telephone exchange case
-
మారన్ సోదరులకు సుప్రీం షాక్..
సాక్షి, చెన్నై : అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్లు విచారణను ఎదుర్కోవాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ కేసులో మారన్ సోదరులను సీబీఐ తప్పించడాన్ని తోసిపుచ్చుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. మీ సోదరుల టీవీ ఛానెల్‌కు మీరు సహకరించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని కేసు నుంచి తప్పించాలన్న దయానిధి మారన్ అప్పీల్‌ను సుప్రీం తిరస్కరించింది. సన్ గ్రూప్ సారధులైన మారన్ సోదరులపై 12 వారాల్లోగా అభియోగాలు నమోదు చేయాలని గత వారం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మారన్ సోదరులతో పాటు ఇతరులను ఈ ఏడాది మార్చిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తప్పించింది. కాగా, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని, ఈ విషయాలన్నీ విచారణలో నిర్ధారించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మారన్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ పేర్కొంది. 2004-06లో దయానిధి మారన్ టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలోని తన ఇంట్లో అక్రమంగా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేశారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ 1.78 కోట్ల నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. సన్ టీవీ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఈ ఎక్స్ఛేంజ్ను ఉపయోగించారని సీబీఐ ఆరోపిస్తోంది. -
మారన్ బ్రదర్స్‌కు భారీ ఎదురుదెబ్బ
చెన్నై : కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో దయానిధి మారన్, కళానిధి మారన్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదును అనుమతించింది. ఈ ఇద్దరు బ్రదర్స్‌కు, ఇతరులకు వ్యతిరేకంగా 12 వారాల్లో అభియోగాలను నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు కోర్టు, సీబీఐను ఆదేశించింది. దయానిధి మారన్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి, సన్ నెట్వర్క్ కోసం అక్రమంగా ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ను తన నివాసంలోనే ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్చేంజ్ ద్వారా 764 హై-స్పీడ్ లైన్లను సన్ నెట్వర్క్ వాడుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ టెలిఫోన్ లైన్లకు ఎలాంటి బిల్లులను చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.78 కోట్ల నష్టం వచ్చింది. మారన్ బ్రదర్స్ కలిగి ఉన్న సన్ నెట్వర్క్, దేశంలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఇది ఒకటి. టెలివిజన్, న్యూస్‌పేపర్, రేడియోలను ఇది కలిగి ఉంది. టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు మరో ఐదుగురిని చెన్నైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు గత మార్చిలోనే నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేవని కేసును కొట్టివేసింది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై, సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. కింద కోర్టు ఇచ్చిన ఈ తీర్పును జీ జయచంద్రన్ కొట్టివేశారు. 12 వారాల్లోగా వారిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో మారన్ బ్రదర్స్‌ను అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. -
మారన్ బ్రదర్స్‌కు సీబీఐ షాక్
సాక్షి,ముంబై: అక్రమ టెలిఫోన కనెక్షన్ల స్కాం లో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ కనెక్షన్ల స్కాంకు సంబంధించి మారన్ బ్రదర్స్ కళానిధి మారన్, దయానిధి మారన్‌లను స్పెషల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది. మారన్ బ్రదర్స్‌కు విముక్తి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో మారన్ బ్రదర్స్ సహా మరో ఏడుగురిని విడుదల చేసిన మూడు నెలల్లో (మార్చి, 14) సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ జి జయచంద్రన్ జూన్20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లు కేటాయించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి .దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్‌లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. బీఎస్ఎన్ఎల్ మాజీ జీఎం బ్రహ్మనాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలు స్వామి, దయానిధి వ్యక్తిగత కార్యదర్శి గౌతం ఇతర నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించిన సంగతి విదితమే. -
కేంద్ర మంత్రి మారన్‌ను ప్రశ్నించిన CBI
-
'నాపై కుట్ర చేస్తున్నారు'
న్యూఢిల్లీ: 2జీ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ మండిపడ్డారు. తమ పార్టీని ఇరుకున పెట్టే క్రమంలోనే సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్ తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన గురువారం పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగరిక దేశంలో మానవహక్కులను హరించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. దీనిపై సీబీఐ డైరెక్టర్ తో పాటు, ఎన్ హెచ్ఆర్సీ( జాతీయ మానవ హక్కుల సంఘం) కి లేఖలు రాయనున్నట్లు మారన్ తెలిపారు.