరువు పుణ్యమా చెన్నై ముని గిందన్న సంకేతాలతో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు బయలు దేరాయి. విచారణ కమిషన్ నియమించాలని పట్టుబడుతూ రాజకీయపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలుసుకుని విచారణకు ఆదేశించాలని విన్నవించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేత దురై మురుగన్, ఎంపీ కనిమొళి తదితరులు సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యకు వినతి పత్రం అందజేశారు. చెన్నై అతలాకుతలం కావడం, ఇందుకు ప్రధాన కారణంగా సెంబరంబాక్కం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం గురించి వివరించారు. కూవంనదిలో లక్ష గణపుటడుగుల మేరకు నీళ్లు వదలి పెట్టడంతో ఆ నది ఉగ్రరూపం దాల్చి ఉన్నదని పేర్కొన్నారు. సెంబరంబాక్కం గేట్లను ముందుగానే ఎత్తివేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూసి, చివరకు భారీ ఎత్తున బయటకు పంపడంతో చెన్నై పెను ప్రళయాన్ని ఎదుర్కొన వలసి వచ్చిందని వివరించారు. ముందుగానే నీటి విడుదల జరిగి ఉంటే, ఇంత పెద్ద నష్టాన్ని , కష్టాన్ని చెన్నై ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని ఆ వినతి పత్రం ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. -
తలవంపులు తెచ్చారు
అధికార పార్టీ తీరుపై స్టాలిన్ ఫైర్ నేడు తంజావూరు, నాగైలలో పర్యటన చెన్నై: అన్నాడీఎంకే వర్గాల తీరు సిగ్గు చేటు అని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుకు తలవంపులు తె చ్చే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయకాల్ని అందించిన స్టాలిన్ మంగళవారం తంజావూరు, నాగపట్నంలలో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, డీఎం కే తరఫున సహాయక చర్యల్ని ఎంకే స్టాలిన్ వేగవంతం చేస్తూ వస్తున్న వి షయం తెలిసిందే. సోమవారం చెన్నైలోని ఆర్ఏ పురం, చేపాక్కం నియోజకవర్గం పరిధిలోని ప లు ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించారు. వరద బాధితులకు భరోసా ఇస్తూ, సహాయకాలను అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్ని రాజకీయం చేయదలచుకోలేదన్నారు. అయితే, అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న సంస్థల మీద తమ ప్రతాపం చూపిస్తుండడం, అడ్డుకోవడం, అమ్మ బొమ్మలకు ఒత్తిడి తీసుకురావడం విచారకరంగా పేర్కొన్నారు. వీరి చర్యలు తమిళనాడుకే తలవంపులు తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సైతం సీఎం బొమ్మను చేత బట్టి తిరుగుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నేడు తంజావూరుకు: తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నైలలో పర్యటించి వరద బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటుగా సహాయకాల్ని అందిస్తూ వచ్చిన స్టాలిన్ ఇక మంగళవారం నుంచి తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, కడలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం తంజావూరులో పర్యటించి ప్రజల్ని కలుసుకోనున్నారు. అనంతరం తిరువారూర్‌లో అన్నదాతల్ని సంప్రదించనున్నారు. తదుపరి నాగపట్నంలో జాలర్లకు భరోసా ఇవ్వనున్నారు. బుధవారం కడలూరులో పర్యటించి, అక్కడి బాధితులకు ఓదార్చడంతో పాటుగా డీఎంకే తరఫున సహాయక చర్యలు ముమ్మరం చేయనున్నారు. -
ఆయన మళ్లీ కొట్టారు!
చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు. మొన్నీమధ్య మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ యువకుడి చెంప చెళ్లుమనిపించారు. ఇంతకీ ఆ యువకుడు చేసిందేమంటే ...స్టాలిన్ తో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించటమే. గురువారం కోయంబత్తూరు పర్యటనలో ఉన్న స్టాలిన్ తన చుట్టూ మూగిన జనాలతో అసౌకర్యానికి గురయ్యారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆయనకు చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. అంతే అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా అతడిని నెట్టివేశారు. ఆ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాట్సాప్‌లోనూ విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వీడియోపై స్టాలిన్ శుక్రవారం స్పందిస్తూ ...ఆ వీడియోలో గ్రాఫిక్స్ యాడ్ చేశారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అయినా ఆ సంఘటనను తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు. కాగా ఈ సంఘటనపై స్టాలిన్ మేనేజర్ ఇచ్చిన వివరణ పూర్తి విరుద్ధంగా ఉంది. అది యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్‌ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది జూన్‌లో మెట్రో రైలులో తొలిసారి ప్రయాణం చేసిన స్టాలిన్...అక్కడ ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. -
మంత్రికి స్టాలిన్ సవాల్
చెన్నై: అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగుతున్న శాసనసభా సమావేశాలు శుక్రవారం పరస్పర సవాళ్లకు దారి తీశాయి. అనేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. హొగెనకల్ సహకార సంఘం తాగునీటి పథకంపై వాడివేడిగా చర్చ సాగింది. నగర పాలన, తాగునీటి వసతులపై చర్చలు సాగగా, మంత్రి వేలుమణి ప్రసంగిస్తూ, అమ్మ పథకాలతో రాష్ట్రంలోని కుగ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ సమయంలో డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ కలుజేసుకున్నారు. రామనాథపురం, హొగెనకల్లోని సహకార తాగునీటి పథకం పూర్తయి ప్రజలకు తాగునీరు అందుతుంటే సంతోషమేనని అన్నారు. అయితే అక్కడి పథకాలు ఇంకా పూర్తికాలేదని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కాదు పూర్తయ్యాయని గౌరవ సభ్యులతో కలిసి వాటిని ప్రత్యక్షంగా చూసి వచ్చేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ స్టాలిన్ సవాల్ విసిరారు. మంత్రి వేలుమణి స్టాలిన్ సవాల్‌కు స్పందిస్తూ, పథకం పనులు సాగుతున్నచోట జాతీయరహదారి పనులు జరుగుతున్నందున తాగునీటి పథకం పూర్తికి జాప్యం జరుగుతోందని అంగీకరించారు. గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణం, సంపూర్ణ మద్య నిషేధం, మధురై క్వారీల్లో నరబలులు తదితర 33 అంశాలపై చర్చించేందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.