ఆయన మళ్లీ కొట్టారు! | Did MK Stalin Slap a Man Who Wanted to Click a Selfie? | Sakshi
Sakshi News home page

ఆయన మళ్లీ కొట్టారు!

Published Fri, Oct 9 2015 12:44 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

ఆయన మళ్లీ కొట్టారు! - Sakshi

ఆయన మళ్లీ కొట్టారు!

చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్  మరోసారి తన ప్రతాపాన్ని  చూపించారు.   మొన్నీమధ్య మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ యువకుడి  చెంప చెళ్లుమనిపించారు. ఇంతకీ ఆ యువకుడు చేసిందేమంటే ...స్టాలిన్ తో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించటమే.

గురువారం కోయంబత్తూరు పర్యటనలో ఉన్న స్టాలిన్ తన చుట్టూ మూగిన జనాలతో అసౌకర్యానికి గురయ్యారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆయనకు చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు.  అంతే అసహనానికి లోనైన  స్టాలిన్ అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా అతడిని నెట్టివేశారు.  ఆ  దృశ్యాలు  కెమెరా  కంటికి చిక్కడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాట్సాప్లోనూ విపరీతంగా  చక్కర్లు కొట్టింది.

ఆ వీడియోపై స్టాలిన్ శుక్రవారం స్పందిస్తూ ...ఆ వీడియోలో గ్రాఫిక్స్  యాడ్ చేశారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.  అయినా  ఆ సంఘటనను తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు.

కాగా ఈ సంఘటనపై స్టాలిన్ మేనేజర్ ఇచ్చిన వివరణ పూర్తి విరుద్ధంగా ఉంది. అది  యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది జూన్లో మెట్రో రైలులో తొలిసారి ప్రయాణం చేసిన స్టాలిన్...అక్కడ ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement